నాడు...
ఉద్దానం ప్రాంతంలో ఎందుకు పుట్టామా అన్న అవేదనే నిత్యం వారిని వెంటాడుతుండేది. అప్పటికే దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. కదలలేక మంచానికే పరిమితమయ్యారు. వైద్యం పేరుతో ఇళ్లు గుల్లయిపోతున్నాయి. ఇళ్లూ, ఆస్తులు అమ్ముకున్నా, మందులకు, డయాలసిస్‌కు డబ్బు చాలని పరిస్థితి. 40 ఏళ్లగా ఉద్దానం ప్రాంతం దయనీయజీవితమిది. పాలకులు మారుతున్నారుగానీ అక్కడి సమస్యను ఎవరూ పరిష్కారించలేదు. రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు గొప్ప విజనరీగా ప్రచారమైతే చేసుకుంటారు కానీ, ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారానికి చూపలేదు. కనీసం విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఉద్దానం వ్యధను పట్టించుకోలేదు.
చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల ముందు, తర్వాత పూర్తిగా మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు. చాలా మాటలే చెప్పారు. వచ్చేశారు. వారి సమస్య పరిష్కారానికి వీసమెత్తు పరిష్కారం చూపలేదు. పైగా, అక్కడి ప్రజల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. తన వల్లే ఆ ప్రజల సమస్య వెలుగులోకి వచ్చిందని ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉద్దానం ఊసే మరిచారు. ఆ సమయంలో.. 2017లో అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వచ్చారు. అక్కడి ప్రజలతో ముఖాముఖీ భేటీ అయ్యారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు.
అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను లోతుగా పరిశీలించారు. ఏమి చేస్తే ఉద్దానం ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందో ఓ ప్రణాళిక రూపొందించారు. ఏడాది కూడా గడవక ముందే.. 2018 డిసెంబరు 31న మరోసారి ఉద్దానానికి వెళ్లారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలోని ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీరు కారణంగా ఈ సమస్య వస్తుందని, ఆ ప్రాంతానికి మంచి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. అక్కడి నుంచి నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
నేడు...
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా పూర్తి కాక మునుపే.. 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతం రక్షిత మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చి సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వచ్చి పనులేవీ ముందుకు సాగక ఆటంకాలు కలిగినా.. పట్టుదలగా నాలుగేళ్లలోనే భగీరధ ప్రయత్నం పూర్తి చేశారు. గురువారం రూ.700 కోట్లతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకానికి, రూ.85 కోట్లతో నిరి్మంచిన కిడ్నీ రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రారం¿ోత్సవం చేశారు.
పరిష్కారమూ సమగ్రంగా, శాశ్వతంగా..
సాధారణంగా.. వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచి నీటి పథకం నిర్మాణం చేపట్టినా, నీరు అందుబాటులో లేకపోతే అంతటి పథకమూ వృథా అవుతుంది. ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం విషయంలోనూ అధికారులు ఇలాంటి సందేహాన్ని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. మనం చూపే పరిష్కారం శాశ్వతంగా, సమగ్రంగా ఉండాలని సీఎం జగన్ వారికి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉంది.
అయితే, వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కారు ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ఆ ప్రాంతానికి 104 కి.మీ.కి పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రణాళిక రూపొందించింది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. ïహిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీలు అందుబాటులో ఉంటుంది.
అందువల్ల ఇక్కడి నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏకంగా 1,047 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్లు నిర్మించారు. ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి బెంగ లేదు. నిత్యం స్వచ్ఛమైన నీరు అందుతుంది. అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది. కిడ్నీ వ్యాధుల రీసెర్చి సెంటరూ ఉంది. 40 ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి, ఆ ప్రాంతానికి ఊపిరి పోసిన సీఎం జగన్‌కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment