Kidney disease
-
కిడ్నీ వ్యాధిని జయించాడు
కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం పరిధిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సీరం క్రియాటినిన్ లెవెల్ పది పాయింట్లు దాటి డయాలసిస్ చేయాల్సిన ఓ కిడ్నీ వ్యాధి బాధితుడికి డయాలసిస్ అవసరమే లేకుండా రెండు నెలల్లోనే సీరం క్రియాటినిన్ లెవెళ్లు రెండున్నరకు దిగిపోయాయి. బతకడం కష్టమే అనుకున్న దశ నుంచి ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చాడు. కిడ్నీ వ్యాధిని జయించి ఆస్పత్రి వైద్యులను ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఉంగ అప్పలస్వామి(48)ని రెండున్నర నెలల కిందట కడుపు ఉబ్బిపోయి, కాళ్లు, చేతులు, ముఖం పొంగిపోయి రెండు మూడు రోజుల్లో మరణిస్తాడనే మాటలతో పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి తీసుకువచ్చారు. అన్ని పరీక్షలు చేశాక రెండు కిడ్నీలు పాడైపోయిన దశలో ఉన్నాయని ఏప్రిల్ 12న వైద్యులు నిర్ధారించారు. సీరం క్రియాటినిన్ 10.02 పాయింట్లు ఉందని, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావని డయాలసిస్ చేసుకోవాలని అతనికి సూచించారు. డయాలసిస్ చేయించుకోవడానికి ఇష్టపడని అప్పలస్వామి వైద్యులు ఇచ్చిన ఉచిత మందులతో ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి రెండు పూటలు చప్పటి ఇడ్లీలు, మధ్యాహ్నం చప్పటి పప్పుతో కూడిన భోజనం తీసుకున్నాడు. మూడు పూటలు భోజనానికి ముందు, తర్వాత కలిపి 23 రకాల మాత్రలు వేసుకున్నాడు. అలా సుమారు రెండు నెలలు ఆహార నియమం పాటించాడు. మధ్యలో ఏప్రిల్ 19న ఆస్పత్రికి మందులకు వెళ్లినప్పుడు పరీక్షిస్తే సీరం క్రియాటినిన్ 8.04కు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ జూన్ 18వ తేదీన పరీక్ష చేయించుకుంటే 2.7 గా సీరం క్రియేటిన్ నమోదైంది. పల్లె ఆహార అలవాట్లే తనను కాపాడాయని, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ కిడ్నీ పరిశోధన కేంద్రంలోనే వైద్య సేవలు పొందానని అప్పలస్వామి ఆనందంగా చెప్పాడు. ఈ ప్రత్యేకమైన కేస్‌కు సంబంధించి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ యర్ర రాకేష్ ను వివరణ కోరగా కిడ్నీ వ్యాధి సోకినపుడు ఆయా శరీర తత్వాలను బట్టి వారిలో మార్పులు వస్తాయని తెలిపారు. అనేక మంది చనిపోతారని, ఆహార అలవాట్లతో కొందరు నెగ్గుకురాగలరని వివరించారు. కిడ్నీ వ్యాధి బాధితునికి పూర్తిగా నయం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. -
మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ..ఎలా అంటే!
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్‌లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. జబల్పూర్లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు. -
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరికి ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయనుంది. ఇందులో భాగంగా మార్కాపురంలో నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బోధనాస్పత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు కోసం 21 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరాలజీ విభాగం ఏర్పాటుకు పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్కాపురం వైద్య కళాశాల ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు ప్రారంభించడానికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటు తప్పనిసరి కాదు. అయినప్పటికీ మార్కాపురం ప్రాంత కిడ్నీ సమస్యల బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగానే ఆ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గత నాలుగు దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను చేపట్టి కిడ్నీ సమస్యల ప్రభావిత గ్రామాలకు మంచినీటి సరఫరాను చేపట్టింది. అదే విధంగా రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. వీటిని కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఉద్దానానికి ఊపిరి పోసిన సీఎం జగన్
నాడు... ఉద్దానం ప్రాంతంలో ఎందుకు పుట్టామా అన్న అవేదనే నిత్యం వారిని వెంటాడుతుండేది. అప్పటికే దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. కదలలేక మంచానికే పరిమితమయ్యారు. వైద్యం పేరుతో ఇళ్లు గుల్లయిపోతున్నాయి. ఇళ్లూ, ఆస్తులు అమ్ముకున్నా, మందులకు, డయాలసిస్‌కు డబ్బు చాలని పరిస్థితి. 40 ఏళ్లగా ఉద్దానం ప్రాంతం దయనీయజీవితమిది. పాలకులు మారుతున్నారుగానీ అక్కడి సమస్యను ఎవరూ పరిష్కారించలేదు. రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు గొప్ప విజనరీగా ప్రచారమైతే చేసుకుంటారు కానీ, ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారానికి చూపలేదు. కనీసం విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఉద్దానం వ్యధను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల ముందు, తర్వాత పూర్తిగా మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు. చాలా మాటలే చెప్పారు. వచ్చేశారు. వారి సమస్య పరిష్కారానికి వీసమెత్తు పరిష్కారం చూపలేదు. పైగా, అక్కడి ప్రజల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. తన వల్లే ఆ ప్రజల సమస్య వెలుగులోకి వచ్చిందని ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉద్దానం ఊసే మరిచారు. ఆ సమయంలో.. 2017లో అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వచ్చారు. అక్కడి ప్రజలతో ముఖాముఖీ భేటీ అయ్యారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను లోతుగా పరిశీలించారు. ఏమి చేస్తే ఉద్దానం ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందో ఓ ప్రణాళిక రూపొందించారు. ఏడాది కూడా గడవక ముందే.. 2018 డిసెంబరు 31న మరోసారి ఉద్దానానికి వెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలోని ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీరు కారణంగా ఈ సమస్య వస్తుందని, ఆ ప్రాంతానికి మంచి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. అక్కడి నుంచి నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. నేడు... 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా పూర్తి కాక మునుపే.. 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతం రక్షిత మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చి సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వచ్చి పనులేవీ ముందుకు సాగక ఆటంకాలు కలిగినా.. పట్టుదలగా నాలుగేళ్లలోనే భగీరధ ప్రయత్నం పూర్తి చేశారు. గురువారం రూ.700 కోట్లతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకానికి, రూ.85 కోట్లతో నిరి్మంచిన కిడ్నీ రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రారం¿ోత్సవం చేశారు. పరిష్కారమూ సమగ్రంగా, శాశ్వతంగా.. సాధారణంగా.. వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచి నీటి పథకం నిర్మాణం చేపట్టినా, నీరు అందుబాటులో లేకపోతే అంతటి పథకమూ వృథా అవుతుంది. ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం విషయంలోనూ అధికారులు ఇలాంటి సందేహాన్ని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. మనం చూపే పరిష్కారం శాశ్వతంగా, సమగ్రంగా ఉండాలని సీఎం జగన్ వారికి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉంది. అయితే, వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కారు ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ఆ ప్రాంతానికి 104 కి.మీ.కి పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రణాళిక రూపొందించింది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. ïహిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీలు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏకంగా 1,047 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్లు నిర్మించారు. ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి బెంగ లేదు. నిత్యం స్వచ్ఛమైన నీరు అందుతుంది. అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది. కిడ్నీ వ్యాధుల రీసెర్చి సెంటరూ ఉంది. 40 ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి, ఆ ప్రాంతానికి ఊపిరి పోసిన సీఎం జగన్‌కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. -
ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. -
ఉద్దానంలోని మరణాలకు అదే ప్రధాన కారణం! కనుగొన్న పరిశోధకులు
'ఉద్దానం' ఈ పేరు చెప్పగానే అందరూ ఉలిక్కిపడతారు. ఎందుకంటే? కిడ్నీ వ్యాధి కారణంగానే దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఊరుగా వార్తల్లో నిలిచింది. అక్కడ అందరి చావులు ఒకేలా ఉండటం. ఎక్కువ మంది కిడ్నీ వ్యాధి బారినేపడటం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో నిర్థారించేరే తప్ప అందుకు గల కారణాలపై అధ్యయనం చేయలేదు. ఇప్పుడిప్పుడూ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆరోగ్య క్యాంపులతో అక్కడి ప్రజలకు వైద్యం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకోలేని వారందరికీ ఉచిత వైద్యం అందించే యత్నం చేస్తోంది. కానీ అందరూ కిడ్నీ వ్యాధినే బారిన పడటానికి కారణం ఏంటీ? ఆ వ్యాధి తీరు ఏంటన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే తాజగా జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం అందుకు గల కారణాన్ని కనుగొనడమే గాక పరిష్కార మార్గాల గురించి వెల్లడించింది. వివరాల్లోకెళ్తే..జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, ఉద్దానంలో జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం మూత్ర పిండాల పనితీరుని క్రమంగా కోల్పోయే క్రానిక్ కిడ్నీ డిసిజీ(సీకేడీ) అని తేల్చి చెప్పారు. సీకేడీ కారణంగానే అధిక సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. సాధారణ కిడ్నీ వ్యాధికి ఈ క్రానిడ్ కిడ్నీ డిసీజ్‌కి చాలా తేడా ఉంది అందేంటంటే. సాధారణ కిడ్నీ వ్యాధీ.. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం లేదా వాటి పనితీరును కోల్పోతే దీన్ని సాధారణ కిడ్నీ వ్యాధి అంటారు. అలా కాకుండా కాల క్రమేణ మూత్ర పిండాలు తమ పనితీరును కోల్పోతే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అని అంటారు. ముఖ్యంగా రక్తపోటు, మదుమేహం వంటి దీర్ఘకాలి వ్యాధుల కారణంగానే ఈ సీకేడీ మూత్రపిండాల వ్యాధి వస్తుంది. ఇక ఉద్ధానంలోని ప్రజల మరణాలకు కారణమైన ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్పై అధ్యయనం చేసేందుకు స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష సాధనాన్ని వినయోగించింది పరిశోధకుల బృందం. ఔదీని సాయంతోనే మరణించిన వ్యక్తు డేటా తోపాటు బతికి ఉన్న బాధిత కుటుంబ సభ్యుల ఆరోగ్య డేటాను తీసుకుని విశ్లేషించారు. అలాగే వారందరి తోపాటు చనిపోయిన మిగతా ప్రజల ఆరోగ్య డేటాను కూడా తీసుకుని కంప్యూటర్ అల్గారిథమ్ సాయంతో ఆ మొత్తాన్ని విశ్లేషించి ఈ పరిస్థితి గల కారణల గురించి వెల్లడించారు. దాదాపు రెడు వేలకు పైగా వ్యక్తుల డేటా అధారంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) ప్రధాన కారణమని నిర్థారించామని పరిశోధకులు తెలిపారు. ఉద్ధానంలోని ప్రజలపై ఈ సీకేడీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో కూడా ఈ పరిశోధన వెల్లడించినట్లు పేర్కొన్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ఉద్ధానంలో మరణించిన మరణాల్లో దాదాపు 45% వరకు ఈ సీకేడీ వల్లనే అని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 5.5 మరణాల రేటు దీని కారణంగానే సంభవించాయి. వయసు సుమారుగా 20 అంతకు పైబడిన వారే ఈ వ్యాధి బారిన పడటం అనేది కలవరపరిచే అంశంగా చెప్పుకొచ్చారు అక్కడ జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం సీకేడీ అని నిర్ధారణ అయ్యింది స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష (SmartVA) సాయంతో ఈసమస్యను చక్కబెట్టగలమన్నారు. ఈ సాధనం సాయంతో మరణాల డేటాతోపాటు ఉద్దనంలో ఉన్న మిగతా ప్రజల ఆరోగ్య డేటాను తీసుకుని సాధ్యమైనంత వరకు మళ్లీ మరణాలు పునరావృత్తం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు పరిశోధకులు. ఈ మేరకు జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రోఫెసర్ వివేకానంద ఝూ మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య మాత్రమే కాదు ఉద్ధానంలో మరణానికి ప్రధాన కారణమని తమ అధ్యయనం వెల్లడించిందని తెలిపారు. ఈ సీకేడీ వ్యాధిని నివారించాలంటే..ముందుగా ఈ వ్యాధిని సక్రమంగా నిర్ధారించడం తోపాటు తక్షణమే సరైన చికిత్స అందించి నివారించడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే బాధితులకు కూడా మెరుగైన చికిత్స అందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పరిశోధనలో డాక్టర్ బాలాజీ గుమ్మిడి, డాక్టర్ వైశాలి గౌతమ్, డాక్టర్ రేణు జాన్, డాక్టర్ రోహినా జోషి, డాక్టర్ ఊమెన్ జాన్ తదితరలు పాలుపంచుకున్నారు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
పెయిన్.. కిల్లింగ్! నెల రోజుల్లోనే 20 మంది, ఆర్ఎంపీల వైద్యమే కారణమా..
‘మా మండలంలోని మామిడిగూడ, ముత్నూర్, హర్కాపూర్ గ్రామాల్లో గత నెల రోజుల వ్యవధిలోనే 20 మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఆర్ఎంపీల వైద్యంతోనే అమాయక ఆదివాసీలు కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలి.’ ఈ నెల 24న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత చేసిన వ్యాఖ్యలివి. బేల మండలంలో బెంగాల్ డాక్టర్ల వైద్యం అమయాక ప్రజల ప్రాణలమీదకు తెస్తుంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో స్థానికంగా ఉన్న బెంగాల్ వైద్యుల వద్దకు వెళ్లగా మోకాళ్లలో హైడోస్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇవి తీసుకున్న వారి కిడ్నీలు నెల వ్యవధిలోనే చెడిపోయి డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.’ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 27న కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఇది. ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది ఆర్ఎంపీల అచ్చీరాని వైద్యం అమయాక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పల్లెవాసులు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా వీరినే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వారు మోతాదుకు మించి ఇస్తున్న హైడోస్ ఇంజక్షన్లు బాధితుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెల గడువక ముందే బాధితులు డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తుండడం గమనార్హం. ఆర్ఎంపీల వైద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఫిర్యాదులు అందుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆర్ఎంపీల వైద్యమే కారణమా.. జిల్లాలో ఆయా గూడాలు, తండాల్లో ఉండే ఆదివాసీలు, గిరిజనులు అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా ఆర్ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థికస్థోమత లేకపోవడం, ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉన్న వీరే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది అచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణల మీదకు తెస్తున్నారు. రోగుల జబ్బులు త్వరితగతిన నయం కావాలని హైడోస్ ఇంజక్షన్లు వేస్తున్నారు. మోతాదుకు మించి మాత్రలు ఇస్తున్నారు. వాటిని ఉపయోగించిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నప్పటికీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్ఎంపీల వద్ద ఇంజిక్షన్లు తీసుకున్న రోగులు నెల గడవక ముందే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పెరుగుతున్న బాధితులు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు బెంగాళి వైద్యుల వైద్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేని ఆర్ఎంపీలు సైతం పల్లెల్లో తిరుగుతూ రోగులకు అనధికారికంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆసుపత్రి తరహాలో పడకలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని బేల, ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ తదితర మండలాల్లో ఇలాంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీరు మోతాదుకు మించి ఇస్తున్న మాత్రలు, ఇంజక్షన్లతో రోగుల కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్ఎంపీలను ఆశ్రయించిన మరుసటి నెలకు రిమ్స్‌కు వెళ్లితే అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేయాలని చెబుతుండటం కలవరానికి గురి చేస్తోంది. పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండా ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయడం చట్టరీత్యానేరం. అలాగే పడకలతో కూడిన వైద్యమందించడం కూడా నిబంధనలకు విరుద్దం. ఇలాంటి వారు ఎక్కడైనా వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంద్రవెల్లి మండలంలో 20 మంది ఒక నెలలో మరణించారనడం పూర్తిగా అవాస్తవం. గతంలో ధనోరాలో ఇలాంటి పరిస్థితే ఉందని మా దృష్టికి రావడంతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశాం. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో పరిమితికి మించితే ప్రమాదం ఆర్ఎంపీలు యాంటిబయటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వీరి వద్దకు వచ్చే బాధితులకు పరిమితికి మించి పెయిన్‌కిల్లర్స్, యాంటిబెటిక్స్ ఇస్తుంటారు. నెలల తరబడి వీటిని వాడడంతో బీపీ, షుగర్‌తో పాటు ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ప్రజలు వారికి వచ్చిన జబ్బును నిపుణులైన వైద్యులతో నిర్ధారించుకొని చికిత్స చేయించుకోవాలి. ఆర్ఎంపీలపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. – డాక్టర్ సుమలత, ఎండీ ఫిజీషియన్ -
సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూ గుంటూరులో కొందరు పేదలకు వరాల జల్లు కురిపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో గిరిధర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని శ్యామలా నగర్ వచ్చారు. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకుని సాయం చేయమని వేడుకున్నారు. వారందరినీ పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకురమ్మని అధికారులకు ఆదేశించారు. అక్కడికక్కడే ఆదేశాలు అధికారుల సాయంతో హెలిప్యాడ్‌కు చేరుకున్న వి.మరియమ్మ, కోటేశ్వరరావు దంపతులు తమ గోడును వివరిస్తూ.. తమ రెండో కుమారుడు నవీన్ థలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనికి రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంటిస్థలం కూడా లేదని వాపోయారు. వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసి.. ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జె.బాబు, శివ లక్ష్మి దంపతులు మాట్లాడుతూ మునిసిపాలిటీలో ఉద్యోగం తీసేశారని, ఆ ఉద్యోగం తమ కుమారుడికి ఇప్పించాలని వేడుకున్నారు. వెంటనే సీఎం జగన్ అందుకు తగిన ఆదేశాలిచ్చారు. బి.పేరిరెడ్డి అనే వ్యక్తి గోడు చెప్పుకుంటూ.. గతంలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకున్నానని కొంత ఆర్థిక సాయం చే యాలని కోరగా.. ఆయనకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని, వైద్యం అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కె.పుష్ప జైన్ మాట్లాడుతూ తమ జైన్ సొసైటీకి కల్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆగమేఘాల మీద సీఎం ఆదేశాలను సాయంత్రానికల్లా అమలు చేశారు. అప్పటికప్పుడే తమ కోర్కెలను మన్నించి న్యాయం చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన ప్రభుత్వం: కలెక్టర్ గుంటూరులోని కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి, జేసీ జి.రాజకుమారి బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. చదవండి: ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం.. -
సీఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు. ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది. చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్ స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్‌కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇడుపూరు లే–అవుట్లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. -
అయ్యో సాషా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటి మృతి
నమీబియా నుంచి తీసుకువచ్చి గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాల్లో ఒక చీతా మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. సాషా భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న ఈ చీతాలో అలసట, బలహీనత వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని, దీంతో చికిత్స కోసం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌కు తరలించామని తెలిపారు. కాగా సాషా వయసు మూడేళ్లు. ఇది క్యాప్టివ్ బ్రీడ్ జాతికి చెందినది భారత్‌లో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్ 17) 8 ఆఫ్రీకన్ చీతాలను కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలను కొన్ని నెలల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్ చేశారు. భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత నవంబర్‌లో పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షించారు తరువాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెట్టారు. అంతేగాక త్వరలోనే భారత్‌కు మరో 12 చీతాలు కూడా రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. -
కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు ఏ నాయకుడి కంటా పడలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు, మనుషులు లేక వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఇళ్లు.. ఏవీ ప్రజా ప్రతినిధుల కరకు గుండెలను కరిగించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. అలాంటి ఆపత్కాలంలో వచ్చాడొక నాయకుడు. వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగుల చెంతకు డయాలసిస్ యూనిట్లు రప్పించాడు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు చేతిలో నెలకు రూ.10 వేలు పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానంకు తీసుకువస్తున్నాడు. అతడే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రి, ఉద్దానం ప్రాజెక్టు ఆయన చిత్తశుద్ధికి సజీవ సాక్ష్యాలు. సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో మృత్యుకౌగిట నుంచి విడుదలవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయి. పాదయాత్రలో చూసి.. పాదయాత్రలో కిడ్నీ వ్యాధి బాధితుల బాధలను వైఎస్ జగన్ దగ్గరుండి చూశారు. ప్రతిపక్ష నేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి.. తన కార్యాచరణను అప్పుడే స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ఉపరితల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. బాబుదంతా బడాయే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. తిత్లీ సమయంలో గోడు చెప్పుకుందామని వెళ్లిన వారిపై చంద్రబాబు మండిపడ్డారు కూడా. 2019 ఎన్నికల ప్రచారానికి సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుడికి కూడా భరోసా ఇవ్వలేకపోయారు. మరోవైపు పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున ఉద్దానం సమస్య పరిష్కరించేశానని ప్రచారం చేసుకున్నారు తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదు. తన మిత్రపక్షం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. కిడ్నీ రీసెర్చ్‌సెంటర్ పరిశీలనలో మ్యాప్ చూస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బతుకుతా అనుకోలేదు.. అంతా జగనన్న దయే! నా పేరు సుగ్గు లక్ష్మీ. ఇచ్ఛాపురం మండలం మారుమూల ప్రాంతం సన్యాసిపుట్టుగ గ్రామం మాది. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10వేలు పింఛన్ వస్తోంది. అంతే కాదు నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటి వరకు బతుకుతానని, అంతా జగనన్న దయే! వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ►కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. 5పైబడి సీరం క్రియేటినిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ►ఉపరితల తాగునీరు అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గల 827 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ►వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా మంజూరు చేశారు. మార్చిలో వీటిని ప్రారంభించనున్నారు. ►టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషీన్లతో 68పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట, కవిటిలో పడకలు పెంచారు. హరిపురంలో పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ►ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10పడకలు, బారువ సీహెచ్‌సీలో 10పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సరీ్వసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అవి జిల్లాకొచ్చాయి. కవిటి, సోంపేట సీహెచ్‌సీల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో యూనిట్లో ఏడేసి పడకలు ఉంటాయి. ►టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. ►కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ►టీడీపీ హయాంలో జిల్లాలో నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. రూ. 10వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10వేలు పింఛన్ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా సరిపోయిన బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పూర్తిగా చితికిపోయిన కిడ్నీ బాధితుల్ని జగనన్న ప్రభు త్వం వచ్చాక ఆదుకుంది. ఉద్దానం పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మా సమస్యల మీద దృష్టిపెట్టారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. – లండ శంకరరావు, కిడ్నీ డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం గ్రామం, కంచిలి మండలం ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు.. డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు అవసరమైన అన్ని మందులను, ఇంజెక్షన్లను ఉచితంగానే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం లాంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండానే డయాలసిస్ చేయించుకుంటున్నాం. – అందాల రత్నాలు, డయాలసిస్ రోగి, లోహరిబంద గ్రామం, -
ఓ తల్లి వేడుకోలు.. వెంటనే స్పందించిన సీఎం జగన్
జూపాడు బంగ్లా: అన్నా.. ఆపదలో ఉన్నా! నా కుటుంబం ఆపదలో ఉంది.. నా కుమారుడి ఆరోగ్యం సరిగా లేదు.. ఆదుకోవాలని సీఎం జగన్‌ను వేడుకున్న ఓ మహిళకు గంటల వ్యవధిలోనే తక్షణ సాయం అందింది. గురువారం నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ ఓ విద్యార్థి దీనస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న తన కుమారుడు యోగి (15) రెండు కిడ్నీలు పాడవటంతో ఆరోగ్యం క్షీణిస్తోందని చాకలి జయమ్మ అనే మహిళ సీఎం జగన్ ఎదుట కన్నీటిపర్యంతమైంది. జయమ్మకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న తహసీల్దార్ పుల్లయ్యయాదవ్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నామని, కిడ్నీ ఆపరేషన్ చేస్తే తన కుమారుడు బతుకుతాడని వైద్యులు చెప్పారని, అందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వాపోయింది. దీంతో స్పందించిన సీఎం జగన్ ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ శ్యామూన్ను ఆదేశించారు. ఈ మేరకు తక్షణ సాయంగా కలెక్టర్ రూ.లక్ష చెక్కును మంజూరు చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నందికొట్కూరు తహసీల్దార్ పుల్లయ్యయాదవ్ కిడ్నీ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. -
అల్లం నారాయణకు సతీ వియోగం
హైదరాబాద్(లక్డీకాపూల్): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ(54) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆమె 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వద్ద ఉంచుతారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గం.కు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్‌లోని ఆమె భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెస్‌లు మూసివేయడంతో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చడమేగాక.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం..: అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నారాయణను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మ మరణం పట్ల శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, టీయూడబ్లు్యజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
చేతులెత్తి నమస్కరిస్తున్నా.. బతకాలని ఉంది
‘చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా కాయకష్టం చేసి ఇంజినీరింగ్ దాకా నెట్టుకొచ్చారు. ఇప్పుడు మాయదారి రోగం నన్ను కుంగదీస్తోంది. ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఉంది. వారికి సేవ చేసి రుణం తీర్చుకోవాలని ఉంది. నన్ను బతికించండి. దాతలు ముందుకొచ్చి ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆ చదువుల తల్లి కళ్లనిండా నీళ్లు పెట్టుకుని.. చేతులెత్తి నమస్కరిస్తూ దీనంగా అభ్యర్థిస్తుండడం కలచివేసింది. ఈ ఘటన మదనపల్లెలో శనివారం పలువురిని కదిలించింది. చదవండి: ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా.. మదనపల్లె సిటీ: వైఎస్సార్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం, కోనపేటకు చెందిన రాయవరం చంద్రమోహన్, దేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి ఏకైక కుమార్తె ఆర్.హిమజ. కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం చంద్రమోహన్ కుటుంబసభ్యులతో కలిసి మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన శ్రీవారినగర్‌కు వచ్చారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలోని టమటా మార్కెట్ యార్డులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం హిమజ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుబుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పుట్టకతోనే ఆమెకు ఓ కిడ్నీ లేదని, మరో కిడ్నీ పాడైందని అక్కడి వైద్యులు తేల్చారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని, అప్పటి వరకు డయాలసిస్ చేయిస్తుండాలని సూచించారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రెండు నెలల నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇప్పటికే బిడ్డ ఆరోగ్యం కోసం రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ – 9502058163, ఎస్బీఐ, మదనపల్లె బ్రాంచ్, అకౌంట్ నం.35877578698, ఐఎఫ్ఐసీ కోడ్ : ఎస్బీఐఎన్ 0003748. -
భేతాళపాడుకు వైద్యాధికారులు
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధిలో కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సోమవారం రక్త నమూనాలు సేకరించారు. ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ‘ఆ ఊరికి ఏమైంది..?’శీర్షికతో కిడ్నీ వ్యాధి పీడితులపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష ఆదేశాల మేరకు జూలూరుపాడు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ భూక్యా వీరబాబు భేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులుతండాలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల ఇళ్లకు వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ వైద్యశిబిరాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం టీ హబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు దీనితో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి శాంపిళ్లు సేకరించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. -
షుగరూ, హైబీపీ అదుపులో ఉంటే కిడ్నీలూ పదిలమే
కిడ్నీ సమస్యలకు ప్రధానంగా డయాబెటిస్, హైబీపీ కారణమవుతుంటాయి. మూత్రపిండాల వ్యాధి వచ్చినవారిని పరిశీలిస్తే... మధుమేహం కారణంగా 39%, హైబీపీ వల్ల 60% మంది, మిగతా ఒక శాతం ఇతరత్రా కారణాలతో కిడ్నీ సమస్యలకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అంటే కేవలం డయాబెటిస్, హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా చాలామందిలో మూత్రపిండాలను కాపాడవచ్చన్నమాట. మూత్రపిండాల విధులివి.. కిడ్నీలు నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడుతూ మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక్కసారి మూత్రపిండం పనితీరు మందగించి, అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. మూత్రపిండం గానీ పూర్తిగా విఫలమైతే జీవితాంతం కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఇలా చేసే ‘డయాలసిస్’ ప్రక్రియ కోసం నెలకు సుమారు రూ. 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతాయి. కిడ్నీ దెబ్బతినగానే మన దేహంలోని కీలక అవయవాలైన గుండె వంటివి దెబ్బతిని.. గుండె జబ్బులు, ఇరత కీలక అవయవాలు దెబ్బ తినటం మొదలవుతుంది. చదవండి: మతిమరుపు నివారణకు మందులు లేవు..ఇలా చేస్తే మాత్రం.. దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేసుకోవాలన్నా.. రోగికి సరిపోయే కిడ్నీ దాతలు దొరకటం చాలా కష్టం. తీరా కష్టపడి ఆ ప్రక్రియ చేయించాక కూడా జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ. వెరసి ఎన్నోఇబ్బందులూ, దుష్ప్రభావాలు. ఇలాంటి ప్రమాదాలూ, అనర్థాలూ దరిచేరకుండా ఉండాలంటే... కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంటే చిక్సిత కంటేæ నివారణే మేలని గుర్తుంచుకోవాలి. కిడ్నీల రక్షణ కోసం కొన్ని సూచనలు.. ► టైప్–1 రకం బాధితులు డయాబెటిస్ బారినపడిన ఐదేళ్ల నుంచి... ప్రతీ ఏటా తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది. ► టైప్–2 బాధితులైతే తమకు డయాబెటిస్ ఉందని గుర్తించిన మరుక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత నుంచి కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చదవండి: Beauty Tips: దీనిని వాడితే డబుల్ చిన్ మాయం! ఇవే ఆ పరీక్షలు... 1) మూత్రంలో ఆల్బుమిన్ పోతోందా? ఆల్బుమిన్ అనేది మన దేహంలోని ఒక రకం ప్రోటీను. ఇది మూత్రంలో పోతూ ఉంటే ‘సుద్ద’ పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా ‘సుద్ద’ ఎక్కువగా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుందన్నమాట. అలాంటప్పుడు ‘ఆల్బుమిన్’ పరీక్షను తప్పనిసరిగా ప్రతి ఏటా చేయించాలి. 2) రక్తంలో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష: మూత్రపిండాల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పే కీలక పరీక్ష ఇది. అయితే కేవలం క్రియాటినిన్ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు కూడా సీరమ్ క్రియాటినిన్ పెరగపోవచ్చు. కాబట్టి క్రియాటినిన్ ఆధారంగా వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్ – ఈజీఎఫ్ఆర్)ను లెక్కించి.. కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందనే అంచనా వేస్తారు. సీరమ్ క్రియాటినిన్‌ను పరీక్షించి.. దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి అంశాల ఆధారంగా ‘ఈజీఎఫ్ఆర్’ లెక్కిస్తారు. కిడ్నీలను కాపాడుకోవాలంటే? డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర మోతాదులనూ, అధిక రక్తపోటునూ కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెర రోగులు ‘హెచ్‌బీఏ1సీ’ (గైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష ఫలితం 7 కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చివరగా... డయాబెటిస్, హైబీపీ... ఈ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ తమ బీపీ 130/80 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి. ∙రక్తహీనత తలెత్తకుండా కూడా చూసుకోవాలి. ∙మూత్రంలో సుద్దపోతుంటే గుర్తించి తక్షణం తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకోవాలి. -డాక్టర్ పి. విక్రాంత్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ -
అతడి ప్రాణాలు కాపాడాలంటే 24 కిలోల కిడ్నీలు తీసేయాలి..
ఒట్టావా: కిడ్నీలకు సంబంధించిన ఓ జన్యుపరమైన లోపం అతడి పాలిట శాపంలా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరణానికి దగ్గర జేస్తోంది. భారీగా ఉబ్బిపోయిన కిడ్నీలు శరీరంలోని ఇతర ముఖ్యమైన భాగాల్ని పూర్తిగా నలిపేసి అతడి ప్రాణాలు తీయబోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని విండ్సర్కు చెందిన 54 ఏళ్ల వారెన్ హిగ్స్ పోలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే జన్యుపరమైన లోపంతో బాధపడుతున్నాడు. ఈ లోపం కారణంగా అతడి రెండు కిడ్నీలు భారీగా ఉబ్బటం మొదలుపెట్టాయి. ఎడమ కిడ్నీ 42 సెంటీ మీటర్ల పొడవు, 27 సెంటీ మీటర్ల వెడల్పు.. కుడి కిడ్నీ 49 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. రోజు రోజుకూ పెరుగుతూ పోతున్న కిడ్నీల కారణంగా అతడి శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలు నలగటం ప్రారంభమైంది. ఇది ఇలాగే కొనసాగితే అతడి ప్రాణాలు పోయే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. జులై నెలలో అత్యంత ప్రమాదకరమైన శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు. ఇండియాలోని ఓ వ్యక్తి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడని.. అతడి కిడ్నీలు 7.4 కేజీలు ఉండగా.. వారెన్ కిడ్నీలు అంతకంటే మూడు రెట్లు (దాదాపు 24 కిలోలు) అధిక బరువున్నాయని తెలిపారు. కిడ్నీల సమస్య కారణంగా వారెన్ ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కిడ్నీలు తీసేయటం తప్పని సరైంది. చదవండి : ‘నేనిలా బతకలేను.. ట్రీట్మెంట్ ఆపేయండి!’ -
పాపం పసివాళ్లు: ఆస్పత్రి సిబ్బందే అమ్మనాన్న అయ్యారు
సాక్షి, సిటీబ్యూరో: అంతుచిక్కని అంటు రోగం.. కొమ్ములు తిరిగిన కొత్త వైరస్.. ముట్టుకుంటే అంటుకునే గుణం.. చివరకు తుమ్మినా.. దగ్గినా.. భయమే.. మందుల్లేవు.. చికిత్సపై వైద్యులకు అవగాహన లేదు. కంటికి కన్పించని ఆ కొత్త వైరస్ అతి కొద్ది కాలంలోనే ఖండాంతరాలు దాటి మార్చి రెండో తేదీన నగరంలోకి ప్రవేశించింది. ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోగా.. మరెంతో మంది కనీసం కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. కరోనాపై పోరులో అహర్నిశలు శ్రమించి.. చివరకు పైచేయి సాధించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి రోజుల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి 35 వేల మందికి వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి పీడియాట్రిక్ వార్డులో 510 మంది పిల్లలు చికిత్స పొందారు. వీరిలో పుట్టుకతోనే కిడ్నీ సబంధిత సమస్యతో బాధపడుతున్న వారు 25 మంది శిశువులు ఉండగా, కేన్సర్ 20, కాలేయం 15, ఫిట్స్ 30, హృద్రోగం 20, మధుమేహం ముగ్గురు బాధితులు ఉన్నారు. 40 మంది చిన్నారులు మినహా మిగిలిన వారందరినీ కాపాడారు. ఇక గైనకాలజీ విభాగం వైద్యులు 950 మంది కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి 100 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఉన్నారు. తల్లిదండ్రులు వదిలేస్తే.. ‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న దుండిగల్‌కు చెందిన కార్తీక్(4)కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో కోవిడ్ వార్డు లేకపోవడంతో.. గాంధీకికు తరలించారు. ఆ తర్వాత కనీసం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు కూడా ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బాలుడు తల్లడిల్లిపోయాడు. తరచూ గుక్కపట్టి ఏడ్చేవాడు. విషయం తెలిసి విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్సులే అమ్మలా అక్కున చేర్చుకున్నారు. ఆకలితో ఏడ్చినప్పుడల్లా పాలు, బిస్కెట్లు, అన్నం తినిపించారు. జోలపాడి నిద్ర పుచ్చారు. 14 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. అయినా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాలేదు. చివరకు పోలీసుల సాయంతో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సి వచ్చింది’. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సులు తల్లిలా ఆదరించారు. ఒంటినిండా పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి, ఉక్కపోతతో శరీరమంతా చెమటలు కక్కుతుంటే చిన్నారులకు వారు అన్నీ తామై సపర్యలు చేశారు. వైద్యులకు చాలెంజ్‌గా డౌన్‌సిండ్రోమ్ కేసు అరుదైన డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతున్న మూడు నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రికి రావడంతోనే వెంటిలేటర్‌పై వచ్చింది. ఇలాంటి వారు బతకడం కష్టం. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు తోడు.. గుండె, కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. క్లిష్టమైన ఈ కేసులను విభాగాధిపతి డాక్టర్ జార్జ్ నేృత్వంలో డాక్టర్లు సుచిత్ర, జయలక్ష్మి, శ్రీకాంత్భట్, ఉమాదేవి, శివరాం ప్రసాద్, మధుసూదన్, రమ్యతో కూడిన వైద్య బృందం చాలెంజ్‌గా తీసుకుని సేవలు అందించిందని పీడియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ సందనాల తెలిపారు. బిడ్డను బతికించాలని.. మహబూబ్‌నగర్‌కు చెందిన జాక్వాబ్(23 రోజులు) శిశువుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెలలోపు శిశువుకు కోవిడ్ నిర్ధారణ కావడం దేశంలోనే తొలిది. లూజ్మోషన్తో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో తల్లికి నెగిటివ్ రాగా.. శిశువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాగైనా తన బిడ్డను బతికించాలని తల్లి వైద్యులను వేడుకుంది. ఆ పసిగుడ్డును తాము కంటికి రెప్పలా చూసుకున్నట్లు స్టాఫ్‌నర్సులు విమల, సత్య, శాంత, శిరీష తెలిపారు. కోలుకున్న బిడ్డను తల్లికి అప్పగించినప్పుడు వారు చెప్పిన కృతజ్ఞతలను ఇప్పటికీ మర్చిపోలేమన్నారు. గాంధీలో మొత్తం పడకలు 1800 ఆస్పత్రిలో తొలి పాజిటివ్కేసు నమోదు మార్చి 2 చికిత్స పొందిన కోవిడ్ బాధితులు 35,000 12 ఏళ్లలోపు చిన్నారులు 510 కరోనా బాధిత గర్భిణులకు చేసిన ప్రసవాలు 950 సిజేరియన్ ప్రసవాలు 612 సహజ ప్రసవాలు 338 కోవిడ్ బారిన పడిన వారికి చేసిన ఇతర సర్జరీలు 250 కోవిడ్ సోకిన వారిలో కిడ్నీ బాధితులు 3,000 డయాలసిస్ సేవలు 7,000 బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 40 % 103 ఏళ్ల వారు ఒకరు చికిత్స పొందిన గర్భిణులు 400 వైరస్ బారిన పడిన వైద్య సిబ్బంది 68 చదవండి: వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : నీతా అంబానీ -
ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత చికిత్స
సాక్షి, అమరావతి: ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత చికిత్స ఆరంభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలో వ్యాధి ప్రబలడానికి అక్కడి భూగర్భ జలాలే కారణమని పలువురు నిపుణులు నిర్ధారించడంతో.. ఆ ప్రాంత ప్రజలు తాగేందుకు ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను సరఫరా చేసేందుకు భారీ మంచి నీటి పథకం పనులను వేగవంతం చేశారు. ఉద్దానంగా పిలవబడే ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 809 నివాసిత ప్రాంతాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా నదీ జలాలను తరలించేందుకు రూ.700 కోట్లతో మంచి నీటి పథకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పనులు ఇలా.. ► రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి భూమి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ► ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించగా.. అందులో 369 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కాకుండానే, 124 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంది. ఈ మేరకు పైపులైన్ నిర్మాణానికి సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. 19 ప్రదేశాల్లో పైపులైన్ ఏర్పాటుకు రైల్వే, అటవీ, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి అనుమతి తీసుకునే ప్రక్రియను ఇప్పటికే ఆరంభించారు. 7.82 లక్షల మందికి ప్రయోజనం ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్య అంటే.. కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 7,82,707 మంది ప్రజల సమస్య. ఇక్కడి ప్రజలందరికీ ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడువునా వచ్చే 30 ఏళ్ల కాలం తాగునీటి సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా తాగునీరు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. బాబు సర్కార్ మాయమాటలతో సరి ► ఉద్దానం ప్రాంతంలో బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవి సమయంలో ఎండిపోతున్నాయి. ఆ సమయంలో ప్రజలు బోరు నీటిని తాగక తప్పడం లేదు. దీంతో వారు వ్యాధి బారిన పడుతున్నారు. ► ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా, గత టీడీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పిందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 సెప్టెంబర్ 6వ తేదీన శాశ్వత రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కేటాయిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. -
అమ్మ బతకాలని..
అమ్మ చేతి ముద్దలు తినాల్సిన ప్రాయం.. ఆ ఇద్దరు పిల్లలది. ఇప్పుడు అమ్మకి అన్నీ తామే అయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఆమెను బతికించుకునేందుకు వారు పడుతున్న ఆరాటం చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. తమ చదువును కూడా పక్కన పెట్టి తల్లి సేవకు అంకితమైన ఆ పిల్లలు దాతలు స్పందించాలని ప్రాధేయపడుతున్నారు. కొత్తవలస (శృంగవరపుకోట): ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన ఆలపాటి వెంకట సుబ్బారావు పొట్టకూటికి విశాఖపట్నం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ అగరొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అరకుకు చెందిన వెంకటపద్మను 2004లో వివాహం చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో వెంకటపద్మ రెండు కిడ్నీలు పాడైపోవటంతో సుబ్బారావు తనకున్న దాంట్లో మూడేళ్లుగా వైద్యం చేయిస్తూ అప్పుల పాలైపోయాడు. వ్యాపారం నడవక.. వయసు మీరటంతో పూట గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక సతమతమవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్ ప్రస్తు తం వారిని ఆదుకుంటున్నా.. మందులకో సం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. బడికి దూరమైన పిల్లలు తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమెకు సేవలందించేందుకు వారికి ఉన్న ఇద్దరు పిల్లలు మూడేళ్లుగా బడికి దూరమయ్యారు. పరిస్థితి తెలుసుకున్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద కొడుకు భరత్‌కుమార్‌కు పుస్తకాలు కొనిచ్చి చదివిస్తుండగా ప్రస్తుతం 9 తరగతికి వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇచ్చే కూర, రసంతో కాలం గడుపుతున్నారు. చిన్నకొడుకు వంశీ మాత్రం మూడోతరగతితో చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూస్తున్నాడు. నా పిల్లలు ఏమవుతారో.. నా రెండు కిడ్నీలు పోయాయి. నెలకు 12 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. చదువుకొని ఆడుకోéల్సిన నా ఇద్దరు పిల్లల్లో ఒకరు స్కూల్ మానేసి నాకు సేవలు అందిస్తున్నాడు. పెద్దకొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు. నాపిల్లలు ఏమవుతారో తెలియడం లేదు. – ఆలపాటి వెంకట పద్మ వంట చేసి స్కూల్కెళ్తా.. ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యంతో పాఠశాలకు వెళుతున్నాను. మా అమ్మ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సాయం చేశారు. స్కూల్‌కు వెళ్లేముందు బొగ్గుల కుంపటిపై అన్నం వండి తమ్ముడికి అప్పగించి వెళ్తున్నా.. – భరత్‌కుమార్, పెద్ద కుమారుడు అందుకే బడికెళ్లడం మానేశా.. అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను. – వంశీ, చిన్న కుమారుడు నైతిక విలువలున్న కుటుంబం కన్నతల్లికి రెండు కిడ్నీలు పాడవటంతో చూసుకోవడానికి రెండో కొడుకు పాఠశాలకు రావటం మానేశాడు. విషయం తెలుసుకుని తోటి ఉపాధ్యాయులంతా కొంత మొత్తం వేసుకుని కుటుంబానికి సాయం చేశాం. నైతిక విలువలున్న కుటుంబం వారిది. – కృష్ణవేణి, విశ్రాంత ఉపాధ్యాయిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. -
పాపం 'నందన్'
తోటి చిన్నారులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు ఆ బాలుడిది. చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. బాధ కలిగినప్పుడు ఏడవడం తప్ప.. తనకున్న జబ్బుఏంటో కూడా తెలియదు. నెల్లూరు, కలిగిరి: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కందులవారిపాళెం గ్రామానికి చెందిన మార్తుల సుధాకర్‌రెడ్డి, అనూష దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు హసిక్ నందన్ కుమార్‌రెడ్డి (9) ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీగా చేస్తుంటారు. నందన్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. మరో కిడ్నీలో రాళ్లు ఉండి ఇన్ఫెక్షన్ చేరింది. ప్రత్యేక పైపు ఏర్పాటు చేస్తేనే మూత్రం వస్తుంది. వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నందన్‌కు 6 నెలల వయసు నుంచే హైదరాబాద్, చెన్నై, తిరుపతి, గుంటూరుల్లోని పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే పరిస్థితిలో మార్పురాలేదు. తల్లిదండ్రులతో నందన్ పింఛన్ ఇవ్వాలంటూ.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందన్ పరిస్థితి చూసి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి చలించిపోయారు. స్వయంగా కలెక్టర్ వద్దకు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను తీసుకువెళ్లి కలిశారు. పేద కుటుంబానికి చెందిన నందన్‌కు డయాలసిస్ చేయించేందుకు పింఛన్ మంజూరు చేయించాలని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ నందన్ వైద్యానికి కొంత నిధులు అందించారు. డయాలసిస్ పింఛన్ అందించడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నందన్‌కు దివ్యాంగుల పింఛన్ అందుతోంది. అప్పులు చేసి.. తలకు మించిన భారమైనా సుధాకర్‌రెడ్డి, అనూష అప్పులు చేసి కొడుక్కి వైద్యం చేయిస్తున్నారు. మూత్రం పోసుకోవడానికి ఇంటి వద్దే తల్లిదండ్రులు బ్యాగ్‌లు మారుస్తున్నారు. కిడ్నీ మార్చాలంటే ముందు మూత్ర సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపూస సమస్య ఉండటంతో ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా నొప్పులతో బాధపడుతున్నాడు. నందన్ వైద్యానికి సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కూలి పనులు చేసుకునే నందన్ తల్లిదండ్రులు అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఒక్కగానొక్క కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ బిడ్డ వైద్యానికి సహకరించాలని కోరుతున్నారు. సాయం కోరుతాం జగనన్న పాదయాత్ర సమయంలోమా గ్రామానికి వచ్చినప్పుడు కలిసి మా పరిస్థితి వివరించాం. త్వరలో ఆయన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి సాయం కోరుతాం. – మార్తుల అనూష,నందన్ తల్లి నందన్ తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు పేరు: మార్తుల అనూష బ్యాంక్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సిద్ధనకొండూరు అకౌంట్ నంబర్: 91073257658 ఐఎఫ్ఎస్ కోడ్: APGB0004016 సెల్ నంబర్: 94932 06631 -
పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీకి ప్రమాదమా?
నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈ మధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? – ఎమ్. భూమయ్య, కరీంనగర్ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి నా వయసు 65 ఏళ్లు. చాలా ఏళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఆ నొప్పులు తట్టుకోలేక చాలాకాలం నుంచి నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?– డి. మాధవరావు, చీరాల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి. బాబు కళ్లూ,కాళ్లు ఉబ్బికనిపిస్తూఉన్నాయి... మా అబ్బాయికి ఆరేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?– ఎమ్. సుభాష్, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి.డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పెద్దరావిగూడెంలో కిడ్నీ బాధితులు
పశ్చిమగోదావరి, కుక్కునూరు: కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో పల్లాల లక్ష్మి (41) సోమవారం మృతి చెందింది. ప్రస్తుతం మరికొంతమంది గ్రామస్తులు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న విషయం వైద్యాధికారులు గత నెలలోనే గుర్తించారు. కొందరు బాధితులను ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ టెస్ట్‌లు నిర్వహించిన వైద్యులు లక్ష్మికి రెండు కిడ్నీలు పాడయ్యాయని, వారానికి నాలుగుసార్లు డయాలసిస్ చెయ్యాలని తేల్చారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారని లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా ఇక్కడి వైద్యులు ట్యూబ్ వేయించుకుంటే తప్ప డయాలసిస్ చెయ్యలేమన్నారని, దీంతో బయట ట్యూబ్ వేయించాలంటే రూ.15 వేలు ఖర్చవుతుందనడంతో డబ్బులు లేక ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. దీంతో వ్యాధి ముదిరి లక్ష్మి సోమవారం మరణించిందని తెలిపారు. గుంటూరు వెళ్లిన మిగిలిన వారు కూడా స్వగ్రామానికి తిరిగి వచ్చేసినట్టు స్థానికులు తెలిపారు. కిడ్నీ సమస్యలకు కారణాలను తేల్చాలి : పెద్దరావిగూడెం గ్రామంలో రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో నలుగురు మృతిచెందడం సంచలనమైంది. ఈ విషయమైపత్రికలలో కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు పెద్దరావిగూడెం గ్రామంలో నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి వల్ల ఆ వ్యాధి రాలేదని తేల్చారు. మరి కిడ్నీ సమస్య రావడానికి కారణాలు ఏమిటన్నది గ్రామస్థులకు అర్థం కావడంలేదు. అది తేల్చాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కిడ్నీ వ్యాధులకు గల కారణాలు ఏంటో తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య సిబ్బందిని పంపిస్తాం పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ పాడై మహిళ మృతిచెందిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. వైద్య సిబ్బందిని మంగళవారం ఆ గ్రామానికి పంపిస్తాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారితో మాట్లాడతాం. ఆ సమస్య ఎందుకు వస్తున్నదో తెలుసుకుని నివారణ చర్యలు చేపడతాం.– వంశీలాల్ రాథోడ్,డివిజినల్ ప్రత్యేక వైద్యాధికారి -
ఆ కుటుంబంపై పగబట్టిన కిడ్నీ మహమ్మారి
ఇచ్ఛాపురం రూరల్: ఆ కుటుంబంపై కిడ్నీ వ్యాధి మహమ్మారి పగబట్టింది. ఒక్కొక్కరూ ఈ వ్యాధిబారిన పడుతూ తొలుత తల్లిదండ్రులు చనిపోగా, రెండేళ్ల క్రితం తమ్ముడు నాగరాజు(35) మృతిచెందాడు. తాజాగా ఈయన అన్నయ్య గుజ్జు మోహనరావు(45) ఈ వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాస విడిచాడు. ఈ విషాద ఘటనతో మండలంలోని కేశుపురం గ్రామంలో గురువారం కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన ఐదేళ్లుగా విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్షలాది రూపాయలు అప్పుల పాలయ్యాడు. అయితే డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న కిడ్నీ బాధితుల పింఛన్‌కు సైతం నోచుకోలేకపోయాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య పద్మ, కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. వీరికి బీమా పథకం ద్వారా ఎంపీపీ ఢిల్లీరావు ఐదు వేల రూపాయలు అందజేశారు. -
కిడ్నీ బాధితులకు రూ.10వేల పెన్షన్ ఇస్తాం : వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం : అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను లోహరబంధ పరిధిలోని ఏడు గ్రామాల కిడ్నీ బాధితులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని మొరపెట్టుకున్నారు. రోగులకు సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా లేవని చెప్పారు. కిడ్నీ, తిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నారని జననేతకు చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార మహేంద్రతనయ నుంచి మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీల పట్ల కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు ఇచ్చాపురం ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. -
క్రియాటిన్ ఎక్కువగానే ఉన్నా... డయాలసిస్ చేయడం లేదెందుకు?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 58 ఏళ్లు. ఈమధ్య బాగా నీరసంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. ఎందుకిలా? క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? – డి. రామేశ్వరరావు, విజయవాడ కిడ్నీ రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి క్రియాటినిన్ కేవలం కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 – 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 – 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 – 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీని వల్ల కేవలం క్రియాటినిన్ మాత్రమే డయాలసిస్ చేయాలనడానికి ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించనప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏమిటి? నా వయసు 52 ఏళ్లు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. పనిలో భాగంగా తరచూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటాను. ఈ కారణంగా నెలలో మూడువారాలు బయటే తింటుంటాను. మద్యపానం అలవాటు కూడా ఉంది. అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉంది. కొద్ది నెలలనుంచి బలహీనంగా అనిపిస్తోంది. వీపు దిగువ భాగాన నొప్పిగా ఉంటోంది. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో మొదలయ్యిందని అనిపించి డాక్టర్‌కు చూపించగా కిడ్నీకి సంబంధించిన వ్యాధి సీకేడీ ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్నారు. అసలు ఇదేం వ్యాధి? ఎందుకు వస్తుంది? దయచేసి వివరంగా తెలపండి. – జి. గుర్నాధరెడ్డి, కొడంగల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే మాటకు సంక్షిప్త రూపమే సీకేడీ. ఇది మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఆహారపు అలవాట్లలో లోటుపాట్ల కారణంగా మనదేశంలో చాలామందికి ఈ వ్యాధి వస్తున్నది. డయాబెటిస్, హైబీపీ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. ఆ రెండూ ప్రధాన కారణాలే అయినప్పటిMీ గ్లోమెరులార్ డిసీజ్, వారసత్వ (జన్యు) కారణాల వల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. పదే పదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు గురవుతుండటం, మూత్రపిండాలలో రాళ్లు, మద్యపానం, పొగతాగడం, ఊబకాయం కూడా సీకేడీ ముప్పును మరింత అధికం చేస్తాయి. సీకేడీ నెమ్మదిగా కబళించే వ్యాధి. దీనిలో మూత్రపిండాలకు జరిగే నష్టం తీవ్రమైనదీ, శాశ్వతమైనది. సీకేడీ వల్ల కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల కాలంలో నెఫ్రాన్లకు నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉంటుంది. సీకేడీలో అధికరక్తపోటు, ఛాతీలో నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, అకారణంగా కనిపించే అలసట, కడుపులో వికారం, వాంతులు, వీపు దిగువభాగాన నొప్పి, చర్మంపై దురదలు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వ్యాధి ముదిరిన దశలో మాత్రమే వ్యక్తమవుతాయి. చాలా సందర్భాలోల వ్యాధిగ్రస్తులను కాపాడటానికి అవకాశం లేని దశలోనే ఇవి వెల్లడి అవుతుంటాయి. నెఫ్రాన్లలో అధిక శాతం పూర్తిగా నష్టం జరిగి, ముదిరిన తర్వాతే వ్యాధి గురించి తెలుస్తుంది కాబట్టి సీకేడీని సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దేశంలో ఆరోగ్యంగా కనిపిస్తున్న ప్రతి 5 నుంచి 10 మందిలో ఒకరు ఇంకా బయటపడని సీకేడీ బాధితులే అని అంచనా. ప్రారంభదశలోనే దీఇ్న గుర్తించినట్లయితే వ్యాధి మరింతగా విస్తరించకుండా చర్యలు తీసుకోడానికి వీలవుతుంది. మందులు ఉపయోగించి చికిత్స చేయడంలో భాగంగా మొదట అధికరక్తపోటును అదుపు చేయడం, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మిగిలిన అవకాశాలు రెండే. మొదటిది డయాలసిస్ చేస్తుండటం. అయితే ఇది మూత్రపిండాల వ్యాధులను నయం చేసే చికిత్స ఎంతమాత్రమూ కాదు. తాత్కాలికంగా మూత్రపిండాల బాధ్యతను స్వీకరించి, శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోకుండా చూసే మార్గమిది. ఇది మరో ప్రత్యామ్నాయం (మూత్రపిండాల మార్పిడి) దొరికే దాక అనుసరించాల్సి మార్గం మాత్రమే. డయాలసిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు శాశ్వత పరిష్కారంగా మూత్రపిండాల మార్పిడిని సూచిస్తారు. ఇందుకు రోగి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులెవరైనా తమ మూత్రపిండాలలో ఒకదాన్ని దానం చేయడమో లేక బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి (రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని జీవన్‌దాన్ సంస్థ సాయంతో) సేకరించిన మూత్రపిండాన్ని అమర్చడమో చేస్తారు. డాక్టర్ కె.ఎస్.నాయక్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బతుకు దుర్భరం.. కష్టాల సాగరం
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: ఆమెకు కిడ్నీ పాడైంది.. రెండు కిడ్నీలు పాడై భర్త మరణం.. భర్త మరణం నుంచి తేరుకుంటున్న ఆమెను ప్రమాదం వెంటాడింది. దీంతో రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో జీవితం దుర్భరంగా మారింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సరిగా మాటలు రాని 14 ఏళ్ల కుమారుడు సంపాదనపై ఆధారపడి జీవనం సాగి స్తోంది. వివరాల్లోకి వెళితే భీమడోలు మండలం కురెళ్లగూడేనికి చెందిన కెంగం దుర్గకు ఉంగుటూరుకి చెందిన శ్రీనివాసుతో 2000లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంపై కష్టాలు కన్నేశాయి. దీంతో కుటుంబం చిన్నాభిన్నమైంది. దుర్గకు బిడ్డ జన్మించిన ఏడాది తర్వాత అనారోగ్యానికి గురైంది. వై ద్యులు పరీక్షించి మూత్రపిండం దెబ్బతిందని నిర్ధారించి తొలగించారు. పదిహేనేళ్లుగా ఒక కిడ్నీతో ఆమె బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలిద్దరూ వ్యవసా య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త శ్రీనివాసరావుకి 2016 మార్చిలో రెండు కిడ్నీలు పాడైపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినా శ్రీనివాసరావు ప్రాణాలు ని లువలేదు. భర్త మరణ శోకాన్ని దిగమింగుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటుండగా మరోసారి విధి వక్రిం చింది. గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో దుర్గ తన రెండు కాళ్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆమె కుమారుడు గణేష్ పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగియగానే మోటార్ మెకానిక్ షెడ్డులో పనిచేసి గణేష్ తల్లిని పోషించుకుంటున్నాడు. కృత్రిమ కాళ్లు ఏర్పాటు పాలకొల్లుకి చెందిన శ్రీ చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు వేదాంతం సదా శివమూర్తి ఆమె దీనస్థితిని చూసి రూ.16 వేలు విలువైన రెండు కృత్రిమ కాళ్లు అందజేశారు. ప్రస్తుతం దుర్గ జీవితం రోజు గడవడం కష్టంగా మారింది. ప్రతి రోజూ మందులు మింగాలి, బలవర్ధక ఆహారం తీసుకోవాలి. మరోవైపు ఆమె కుమారుడు చదువుకోవాలి. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉందని దుర్గ ఆవేదన చెందుతోంది. దయగల దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు కెంగం దుర్గ, యూనియన్ బ్యాంక్, పూళ్ల, ఖాతా నం.329602120001383, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0532967, సెల్ 96665 27734 సంప్రదించాలని ఆమె కోరుతున్నారు. -
పోలీసుల కాఠిన్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : ఫ్రెండ్లీ పోలీస్‌లుగా ప్రజలతో వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు తెలియజేస్తున్నా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని రాపూరు ప్రాంతానికి చెందిన, రాపూరు నరసింహరావు, లక్ష్మమ్మ వృద్ధ దంపతులు. లక్ష్మమ్మ కొన్ని సంవత్సరాలనుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్ర వారాల్లో నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని నారాయణ ఆస్పత్రిలో క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకోవాల్సి ఉంది. ప్రతి వారం రెండు రోజులు నెల్లూరుకు వచ్చి చికిత్స చేయించుకుని వెళ్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా రాపూరులోని వారి బంధువులకు చెందిన కారులో, నారాయణ ఆస్పత్రికి వచ్చి డయాలసిస్ చేసుకుని తిరిగి రాత్రి రాపూరుకు వెళుతుండేవాడు. నగరంలోని ఆనం వెంకటరెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగా, ప్రమాదవశాత్తు, ముందు వెళ్తున్న ఓ స్కూటరిస్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే స్కూటర్లో ప్రయాణిస్తున్న పోలీసుశాఖకు చెందిన దంపతులు కింద పడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆ పోలీసు డ్రైవర్‌ను బలవంతంగా కారులోంచి బయటకు లాగాడు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మమ్మ, నరసింహరావు కుమారుడు శ్రీనివాసులు ఎంతో బతిమిలాడారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, డ్రైవర్‌ను తీసుకుపోతే, తన తల్లి పరిస్థితి విషమిస్తుందని వేడుకున్నారు, సదరు ఆ పోలీసు పట్టించుకోకుండా, కారు డ్రైవరు ఎస్కె.సలామ్‌ను సీసీఎస్‌కు తీసుకెళ్లాడు. గంట సేపు కారులోనే అనారోగ్యంతో ఉన్నా లక్ష్మమ్మను చూసి స్థానికుల మనస్సు కలచివేసింది. గంట తరువాత పోలీసులు డ్రైవర్‌ను విడిచి పెట్టారు. అయితే ఫ్లెండ్లీ పోలీసు అంటే ఇలాగు ఉంటారా అని స్థానికులు చర్చించుకున్నారు. -
దెబ్బతిన్న రెండు కిడ్నీలు
చిత్తూరు, రొంపిచెర్ల: రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో దాతల సాయం కోసం ఓ సామాన్య వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని బోడిపాటివారిపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లెకు చెం దిన వెంకటనాగులు రెండవ కుమారుడు శ్రీకాంత్ (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య తేజశ్రీ, లీలు (11 నెలల పాప) ఉన్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాంత్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో పలు ఆస్పతుల్లో చికిత్సలు చేయించారు. చివరకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలియజేశారు. అప్పటికే సుమారు రూ. 10 లక్షలు అప్పు చేసి చికిత్సలు చేయించినట్లు భార్య తేజశ్రీ తెలిపారు. మరో రూ. 20 లక్షలు ఉంటేగానీ ఏం చేయలేమని డాక్టర్లు తెలిపారని తేజశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. కూలి చేసి జీవనం సాగిస్తున్న తాము అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని బోరున విలపించింది. ప్రస్తుతం తన భర్త స్విమ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. దాతలు స్పందించి కిడ్నీ దానం చేసి ఆదుకోవాలని, లేకుంటే నగదు సాయం చేయాలని ఆమె కోరుతోంది. దాతలు నగదును తేజశ్రీ ఎస్బీఐ అకౌంట్ నెంబరు 35531788134, ఐఎఫ్‌సీ కోడ్ 15894కు బదిలీ చేయాలని ఆమె విన్నవించింది. వివరాల కోసం 88868 36415లో సంప్రదించగలరు. -
రెపరెపల దీపానికి కనురెప్పల కావలి
ఈ తల్లీబిడ్డల జీవితంలో పేదల బతుకులున్నాయి. నిరాదరణకు గురైన మహిళల జీవితాలున్నాయి. తండ్రి ఆలన, పాలనకు నోచుకోని పిల్లల కన్నీళ్లున్నాయి. వైద్యం ఆరోగ్యం పేదవాడికి అందని ద్రాక్ష అని చెప్పేందుకు సాక్ష్యాలున్నాయి. అన్నిటినీ మించి నిండు ప్రాణం కళ్లముందే కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపించలేని పాలకుల నిర్లక్ష్యపు నీలి ఛాయలున్నాయి. కష్టం వస్తే నేరుగా ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకోవాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. రెపరెపలాడుతున్న దీపాన్ని కంటిరెప్పల మధ్య పెట్టి బతికించుకుంటున్న ఓ తల్లి వ్యథ ఇది. అజయ్‌కి పన్నెండేళ్లు. ‘గాచర్స్’ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి ఏటా కోటి రూపాయలు ఉంటే తప్ప వైద్యం దొరకదు. మందులు, ఇంజెక్షన్లు కూడా విదేశాల నుంచే తెప్పించాలి! సూర్యకుమారి.. అజయ్ తల్లి.ఉపాధి పనులకు వెళుతూ వచ్చిన కూలీ డబ్బులతో బిడ్డను పోషిస్తోంది. కిడ్నీ వ్యాధి కబళిస్తున్నా, కట్టుకున్నవాడు కలిసిరాకపోయినా కన్నబిడ్డను కంటికి రెప్పలా కాసుకుంటోంది. మూడేళ్ల క్రితమే గుర్తించారు విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి వెళితే 2116 మంది జనాభా కనిపిస్తారు. వీరిలో ఐదేళ్ల వయసులోపు పిల్లలు 96 మంది ఉంటే ఆరేళ్ల నుండి 14 ఏళ్ల లోపు వయసు పిల్లలు 62 మంది వున్నారు. అరవై రెండు మందిలో ఒకడు పన్నెండేళ్ల వయసున్న పెదపూడి అజయ్. దేవరాపల్లి మండలం కాశీపురంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పుట్టుకతోనే ఎంజైమ్ లోపంతో వచ్చే గాచర్స్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అజయ్‌కు మూడో ఏటా నుండే ఆరోగ్యం సమస్యలు తలెత్తినప్పటికీ మూడేళ్ల క్రితమే ఆ సమస్యలకు గాచర్స్ కారణమని వైద్యులు గుర్తించారు. తనకు కడుపులో కాయ వచ్చిందని, ఎప్పుడుపడితే అప్పుడు అది కదులుతుంటుంటే నొప్పి వస్తోందని అంటున్న అజయ్ బాధను తల్లి సూర్యకుమారి కన్నీటిపర్యంతం అవుతూ సాక్షి ప్రతినిధికి చెప్పుకుంది. ఐదో నెల నుంచీ దగ్గు, జ్వరం ‘‘విశాఖ నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సన్యాసిరావుతో 2005లో నా పెళ్లి జరిగింది. 2006లో బాబు, 2008లో పాప పుట్టారు. ఐదు నెలల వరకు బాబు బాగానే ఉన్నాడు. తరువాత నుంచి దగ్గు రావడంతో పాటు జ్వరమూ వస్తుండేది. అప్పుడు అనకాపల్లిలో ఉమామహేశ్వరరావు అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. రెండుమూడేళ్లు ఆయన దగ్గరే వైద్యం చేయించాం. తర్వాత కొత్తవలసలో శ్రీకాంత్ అనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాం. అప్పటికీ ఫలితం లేకపోయింది. బాబుకి 8 ఏళ్లు వచ్చిన తరువాత విశాఖ కేజీహెచ్ దగ్గర ప్రేమ్‌కుమార్ దగ్గరకు తీసుకెళ్లాము. అక్కడ ఆస్మా తగ్గింది. కానీ అక్కడ నుంచి వాంతులు అవ్వడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఊపిరి పీల్చుతుంటే బాబుకి బాగా నొప్పి వచ్చింది. ఆ సంగతి మాకు చెప్పకుండా అలాగే రెండురోజులు స్కూల్‌కి కూడావెళ్లాడు. అన్నం తినమంటే ఆకలిగా లేదని అన్నం తినేవాడుకాదు. ఏం తిన్నా, పాలు తాగిన బాబుకి వాంతులు అయిపోయేది. ఏడాదికి కోటి రూపాయలు! బాబుకి ఇలా అయిన దగ్గర నుంచి మా ఆయన బాబుని పూర్తిగా పట్టించుకోవడం మానేసాడు. ఆయన వైజాగ్ మద్దిలపాలెంలో వెల్డింగ్ చేస్తుంటాడు. బాబుకి నొప్పి వస్తే నాతో పాటు అమ్మ, తమ్ముడే హాస్పిటల్‌కు తీసుకెళుతుంటారు. నాక్కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. చెరువు పనులు ఉంటే వెళ్తుంటాను. నాకు ఒంట్లో బాగోదని ఆ పనికి కూడా తమ్ముడు నన్ను పంపించేవాడు కాదు. నాకు, నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందని ఎవరినైనా సాయం అడగాలనుకున్నా.. అందరం పనులు చేసుకునే వాళ్లమేగా అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా. తర్వాత బాబును విశాఖ కె.జి.హెచ్.కు తీసుకెళ్లి ఆరునెలలపాటు చికిత్స చేయించాము. చివరికి అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ లేదన్నారు. బెంగళూరు వెళ్లమన్నారు. బాబు ట్రీట్మెంట్కు మెడిసిన్ ఉంది కానీ ఒక్క ఇంజక్షను సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు. డాక్టర్‌ను అడిగితే మీరు లోకల్ ఎమ్మెల్యేను గానీ, లేదా ఇంకెవరినైనా ధన సాయం అడిగి చూడండి అన్నారు. హైదరాబాద్‌లో జెనిటిక్స్ మేడమ్ రాధా రమాదేవి గారిని కలిశాం. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందని అయితే అది చాలా ఖరీదైనదని ఆమె ద్వారానే తెలిసింది. ఒక హాస్పిటల్లో ఈ వ్యాధికి అయ్యే ఖర్చు ఎంతో అంచనా వేసి ఏడాదికి కోటి రూపాయలు అవుతుందని చెప్పారు. అప్పులు తప్ప ఏమీ మిగల్లేదు బాబుకు పదిహేను రోజులకోసారి ఉదయంపూట నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో ఏం తిన్నా వాంతులు అవుతుంటాయి. తిన్నగా కూర్చోలేడు. పడుకోలేడు. అప్పుడే డాక్టరు రాసిచ్చిన టానిక్ వేసేవాళ్లం.కేజీహెచ్ హాస్పిటల్లో మేడమ్ మమ్మల్ని ఇక హాస్పిటల్‌కి రానవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ వ్యాధికి వైద్యం అందించే మందులు అక్కడ లేవు. పదేళ్ల పాప రిషిత, నా బాబు, వాడి కోసం చేసిన అప్పులు తప్ప నాకు ఇంకేమి లే దు. అజయ్ అమ్మమ్మ, తాతయ్య, మేనమామ అరిపాక సరోజిని, విశ్వనాథం, సతీష్‌లు నాకు తోడుగా ఉన్నారు. అజయ్‌కు అనారోగ్యం ఉందని తెలిసినప్పటి నుంచీ నా భర్త సన్యాసినాయుడు తాగుడుకు బాగా అలవాటు పడి మమ్మల్ని పట్టించుకోవటం మానేశాడు. కోర్టును కూడా ఆశ్రయించాం రిపోర్టుల ఆధారంగా అజయ్ వ్యాధి అరుదైనదని తెలిసింది. దానికి వైద్యం కేజీహెచ్‌లో అందించలేమని బెంగళూరు, సీఎంసీలో మందులు దొరికే అవకాశముందని వైద్యులు చెప్పారు. ఆరునెలలు పాటు అక్కడి సీఎంసీలో అనేక టెస్టులు చేయించి వైద్యసేవలు అందించారు. ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.1.24 లక్షలన్నారు. అంత ఆర్థిక స్తోమత లేకపోవటంతో అక్కడి నుంచి వచ్చేశాం. అప్పుడే.. సీఎంసీ వైద్యులు సుమిత హైదరాబాద్ వెళ్లమంటే బంజారాహిల్స్‌లో డాక్టర్ రాధారమాదేవిని కలిశాం. అంత డబ్బంటే ఎలా! ప్రభుత్వం నుండి సహాయం చేయమని అడగడానికి అమరావతి వెళ్లాం. అక్కడ సిఎమ్ అందుబాటులో లేకపోవటంతో మా గోడు వినిపించలేక వెనుదిరిగాం. అప్పుడే నాకూ కిడ్నీలో రాళ్లున్న విషయం బయటపడింది. కిడ్నీ సమస్యతో ఏ పనిచేయలేకపోతున్నా. ఆరోగ్యం బాగున్నప్పుడు గ్రామంలో ఉపాధి పనికి వెళుతుంటాను. కోటాబియ్యం, కట్టెల పొయ్యితోనే జీవనం సాగిస్తున్నాను. ఇలాంటి స్థితిలో బాబుకి ఇంత ఖరీదైన వైద్యం చేయించలేను. అలాగని వాడిని అలా వదిలేయలేనని బాధపడుతున్న సమయంలో తెలిసిన వ్యక్తి సలహా మేరకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాం. నా బిడ్డ ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఆ ఖర్చును భరించాలని పిటిషన్ వేశాం. ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన లేదు’’ అని చెబుతూ సూర్యకుమారి బోరున విలపించింది. వ్యాధి లక్షణాలు గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రో సైడస్ అని కూడా అంటారు. ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది. ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి. ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది. గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది. గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి. ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది. రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని బెటా – గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తిస్తారు. సాయం అందించాలనుకున్నవారు... అజయ్ మేనమామ సతీష్‌ను 8500637917, 8374145443 నెంబర్లలో సంప్రదించవచ్చు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
ఈ కన్నీరు తుడిచేవారెవరు?
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చదనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లెలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా పది మందికి అన్నం పెట్టిన రైతన్నలు నేడు ఆర్థిక సాయం కోసం చేతులు చాపాల్సిన దుస్థితి దాపురించింది. మూత్రపిండాల(కిడ్నీ) జబ్బులతో వేలాది కుటుంబాలు చితికిపోయాయి. ఈ దెబ్బకు ఉన్న ఆస్తులు, పొలాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. పుండుపై కారం చల్లినట్టు తిత్లీ తుపాన్ బాధిత కుటుంబాలను మరింత కుంగదీసింది. ఉద్దానంలోని సోంపేట, కవిటి, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో కిడ్నీ రోగుల దుస్థితిని ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. గుండె తరుక్కుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఉద్దానం ప్రాంతంలో 40–45 ఏళ్ల వయసుకే వేలాది మంది మూత్రపిండాల జబ్బుల బారిన పడ్డారు. ఎప్పటికప్పుడు రక్తశుద్ధి(డయాలసిస్) చేయించుకుంటే తప్ప వారు బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఉద్దానంలో 7 మండలాలు ఉండగా, సోంపేట, పలాసలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలున్నాయి. చాలామంది బాధితులు వారానికి రెండుసార్లు, కొందరు మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. సోంపేటలో రోజుకు 70 మందికి, పలాసలో 40 మందికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో చాలామంది బాధితులు వెయిటింగ్లో ఉన్నారు. లేదంటే విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లాలి. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లాలంటే సహాయకుడితో కలిపి రూ.2,000 ఖర్చవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కిడ్నీ వ్యాధుల వల్ల ఉద్దానంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. తిత్లీ తుపాన్ పల్ల పంటలు, తోటలన్నీ నాశనమయ్యాయని, రూపాయి కూడా ఆదాయం లేదని, ఇక డయాలసిస్ ఎలా చేయించుకోవాలని కిడ్నీ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఉద్దానంలో ఏ కిడ్నీ బాధితుడిని కదిలించినా ఒకటే ఆవేదన. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెన్షన్ సరిపోవడం లేదని, తక్షణమే పెంచాలని కోరుతున్నారు. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లడానికి బస్ పాసులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. తిత్లీ తుపాన్ వల్ల దారుణంగా నష్టపోయామని, తమకు ప్రత్యేకంగా నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరు మృతి చెందితేనే మరొకరికి డయాలసిస్ ఉద్దానంలోని సోంపేట, పలాసతోపాటు టెక్కలి, శ్రీకాకుళంలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 13 రక్తశుద్ధి యంత్రాలు పనిచేస్తున్నాయి. ఉద్దానంలోని బాధితులంతా సోంపేట, పలాసకే వస్తారు. ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులెవరైనా మృతి చెందితేగానీ మరొకరికి అవకాశం రాదు. ఒక యంత్రం రోజుకు ఒక్కొక్కరికి 4 గంటల చొప్పున మూడు షిఫ్ట్‌లు మాత్రమే రక్తశుద్ధి చేయగలదు. గడిచిన ఏడాదిన్నరలో సోంపేట డయాలసిస్ కేంద్రం పరిధిలో 43 మంది, పలాస కేంద్రం పరిధిలో 15 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. శ్రీకాకుళం, టెక్కలి కేంద్రాలను కూడా కలుపుకుంటే 100 మందికి పైగా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డయాలసిస్ చేయడంలో జాప్యం జరిగితే కాళ్లు, చేతులు వాపు వస్తాయి. తీవ్ర ఆయాసం వస్తుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా జాప్యం జరగడం వల్ల చాలామంది బాధితులు మృతి చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డయాలసిస్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. పెన్షన్ డబ్బులు చాలడం లేదు ‘‘నాది ఇచ్ఛాపురం దగ్గర కేఎస్ పురం. డయాలసిస్ కేంద్రానికి రావాలంటే 35 కిలోమీటర్లు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చెయ్యాలి. వచ్చిన ప్రతిసారీ రూ.1,000 ఖర్చవుతోంది. ఇక్కడ ఇచ్చే మందులు చాలవు. మందులకే రూ.5,000 అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.2,500 పెన్షను ఒక్క వారానికి కూడా సరిపోవడం లేదు’’ – లోకనాథం, కిడ్నీ బాధితుడు, కేఎస్ పురం మాకే ఎందుకు ఈ శాపం ‘‘మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు కిడ్నీ జబ్బు వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక కొంత పొలం అమ్ముకున్నాం. వారానికి రెండుసార్లు డయాలసిస్ కేంద్రానికి వస్తున్నాం. మాకే దేవుడు ఎందుకు ఈ శాపం పెట్టాడో. సర్కారు సాయం చాలడం లేదు. భర్తకు కిడ్నీ జబ్బు రావడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది’’ – శోభ, కిడ్నీ బాధితుడు బాలం భార్య, బెజ్జపుట్టుగ గ్రామం మందులు మింగకపోతే చనిపోతా.. ‘‘నేను ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. మూడు రోజులు మందులు మింగకపోతే చనిపోతా. కిడ్నీ జబ్బు వచ్చాక నా భార్య కిడ్నీ ఇచ్చింది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మందులు ఉచితంగా ఇవ్వరట. ఎకరా భూమిలో కొబ్బరి చెట్లన్నీ తిత్లీ తుపాన్ ధాటికి నేలకొరిగాయి. మందులు ఏ రోజైతే ఆపేస్తానో అవే నాకు చివరి రోజులు’’ – లమ్మత శేషగిరి, అతని భార్య సుజాత, పెద్ద శ్రీరాంపురం చనిపోతే మేలేమో అనిపిస్తోంది ‘‘నా భార్య రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటోంది. ఇంట్లో వృద్ధురాలు మా అమ్మ, మా అత్త ఉన్నారు. అనారోగ్యం వల్ల నా భార్య ఏ పనీ చేయలేదు. ఈ ముగ్గురికీ నేనే వండిపెట్టాలి. నా భార్యకు చికిత్స చేయించాలంటే చేతిలో డబ్బుల్లేవు. సర్కారు ఇచ్చే సాయం సరిపోవడం లేదు. ఈ బాధ పడే కంటే చనిపోతే మేలేమో అనిపిస్తోంది’’ – కిడ్నీ జబ్బు బాధితురాలు నాగమణి భర్త పురుషోత్తం, పలాస టౌన్ పెన్షన్ పెంచాలని ప్రతిపాదించాం.. ‘‘కవిటి మండల కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఉద్దానం కిడ్నీ బాధితులకు మందుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని లేఖ రాశాం. బస్సు పాసులు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పంపిస్తాం’’ – ధనుంజయరెడ్డి, కలెక్టర్, శ్రీకాకుళం జిల్లా -
హైబీపీతో కిడ్నీలు దెబ్బ తినవచ్చా?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించగా ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. లేదంటే నాకు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నేను మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – విశాల్, హైదరాబాద్ మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. కాళ్ల వాపులు వస్తున్నాయి... కిడ్నీల సమస్యా? నాకు 67 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రొటిన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? – ఎల్. కృష్ణమూర్తి, జనగామ మీరు తెలిపిన వివరాలను, మీ రిపోర్టుల్లో నమోదైన అంశాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రొటిన్లు ఎక్కువగా పోతున్నాయి. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మూత్రంలో ప్రొటిన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పినివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు నివారణ మార్గాలున్నాయా? దయచేసి నాకు సలహా ఇవ్వండి. – డి. రమేష్‌కుమార్, కాకినాడ మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆధునిక వ్యాధులకు దేశీ ఆహారమే దివ్యౌషధం!
మధుమేహం, హృద్రోగాలు, ఊబకాయం, కేన్సర్, కిడ్నీ జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డి, బి12 లోపం, విషజ్వరాలు.. వంటి ఆధునిక వ్యాధుల నియంత్రణకు, నిర్మూలనకు.. సంపూర్ణ ఆరోగ్య సాధనకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన సిరిధాన్యాలు, కషాయాలు వంటి దేశీయ ఆహారమే దివ్యౌషధాలని ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, అటవీ వ్యవసాయ నిపుణులు డా. ఖాదర్‌వలి(మైసూరు) అంటున్నారు. ఔషధ విలువలతో కూడిన సిరిధాన్యాలు, కషాయాలతో అన్ని రకాల వ్యాధులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చంటున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ నెల 7,8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభల్లో ప్రసంగించిన అనంతరం సభికుల ప్రశ్నలకు డా. ఖాదర్ సమాధానాలిస్తారు. ఈ నెల 7(ఆదివారం)న మ. 2 గం.–5.30 గం. వరకు సికిందరాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో ప్రసంగిస్తారు. 8(సోమవారం)న ఉ. 9.30 గం.–మ. 12.30 గం. వరకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం(సుబేదారి, హనుమకొండ)లో, అదే రోజు సా. 3 గం.–6 గం. వరకు కరీంనగర్‌లోని వైశ్య భవన్(గాంధీరోడ్, కరీంనగర్)లో డా. ఖాదర్ ప్రసంగిస్తారని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
మిషన్ ఉద్దానం..!
సిక్కోలు కోనసీమగా పచ్చని కొబ్బరి చెట్లతో పేరుతెచ్చుకున్న ఉద్దానం ప్రాంతాన్ని ఇప్పుడు కిడ్నీ రోగాలు వణికిస్తున్నాయి. రోగాలకు మూలకారణాలపై పరిశోధనలు మాటెలా ఉన్నా ప్రజలలో ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. అసలు వ్యాధికి కారణమేమిటో కనుక్కునేలోగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలంటే ఏమి చేయాలి? అదే మిషన్ ఉద్దానం! జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ప్రత్యేక దృష్టితో దీనికి నాంది పలికారు. వైద్య, సామాజిక, ఆర్థిక కోణాల్లో సమస్యను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉద్దానంలోని ఏడు మండలాల్లో మండలానికి ఒక్కటి చొప్పున అవగాహన సమావేశాలనూ నిర్వహించారు. మరోవైపు వైద్యం, తాగునీటి సౌకర్యాలను పెంచేందుకు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం సాక్షి: మీ ‘మిషన్ ఉద్దానం’ లక్ష్యాలేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తేలితే వైద్యం ఏ స్థాయిలో అందించాలనేదీ నిర్ణయమవుతుంది. ఇందుకు తొలుత ఉద్దానంలో పెద్ద ఎత్తున మెడికల్ మాస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. అలా గుర్తించినవారికి ఉచితంగా మందులు, డయాలసిస్ సౌకర్యం కల్పించాలి. తాగునీటి వల్లే ఈ రోగాలు వస్తున్నాయనే వాదనలు ఉన్న నేపథ్యంలో ముందు ఇంటింటికీ శుద్ధజలం అందించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం మరో ఎత్తు. సాక్షి: మిషన్ విజయవంతమవ్వాలంటే మౌలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: కిడ్నీ రోగాలపై ప్రజల్లో ఇప్పటికీ తగిన అవగాహన లేదు. రోగం వచ్చినా తగిన వైద్యం పొందితే కోలుకుంటామన్న మనోధైర్యం కూడా చాలామందిలో ఉండట్లేదు. ఒకవిధమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యను ఇప్పటివరకూ వైద్యపరంగానే చూస్తున్నాం. సామాజిక, ఆర్థిక కోణాల్లోనూ చూడాలి. ప్రజలను చైతన్యం చేసి ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చూపించాలి. ఈ ప్రక్రియ పక్కాగా జరిగితే ముందడుగు వేసినట్లే. సాక్షి: రోగం గుర్తించడానికి అవసరమైన వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి ఏం చేస్తారు? కలెక్టర్: వైద్య పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కూడా చాలామంది ఉద్దానం ప్రజల్లో లేదు. భయంతో పెయిన్ కిల్లర్స్ తీసుకొని రోగాన్ని పెంచుకుంటున్నారు. కొంతమందైతే రోగం బాగా ఎక్కువయ్యేవరకూ వైద్యానికి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ కిడ్నీ రోగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం వైద్యాఆరోగ్య శాఖనే గాకుండా స్త్రీశిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖల సిబ్బందితో పాటు స్థానిక వైద్యులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇలా అన్నివర్గాలనూ ఈ మిషన్‌లో పాలుపంచుకునేలా చేసేందుకే ముందుగా మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాం. సాక్షి: క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయా? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సాధికారమిత్రలతో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులకూ ముందుగా అవగాహన కల్పించాం. వారైతే ప్రజలకు చేరువగా వెళ్లి చైతన్యం చేయగలరు. ఈ విషయంలో మీడియా కూడా తన వంతు సహకారం అందిస్తోంది. అన్ని వర్గాల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉద్దానం ప్రాంతంలో 730 ఆవాసాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలైతే 160 నుంచి 170 వరకూ ఉన్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈనెల 11వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాక్షి : ప్రచార కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగాలకు కారణాలేమిటి? వైద్య పరీక్షలు ఎలా చేయించుకోవాలి? ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రత్యేకంగా కరపత్రాలను రూపొందించాం. వాటిని కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి అందజేస్తారు. తర్వాత గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఈ కరపత్రాలు అందజేయాలని డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం. వాస్తవానికి కిడ్నీ రోగుల్లో క్రియాటిన్ లెవల్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మందులు వాడితే సరిపోతుంది. సాక్షి: వైద్య పరీక్షలు సక్రమంగా జరగట్లేదు కదా? కలెక్టర్: జబ్బు బయటపడితే ఏదో జరిగిపోతుందనే భయం ఉద్దానం ప్రజల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువతలో. ముందు ఆ భయం పోగొట్టాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకొస్తే సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడినట్లే! క్రియాటిన్ లెవల్ వగైరా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఉద్దానంలోని ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సెమీ ఆటో ఎనలైజర్లు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కో దానికి రూ.1.50 లక్షల ఖర్చవుతోంది. అంటే ఏ కారణమైనా పీహెచ్‌సీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్రియాటిన్ లెవల్ పరీక్ష చేయాలని వైద్యాధికారులకు చెప్పాం. ఎవరిలోనైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే సీహెచ్‌సీకి వెళ్లాలని వారికి సూచించాలని ఆదేశించాం. సాక్షి: ఉచిత మందుల పంపిణీ మాటేమిటి? కలెక్టరు: కిడ్నీమార్పిడి చేసుకున్నవారికి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మాత్రమే ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇది వ్యయప్రయాసలతో కూడినది. అలాగాకుండా శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నందున ఇక్కడే మందులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరాం. ఇప్పటికే ఉద్దానంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడానికి ఏడాదికి రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఆహారపు అలవాట్లు మార్పు కోసం ప్రచారం చేస్తున్నారా? కలెక్టర్: కిడ్నీ రోగానికి గురైనవారెవ్వరైనా మద్యం, గుట్కా, మాంసాహారానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధిజలం అందించడానికి ఏర్పాట్లు చేసినా మూడో వంతు ప్రజలు మాత్రమే ఇప్పటివరకూ కార్డులు తీసుకున్నారు. 20 లీటర్లు నీటిని రూ.2కు సరఫరా చేస్తున్నారు. అలాగాకుండా తొలి నెల ఉచితంగా కార్డు ఇచ్చేలా డీఆర్డీఏ అధికారులకు బాధ్యత అప్పగించాం. ఇలా అన్ని కోణాల్లో సమష్టిగా మిషన్‌ను విజయవంతం చేస్తే కిడ్నీ మహమ్మారిపై పోరాటంలో ముందడుగు వేసినట్లే! సాక్షి: డయాలసిస్ సౌకర్యాలు మెరుగుపరుస్తారా? కలెక్టర్: సోంపేట, పలాసలోనూ ఉన్న డయాలసిస్ కేంద్రాలకు తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ నాలుగైదు మిషన్లు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో కూడా పెట్టాలనే డిమాండు ఉంది. -
కుమార్తె వైద్యానికి సహకరించమని వేడుకోలు
అల్లిపురం(విశాఖ దక్షిణ): కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందించి జీవితాన్ని ప్రసాదించాలని నగరంలోని బర్మాక్యాంపునకు చెందిన ఆటో డ్రైవర్ కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు దాతలను వేడుకొంటున్నారు. ఈ మేరకు ఆదివారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ 13 ఏళ్ల కుమార్తె కానూరి లతాశ్రీ కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని, మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.15వేలకు పైగా అవుతోందని తెలిపారు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమకు కుమార్తెకు వైద్యం చేయించే స్థోమత లేకుండా పోయిందని తెలిపారు. ఒక రోజు బాగుంటే రెండు రోజులు జ్వరంతో బాధపడుతోందని, మురళీనగర్‌లోని ఎంఎస్ఎం స్కూల్లో పనిచేస్తున్న మూర్తి మాస్టారి సహకారంతో చదివిస్తున్నామని తెలిపారు. ఇంత వరకు అప్పులు చేసి అమ్మాయికి వైద్యం చేయించామని, అయినప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తోందని వాపోయారు. మెరుగైన వైద్యం కోసం దాతలు సహకరించి తమ కుమార్తెకు జీవితాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు తమ ఎస్బీఐ అకౌంట్ నంబరు 89769442309(ఐఎఫ్ఎస్డీ కోడ్ నంబరు. ఎస్బీఐఎన్ 0020573) కానూరి కోటేశ్వరరావు(9010943730) నంబర్లో తెలియపరచగలరని కోరారు. -
బతుకునివ్వండి..
ఎరువుల దుకాణంలో చిరుద్యోగి. వస్తున్న అరకొర వేతనంతోనే భార్యా పిల్లలతో కలిసి గౌరవప్రదమైన జీవనం. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. రెండు కిడ్నీలు చెడిపోయి భర్త మృత్యువుతో పోరాడుతుంటే భార్య తల్లడిల్లిపోయింది. అప్పులు చేసి చికిత్సకు ఖర్చు పెట్టింది. తక్కువ పడితే తన వద్ద ఉన్న నగలు.. చివరకు తాళిబొట్టును సైతం తాకట్టుపెట్టి వైద్యం చేయించింది. ఫలితం దక్కలేదు. నానాటికీ మృత్యువుకు చేరువవుతున్న తన భర్తను కాపాడాలంటూ కనిపించిన వారిని కాళ్లావేళ్లా ప్రాధేయపడుతూ భిక్షాటన చేపట్టింది. మంత్రి కాలవ శ్రీనివాసులు ఇలాకా, జిల్లా పరిషత్ చైర్మెన్ పూల నాగరాజు సొంత మండలంలో ఓ గిరిజన కుటుంబం పడుతున్న వేదన ఇది. అనంతపురం : గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాకు చెందిన ఎస్. రామునాయక్‌కు నాలుగేళ్ల క్రితం పామిడి మండలం రామగిరి తండాకు చెందిన కువిలా బాయితో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హేమంత్నాయక్ (3), సాత్విక్ నాయక్ (2) అనే పిల్లలు ఉన్నారు. బీకాం పూర్తి చేసిన రాము నాయక్ ఉద్యోగం రాకపోవడంతో కూలీపనులకు వెళ్లేవాడు. ఏడాది క్రితం కళ్యాణదుర్గంలోని ఓ ఎరువుల దుకాణంలో చిరుద్యోగిగా చేరి నెలకు రూ. 10 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. కుటుంబ పోషణ భారమైనా భార్యను ఏనాడూ కూలి పనులకు పంపకుండా ఉన్న సంపాదనతోనే గౌరవప్రదంగా జీవిస్తూ వచ్చాడు. రెండేళ్ల క్రితం బయటపడ్డ వ్యాధి రెండేళ్ల క్రితం రామునాయక్ అస్వస్థతకు గురవుతూ వచ్చాడు. పలు ప్రాంతాల్లో చికిత్సలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బళ్లారిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు తేల్చి చెప్పారు. చికిత్సల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. డబ్బు తక్కువ పడితే తన నగానట్రాతో పాటు చివరకు తాళిబొట్టును సైతం కువిలాబాయి తాకట్టుపెట్టి రూ. 4 లక్షల వరకు సమకూర్చుకుని బళ్లారి, అనంతపురం, హైదరాబాద్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఫలితం దక్కలేదు. చావుబతుకుల మధ్య ఊగిసలాట రామునాయక్ చికిత్స కోసం రూ. లక్షలు ఖర్చు అవుతూ వచ్చాయి గానీ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. చివరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. పది నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. రెండు రోజులకొకసారి డయాలసిస్ చేసి రక్త మార్పిడి చేస్తే తప్ప అతనిలో చలనం ఉండడం లేదు. చివరకు కిడ్నీ దాతలతో పాటు శస్త్రచికిత్సకు రూ. 10లక్షలు అవసరమవుతాయని, లేకుంటే అతని ప్రాణాలు దక్కవంటూ అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. విషయం విన్న నిరుపేద గృహిణి తల్లడిల్లిపోయింది. -
పేదింటి బిడ్డకు కిడ్నీల సమస్య
నెల్లూరు, కొడవలూరు: మండలంలోని గండవరం గాడికయ్యలులో నివాసముంటున్న పర్వీన్‌కు సమీర్(7) అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడికి మూడేళ్ల వయస్సులోనే రెండు కిడ్నీల్లో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా బాలుడి ముఖం, కాళ్లు, చేతులు వాచిపోయి కడుపునొప్పని నేల కొరిగిపోయాడు. దీంతో పర్వీన్ కుమారుడిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. అక్కడ వారం రోజుల పాటు చికిత్స చేయించగా ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సమస్య పూర్తిగా నయం కాలేదు. శస్త్రచికిత్సకు బాలుడి వయస్సు సహకరించదని, వ్యాధి పూర్తిగా నయం కావాలంటే డబ్బు భారీగా ఖర్చవుతుందని వైద్యులు తేల్చేశారు. ఆ సమయానికి బాలుడి పరిస్థితి బాగానే ఉండటంతో ఇంటికి తీసుకొచ్చి, పాఠశాల్లో చేర్పించారు. ఏడాది తర్వాత పాఠశాలకు వెళ్లిన బాలుడు ఆ ఆవరణలోనే మరోసారి ముఖం, కాళ్లు, చేతులు వాచిపోయి కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని తిరుపతిలో వైద్యుల వద్ద చూపించారు. వారు చిన్నారికి తప్పనిసరిగా మందులు వాడాలని తేల్చారు. అప్పటి నుంచి 6 నెలలకోమారు సమస్య పునరావృతమవుతూనే ఉంది. అలా జరిగినప్పుడల్లా చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వ్యాధిని నయం చేస్తున్నారు. అనారోగ్యం నేపథ్యంలో బాలుడిని పాఠశాలకు పంపడం కూడా మానేశారు. బాలుడికి తండ్రి ఉన్నప్పటికీ అతను ఇంటికి రావడం మానేయడంతో తల్లే పాచి పనులు చేసి చిన్నారిని కాపాడుకుంటోంది. పర్వీన్ పనులకు వెళ్లినప్పుడు బాలుడికి సాయంగా అమ్మమ్మ మస్తాన్‌బీ ఉంటోంది. చిన్నారికి చెన్నైలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తే వ్యాధి నయమవుతుందని, అందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందని కొందరు చెప్పినప్పటికీ అంత డబ్బు వెచ్చించలేక ఆ ప్రయత్నం చేయలేదని మస్తాన్‌బీ తెలిపింది. బాబుకు 18 ఏళ్లు వచ్చేదాక మందులు వాడితే ఆ తర్వాత నయమయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పడంతో ఆ ఆశతోనే కష్టాలు పడి మందులు కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. దాతలు సాయం చేస్తే తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తామని పర్వీన్ కోరుతోంది. -
హాస్య నటుడు మహేశ్ కన్నుమూత
యశవంతపుర : హాస్య నటుడు మహేశ్ (మల్లేశ్) మృతి చెందారు. కిడ్నీ సమస్య కారణంగా అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వందకు పైగా సినిమాల్లో నటించిన మహేశ్ హాస్యనటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, మహేశ్ పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. హాస్య నటుడి మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబానికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కబళిస్తున్న కిడ్నీ భూతం!
పశ్చిమ కృష్ణాను కిడ్నీ భూతం కబళిస్తోంది. ఇప్పటికే తిరువూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కిడ్నీ రోగాలతో ప్రజలు మృత్యువాత చెందుతున్నారు. తాజాగా జగ్గయ్యపేట మండలంలోనూ పెద్ద సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారనే విషయం బహిర్గతమైంది. ఒక్క షేర్‌మహ్మద్‌పేట గ్రామంలోనే 22 మంది కిడ్నీ బాధితులున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్లే ప్రజలు కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని ఏ.కొండూరు, జి.కొండూరు, తిరువూరు, గంపలగూడెం, మైలవరం, నూజివీడు తదితర మండలాలకే పరిమితం అనుకుంటున్న కిడ్నీ వ్యాధులు క్రమక్రమంగా పశ్చిమ కృష్ణా మొత్తాన్ని కబళిస్తోంది. తాజాగా జగ్గయ్యపేట మండలంలోను కిడ్నీ రోగులు బయటపడుతున్నారు. ఒక్క షేర్‌మహ్మద్‌పేట గ్రామంలోనే దాదాపు 22 మంది బాధితులున్నారనే విషయం బయటకొచ్చింది. గిరిజన తండాల్లో ప్రజల ఆహారం, ఆచారాలు, మద్యం వంటి కారణాలతో కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని పాలకులు చెబుతున్నారు. మరి మెట్టప్రాంతమైన షేర్‌మహ్మద్‌పేట గ్రామంలో కూడా ఈ సమస్య ఉండటంపై ఏం సమాధానం చెబుతారనివామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. యుద్ధప్రాతిపాదికతన అందరికి వైద్య పరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించాలని స్థానికులు వేడుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలానికి చెందిన మేజర్ పంచాయితీ షేర్‌మహమ్మద్‌పేట. దాదాపు ఆరు వేల మంది ప్రజలు ఉన్న ఈ గ్రామం నేడు కిడ్నీ బాధితులతో విలవిల్లాడుతోంది. 20 రోజుల కిందట ఈ గ్రామంలో కిడ్నీ పాడైపోవడంతో మక్కల శాంతమ్మ (47) అనే మహిళ చనిపోయింది. ఆర్నెళ్ల కిందట డయాలసిస్ రోగి పల్లెబోయిన చంటి కూడా మృత్యువాత పడ్డాడు. చాలా మందికి తాము కిడ్నీ వ్యాధిగ్రస్తులమన్న విషయం తెలియడం లేదు. మరికొంత మంది తెలిసి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. గ్రామంలో చాలా మంది మోకాలి నొప్పులతో బాధపడుతున్నారు. ఏ పని చేసుకోలేక పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఫ్లోరైడ్ నీటితోనే అసలు సమస్య... షేర్‌మహ్మద్‌పేటలో తాగే నీటిలో అధిక ఫ్లోరైడ్ ఉందని ప్రజలు వాపోతున్నారు. స్థానిక సీపీఎం నాయకులు పంచాయతీ నుంచి సరఫరా చేసే నీటిని పరీక్ష చేయించగా ఫ్లోరైడ్ పరిమాణం దాదాపు 600 పీపీఎం ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఫ్లోరైడ్ లేదంటూ నివేదికలు ఇస్తున్నారు. గ్రామంలోని కొన్ని బోరు పంపులలో ఫ్లోరైడ్ ఉన్న మాట వాస్తవమేనని చెబుతున్నారు. గ్రామంలో ఆర్ఓ ప్లాంట్లు ఉన్నప్పటికి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు అక్కడి నుంచి నీటిని తెచ్చుకోలేక అందుబాటులో ఉన్న నీటినే వాడుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. టీడీపీ నాయకులు తమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కృష్ణా నది నీటిని తెస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణలో పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కృష్ణా జలాలు అన్ని గ్రామాలకు అందేలా చూడాలని కోరుతున్నారు. మరోవైపు ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలు విడుదల చేసే రసాయన పదార్థాలు భూమిలో కలపడంతో అవి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని వాపోతున్నారు. హామీలు సరే...ఆచరణేదీ ? ఏదో ఒకటి రెండు గ్రామాలకే పరిమితం అనుకుంటున్న కిడ్నీ వ్యాధులు నేడు పశ్చిమ కృష్ణ మొత్తాన్ని కబళిస్తోంది. ప్రభుత్వం మాత్రం తగిన విధంగా స్పందించడం లేదు. మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలలో కొన్ని నేటికీ కార్యరూపందాల్చలేదు. నూజివీడులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం బుధవారం మంత్రి దేవినేని హడావుడిగా ప్రారంభించినా పూర్తిగా సేవలు అందించడానికి మరో వారం పది రోజుల సమయం పట్టనుంది. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా, భూమి పంపీణి, వైద్య శిబిరాల ఏర్పాటు ఎప్పటికి నేరవేరుతాయో ప్రభుత్వ యంత్రాగానికే తెలియాలి. ప్రభుత్వం వెంటనే పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి తగిన టెస్ట్‌లను చేసి, తగిన మందులను అందించాలి. -
‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల పట్ల నిర్లక్ష్యం తగదు’
సాక్షి, విజయవాడ: గంపలగూడెం మండంలంలోని ఎస్సీ కాలనీ, వినగడప తండాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఆదివారం పర్యటించారు. కిడ్నీవ్యాధి బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. తిరువూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు-పరిష్కారాలపై నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యాధిబారిన పడ్డవారికి, వారి కటుంబ సభ్యులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు సత్వర ఆర్థిక సాయం అందించాలనీ, 2500 రూపాయలు పింఛన్ కూడా ఇవ్వాలన్నారు. కిడ్నీవ్యాధి సోకి చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించాలన్నారు. -
తనువు చాలిస్తాం..అనుమతించండి
జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలిచే నేల మనది. నాన్నంటే నడిచే దేవాలయం లాంటి వ్యక్తి. అమ్మప్రేమకు సాటిలేదు. ఇలాంటి కర్మభూమిలో పుట్టి, జీవిత చరమాంకంలో జబ్బు బారిన పడిన తండ్రిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిందిపోయి.. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలున్నా చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నాడో కొడుకు. గారాబంగా పెంచి, ఓ ఇంటి వాడిని చేసిన తండ్రి సంపాదించిన ఆస్తిని లాగేసుకొని వీధిన పడేశాడు. ఓవైపు మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది.. మరోవైపు ఇంకెంతకాలం బతుకుతారంటూ హేళన చేస్తూ దుర్మార్గంగా మాట్లాడే కుమారుడు.. వెరసి తమకు ఆత్మార్పణే శరణ్యమని, చనిపోయేందుకు అనుమతించాలంటూ శనివారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి అర్జీ ఇచ్చారు ఆ వృద్ధదంపతులు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా సర్పవరానికి చెందిన పిట్టా అప్పారావు, లక్ష్మి దంపతుల దయనీయస్థితి ఇది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు రవి విడిగా ఉంటున్నాడు. అప్పారావుకు కిడ్నీ పాడవడంతో రెండ్రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.వేలు ఖర్చు అవుతున్నాయి. కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ దుస్థితిలో తల్లిదండ్రులను రవి పట్టించుకోవడంలేదు. అప్పారావు కష్టపడి కూడబెట్టిన ఆస్తి రూ.2 కోట్లు ఉంటుంది. చికిత్స నిమిత్తం అందులో కొంత భూమిని అమ్ముదామంటే కొడుకు ఒప్పుకోవడం లేదు సరికదా.. ‘62 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఎంతకాలం బతుకుతారేంటి?’ అంటున్నాడు. తన భర్త సంపాదించిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను రెండేళ్ల క్రితం బ్యాంకులోను కోసం అని చెప్పి కొడుకు తీసుకెళ్లిపోయాడని, వాటిని ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని, విషయాన్ని పెద్దల వద్ద పెట్టినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్తకు వచ్చిన వ్యాధిని బాగుచేయించుకోలేక, కొడుకు పెడుతున్న ఇబ్బందులను భరించలేక తీవ్ర మనోవ్యధ చెందుతున్నామని, తామిద్దరం చనిపోయేందుకు అనుమతి ఇప్పించాలంటూ వృద్ధ దంపతులు ఎస్పీని అభ్యర్థించారు. వారిని సముదాయించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరపాలని కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదేశించారు. వృద్ధుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసిందని, అధైర్య పడొద్దని చెప్పి పంపించారు. -
కళ్లెదుటే ప్రాణం విడిచాడు!
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నఅతడిని చూసి బస్సులోంచి దించేశారు.రోడ్డు పక్కన తన ఒడిలో పెట్టుకుని భార్య సపర్యలు చేస్తుండగానే భర్త ప్రాణం వదిలాడు.గుండెలవిసేలా రోదిస్తున్న భార్యను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం బసాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న (65) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వారానికొకసారి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సోమవారం ఉదయం భార్య ఈరక్కతో కలిసి ఆస్పత్రికి బయల్దేరాడు. కుందుర్పి నుంచి ప్రైవేట్ బస్సులో కళ్యాణదుర్గం వచ్చి.. అక్కడి నుంచి మరో బస్సు ఎక్కారు. అప్పటికే ఈరన్న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. గమనించిన కండక్టర్ తమకెందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో వారిని టీ సర్కిల్లోనే దించేశాడు. భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలిన భర్త శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న భర్తను భార్య తన ఒడిలోకి తీసుకుని సపర్యలు చేసింది. నిమిషాల వ్యవధిలోనే భర్త ఊపిరి ఆగిపోయింది. కళ్లెదుటే భర్త మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది. 108 సిబ్బంది వచ్చినా.. అప్పటికే ప్రాణం పోవడంతో వారు వెనుదిరిగారు. భర్త మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న ఆమెను స్థానికులు, ప్రయాణికులు చూసి ‘అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చిందంటూ’ నిట్టూర్చారు. గంట అవుతున్నా అలాగే రోదిస్తుండటంతో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు గూబనపల్లి నాగరాజు, వైఎస్సార్సీపీ బీసీ సెల్ యూత్ నాయకుడు దొడగట్ట సూరి, మరికొంత మంది స్థానికులు చలించిపోయి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. విషయం తెలుసుకున్న కుమారులు భీమేష్, ఓబిలేసులు కళ్యాణదుర్గం చేరుకున్నారు. ప్రైవేట్ వాహనంలో ఈరన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఆదుకుంటే నూరేళ్ల జీవితం!
చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పటికే నలుగురు సంతానంలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఎవరైనా కిడ్నీ దాతలు ఆదుకుంటే ఆ యువకుడు నిండు నూరేళ్లు బతుకుతాడు. లేదా ఆర్థిక సాయం చేసినా పెద్ద ఆస్పత్రి వారే క్నిడ్నీ సమకూర్చి ఆయుష్షు పోస్తారు. కానీ ప్రస్తుతం ఈ పేదల దగ్గర రెండు ఆప్షన్లకూ దిక్కు లేకపోవడంతో కుమారుడిని చూసి శోకిస్తున్నారు. యర్రగొండపాలెం టౌన్ : యర్రగొండపాలెంలోని జామియా మసీదు వీధిలో నివాసం ఉంటున్న గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం క్రితం ఒక కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరొక కుమార్తె అనారోగ్యంతో మరణించింది. రెండెకరాల పొలం ఉన్నప్పటికీ, వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి. సొంత ఇల్లు లేదు. దీంతో భార్యా భర్తలు కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు మగ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. పెద్ద కుమారుడు గోపిరెడ్డి అంజిరెడ్డి (21) 10వ తరగతి వరకు చదివి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు. అయితేగత సంవత్సరం దసరా పండగకు ముందు అంజిరెడ్డికి కాళ్ల వాపు, జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించినప్పటికీ, నయం కాక పోవడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచే యడం లేదని, డయాలసిస్ చేయాలని చెప్పారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో, మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ అంజిరెడ్డికి మళ్లీ వైద్యపరీక్షలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ ఉచితంగా చేస్తామని, అయితే కిడ్నీ ఇచ్చేందుకు దాతలు అవసరమని చెప్పారు. ఇది సాధ్యం కాకపోవడంతో హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే, కిడ్నీ కూడా తామే ఏర్పాటు చేస్తామని, ఇందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వీరి దగ్గర ఎందుకుంటుంది? దీంతో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతుండాలని చెప్పారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఎన్ఆర్ఐలో డయాలసిస్ చేయించుకుని మందులు వాడుతున్నారు. డయాలసిస్‌కే బోలెడు ఖర్చు ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలం టే రూ. 2వేలు ఖర్చు అవుతాయి. వారంలో 3 సార్లు హాస్పిటల్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు, మందులు, రవాణా చార్జీలు మొత్తం కలిసి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇంత భారం మోయలేక ప్రస్తుతం మార్కాపురం ఏరియా వైద్యశాలలోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. ఆపరేషన్ చేసి, కిడ్నీ అమర్చేంతవరకు ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. తన బ్లడ్ గ్రూప్ బీ–పాజిటీవ్ అని తన పరిస్థితి గ్రహించి, ఎవరైనా కిడ్నీ ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తే, ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేయించు అంజిరెడ్డి తెలిపాడు. లేదా హైదరాబాద్‌లోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళితే కిడ్నీ కూడా వైద్యులే ఏర్పాటు చేస్తారని చెప్పాడు. కుమారుడి ఆరోగ్యపరిస్థితి చూసి, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ సహకరించి, తమ కుమారుడికి వైద్యం చేయించాలని అంజిరెడ్డి తల్లిదండ్రులు గోపిరెడ్డి ఈశ్వరమ్మ, రామిరెడ్డి వేడుకుంటున్నారు. వైద్య పరంగా లేదా ఆర్థికంగా సాయం అందించాలనుకున్న దాతలు సెల్ నంబరు 9701922801ను సంప్రదించవచ్చు. అంజిరెడ్డి గోపిరెడ్డి ఎస్బీఐ అకౌంట్ నంబర్ 34407845821, సీఐఎఫ్ నంబర్ 87851910505 కు సాయం చేయవచ్చు. -
గుడిసె నీడన బతుకు..గుండె నిండ బాధ
ఆ కుటుంబం రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఉన్ననాడు తింటూ.. కూలీ దొరక్కన్నాడు పస్తులున్నారు. అయినా వారెప్పుడూ ఆధైర్యపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకూ మంచిరోజులు వస్తాయనే ఆశతో ఆనందంగా జీవనం సాగించారు. గుడిసె తప్ప ఇంకేమీ ఆస్తుల్లేని ఆఇంట్లోకి అనారోగ్యం చొరబడింది. రెండు కిడ్నీలు పాడై పోవడంతో కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. కనీసం ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుదామన్నా ఇప్పటికీ వారికి రేషన్ కార్డే లేదు. ఇలా కష్టాలన్నీ ఒక దాని వెంట ఒకటి తరుముకొస్తుంటే చికిత్స కోసం రూ. 8 లక్షలు అప్పు చేశారు. చెన్నూర్, మంచి ర్యాల, వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ ఇంటి దీపం కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని సాకుతోంది. మనసున్న మా రాజులు చేయూతనందిస్తారని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. చెన్నూర్‌రూరల్: భార్య, కుమారుడితో సరదాగా గడిపే ఆ ఇంటి పెద్దను కిడ్నీల వ్యాధి కుంగదీసింది. ఆ ఇంటి పెద్ద కూలీ పనులు చేసి భార్య పిల్లలను పోషించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఏ పని చేయలేక భార్య కూలీకి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధిలోని వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్యది నిరుపేద కుటుంబం. ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితి. పోశయ్య తండ్రి మల్లయ్య చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి వీరక్క కూలీ పనులు చేసి పెంచి పెద్ద చేసింది. పోశయ్యకు భార్య ఎల్లక్క, మూడేళ్ల బాబు మల్లిఖార్జున్ ఉన్నాడు. కుటుంబాన్ని కుదిపేసిన కిడ్నీ వ్యాధి.. రెండేళ్ల క్రితం పోశయ్య శరీరం వాపు రావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కరీంనగర్‌కు వెళ్లమని సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని నిర్ధారించి చెప్పారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అప్పటి నుంచి నెలకు ఒక్కసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నాడు. భార్య ఎల్లక్క కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పటి వరకు అందిన చోటల్లా సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసి మరీ వైద్యానికి ఖర్చు చేశారు. ఒక కిడ్నీ మారిస్తే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో గుడిసె తప్ప వేరే ఆస్తి లేని తాము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలని పోశయ్య భార్య ఎల్లక్క కన్నీరుమున్నీరవుతోంది. ప్రతి నెలా హైదరాబాద్‌కు డయాలసిస్‌కు వెళ్లిన ప్పుడల్లా సుమారు రూ.6వేల వరకు ఖర్చు అవుతోందని పోశయ్య ఆందోళన చెందుతున్నాడు. కనీసం తమకు రేషన్ కార్డు కూడా లేదని, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు.. వైద్యానికి ఇప్పటికే అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని భార్య ఎల్లక్క కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు తన భర్త వైద్యానికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. నా భర్తను కాపాడండి.. నాభర్త ఆరోగ్యం బాగా లేదు. కుటుంబం నడుసుడు కష్టమైతాంది. నేను కూలీ పనికి పోతాన. వచ్చిన డబ్బులతో ప్రతినెలా ఆస్పత్రికి తీసుకపోతాన. మాకు ఆస్తి కూడా లేదు. నా భర్త ఆరోగ్యం మంచిగ కావాలని తిరగని హాస్పటల్ లేదు. ఎన్నో చోట్ల అప్పుజేసినం. పెద్దసార్లు, గవర్న మెంటు ఆదుకోవాలి. నా భర్తకు వైద్యం అందించేందుకుసాయం అందించాలి.– జాడి ఎల్లక్క, వెంకంపేట -
ఎయిమ్స్‌లో అరుణ్ జైట్లీకి డయాలసిస్
సాక్షి, న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్‌లో డయాలసిస్ చేస్తున్నారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి ముందు కొద్దిరోజుల పాటు జైట్లీకి డయాలసిస్ చేస్తారని చెప్పారు. కిడ్నీలు పనిచేయకుండా విఫలమైన సందర్భంలో రక్తంలో విషపూరిత వ్యర్ధాలు పేరుకుపోకుండా డయాలసిస్ చేస్తారు. ఇతర కాంప్లికేషన్లు లేకుండా సర్జరీ విజయవంతంగా చేపట్టి మెరుగైన రికవరీ కోసం డయాలసిస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నిరోజుల పాటు డయాలసిస్ చేస్తారనేదానిపై ఎయిమ్స్ వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే జైట్లీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుదుందని వెల్లడించారు. ఏ రోజైనా శస్త్రచికిత్స నిర్వహించవచ్చని తెలిపారు. సర్జరీ కోసం అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు గురువారం మంత్రి జైట్లీ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్ కార్డియో-న్యూరో టవర్‌లో శుక్రవారం చేరిన జైట్లీ అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కిడ్నీ దాతతో పాటు జైట్లీకి పలు పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ దాత వివరాలను వైద్యులు, ఎయిమ్స్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు త్వరలో జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. కాగా, సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాజరు కాలేదు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం జైట్లీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. డయాబెటిక్‌తో బాధపడుతున్న జైట్లీ బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. తొలుత మ్యాక్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ జరగ్గా, కొన్ని సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం జైట్లీని ఆయన నివాసంలో ఎయిమ్స్ వైద్యులు పరీక్షిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అవసరమా, లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో టవర్‌లో జైట్లీని అడ్మిట్ చేస్తారని భావిస్తున్నారు. -
ఇంత చిన్న వయసులోనూ కండరాల నొప్పులా?
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఈ సమస్య మినహా అన్ని రకాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. డాక్టర్‌కు చూపిస్తే విటమిన్–డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా విపరీతంగా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్–డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్–డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. – సుహానా, కర్నూలు మీ బాబు విషయంలో మీరు పేర్కొన్న లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... అతడిలో ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్ చెప్పినట్లుగా విటమిన్–డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా ఇటీవలి కాలం వరకూ బాగా చల్లటివీ, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్–డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్–డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. విటమిన్–డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్–డి లోపం వల్ల, శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్–డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్–డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. విటమిన్–డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు. దాంతో పాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్–డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్–డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్–డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్–డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్య పరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్–డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే కూడా... సూర్యుడికి తగినంత ఎక్స్పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్–డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్–డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. బాబుకు యూరిన్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా పోతున్నాయి... కిడ్నీ జబ్బు కావచ్చా? మా బాబుకు ఐదేళ్లు. వాడికి ఇటీవల రెండుమూడు సార్లు జ్వరం వచ్చింది. మందులు ఇచ్చిన వెంటనే తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మావాడికి మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. కొద్దిగా నీరసంగా కూడా ఉన్నాడు. ఈమధ్య మూత్రపరీక్ష చేయిస్తే అతడికి యూరిన్‌లో కొద్దిగా ప్రోటీన్స్ పోతున్నట్లుగా రిపోర్టు వచ్చింది. మా దూరపు బంధువుల్లో ఒకరికి కిడ్నీ రుగ్మత ఉంది. ఆయనకు కూడా ఇలాగే ప్రోటీన్స్ పోతుంటాయి. దాంతో మావాడి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇదేమైనా మావాడి రాబోయే కిడ్నీ రుగ్మతకు సూచనా? దయచేసి వివరంగా చెప్పండి. – సునీల, బెంగళూరు పిలల్లోని పదిశాతం మందిలో ఎనిమిది, పదిహేనేళ్ల మధ్య...వారిలో జీవితకాలంలోని ఏదో సమయంలో ఇలా మూత్రంలో ప్రోటీన్ పోవడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇలా పోతున్న ప్రోటీన్ అన్నది కిడ్నీకి సంబంధించినదా, లేక తాత్కాలికంగా నష్టపోతున్నదా లేదా ఇతరత్రా హానికరం కాని కారణాల వల్ల పోతున్నదా అని తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అధికంగా వ్యాయామం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, తాము ఉన్న స్థితినుంచి మారడం (పొజిషనల్ వేరియేషన్) వంటి సాధారణమైన కారణాలు మొదలుకొని కిడ్నీజబ్బులు, ట్యూబ్యులార్ డిసీజెస్, పాలీసిస్టిక్ కిడ్నీ, రిఫ్లక్స్ నెఫ్రోపతి వంటి తీవ్రమైన, దీర్ఘకాలిక జబ్బుల వరకు ప్రోటీన్ పోవడం సంభవించవచ్చు. ప్రోటీన్ పోవడంలోని తీవ్రత ఆధారంగానే పేషెంట్ విషయంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడం జరుగుతుంది. పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్ పోవడంలోని తీవ్రత – నిత్యం, గుర్తించేంత మోతాదులో అంటే కన్సిస్టెంట్గా, సిగ్నిఫికెంట్‌గా పోతుంటే అప్పుడిది ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీసే కండిషన్స్‌కు సూచికా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మూత్రంలో ప్రోటీన్స్ చాలా తక్కువ మోతాదులో పోతుంటాయి. దీన్నే మైక్రో ఆల్బ్యుమిన్ యూరియా అంటారు. ఈ అంశంలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్, 24గంటల్లో మూత్ర విసర్జన పరిమాణం, ఇమ్యూనలాజికల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ వంటి మరిన్ని అదనపు పరీక్షలు చేయించాలి. అవసరమైతే కిడ్నీ బయాప్సీ మొదలైన పరీక్షల ద్వారానే ఇదేమైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణమా అని తెలుసుకోవచ్చు. ఇక మీ అబ్బాయి విషయానికి వస్తే రెండు మూడు సార్లు జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలూ కనిపించలేదు కాబట్టి అతడి విషయంలో కనిపిస్తున్న ప్రోటీన్ పోవడం అన్నది తీవ్రమైన, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణం కాకపోవచ్చు. అయినా మీ బంధువుల్లో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని రాశారు కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించడం వల్ల మీ అబ్బాయి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీరేమీ ఆందోళన చెందకుండా మీ అబ్బాయికి సంబంధించిన యూరిన్ టెస్ట్ రిపోర్టులు, ప్రోటీన్ పోతున్న రిపోర్టులతో ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు నెఫ్రాలజిస్టును కలిసి తగిన సలహా తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
చావుబతుకుల మధ్య జర్నలిస్ట్
హిమాయత్‌నగర్: షేక్ కైసర్.. విలేకరిగా రెండు దశాబ్దాల నుంచీ పనిచేస్తున్నారు.. విలువలను పాటిస్తూ భార్య,పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కైసర్ ఆరోగ్యం దెబ్బతినింది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండటంతో చికిత్సకు ఇబ్బంది ఏర్పడుతోంది.జీవన్‌దాన్‌లో కిడ్నీ మార్పిడికి అవసరమైన డబ్బులేక సతమతమవుతున్నాడు. దీంతోభార్య, భార్య, ముగ్గురు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఖైరతాబాద్‌లోని గుమ్మద్ గల్లీలో నివాసం ఉండే షేక్ కైసర్(40) నివాసముంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సమయానికి తిండి తినకపోవడంతో నాలుగేళ్ల క్రితం హైపర్‌టెన్షన్‌కు గురయ్యాడు. తరువాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా డయాలసిస్ చేసుకుంటున్నాడు. జీవన్ ద్వార్ ద్వారా కిడ్నీ మార్పిడికి ఇప్పుడు అవకాశమొచ్చింది. కిడ్నీ మార్పిడికి డబ్బు లేకపోవడంతో ఇబ్బందులెదురవుతున్నాయి. ఆదుకునే దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు కైసర్. -
బాలుడిని మింగేసిన కిడ్నీభూతం
కవిటి: అందరితో సరదాగా ఆడుకోవాల్సిన ఆ విద్యార్థిని కిడ్నీ భూతం మింగేసింది. నిండా 15 ఏళ్లు నిండకుండానే కబళించింది. బాలుడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని మాణిక్యపురం గ్రామానికి చెందిన అనీల్ బిసాయి(15) కిడ్నీవ్యాధితో పోరాడి తనువు చాలించాడు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇతడు ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నెల రోజుల క్రితం వరకు చక్కగానే ఉన్న అనీల్ బిసాయికి ఉన్నట్టుండి ఒంట్లో బాగులేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యానికి సోంపేట తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షలన్నీ చేసిన తర్వాత బాలుడికి మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు. దీంతో కన్నీరుమున్నీరైన అనీల్ తల్లిదండ్రులు రత్నాకర్ బిసాయి, ఖిరోమణి బిసాయి తమ బిడ్డకు అందినంతలో వైద్యం చేయిస్తూ వచ్చారు. అనీల్‌కు సీరం క్రియేటినైన్ 8 పాయింట్లు దాటిపోవడంతో తీవ్రంగా నీరసించి ఆదివారం తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనీల్ సోదరుడు సునీల్ బిసాయి విజయవాడలో ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నాడు. -
అల్లుడి మరణంతో ఆగిన మామ గుండె!
తన కుమార్తె జీవితానికి వెలుగు ఇస్తాడనుకున్న అల్లుడు తనకన్నా ముందే చనిపోయాడన్న మరణవార్తను విన్న ఆ మామ తనువుచాలించాడు. కిడ్నీ వ్యాధితో అల్లుడు మృతి చెందగా.. ఆ వార్త విన్న మామ తట్టుకోలేక కన్నుమూశాడు. ఒకే రోజు అల్లుడు, మామ మృతితో ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొరివంక గ్రామంలో ఈ రెండు హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. ఒడిశా: కవిటి మండలంలో బొరివంక గ్రామంలో ఒకే రోజు అల్లుడు, మామ మృతి చెందారు. కిడ్నీవ్యాధితో అల్లుడు డొంబురు బిసాయి ప్రాణాలు కోల్పోగా, ఆ వార్త విని తట్టుకోలేక మామ అప్పుడు పురియా తనువుచాలించాడు. గ్రామానికి చెందిన అప్పుడు పురియా తన కుమార్తె కమల బిసాయిను అదే గ్రామానికి చెందిన డొంబురు బిసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వీరికి ఎప్పటికీ పిల్లలు కలగకపోవడంతో ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో భార్య కమల బిసాయి స్వయంగా తన భర్త జీవితంలో మరో మహిళకు సగభాగమిచ్చి రెండో పెళ్లి చేసింది. ఆ తండ్రీ కూతుళ్ల ఉదార మనస్తత్వానికి దేవుడు సైతం కరుణిస్తూ రెండో పెళ్లి చేసుకున్న డొంబురు బిసాయి భార్య హేమలతకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వీరికి శివకృష్ణ, సాయికృష్ణ అని పేర్లు పెట్టారు. ఆనందంగా ఉంటున్న ఆ కాపురంలో చేదు వార్త వినాల్సి వచ్చింది. డొంబురు బిసాయికి కిడ్నీ వ్యాధి సోకింది. అతడు ఈ వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందుతున్నాడు. తన కష్టార్జితాన్ని కొంతమొత్తం అమ్మేసి వైద్యం పొందుతున్నాడు. ఉన్న ఫళంగా రెండు రోజుల క్రితం ఇతడు కుప్పకూలిపోయాడు. వెంటనే బల్లిపుట్టుగకు చెందిన ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ సాయంతో అతనిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున డొంబురు బిసాయి కన్నుమూశాడు. ఆ మరణవార్తను తెలుసుకున్న గ్రామంలో ఉన్న మామ అప్పుడు పురియా గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒకే ఇంటిలో రెండు చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదవాతావరణం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఇక మాకు దిక్కెవరంటూ రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్ద దిక్కులుగా ఉన్న ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడ్డారు. ముందుగా మామ అప్పుడు పురియాకు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు జరిపారు. అనంతరం విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన డొంబురు బిసాయి మృతదేహానికి తర్వాత గ్రామస్తులంతా వెళ్లి అంత్యక్రియలు జరిపారు. -
కేంద్రాస్పత్రికి వస్తే కేజీహెచ్‌కే...
గంట్యాడ మండలానికి చెందిన కె.రమణమ్మ నాలుగు రోజులు కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో కేంద్రాస్పత్రిలో చేరింది. చేరిన పది గంటల్లోనే ఆమెను కిడ్నీ సంబంధిత వైద్యులు లేరని అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేసేశారు. ఇది ఒక్క రమణమ్మ పరిస్థితే కాదు. కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి ఇది. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో జిల్లా నలుమూలలు నుంచి రోగులు కేంద్రాస్పత్రికి వస్తారు. పెద్దాస్పత్రిలోనే వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉన్నా ఒకసారి డయాలసిస్ చేసిన రోగులకు మాత్రమే కేంద్రాస్పత్రిలో చేస్తున్నారు. డయాలసిస్ అవసరం రోగికి నేరుగా డయాలిసిస్ చేసే సౌకర్యం( ఎ.వి.ఫిస్టులా) లేదు. ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ సెంటర్ రోగులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి కేజీహెచ్‌లోగాని ప్రైవేటు ఆస్పత్రుల్లోగాని డయాలసిస్ చేసుకుంటే తప్ప డయాలసిస్ చేయని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి డయాలసిస్ చేయడం లేదు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు విశాఖపట్నం కేజీహెచ్‌కుగాని కార్పొరేట్ ఆస్పత్రికిగాని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చువుతుంది. డబ్బులు లేని నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయాలి. ఎ.వి. ఫిస్టులా సౌకర్యం లేకపోవడం వల్ల డయాలసిస్ జరగడం లేదు. అమలు కాని ఆదేశాలు రెండు నెలలు కిందట వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కేంద్రాస్పత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు ఎ.వి. ఫిస్టులా సౌకర్యం అందలేదని గుర్తించి నెల రోజుల్లో ఎ.వి. ఫిస్టులా సౌకర్యం కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలవుతున్నా ఇంతవరకు కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. త్వరలో ఏర్పాటు చేస్తాం... కిడ్నీ రోగులకు నేరుగా డయాలసిస్ సౌకర్యం కేంద్రాస్పత్రిలో ప్రస్తుతానికి లేదు. త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –కె. సీతారామరాజు,కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ -
నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు రామచంద్రానగర్‌కు చెందిన పుల్లెల విజయ్ కుమార్ వేడుకున్నారు. ఈ మేరకు వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన తన భార్య వెంకటేశ్వరిదేవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడేళ్లుగా తన భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని, ఏడాదిన్నర కిందటి వరకు డయాలసిస్, మందులతోనే రక్షించుకుంటూ వచ్చానని చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్ కూడా కష్టమవుందన్నారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశానన్నారు. జీవన్‌దాన్ పథకానికి దరఖాస్తు చేశామని, దాతలు ఆదుకొని తన భార్య ప్రాణాలు నిలపాలని విజ్ఞప్తి చేశారు. సాయం చేసే దాతలు ఎస్బీఐ అకౌంట్ నంబరు 20072722127, రామలక్ష్మి బ్రాంచ్, శ్రీకాకుళానికి జమ చేయాలని, లేదా ఫోన్ నంబర్ 97037 84077లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. -
మూత్రం ఎర్రగా వస్తోంది... కిడ్నీలు దెబ్బతింటాయా?
నా వయసు 26 ఏళ్లు. రెండేళ్లుగా అప్పుడప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది. ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. దీని వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? – శంకర్, కొత్తగూడెం సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రొటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జాగ్రత్తలేమిటి? నాకు 41 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కృష్ణమూర్తి, మహబూబ్‌నగర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కిడ్నీ రోగులు నీళ్లు తక్కువగా ఎందుకు తాగాలంటారు? నా వయసు 49 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని మా డాక్టర్ చెప్పారు. సాధారణంగా డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు కదా! మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఆంక్ష ఎందుకు పెట్టారు? నాకు అర్థమయ్యేలా వివరించగలరు.– నిహారిక, మెదక్ సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలోనూ నీరు తక్కువగా తాగాలంటూ ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతారు. మన భారతదేశంలాంటి ఉష్ణదేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5–6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరు వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, డాక్టర్లు వారు రోజూ తీసుకోవాల్సిన నీటి మోతాదును నిర్ణయిస్తారు. ఎక్కువయితే కిడ్నీలు సరిగా పనిచేయవు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మరో ఉద్దానం.. చింతలూరు!
రాయికల్: ఇవి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామస్తులు పరిస్థితి ఉదాహరణలు మాత్రమే. పేరులో ‘చింత’మాదిరిగానే ఆ ఊరిలోని ప్రతి ఇంటా రోగాలు ‘చింత’పెడుతున్నాయి. పరిస్థితి విషమిస్తే మరో ‘ఉద్దానం’అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో 280 మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మరో 40మంది టీబీ, 20 మందికిపైగా మంది ఎముకల బలహీనత వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్నారు. చాలామంది వృద్ధులు ఎముకల బలహీనతతో మంచానపడ్డారు. యువకుల్లో సైతం శరీరంలో ఎముకల అరిగిపోవడం శాపంగా మారింది. వెయ్యి మంది జనాభా.. 280 ఇళ్లు ఉన్న ఈ పల్లెలో ఇంటికొకరి చొప్పున కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మట్లగాజం నాగయ్య, ఎండ్లగట్ట పోచయ్య టీబీ వ్యాధితో మృతిచెందారు. వైద్య చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఎందరో మంచానికే పరిమితమయ్యారు. నీటిలో క్యాల్షియం ఎక్కువ.. గ్రామస్తులు తాగే నీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతోపాటు తగిన మోతా దులో నీరు తాగకపోవడంతో ఈ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు సైతం సరిగా వైద్యం అందించకపోవడంతో ఒకరినుంచి మరొకరికి సోకి మృతి చెందుతున్నారని గ్రామంలో ఆందోళన నెలకొంది. చలనం లేని వైద్యారోగ్యశాఖ.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పట్టిపీడిస్తున్నా ఈ వ్యాధుల గురించి వైద్యాధికారులకు తెలియకపో వడం గమనార్హం. వ్యాధుల విజృంభణకు కారణం తెలుసుకోవడంలో విఫలమయ్యారు. వెలుగు చూసిందిలా.. ఒడ్డెర కాలనీకి చెందిన వారు అనారోగ్యం బారిన పడటమే కాకుండా, రెండేళ్లలో ఏడు గురు చనిపోయారు. అయితే, అనారోగ్యాలకు.. చావులకు మంత్రాలే కారణమని కాలనీవాసులు నమ్మారు. ‘సాక్షి’గ్రామస్తులతో మాట్లాడగా కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. జిల్లా వైద్యాధికారిణి సుగంధిని వివరణ కోరగా మంచినీళ్లు తాగక పోవడం, ఆహారం లోపంతో ఇలాంటి సంభవిస్తాయని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఎక్కువ గ్రామంలో కిడ్నీలో రాళ్లవంటి వ్యా« దులతో చాలా మంది బాధపడుతున్నాం. అసలు ఈ వ్యా« ది ఎలా వస్తుందో అర్థమయితలేదు. గతంలో ఆపరేషన్‌కు నాకు రూ. 40 వేలు ఖర్చు అయ్యాయి. వైద్యంకోసం భూమి అమ్ముకున్న. టీబీ, ఎముకల అరుగుదల వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. –సబ్బినేని రాజం, గ్రామస్తుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా గ్రామంలో చాలా మంది కిడ్నీలో రాళ్లవంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేసుకుంటున్నా నొప్పి పదేపదే రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా సమస్య ఎవరు పట్టించుకోవడంలేదు. –అనుపురం శ్రీనివాస్‌గౌడ్ -
రిమ్స్ నెఫ్రాలజీ వైద్యుల నిర్లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రిమ్స్‌లో వైద్యాధికారుల నిరక్ష్యం రాజ్యమేలుతోంది. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ కోసం వచ్చిన మహిళకు వైద్యం చేసేందుకు వీరు నిరాకరించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని నిర్ద్రయగా చెప్పారు. ఆమెకు వైద్యం చేయాలని కలెక్టర్ ఆదేశించినా, రిమ్స్ డైరెక్టర్ ఫోన్ చేసినా చివరకు ఆమెకు వైద్యం అందలేదు. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం పొలవరం గ్రామానికి చెందిన కిడ్నీ రోగి సనపల కళావతి ఇటీవల విశాఖపట్నం కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకున్నారు. అక్కడ వైద్యం చేయించుకునే స్తోమత లేక టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేరారు. అక్కడ డయాలసిస్‌కి నెఫ్రాలజీ ప్రత్యేకాధికారి లేనందున రిమ్స్‌కు తరలించారు. గురువారం అక్కడకు తీసుకెళ్లగా.. ఆమెకు నిరాశే ఎదురైంది. డయాలసిస్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, అక్కడ ఖర్చు భరించలేమని చెప్పినా సిబ్బంది కనికరం చూపలేదని బంధువులు వాపోయారు. అప్పటి నుంచి ఆమె రిమ్స్‌లో ఉన్నారు. సోమవారం ఈ విషయంపై కలెక్టర్ కె.ధనుంజయరెడ్డికి గ్రీవెన్సు సెల్లో కళావతి బంధువు ఫిర్యాదు చేశారు. అయన వెంటనే స్పందించి రిమ్స్ డైరెక్టర్‌కి ఫోన్ చేసి వైద్యం అందించాలని ఆదేశించారు. వాటిని కూడా పట్టించుకోలేదు. వైద్యం అందించలేమని తేల్చిచెప్పారు. దీంతో కళావతిని బంధువులు సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువెళ్లారు. కాగా, దీనిపై రిమ్స్ నెఫ్రాలజీ విభాగ వైద్యురాలు జ్యోస్న మాట్లాడుతూ.. రిమ్స్‌లో తగిన పరికరాలు లేవన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో, విశాఖకు రిఫర్ చేయాల్సి వచ్చిందన్నారు. -
శుద్ధ ప్రచారమే!
♦ ఉద్దానంలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటులో కనిపించని వేగం ♦ కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు అందని శుద్ధజలం ♦ హామీలు నెరవేర్చకపోవడంపై ఉద్దానం వాసుల ఆగ్రహం కంచిలి, సోంపేట : జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి శుద్ధజలం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు నిజం కావడానికి ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఉత్సాహంగా ప్ర కటించిన నేతలు పనుల్లో ఆ ఊపు చూపించడం లేదు. ఒకచోట పనులు చేసి వంద చోట్ల చేసినట్లు ప్రచారం మాత్రమే జరుగుతోంది. మండలానికి ఒక యూనిట్ ప్రాతిపదికన పనులు చేపడతామని వారు చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు పొం తన కుదరడం లేదు. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్థానిక టీడీపీ నేతలు చాలా సార్లు చెప్పారు. తీరా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చి పలాస వరకు తిరిగి ఇచ్ఛాపురం ని యోజకవర్గానికి వెళ్లకపోవడంతో అ క్కడి ప్రజలు, పార్టీ క్యాడర్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఆర్ఓ ప్లాంట్ల పథకాన్ని సోంపేటలో ప్రారంభిస్తామనే అంశం కూడా అడుగున పడింది. ప్రాణాలు పోతున్నాయి.. కిడ్నీ వ్యాధి మూలాన ఉద్దానంలో ఎంతో మంది కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణాలను కనుగొనలేకపోయారు. అయితే కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో గల నీటిలో ఏదో సమస్య ఉందనే అనుమానంతో చా లా వరకు ఉద్దాన ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాను చేపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ఈ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. టెక్కలి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మం డలానికో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీరందించటానికి ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణ పరిధి బిరుసువాడ వద్ద ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యింది. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో పరిశీలిస్తే.. కంచిలి మండలంలో మండపల్లి పంచాయతీ పరిధి ఒరియా నారాయణపురం గ్రామంలోను, కవిటి మండల కేంద్రంలోను, ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామంలో ఇప్పటి వరకు కేవలం బోర్ల తవ్వటం మాత్రమే అయ్యింది. దీంతో టీడీపీ నేతల ప్రకటన ఆరంభ శూరత్వమేనా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. సోంపేటలో రూ.1.88కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 16 హేబిటేషన్లలో, కంచిలిలో రూ.1.95కోట్లతో ప్లాంటు ఏ ర్పాటు చేసి 21 హేబిటేషన్లలోను, ఇచ్ఛాపురం మండలం లో రూ.1.47కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 13 హేబిటేషన్లలోను, కవిటిలో రూ.2.93కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 38 హేబిటేషన్లలో సబ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మండలానికో ఆర్ఓ ప్లాంటు ప్రధానమైనది ఏర్పాటు చేసి, అక్కడ నుంచి కిడ్నీవ్యాధుల ప్రభావం ఉండే హేబిటేషన్ గ్రామాలకు 5వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్లను ట్రాక్టర్ల సహాయంతో సరఫరా చేసి, అక్కడే సబ్పాయింట్లు పెట్టి 20 లీటర్ల నీటిని రూ.2లు చొప్పున స్వైపింగ్ కార్డులతో అమ్మకాలు జరుపుతామని సన్నాహాలు చేస్తున్నారు. అయితే పనుల్లో వేగం లేకపోవడం స్థానికులను అసహనానికి గురి చేస్తోంది. సమాధానాలు ఏవీ? ప్రభుత్వం తరఫున మండలానికో చోట ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి హేబిటేషన్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా తీసుకెళ్లి, అక్కడ సబ్పాయింట్ల వద్ద సరఫరా చేసే ప్రక్రియ ఎన్నాళ్లు సాగుతుందో అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఒక్కో హేబిటేషన్కు 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ నీళ్లు సరిపోతాయా లేదా సరిపోకపోతే అవసరమైనన్ని నీళ్లు సరఫరా చేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ దీనికి సమాధానం చెప్పేవారే లేకపోయారు. మందస : మందస మండలంలోని ఉద్దాన ప్రాంతానికి శుద్ధజలం అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన హామీ గాల్లో కలి సిపోయింది. ఉద్దాన ప్రాంతానికి కేంద్రం హరిపురం కావడంతో రివర్స్ ఆస్మాసిస్(ఆర్ఓ)ప్లాంట్‌ను హరిపురంలో ని ర్మించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. హరిపురంలో ఆక్రమణ భూములు, ప్రభుత్వ భూములుండగా వాటి ని వదిలేసిన అధికారులు శ్మశానం పక్కన ఉన్న భూమిని ఎంచుకున్నారు. అయితే ఆ నీటిని ఎలా తాగుతామని ఉద్దా నం వాసులు ముందు నుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ లోగా ఏమైందో ఏమో ఈ స్థలాన్ని కాదని పాత ఆర్ అండ్ బీ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు, సర్వేయర్లు వెళ్లి ఈ ప్రాంతంలోనే ఆర్ఓ ప్లాం ట్ నిర్మించాలని సర్వే కూడా చేశారు. కానీ పనులు ముం దుకు కదల్లేదు. ప్రభుత్వం తలచుకుంటే స్థల సమస్య పెద్దదేం కాదు. కానీ వారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఉద్దానానికి శుద్ధజలం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మమ్మల్ని బతికించండి
-
మమ్మల్ని బతికించండి
వాటర్ అనాలసిస్ట్ బృందానికి గువ్వలగుట్ట వాసుల వినతి చందంపేట (దేవరకొండ): ‘కృష్ణమ్మ పక్కనే ఉన్నా.. తాగనీకి స్వచ్ఛమైన నీళ్లు లేక సుద్దనీటిని తాగుతూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. గ్రామస్తులు పిట్టల్లా రాలుతున్నారు. మమ్మల్ని బతికించండి’అంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామస్తులు బుధవారం ఆ గ్రామానికి వచ్చిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ బృందానికి విన్నవించారు. కిడ్నీ వ్యాధులతో అవస్థలుపడుతున్న గ్రామ ప్రజల ఆవేదన, దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ఈనెల 16న సాక్షి ప్రధాన సంచికలో ‘‘జనం పరిస్థితి అధ్వానం..ఇది మన ఉద్ధానం’’, బుధవారం రోజున మరో ‘‘ప్రాణం పోయింది’’అనే శీర్షికన కథనాలను ప్రచురించింది. ఈ కథనాలకు స్పందించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ బృందం చీఫ్ వాటర్ అనాలసిస్ట్ బి. ఆంజనేయులు, సీనియర్ వాటర్ అనాలసిస్ట్ వి.కిరణ్మయి బుధవారం గువ్వలగుట్ట, మంగళితండాలను సందర్శించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలు ప్రభుత్వానికి మా గోస తెలుస్తలేదని, ఊరు వల్లకాడయ్యాకే స్పందిస్తుందా? అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను బతికించండి సారూ.. అని వారు వేడుకున్నారు. ఈ గ్రామంలో పర్యటించిన బృందానికి 50 ఏళ్ల పైబడిన వృద్ధులు ఏ ఒక్కరూ కానరాకపోవడంతో సభ్యులు ఇదేంటని ప్రశ్నించారు. గ్రామస్తులు మా తండాలో 50 ఏళ్లకు మించి బతకడం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. అనంతరం గ్రామంలో చేతిపంపులు, బోర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఫిజికల్ కెమికల్ అనాలసిస్, బ్యాక్ట్రాలజికల్ అనాలసిస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. బృందం సభ్యుల్లో వేణుగోపాల్, గోవర్ధనాచారి తదితరులున్నారు. -
కిడ్నీ రోగులకు కంటితుడుపు!
కిడ్నీ వ్యాధి... అంతుచిక్కని కారణమేదైనా కానీ ఉద్దానంలో కొన్ని వేల కుటుంబాలను పీల్చిపిప్పి చేసేస్తోంది. వారందర్నీ ఆదుకుంటామని హామీలిచ్చి గత ఎన్నికలలో గట్టెక్కిన టీడీపీ నాయకులు... అధికారంలోకి వచ్చాక అసలు విషయం మరచిపోయారు! గత మూడేళ్లూ తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు! వందల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వదిలించారు. మే నెలలో ఉద్దానం పర్యటనలోనూ, ఇటీవల పార్టీ జాతీయ ప్లీనరీలోనూ కిడ్నీ వ్యాధి బాధితులకు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛను ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్ల మొద్దునిద్రను వీడి దిగొచ్చింది. డయాలసిస్ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది కంటితుడుపు చర్యే తప్ప మరొకటి కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోనున్న ఉద్దానం ప్రాంతంలో కుటుంబానికి ఒక్కరైనా కిడ్నీవ్యాధి బాధితులున్నారు! వారిలోనూ ఎక్కువ మంది కుటుంబానికి ఆధారమైనవారే! తండ్రి.. లేదంటే తల్లి, కొన్ని కుటుంబాల్లో ఇద్దరూ, కొన్నికొన్ని కుటుంబాల్లో పిల్లలను కూడా ఈ మహమ్మారి కబళిస్తోంది! ఈ ప్రాంతంలోని దాదాపు రెండు లక్షల మంది జనాభాలో సుమారు 28 శాతం మంది కిడ్నీవ్యాధి బాధితులేనని ఓ అంచనా! వైద్యం, డయాలసిస్, మందుల కోసం ఆస్తులు అమ్మేస్తున్నవారు కొందరైతే, అప్పులు చేసి మరీ మృత్యువు నుంచి కాపాడుకోవడానికి నిత్య పోరాటం చేస్తున్నారు! ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు కేంద్రీకృతమైన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒక్కటి. గత ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏడు మండలాల పరిధిలోని 170 గ్రామాల్లో కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వైద్య బృందాలు నిర్వహించాయి. ఒక లక్షా పదిహేను వేల మందికి ప్రాథమిక దశ పరీక్షలు చేస్తే వారిలో 13 వేల మందికి పాజిటివ్ వచ్చింది. రెండో దశ పరీక్షలు చేస్తే వారిలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో తేలుతుంది. ఇప్పటివరకూ ఈ రెండో దశ పరీక్షలు కేవలం నాలుగు వేల మందికే నిర్వహించారు. మరో 9 వేల మందికి ఇంకా చేయాల్సి ఉంది. ఇక ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సివారు కూడా 70 వేల మందికి పైగా ఉంటారు. ఇవన్నీ పూర్తయితే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 50 వేల వరకూ ఉంటుందని స్థానిక వైద్యనిపుణులు చెబుతున్నారు. బాధితుల గోడు వినరా... కిడ్నీ వ్యాధి వస్తే ప్రాథమిక దశలో వైద్యం కోసం పలాస, టెక్కలి, శ్రీకాకుళం ఆసుపత్రులకు వెళ్లేవారే ఎక్కువ. కొంతమంది విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఆసుపత్రులకు కూడా వెళ్తున్నారు. ఇక నాలుగు, ఐదు దశలకు వ్యాధి వచ్చేసిన తర్వాత డయాలసిస్ ఒక్కటే శరణ్యం. ఇందుకోసం ఉద్దానం నుంచి ఎక్కువ మంది శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రులకే వెళ్తున్నారు. టెక్కలి, పాలకొండ, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడ వైద్య సిబ్బంది తగినంతగా లేరు. కొన్ని కేంద్రాల్లో కిడ్నీవ్యాధి వైద్య నిపుణులు లేనేలేరు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం ఈ మూడేళ్లలో చూపిన చొరవ తక్కువే. ఇటీవలే పాలకొండ, సోంపేట కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ కిడ్నీ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి పలు విన్నపాలు చేస్తున్నా వాటిపై దృష్టి పెట్టలేదు. వీలైనంత సమీపంలోనే డయాలసిస్ సౌకర్యం కల్పించాలని, విశాఖలోని కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లినా సకాలంలో డయాలసిస్ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న దృష్ట్యా బస్సు, రైలు ఛార్జీల్లో రాయితీ ఇస్తూ ప్రత్యేక పాసులు ఇవ్వాలనేది మరో ముఖ్యమైన విన్నపం. ఇక అత్యంత ప్రధానమైన వేడుకోలు ఏదంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను సౌకర్యం కల్పించాలనేది. వారి విన్నపాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జగన్ రంగప్రవేశంతో... వేలాది మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నా, వైద్యం చేయించుకోలేక వందలాది మంది మృత్యువాత పడుతున్నా మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. జనవరిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్ఛాపురంలోని ఒక సినిమా థియేటర్లో కొందరు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన సమావేశంలో అల్టిమేటం ఇచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాకొచ్చి రెండు చోట్ల డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిపరీక్షల నిమిత్తం వైద్య బృందాల పర్యటనకు పచ్చజెండా ఊపే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మే 20వ తేదీన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దానం కిడ్నీరోగుల బాధలను స్వయంగా తెలుసుకోవడానికి వచ్చారు. కవిటి మండలంలోని జగతి గ్రామంలో వందలాది మంది కిడ్నీరోగులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. వైద్యం, డయాలసిస్ కోసం ఆసుపత్రులకు వెళ్లిరావడానికి, మందులకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదని వారు చెప్పారు. వైద్యానికే గాక మరోవైపు కుటుంబ పోషణకు చేతిలో పైసల్లేక అప్పులపాలవుతున్న వైనాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆయన... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవెంటనే కిడ్నీ రోగులకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు సమీప ఆస్పత్రుల్లోనే డయాలసిస్ కేంద్రాలు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయిస్తానని, కిడ్నీ వ్యాధికి మూలకారణాలను శోధించేందుకు ఎయిమ్స్ వైద్యుల సహకారంతో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. నవరత్నాలతో కదలిక.... గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్లీనరీలో జగన్ నవరత్నాల్లాంటి తొమ్మిది హామీలు ప్రజలకు ఇచ్చారు. వాటిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను సౌకర్యం కల్పన కూడా ఒక్కటి. ఇవన్నీ చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రూ.2,500 చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలకు భ్రమ కల్పించడానికే... ఎప్పుడైతే జగన్ రూ.10 వేలు పింఛను ఇస్తామని ప్రకటించారో టీడీపీ ప్రభుత్వ పెద్దల్లో అలజడి మొదలైంది. మూడేళ్లలో చేతగానిపాలన చూసి నిరసన గళం వినిపిస్తున్న ప్రజలకు భ్రమ కల్పించడానికే రూ.2,500 పింఛనును టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేతప్ప కిడ్నీ వ్యాధిగ్రస్తులను, ఉద్దానం ప్రాంతంలో చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పం ఏమీ కనిపించట్లేదు. జిల్లాలో తూతూమంత్రంగా అయిదారు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణకు ఇప్పటికీ వైద్య సిబ్బందిని, నిపుణులను నియమించలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోతోంది. – రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు -
ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర
కబళిస్తున్న కిడ్నీ వ్యాధులు.. దశాబ్దం వ్యవధిలో 5 వేల మరణాలు - ఉద్దానం ప్రాంతంలోని జనాభాలో 28 శాతం మూత్రపిండాల వ్యాధిగ్రస్తులే - ప్రపంచంలో ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులున్న మూడు ప్రాంతాల్లో ఒకటి - వ్యాధుల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలన్న ఐసీఎంఆర్ - ఇప్పటికి 77 వేల మందికి వైద్య పరీక్షలు.. 20 శాతం మందిలో అధిక తీవ్రత - అయినా సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి - కిడ్నీ పరిశోధన కేం్రద్రం ఏర్పాటుకు ప్రతిపాదన కూడా పంపని వైనం - లోక్‌సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు రాతపూర్వక సమాధానం సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం కోనసీమను తలపించే అందాల ఉద్దానం మూత్రపిండాల వ్యాధులతో వణికిపోతోంది. ప్రాణాంతకమైన ఈ సమస్య వేలాది ప్రాణాలను నిలువునా కబళిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదు. ప్రతిసారీ ప్రకటనలు, హడావుడి చేసి చేతులు దులుపుకోవడమే తప్ప పరిష్కారం చూపించడంలేదు. ప్రపంచంలో ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులున్న మూడు ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక సైతం వెల్లడించినా ప్రభుత్వ పెద్దల చెవికి చేరడంలేదు. ఇక్కడి జనాభాలో 28 శాతంమంది కిడ్నీ వ్యాధుల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నా వారి మనసు కరగడంలేదు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా వెళ్లలేదంటే సర్కారు ఎంతటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందో స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్దానం ప్రాంత పరిస్థితి రోజురోజుకూ మరింత అధ్వాన్నంగా తయారవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 15 వేల మందికి వ్యాధి గుర్తింపు... కిడ్నీ రోగుల జాతీయ సగటు ఏడుశాతం కాగా... ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం, పలాస నియోజక వర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడినవారు 28 శాతం ఉన్నారని అంచనా. గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో ఐదు వేల మంది కిడ్నీ వ్యాధులతో మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో కుటుంబ సభ్యులంతా ఈ వ్యాధిబారిన పడిన కుటుంబాలున్నాయి. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ ప్రాంతంలోని సుమారు 110 పల్లెల్లో 77 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20 శాతం వరకూ బాధితులు తీవ్ర మూత్రపిండాల వ్యాధికి గురైనట్టు తేలింది. మూత్రపిండాల వ్యాధికి కారణమైన సీరం క్రియాటినైన్ 1.2 కంటే తక్కువగా ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు. కానీ ఉద్దానం ప్రాంతంలో 15 వేల మంది పైచిలుకు బాధితుల్లో మోతాదుకు మించి సీరం క్రియాటినైన్ ఉన్నట్టు తేలింది. బాధితులకు ఇప్పటికే 80 శాతం పైన కిడ్నీలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్ కేంద్రాలకు తరలించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలేదు. సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో నామమాత్రపు సేవలు మాత్రమే అందుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 15 నాటికి వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తవుతుందని, బాధితుల సంఖ్య ఇంకెంత పెరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల వారుండటం మనసును కలిచి వేస్తోందని వారు తెలిపారు. వైఎస్ఆర్ నిధులిచ్చినా... ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై స్థానిక ప్రజాప్రతినిధులు చట్టసభల్లో అనేకసార్లు ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యపై పరిశోధనకు ప్రాధాన్యం ఇచ్చారు. రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో విశాఖలోని కేజీహెచ్, అమెరికాకు చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు సంయుక్తంగా 2009–10 సంవత్సరంలో ఉద్దానంలో పరిశోధన చేశారు. తొలి దశలో కొంత పురోగతి సాధించారు. కానీ వైఎస్సార్ అకాల మరణంతో ఆ పరిశోధనలకు గండిపడింది. ఇటీవల విశాఖకు వచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిపుణుల బృందాన్ని ఉద్దానంలో శాస్త్రీయమైన పరిశోధనలకు పంపిస్తామని చెప్పారు. గత జనవరి 19న సోంపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజక వర్గంలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయిస్తామని, సోంపేటలో 60 రోజుల్లో డయాలసిస్ కేంద్రం నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. కానీ అసలిప్పటివరకూ కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలే పంపకపోవడం రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు అభ్యర్థిస్తున్నారు. వైద్య, సామాజిక కారణాలపై శోధించేందుకు నిపుణులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మూల కారణాలు కనుక్కొనేలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నతస్థాయి కమిటీలు ఏం చెప్పాయి? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే కేంద్రం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు చెప్పిన సంగతులేమంటే... –ఈ ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది –సీకేడీ (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలి –ఇక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు, తదితర సిబ్బందిని బాగా పెంచాలి –కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం ఏర్పాటును ఏపీ కోరలేదు రాష్ట్రంలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల పరిశోధనా కేంద్రం ఏర్పాటును ఏపీ ప్రభుత్వం కోరిందా? కోరి ఉంటే దాని స్థితిగతులు ఏమిటని తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) లోక్‌సభలో ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)విభాగాల నుంచి నివేదికలు తీసుకున్నామని, ఏపీలో కిడ్నీ జబ్బులకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకూ కోరలేదని లోకసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది. దారిలోనే ప్రాణం పోయింది... బలగ బాలరాజు (40) కవిటి మండలంలోని బోరివంక గ్రామస్థుడు. వీఆర్ఏగా పనిచేసే ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మూత్రపిండాల వ్యాధి బారినపడినట్లు 2010 సంవత్సరంలో అతనికి తెలిసింది. బరంపురం, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా చివరకు అప్పులే మిగిలాయి. 2013, జనవరి 10న మెరుగైన వైద్యం కోసం అతన్ని కుటుంబసభ్యులు అద్దె వాహనంలో విశాఖపట్నంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా ఎచ్చెర్ల వద్దకు రాగానే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. నాలుగేళ్లు లక్షల్లో ఖర్చు చేసినా... మోహనరావు మజ్జి (46)ది ఇచ్చాపురం మండలంలోని తిప్పనపుట్టుగ స్వగ్రామం. మూత్రపిండాల వ్యాధి బారినపడినట్లు 2009లో తెలిసింది. నాలుగేళ్ల పాటు రూ.లక్షల ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీకాకుళం రిమ్స్‌లో వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకునేవాడు. దీనికోసమే 2013, అక్టోబరు 9న అతన్ని భార్య భాస్కురీ శ్రీకాకుళం తీసుకెళ్తుండగా బస్సు పలాస వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. టెక్కలి వచ్చేసరికి ప్రాణం పోయింది. ప్రభుత్వం నుంచి సాయం లేదు నా భర్త నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నేను, నా పిల్లలు కూలి చేసి జీవిస్తున్నాం. అప్పుచేసి నా భర్తకు వైద్యం చేయిస్తున్నాను. ప్రతీ నెలా వైజాగ్ ఆసుపత్రికి డయాలసిస్‌కు తీసుకెళ్తున్నాను. డయాలసిస్ ఉచితంగా చేసినా మందులు, రానుపోను ఖర్చులు మేము భరించాల్సిందే. మాలాంటి పేదలకు ప్రభుత్వం ఉచితంగా మందులు, రవాణా ఖర్చులు ఇవ్వాలి. కానీ అలాంటి సాయమేదీ ప్రభుత్వం నుంచి అందట్లేదు. – గీత పొడియా, శ్రీహరిపురం, కవిటి మండలం, ఉద్దానం -
వెలిగొండకు వెన్నుపోటు
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు ► తాజా బడ్జెట్లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్ కే రూ.వెయ్యి కోట్లు అవసరం ► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి ► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి ► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం. మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. ప్రకటనల ప్రగల్బాలే.. వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు. వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఫ్లోరైడ్ పీడకు వెలిగొండే విరుగుడు.. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. -
విధి వంచితులు
► ఆరు నెలల క్రితం తండ్రి మృత్యువాత ► కిడ్నీ సంబంధ వ్యాధితో మృత్యుఒడికి చేరిన తల్లి ► అనాథలైన ముగ్గురు పిల్లలు బొమ్మలరామారం (ఆలేరు) : పేద కుటుంబంపై విధి మరోమారు కన్నెర్రజేసింది. ఆరు నెలల క్రితమే తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. నాటి నుంచి కూలినాలి చేసి తన పిల్లలను కాపాడుకుంటున్న తల్లి కిడ్నీ సమస్యతో మంగళవారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. హృదయ విధారకమైన ఈ సంఘటన మండలంలోని సోలిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంధాల నాగమల్లయ్య, పోషమ్మ దంపతులది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఇద్దరు ఆడ పిల్లలు ప్రభావతి మమత, కొడుకు వెంకటేష్‌తో కలిపి ఐదుగురు సభ్యుల కుటుంబం. కూలి పని లభించిన రోజు కడుపునిండా భోజనం చేస్తూ.. పని దొరకని రోజు పస్తులున్నా.. బయటకు పడని నైజం వారిది. పోషమ్మ, నాగమల్లయ్య దంపతులు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావొద్దని తపన పడేవారు. వారు పస్తులండి మరీ పిల్లలకు ఓ ముద్ద పెట్టి పాఠశాలకు పంపేవారు. కొడుకును పదో తరగతి వరకు చదివించి కూతుళ్లను మధ్యలో బడి మాన్పించారు. నాగమల్లయ్య ఆర్నెల్ల క్రితం గుండెపొటుతో మృతి చెందాడు. నాటి నుంచి పోషమ్మ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించింది. మూడు నెలల నుంచి కిడ్నీ సమస్యతో పోషమ్మ సైతం అనారోగ్యంతో మంచాన పడింది. చేతిలో చిల్లి గవ్వలేని పిల్లలు తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఇరుగుపొరుగు వారి నుంచి రూ.రెండు లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. కానీ విధి వారిని వెక్కిరించింది. కిడ్నీ వ్యాధితో మంగళవారం పోషమ్మ మృతి చెందింది. కన్న వారిని పోగొట్టుకున్న ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు, కుమారుడు అనాథలుగా మారారు. పోషమ్మ అంత్యక్రియలకు సైతం డబ్బు లేకపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోషమ్మ అంత్యక్రియల ఖర్చులకు రూ.ఐదువేలను చీకటిమామిడి ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ ద్వారా అందజేశారు. పిల్లలను కలసి వారికి అన్ని రకాలు సహయ సహకారాలు అందిస్తానని తెలిపాడు. -
మాజీ సీజేఐ కబీర్ కన్నుమూత
► రాష్ట్రపతి సహా ప్రముఖుల దిగ్భ్రాంతి ► తెలివైన న్యాయమూర్తిని కోల్పోయామన్న బార్‌కౌన్సిల్ కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ (68) ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన కిడ్నీ సంబంధింత వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నారు. సెప్టెంబర్ 29, 2012 నుంచి జూలై 19, 2013 వరకు ఈయన అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈయనకు భార్య, కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. 1973లో కోల్‌కతాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన అల్తమస్ 1990లో కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 మార్చి 1న జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయలోకం దిగ్భ్రాంతి అల్తమస్ కబీర్ హఠాన్మరణంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘అల్తమస్ చాలా తెలివైన న్యాయమూర్తి, రెండు వైపుల వాదనలను చాలా ఓపికగా వినేవారు. అనవసర విషయాలు చర్చకు వచ్చినా ఏమాత్రం సహనం కోల్పోయేవారు కాదు. ఆయన మృతి న్యాయ వ్యవస్థకు తీరనిలోటు’ అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ తన సంతాప సందేశంలో తెలిపారు. ‘ఆయన మృతి దురదృష్టకరం, తీవ్రమైన లోటు. కేరీర్ చివర్లో కొన్ని వివాదాలొచ్చినా.. ఆయన గొప్ప ఆలోచనలున్న న్యాయమూర్తి. ఆయనలాంటి మరింతమంది న్యాయమూర్తులు రావాలని కోరుకుంటున్నాం’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఏఎస్ సూరి అభిప్రాయపడ్డారు. ఇద్దరు కేరళ జాలరులను ఇటలీ నేవీ అధికారులు కాల్చిచంపిన కేసు సమయంలో ధర్మాసనంలో కబీర్ సభ్యుడిగా ఉన్నారు. పార్టీనుంచి బహిష్కృతుడైన తర్వాత ఓ ఎంపీ పదవిలో కొనసాగొచ్చా అనే అంశంపై కబీర్ కీలక తీర్పునిచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ఎంపీగా ఉండొచ్చని, ఓటింగ్‌లోనూ పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. -
ప్రకాశం ఏదీ?
ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న జిల్లా ఇది. కానీ... పాలకులకు ఆయనకున్న దేశభక్తి లేదు. ప్రజలంటే ఆయనకున్న అనురక్తి లేదు. మూత్రపిండాల వ్యాధితో పిల్లలు సైతం రాలిపోతున్న జిల్లా ఇది. ఈ చీకటి ప్రభుత్వం కొంచెం ప్రకాశం చూస్తే బాగుండు. ప్రకాశం జిల్లాను చూస్తే బాగుండు. మెకానిక్కు పెద్ద కష్టం పేద కుటుంబంలో పుట్టి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న 20 ఏళ్ల షేక్ షంషూర్ కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఈ యువకుడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రోజు వారీ కూలీ. మెకానిక్ షాపులో పని చేసే షంషూర్ నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు చికిత్స చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కిస్తే సరిపోతుందని చెప్పి రెండుసార్లు రక్తం ఎక్కించారు. కొద్దిరోజుల తరువాత ఏ ఆహారం తిన్నా వాంతి చేసుకోవడం, అందులో రక్తం కనిపించడంతో బద్వేలు నుంచి వచ్చిన భూతవైద్యుని ఆశ్రయించారు. అప్పటికి తగ్గక పోవడంతో ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు వైద్యశాలలో చూపించారు. ఆ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు పాడయ్యాయి వెంటనే మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో వేరే హాస్పిటల్‌కు వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దుతో చికిత్సకు డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షంషూర్ నెల్లూరులో చికిత్స పొందుతున్నాడు. నీటి సమస్యే ప్రధాన కారణం.. కలుషితమైన నీటివల్లే తన కుమారుడి కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారని షంషూర్ తండ్రి ఇబ్రహీం ఆవేదనగా తెలిపాడు. తాము పంచాయతి వారు సరఫరాచేసే కుళాయి నీరు తాగే వారమనీ ఆ నీరు వాసనగా ఉండేదని తెలిపాడు. షంషూర్కు మెడ దగ్గర రంధ్రం వేసి ఇప్పటివరకు 24 సార్లు డయాలసిస్ చేయించామనీ వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి ఉంటుందనీ వెళ్లిన ప్రతిసారి 700 రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపాడు. ఇదిగాక వారానికి 2,500 రూపాయల విలువగల ఇంజక్షన్, 500 రూపాయల మందులు, నెలకు ఒకసారి 3,500 రూపాయల విలువగల ఇంజక్షన్ వాడాల్సి వస్తోందని అంత ఖర్చు తాము ఏమాత్రం భరించలేమని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటివరకు నెల్లూరులో చికిత్సకు 44 వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు. అయితే ప్రతిసారి మెడద్వారా డయాలసిస్ చేయడం కుదరదని, చెన్నై వెళ్లి చేతిలో ఆపరేషన్ ద్వారా పైపు ఏర్పాటు చేసుకొని వస్తే దాని ద్వారా డయాలసిస్ చేస్తామని నెల్లూరు వైద్యులు తెలిపారని చెప్పాడు. కూతురు పెండ్లి డబ్బుతో చికిత్స.. కూతురు ఆషా పెండ్లి కోసం 3 లక్షల రూపాయలు దాచి పెట్టామనీ పెళ్లి కూడా కుదిరిందనీ అయితే కుమారునికి వ్యాధి బయటపడటంతో చికిత్సకు డబ్బులు అవసరమని పెండ్లిని రద్దు చేసుకున్నామని ఇబ్రహీం తెలిపాడు. తాను కూడా తమ్ముడి కోసం మహారాష్ట్రలో చేస్తున్న పనిని వదిలేసి వచ్చానని అన్న షబ్బీర్ చెప్పాడు. జీవన్ ఆధార్‌లో రిజిస్ట్రేషన్ విఫలం.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవన్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో కిడ్నీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించడంతో అక్కడికి వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నామని ఎవరిని అడిగినా ఒకరిపై ఒకరు చెబుతున్నారే తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, ఎంఎల్ఏ, ఎంపి లెటరు తీసుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పారన్నాడు. చివరికి ఒక స్నేహితుడి సహాయంతో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు సహకారంతో జగన్ సార్‌ను కలుసుకుని తన సమస్యను చెప్పగలిగామని ఇబ్రహీం తెలిపాడు. ప్రభుత్వసాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరోగ్యశ్రీ వల్లే బతుకుతున్నా... గత నాలుగేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదుకునే వారు లేక బాధపడుతున్నానని కిడ్నీ బాధితుడు మల్లెల ఎలేజర్ అన్నాడు. హనుమంతునిపాడు మండలం హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన మెల్లెలఎలేజర్ది నిరుపేద కుటుంబం. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మరియమ్మ, 5 మంది సంతానం ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పరీక్షలు చేయించుకుంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాని చెప్పారు. దాంతోవారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే డబ్బులు లేక మూడుసార్లు డయాలిసిస్ మానుకున్నాడు. దీంతో పొట్టంతా వాపు వచ్చింది. కదలలేని పరిస్థితిలో మంచం పట్టి ఉన్నాడు. కుటుంబానికి ఎటువంటి ఆదాయం లేదు. భార్యాపిల్లలు సంపాదించిన రోజువారీ కూలీతో పోషణ జరుపు కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ కార్డు వలనే ఇంత కాలం గొంతులో ఊపిరుందని, అది లేకుంటే ఎప్పుడో మృతి చెందేవాడినని ఎలేజర్ అన్నాడు. కుటుంబం గడవక పిల్లల్ని చదువు మాన్పించి కూలి పనులకు పంపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన వీరపనేని లింగయ్య కుటుంబంలో నలుగురికి కిడ్నీ వ్యాధి సోకింది. లింగయ్యకు, అతడి భార్య నాగరత్తమ్మకు, ఐదో కుమారుడు గోపాల్‌కు, లింగయ్య వదిన నారాయణమ్మకు కిడ్నీ వ్యాధి సోకింది. ఒకే కుటుంబంలో నలుగురికి ఈ వ్యాధి సోకడంతో కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. లింగయ్య మిగతా నలుగురు కుమారులు తోచిన సంపాదన చేస్తూ వీరికి వైద్యం చేయిస్తున్నారు. మూడేళ్ల కిందట గోపాల్‌కు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్పటికే కుదిరిన పెళ్లి ఆగిపోయి తల్లిదండ్రులు లింగయ్య, నాగరత్తమ్మలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒకపక్క తమ ఇద్దరికీ అదే వ్యాధి సోకి మృత్యువుకు చేరువ అవుతుంటే యుక్తవయస్సులో ఎటువంటి సంతోషాలకు నోచుకోని తన బిడ్డ ఇలా ఈ వ్యాధి బారిన పడటం తల్లిదండ్రులను కలచివేసింది. భారమైన వైద్యఖర్చులు.. ఒకే కుటుంబంలో నలుగురికి వ్యాధి సోకడం వల్ల ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో అందరికీ వైద్యం చేసే స్తోమత లేని లింగయ్య దంపతులు సతమతమవుతున్నారు. తమ పిల్లలకు తాము భారంగా మారుతున్నామని ఏమి చేయాలో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సాయం చేస్తే తప్ప కోలుకోలేని ఇలాంటికుటుంబాలు ఈ ప్రాంతంలో కొల్లలు. తిరుపతమ్మకు ఆయువు పోయండి... బతకాలనే ఆశకు ఆయువు పోయండి అంటూ ఆ అమ్మాయి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని పెదవరిమడుగు గ్రామానికి చెందిన నూకతోటి తిరుపతమ్మ వయసు 19 సంవత్సరాలు. వీరిది నిరుపేద కుటుంబం. తల్లి ఆదిలక్ష్మి వ్యవసాయ కూలీ. కొన్నేళ్ల కిందటే ఇల్లు విడిచి వెళ్లిపోయిన తండ్రి ఆచూకీ నేటికీ లేదు. ఈనెల 19వ తేదీ తిరుపతమ్మకు కాళ్లు, చేతులు వాపు రావడంతో ఒంగోలులోని కిడ్నీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అమ్మాయికి మూత్రపిండాలు రెండూ చెడిపోయినట్లు తెలపడంతో తల్లి తల్లడిల్లిపోయింది. తమకు సెంటు భూమి కూడా లేదని, కూలిపని చేసి ఇద్దరు కుమార్తెలను పోషించి పెద్ద చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపాల్సిన వయస్సులో కూతురు గురించి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చిందని ఆమె కన్నీర మున్నీరయ్యింది. ఈవిషయాన్ని పీసీపల్లి సభలో శుక్రవారం వైఎస్ జగన్‌కు విన్నవించింది. ►ప్రకాశం జిల్లాలో మితిమీరిన ఫ్లోరైడ్‌తో ప్రాణనష్టం. ► రెండేళ్లలో కిడ్నీ వ్యాధులతో 420 మంది మృతి ► అనధికారికంగా వెయ్యిమందికి పైనే ► చావుకు దగ్గరగా వందల్లో బాధితులు ► కనిగిరి, కొండపి ప్రాంతాల్లో అధికం ► రోగులకు ఉచిత వైద్యం లేదు... డయాలసిస్ లేదు ► తూతూ మంత్రంగా ప్రభుత్వ వ్యవహారం -
మరణాలకూ మీ గుండె కరగదా?
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్న ♦ కిడ్నీ వ్యాధితో 424 మంది చనిపోయినా పట్టించుకోలేదు ♦ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయొద్దు.. బతికించుకుందాం..ఇంకా 1460 కోట్లు బకాయిలున్నాయి.. ♦ కిడ్నీ వ్యాధి మృతులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి ♦ నెలకు రూ.10వేలు మందులకు ఇవ్వాలి ♦ డయాలసిస్ యూనిట్లకు కోట్లు అవసరమేలేదు.. ♦ నేను వస్తున్నాననే హడావుడిగా జీవోలు జారీ.. ♦ పనిచేయని కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులేమిటి? ♦ వెలిగొండ పనులు పూర్తి చేస్తే ప్రకాశంలో వెలుగులే.. ♦ ప్రకాశం పర్యటనలో ప్రతిపక్షనేత పిలుపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైద్యం అందక పేదలు మరణిస్తున్నా మీ గుండె కరగదా అని సీఎం చంద్రబాబును ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. అపర సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వైద్యం చేసే స్థితి లేదని ఆయన విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందకపోవడంతోనే ప్రకాశం జిల్లాలో గత రెండేళ్లలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందారని జగన్ వివరించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లిలో జగన్ ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలసి పరామర్శించారు. వారి కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత వైద్యం అందటం లేదని ప్రైవేట్ వైద్యం కొనే స్థోమత లేక ఇప్పటికే వేల సంఖ్యలో మృతి చెందారని బాధితులు జగన్‌కు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. గుండె తరుక్కుపోతోంది.. ‘‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. చంద్రబాబుకు జిల్లాలోని ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగులుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు కళ్లారా చూశాకైనా బాబు మనస్సు కరిగించుకోవాలి. కిడ్నీ వ్యాధి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. వ్యాధిగ్రస్తులకు మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలి. వారి కుటుంబాలు గడవడం కోసం భృతి చెల్లించాలి. బాబు పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందటం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో వారు వైద్యాన్ని నిలిపివేశారు. రూ.910 కోట్లు కావాలని వైద్య ఆరోగ్యశాఖ కోరితే రూ.568 కోట్లు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అందులో పాత బకాయిలకే రూ.368 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి రూ.1460 కోట్లు అవసరం ఉంది. నిధులివ్వకుండా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత రెండేళ్లలో ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి బారిన పడి 424 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నాన్న హయాంలో పేదలకు ఉచిత వైద్యం.. కిడ్నీలు పాడైనా.. అనారోగ్యం వచ్చినా నేనున్నా... అని, లక్షలు ఖర్చయినా భయపడవద్దంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలనలో పేదలు అప్పులపాలు కాకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొని నవ్వుతూ తిరిగి వచ్చేవారు. ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిడ్నీలు పాడైపోయి వైద్యం అందక పేదలు మృత్యువాత పడుతున్నారు. పేదవాడికి సంఘీభావంగా వారికి భరోసా కల్పించేందుకే ఈ సభ. ఆరోగ్యశ్రీ కోసం పోరుబాట.. ఆరోగ్యశ్రీ అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశాం. ప్రకాశం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో నేను కూడా పాల్గొన్నా.. దీనికి భయపడి చంద్రబాబు ప్రభుత్వం రూ.270 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవం తంగా అమలు చేసి పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకే మరిన్ని మెరుగైన మార్పులు చేసి 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. పేదలకు వైద్యం అందించటంతో పాటు అనారోగ్యానికి గురై కిడ్నీలు, గుండె, కాలు తదితర ఆపరేషన్లు చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు భృతి కూడా ఇస్తామని చెప్పాం. ఆరోగ్యశ్రీని నాశనం చేస్తున్నారిలా... నెట్వర్క్ ఆసుపత్రులకు నెలల తరబడి డబ్బులివ్వలేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి 2007లో వైఎస్ ఇచ్చిన రేట్లే ఇçప్పుడూ కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ఆపరేషన్ల ఖర్చులు పెరగడంతో రేట్లు పెంచమని ప్రైవేట్ ఆసుపత్రులు పదే పదే అడుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ పేషెంట్లకు కీమో థెరపీ చేయాలి. ఒక్కసారికి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. కీమో థెరపీ ఎనిమిది సార్లు చేస్తే రూ.8 లక్షలు ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీలో ఎంత ఇస్తారో అంత మొత్తానికి సరిపడా మాత్రమే కీమోథెరపీ చేస్తున్నారు. దీంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యశ్రీలో మూగ, చెవుడు పిల్లలకు వైద్యం అందటం లేదు. దివంగత నేత వైఎస్ హయాంలో మూగ, చెవిటి పిల్లలకు 12 సంవత్సరాల వరకు ఆపరేషన్లు చేసేవారు. ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపు వారికే ఆరోగ్యశ్రీ వైద్యం అంటూ ఆంక్షలు పెట్టింది. దివంగత నేత వైఎస్ హయాంలో 108కు ఫోన్ కొట్టగానే కుయ్..కుయ్... మంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్సు వచ్చేది. ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి చేర్చేవారు. ఇవాళ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. పేదల వైద్యానికి సహకరించే ఆరోగ్యమిత్ర లను తొలగించటంతో వారు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆశా వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ఇక 104కు ఫోన్ చేస్తే అవి రావు... వచ్చినా మందులుండవు... పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఖర్చులు తడిసిమోపెడు... కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రలు, రక్తపరీక్షలకు రూ.4 వేలు ఖర్చవుతుంది. ఆ స్థాయి దాటి డయాలసిస్ స్టేజ్‌కు వెళితే వారానికి 2, 3 సార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక్కోసారి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. నెలకు రూ.16 వేల నుంచి రూ.24 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఏడాదికి ఇది లక్షల్లోకి చేరుకుంటుంది. ఇది పేదవాడికి మోయలేనంత భారం.కిడ్నీ వ్యాధిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ’నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి సర్వే చేసింది. జిల్లాలో 56 మండలాలు ఉండగా 48 మండలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండి తాగేందుకు నీళ్ళు పనికిరాకుండాపోయాయని నివేదిక ఇచ్చింది. 787 గ్రామాల్లో ఫ్లోరైడ్ అధిక మోతాదులో ఉందని నివేదించారు. ఫ్లోరైడ్ నీటితో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. వెయ్యి అడుగుల వరకు బోరు తవ్వితే తప్ప జిల్లాలో నీళ్లు పడే పరిస్థితి లేదు. దీని వలన ఫ్లోరైడ్ వాటర్ బయటపడుతుంది. ఈ నీళ్లు తాగి ఒళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడి ఉపశమనం పొందేందుకు పెయిన్‌కిల్లర్స్‌ను వాడుతుండటంతోనే కిడ్నీలు పాడైపోతున్నాయి. వైఎస్ హయాంలో నల్గొండకు కృష్ణాజలాలు ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నల్గొండ జిల్లాకు సురక్షిత నీరు అందించిన ఘనత దివంగత నేత వైఎస్‌కే దక్కింది. రూ.1700 కోట్లతో ఎస్ఎల్బీసీ నుంచి కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు అందించారు. సాగర్ నీటి వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి తగ్గింది. ప్రకాశం జిల్లాలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా... ఫ్లోరైడ్ పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం లేదు. ఆర్వో ప్లాంట్లలో రికవరీ 30 నుండి 40 శాతం నీళ్ళే ఉంటాయి. 60 శాతం నీటిలో ఫ్లోరైడ్ పూర్తిస్థాయిలో ఉంటుంది. దీన్ని బయటకు వదిలితే తిరిగి భూమిలోకి చేరి మళ్ళీ ఫ్లోరైడ్‌గా మారుతుంది. అందువల్ల రక్షిత నీరే మార్గం. కాలువల ద్వారా నీటిని తరలించాల్సిందే. ఫ్లోరైడ్ పోవాలంటే.. వెలిగొండ నీరే శరణ్యం ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి తగ్గాలంటే వెలిగొండ ప్రాజెక్టు నీరే శరణ్యం. వెలిగొండకు మరిన్ని నిధులిచ్చి పనులు వేగవంతం చేసిన ఘనత వైఎస్‌దే. ఆయన హయాంలో వెలిగొండకు రూ.4,700 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేశారు. వెలిగొండకు నీళ్ళు వచ్చే టన్నెల్–1, 2 పనులు దాదాపు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. టన్నెల్–1 పనులు 5 కి.మీ. పెండింగ్‌లో ఉన్నాయి. టన్నెల్–2కు 8 కి.మీ. పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనిచేయని కాంట్రాక్టరుకు అదనపు చెల్లింపులా..? వెలిగొండ పనుల్లో టీడీపీ మంత్రికి వాటాలున్నాయి.. ముఖ్యమంత్రికి ఆ మంత్రి వాటా ఇస్తున్నారు కాబట్టి వెలిగొండ కాంట్రాక్టరు ఏ పనీ చేయకపోయినా అదనంగా చెల్లిస్తున్నారు. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌కు అధికంగా నిధులివ్వకూడదన్న నిబంధన ఉంది. పనులు చేయని వెలిగొండ కాంట్రాక్టరును ఊడబెరకాల్సింది పోయి 65 కోట్లు అదనంగా చెల్లించారు. కాంట్రాక్టర్ పని చేయకపోయినా, అతనికి చేతకాకపోయినా అతనికి చంద్రబాబు తోడుగా ఉన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు ఎంపీ వై.వి.కృషి ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేం దుకు ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శాయశక్తులా కృషి చేశారు. బాధితుల గోడు చూసి తట్టుకోలేక 2015 నుండి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ వై.వి. 10 లేఖలు రాశారు. ప్రధానిని కూడా కలిశారు. ఈ ప్రాంత వాసులకు పైప్లైన్ల ద్వారా సాగర్ నీటిని అందించేందుకు రూ.996 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను రాష్ట్రానికి చేర్చగా అది పక్కన పెట్టింది’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఒత్తిడి వస్తేనే చంద్రబాబు పలుకుతాడు ఒత్తిడి వస్తేనే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుకు తాడు. మూడు సంవత్సరాల పాలనలో ప్రకాశం జిల్లా కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకోని చంద్రబాబు జగన్ కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు వస్తున్నాడని పత్రికల్లో రాగానే స్పందించాడు. అందుకే నా పర్యటనకు ఒక్క రోజు ముందు కందుకూరు, కనిగిరి, మార్కాపురం కేంద్రాలలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చాడు. డయాలసిస్ సెంటర్ల కోసం కోట్లు అవసరం లేదు. ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.10 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. కనిగిరిలో డయాలసిస్ యూనిట్ కోసం ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఏప్రిల్ 2016లో తన ఎంపీ నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయించారు. గ్రాంటు ఉన్నా ప్రభుత్వం యూనిట్ పెట్టేందుకు ముందుకు రాలేదు. -
నేడు ఉద్ధానం పర్యటనకు పవన్
కిడ్నీ వ్యాధి బాధితులతో మాటామంతీ సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్ధానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్ధానం’ బాధితులకు డయాలసిస్ సెంటర్లు: కామినేని కైకలూరు: శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితులకు అదనంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పవన్‌కల్యాణ్ మంగళవారం ఉద్ధానం కిడ్నీ బాధితుల పరామర్శకు వెళ్తున్నట్లు ట్వీటర్లో ప్రకటించడంతో మంత్రి కామినేని కైకలూరులో విలేకరులతో మాట్లాడారు. -
నేడు ఉద్ధానం పర్యటనకు పవన్
-
కిడ్నీ వ్యాధులపై కేజీహెచ్ వైద్యుల అధ్యయనం
కవిటి: ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తిపై విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. కవిటి మండలం బొరివంక పీహెచ్సీలో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగం నిపుణులు డాక్టర్ బి.భాస్కర్, కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం సహాయక సిబ్బంది క్రాంతి, సురేంద్రలు కిడ్నీరోగులను పరీక్షించారు. వ్యాధి వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. కేజీహెచ్ వైద్యులకు స్థానిక వైద్యులు భాస్కర్, రాకేష్కుమార్‌లు సహకరించారు. స్థానికSసర్పంచ్ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు బెందాళం విజయకృష్ణ, హాస్పిటల్ డెవెలెప్‌మెంట్‌కమిటీ అధ్యక్షుడు పండి శ్రీనివాస్, సభ్యుడు జయప్రకాష్, ఉద్దానం యూత్‌క్లబ్ ఆఫ్ బొరివంక అధ్యక్ష, కార్యదర్శులు దుద్ది సతీస్, లొట్ల దీనబంధు తదితరులు హాజరై ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తిపై పలు అంశాలను వైద్య బృందానికి తెలియజేశారు. -
కిడ్నీ వ్యాధులకు తాగునీరే కారణం
రేగిడి: అంబకండి గ్రామంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తికి తాగునీరే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుద్ధి జలాన్నే తాగాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ అబ్దుల్‌రజాక్ సూచించారు. గత నెల 29న ‘అంబకండిలో కిడ్నీ భూతం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆర్డబ్ల్యూఎస్, వైద్యశాఖాధికారులు స్పందించారు. నేలబావులు, బోర్ల నీటిని పరీక్షించారు. రెండు బోర్ల నీటిలో ఫ్లోరైడ్ ఉందని గుర్తించారు. మిగిలిన ఏడు బోర్ల నీరు తాగవచ్చని సూచించారు. ప్రస్తుతం చెరువుల్లో ఎక్కువుగా ఉన్నందున గ్రామంలోని నాలుగు నేలబావుల్లో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. నేలబావుల నీటిని తాగొద్దన్నారు. సంతకవిటి మండలం కొండగూడెంలో రూ.49 కోట్లతో నిర్మించిన రక్షిత నీటి పథకం నుంచి గ్రామంలోని రక్షిత పథకానికి సరఫరా చేస్తున్న నీటిని తాగాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయోదాయకమన్నారు. రక్షిత నీటి ట్యాంకులో పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి తాగునీటిని సరఫరా చేయాలని సర్పంచ్ ప్రతినిధి లావేటి వెంకటవేణుగోపాలనాయుడుకు సూచించారు. కార్యక్రమంలో జేఈ జి.శ్రీచరణ్, సైట్ ఇంజినీరు గట్టి చలపతి, పంచాయతీ కార్యదర్శి జోతిర్మయి, వీఆర్వో సన్నెందొర తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమకు అనారోగ్యం!
నాటి ప్రేమికుల అనురాగాన్ని దూరం చేస్తున్న కిడ్నీ వ్యాధి శాపంగా మారిన పేదరికం ప్రేమ అజరామరం.. ఎలాంటి వివక్ష చూపని స్నేహ బంధం యువతీయువకుల్ని ఒక్కటిగా చేసే ఆనంద గీతం శ్రీహరి.. లక్ష్మిలది ఈనాటి ప్రేమ కాదు అది 1999 ఎ లవ్ స్టోరీ వారి ప్రేమ సక్సెస్.. కాపురం కూడా! రోజా పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వృద్ధాప్యం వరకు ఈ జంట ప్రేమ పచ్చని చెట్టులా కళకళలాడేలా లేదు లక్ష్మిని రెండు కిడ్నీలూ మోసం చేశారుు గొప్ప ప్రేమికుడు తోడుగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు వైద్యం చేరుుంచనంటున్నారుు...! ⇒ అప్పుడే తెల్లారింది. సూర్యుడు ఇంకా కోపం తెచ్చుకోకపోవడంతో వాతావరణం వేడెక్కలేదు. కందుకూరులోని ఆర్టీసీ బాస్టాండ్ జనాల గొడవకు చెవులు మూసుకుంది. భిక్షగాళ్లు చేతులు చాపుతుంటే ప్రయూణికులు చిరాకు పడుతున్నారు. ఇంతలో హైదరాబాద్ బస్ సర్వీసు బస్టాండుకు చేరుకుంది. అందులో నుంచి ఓ యువకుడు చిన్న బ్యాగుతో దిగాడు. అతను.. చుట్టాల ఇంటికో.. శుభకార్యానికో రాలేదు. పొట్ట చేత పట్టుకుని బతుకుపై ఆశతో దిగాడు. ⇒ పట్టణంలోని తూర్పువడ్డెపాలెంకు చేరుకున్నాడు.. బేల్దారి పని ఏమైనా దొరుకుతుందో అని. బాగా దాహం వేసింది. ఓ ఇంటి దగ్గరకు వెళ్లాడు. ‘కొంచెం నీళ్లు ఉంటే ఇవ్వండయ్యూ’ అన్నాడు. లోపల నుంచి పదహారేళ్ల అమ్మారుు వచ్చి చేతికి గ్లాసు అందించింది. తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. అతనికి పని దొరికింది. అమ్మారుు.. అబ్బారుు మాటామాటా కలిసింది. కొద్దిరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ⇒ ఇది పదిహేడేళ్ల క్రితం జరిగిన ఘటన. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం.. తోషం గ్రామవాసి కామిరి శ్రీహరి, పట్టణానికి చెందిన కామెరి లక్ష్మి ప్రేమకు పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. ఇద్దరూ ఒక్కటయ్యూరు. హైదరాబాద్‌తో పాటు ఎక్కడ పని దొరికినా ఇద్దరూ కలిసి బేల్దారి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా గడిపేవారు. వారి కాపురానికి ఫలితంగా ఇద్దరు సంతానం కలిగారు. ఉప్పుచెరువులో కాపురం పెట్టారు. ⇒ జీవితం సాఫీగా సాగిపోదు కదా! చక్కగా ఉన్న వారి కాపురంలో కిడ్నీ వ్యాధి వచ్చిపడింది. మూడేళ్ల క్రితం లక్ష్మి (35)కి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నెమ్ము చేరిందని డాక్టర్లు చెప్పడంతో మందులు వాడటంతో ఆరోగ్యం కుదుటపడింది. కానీ గత డిసెంబర్లో అనారోగ్యం పాలవడంతో పరీక్షలు చేయించుకున్నారు. నెల్లూరు వైద్యులు కిడ్నీ వ్యాధిగా తేల్చారు. అనంతరం ఒంగోలు రిమ్స్‌లో చూపించుకోగా గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలని తెలిపారు. అప్పటికే భార్య వైద్యం కోసం రూ. 2 లక్షలను శ్రీహరి ఖర్చు చేశాడు. ఇవి కాక మరో రూ. 70వేల వరకు అప్పులపాలయ్యాడు. ఇటీవల తన భార్య మరింతగా బాధ పడుతుండటంతో కందుకూరులో చూపించగా.. 5వేల రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. అతని వద్ద డబ్బు లేకపోవడంతో స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చారు. ‘ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. దేవుని పై భారం వేసి గడుపుతున్నాం. ప్రాణం ఉన్నంతవరకే మేమేమైనా చేయగలం’ అని దుఃఖించాడు. ⇒ చిన్నారులకు అమ్మా.. నాన్నకంటే గొప్పవారు ఎవరుంటారు. వారు ఏదైనా తెస్తే తింటారు. లేదా పస్తులుంటారు. ఇప్పుడు ఆ దంపతుల పిల్లలు అంజలి, సాయికృష్ణ ఇదే పరిస్థితిలో ఉన్నారు. మూడు పూట్లా కంచంలో అన్నం ఎందుకు రాదో తెలియదు. వాళ్ల అమ్మ మంచం ఎందుకు దిగదో తెలియదు. కోలుకోవాలంటే ఏం చేయూలో అర్థం కాదు. 8వ తరగతి చదువుతున్న కూతురు ఇంటి వద్దే ఉండి తల్లిని చూసుకుంటోంది. సాయికృష్ణ కూడా 8వ తరగతే చదువుతున్నాడు. కుమారుని పరిస్థితీ అలాగే ఉంది. ⇒ ఈ కుటుంబానికి తెల్ల కార్డు ఉంది. కానీ పొట్ట చేత పట్టుకుని ఊర్లు తిరుగుతుండటంతో నిలువునా కార్డు తొలగించారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవలు శ్రీహరి కుటుంబానికి అందడంలేదు. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదు. వీరి బాధను చూసిన ఒంగోలులోని ఓ కిడ్నీ సెంటర్ డాక్టర్.. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. ‘దీనిని ముఖ్యమంత్రి కార్యాలయూనికి తీసుకు వెళ్లి ఆరోగ్య కార్డు తెచ్చుకోండి. దీనివల్ల కొంత మేలు జరగవచ్చు’ అని చెప్పారు. ‘రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. నా సంపాదన నా భార్య బిళ్లలకు ఇవ్వాలా.. పిల్లల కూటికి ఇవ్వాలా. మా లాంటి వారిని ముఖ్యమంత్రి పలకరిస్తారా’ అని ఇంటి యజమాని వాపోయూడు. సాయం చేయదల్చిన దాతలు శ్రీహరి ఫోన్ నంబర్ 9550447964ను సంప్రదించవచ్చు. - కందుకూరు -
సంతోషం లేని జీవితం
► రెండు కిడ్నీలు పాడై మంచం పట్టిన ఆటోడ్రైవర్ సంతోష్ ► ఇప్పటికే రూ.2ల క్షల వరకు ఖర్చు ► ఒక కిడ్నీ మార్చేందుకు రూ.4లక్షల ఖర్చు ► వైద్యానికి డబ్బులు లేక ఇక్కట్లు ► ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు ► ప్రభుత్వం ఆదుకోవాలని తల్లి, భార్య వేడుకోలు ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా కిడ్నీ వ్యాధి కుంగదీసింది. వైద్యం చేరుుంచుకునేందుకు ఆర్థికస్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. దాతలు పెద్ద మనుసు చేసుకుంటే ఆ కుటుంబం నిలబడుతుంది. చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధి చెల్లాయిపేట గ్రామానికి చెందిన గోదరి సంతోష్ ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఉన్నట్టుండి రెండు కిడ్నీలు పాడైపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యూడు. సంతోష్‌కు తల్లితోపాటు భార్య కవిత, 3 ఏళ్ల పాప మనస్విని ఉన్నారు. ప్రస్తుతం ఏ పనిచేయలేక తల్లి, భార్య కూలికి వెళ్తేగాని పూట గడవని దయనీయస్థితి ఆ ఆటోడ్రైవర్ కుటుంబానిది.- చెన్నూర్‌రూరల్ గోదరి అంకమ్మ-చంద్రయ్యకు ఏకైక సంతానం సంతోష్. కూలి పనులు చేసి కొడుకును పెద్ద చేశారు. వీరిది నిరుపేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు కూడా లేదు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. తండ్రి చంద్రయ్య 2007లో చనిపోవడంతో కుటుంబ భారమంతా కొడుకుపైనే పడింది. సంతోష్ ఆటోనడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. కుటుంబాన్ని కుంగదీసిన కిడ్నీ వ్యాధి రెండేళ్ల క్రితం సంతోష్‌కు అనుకోకుండా తలనొప్పి, వాంతులతోపాటు క ళ్లు తిరిగారుు. దీంతో చెన్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. సంతోష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేరుుంచుకోగా కిడ్నీ సమస్య ఉందని వేరే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు తెలిపారు. అక్కడే నిమ్స్ ఆసుపత్రికి వె ళ్లాడు. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలతోపాటు బయాప్సీ చేసి కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యాయని, ఒక కిడ్నీ ఫెయిలైందని చెప్పారు. మందులు వాడితే నయమవుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, మూడు నెలల కొకసారి వచ్చి వైద్య పరీక్షలు చేరుుంచుకోవాలని సూచించారు. సంతోష్ ప్రతీసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు తెచ్చుకొనేవాడు. దీంతో ఆటో నడపడ ం కూడా మానే శాడు. తల్లి, భార్య కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన కాడల్లా సుమారు రూ.2లక్షల వరకు అప్పు చేసి మరీ వైద్యానికి పెట్టారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో సంతోష్ 5 నెలల క్రితం మళ్లీ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యూయని వైద్యులు చెప్పారు. ఒక కిడ్నీ అయినా మార్చాలని లేదంటే ప్రాణానికే ప్రమాద న్నారు. కిడ్నీ మార్చే వరకు రెండు రోజులకోకసారి డయాలసిస్ చేయించుకోవాలని చెప్పడంతో సంతోష్ రెండు రోజులకోసారి కరీంనగర్ వెళ్లి డయాలసిస్ చేయించుకొని వస్తున్నాడు. ఇందుకు వెళ్లినప్పుడల్లా సుమారు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు తన కొడుకును బతికించుకోవాలనే తపనతో తల్లి అంకమ్మ ఒక కిడ్నీని కుమారునికి ఇచ్చేందుకు మందుకు వచ్చింది. కానీ దానిని అమర్చాలంటే సుమారు రూ.4లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో వారు నిర్ఘాంతపోయారు. వైద్యానికి ఇప్పటికే అప్పు చేసి రూ.2లక్షల వ రకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.4లక్షలు ఎక్కడి నుంచి తీసుకువచ్చేదని తల్లి, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తన కుమారుని వైద్యం కోసం సహాయం అందించాలని, ఎవరైనా ఆపన్నహస్తం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంతోష్‌ను ఆదుకోవాలనుకునే దాతలు సెల్ : 9640333592లో సంప్రదించవచ్చు -
బిడ్డను చావు తరుముతోంది.. చక్రం అడ్డేయరూ!
► పేద తల్లిదండ్రుల కన్నీటి వేడుకోలు ► రెండు కిడ్నీలూ చెడిపోయిన బాలుడు ► కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన నానమ్మ వీరవల్లిపాలెం (అయినవిల్లి) : ఓ నిరుపేద బాలుడిపై మృత్యువునీడ పరుచుకుంటోంది. 14 ఏళ్లకే నిండునూరేళ్ల జీవితానికి తెరపడే ముప్పు ముంచుకొస్తోంది. ‘ఇంటికో పువ్వు.. ఈశ్వరునికో మాల’ అన్నట్టు.. కరుణ కలిగిన వారు తలో కొంత పైకం వితరణ చేస్తే తమ బిడ్డ బతుకుతాడని, వారికి బతుకంతా రుణపడి ఉంటామని చేతులు జోడించి అర్థిస్తున్నారు అతడి అమ్మానాన్నలు. మండలంలోని వీరవల్లిపాలేనికి చెందిన మామిడికుదురు సత్యనారాయణ, శ్రీదేవి దంపతుల కుమార్తె విజయలక్ష్మి 8 ఏళ్ల క్రితమే కామెర్లతో మరణించింది. ఆ విషాదంతో కుంగిపోరుున దంపతులు కుమార్తెను కూడా కుమారుడు మణికంఠలోనే చూసుకుంటూ తేరుకున్నారు. ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మణికంఠకు రెండు నెలల క్రితం సుస్తీ చేయగా వైద్యులకు చూపించారు. వైద్యపరీక్షల్లో అతడి రెండు కిడ్నీలూ చెడిపోరుునట్టు తేలింది. కిడ్నీ మార్పిడి చేయకపోతే మణికంఠ దక్కడని వైద్యులు చెప్పారు. బాలుడి నానమ్మ సత్యవతి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యూరు. అరుుతే ఆమె కిడ్నీని మనుమడికి అమర్చే ఆపరేషన్‌కు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించే సత్యనారాయణ అప్పటి వరకూ అయిన వైద్యానికే పుట్టిన చోటల్లా అప్పులు చేశారు. రూ.5 లక్షలు సమకూర్చుకోవడం తమకు కలలోని మాటని, ఉదారులు స్పందించి, సహాయహస్తం అందించి, తమ బిడ్డకు పునర్జీవితాన్ని ఇవ్వాలని సత్యనారాయణ, శ్రీదేవి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. దాతలు తోచిన సాయూన్ని ‘మామిడికుదురు సత్యనారాయణ, ఖాతా నం: 32868328153, ఎస్బీఐ ముక్తేశ్వరం బ్రాంచి (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0002759)’కి జమ చేయూలని, ఏమైనా వివరాలు కావలస్తే 9666976566 సంప్రదించాలన్నారు. మార్పిడి ఆపరేషన్ ఖర్చు రూ.5 లక్షలు -
కిడ్నీ వ్యాధుల్ని ప్రేరేపించే ప్రోటీన్!
న్యూయార్క్: నేటి కాలంలో కిడ్నీ (మూత్ర పిండాలు) సంబంధిత వ్యాధులు అధికమయ్యాయి. పెద్దవయసు వారు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసే పరిశోధకులు కిడ్నీ వ్యాధులను ఓ ప్రోటీన్ ప్రేరేపిస్తుందని గుర్తించారు. మానవ శరీరంలో ఉండే ఆర్టీఎన్1 అనే జన్యువు సగటు స్థాయికన్నా ఎక్కువైతే, అది రెటిక్యులాన్ అనే ప్రోటీన్‌ను అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ ప్రోటీన్ పరిమితికి మించి ఉంటే అది తీవ్రమైన కిడ్నీ వ్యాధులను కలిగిస్తుందని అమెరికాకు చెందిన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు జాన్ సిజియాంగ్ తెలిపాడు. ఈ ప్రోటీన్ కిడ్నీలోని కణజాలాలను ధ్వంసం చేసే చర్యలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా కిడ్నీలు పాడై పోతాయని జాన్ బృందం జరిపిన అధ్యయనంలో తేలింది. ఏ జన్యువులు, ప్రోటీన్లు ఎక్కువగా, లేదా తక్కువగా ఉంటే కిడ్నీ వ్యాధులు సంభవిస్తాయి అనే అంశంపై ఈ బృందం ఎలుకలపై అధ్యయనం జరిపింది. ఆర్టీఎన్1 సహా పలు జన్యువులు మూత్ర నాళ వ్యాధులకు కారణమవుతాయని దీనిద్వారా కనుగొన్నారు. రెటిక్యులాన్ ప్రోటీన్ ఎక్కువైతే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఈ విషయాన్ని కనుగొనడం ద్వారా ఈ వ్యాధుల నివారణకు సరైన మందులు, చికిత్సా విధానాన్ని కనుగొనే వీలుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో కిడ్నీ వ్యాధులు వస్తే కొన్ని సార్లు కిడ్నీల మార్పిడి, లేదా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తీరే వీలుంది. -
మహిళల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ కౌన్సెలింగ్
ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బేనా? నా వయసు 35 ఏళ్లు. షుగర్ ఉంది. ఈమధ్యకాలంలో కాళ్లు బాగా వాస్తున్నాయి. బలహీనంగా కూడా అనిపిస్తోంది. ఊపిరి తీసుకోవడం కూడా అప్పుడప్పుడూ ఇబ్బందిగా ఉంటోంది. జీర్ణశక్తి తగ్గింది. మూత్రవిసర్జనలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాంతులు అవుతున్నాయి. ఇది కిడ్నీలకు సంబంధించిన జబ్బేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - మేరీ కృపావరం, కడప చాలా సందర్భాల్లో కిడ్నీలకు సంబంధించిన జబ్బుల విషయంలో ముందస్తు హెచ్చరికలుగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే శరీరంలో వచ్చే మార్పులను ముందుస్తు హెచ్చరికలుగా పరిగణించి జాగ్రత్తపడాలి. ప్రస్తుతం మీ విషయంలో కూడా మీరు చెప్పిన లక్షణాలన్నీ కిడ్నీ జబ్బులకు సంబంధించిన ముందస్తు సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కాలయాపన మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మీకు అందుబాటులో ఉన్న నెఫ్రాలజిస్టును మీరు కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయవచ్చు. కిడ్నీ సంబంధిత జబ్బుల లక్షణాలు లేదా సంకేతాలను గ్రహించిన మూడు నెలలోనే ఆ జబ్బులను పరీక్షల ద్వారా నిర్ధారణ చేయించుకుని, చికిత్స ప్రారంభించకపోతే కిడ్నీలు పూర్తిగా విఫలం కాగలవు. ఒకసారి కిడ్నీలు విఫలమైన తర్వాత వాటిని సాధారణ స్థితికి తీసుకురావడం ఏ చికిత్స ద్వారా కూడా సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, తక్షణమే వైద్యులను సంప్రదించండి. నా వయసు 50 ఏళ్లు. టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోవడంతో చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. - ఎస్ ఇందిరాదేవి, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. అయితే ఇంటి దగ్గర మీరే స్వయంగా లేదా మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. ఇందులో కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఆ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. -
నేటి తల్లుల వ్యాయామం రేపటి పిల్లల ఆరోగ్యం
కడుపులో ఉన్నపుడే అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి తెలుసనే విషయం మనందరికీ తెలుసు. ఆ కాలంలో గర్భస్థ శిశువుతో కమ్యూనికేట్ చేయడానికి సుభద్ర ఏ మైండ్‌గేమ్ వాడిందో తెలియదు కానీ ఈ కాలం తల్లులు కొద్దిగా వ్యాయామం చేయడం ద్వారా కడుపులో ఉన్న తమ ప్రతిరూపానికి జీవితకాలానికి సరిపోయే ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చని ఓ సర్వేలో తేలింది. నెలలు నిండుతున్నపుడు ఊరికే టీవీ చూస్తూ కాలం గడిపేయకుండా డాక్టర్ సూచించిన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే పుట్టబోయే పిల్లలను హైబీపీ నుంచి రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే పుట్టినపుడు తక్కువ బరువు ఉండే పిల్లల్లో వయసుతో పాటు హైబీపీ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. వారు గర్భంలో ఉండగానే తల్లులు వ్యాయామం చేస్తే అప్పుడే ఏర్పడుతున్న వారి రక్తనాళాలు సవ్యంగా పని చేస్తాయి. పుట్టుకతోనే రక్తప్రసరణ సరిగా ఉంటే భవిష్యత్తులో హైబీపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో పాటు హైబీపీ వల్ల కలిగే హృద్రోగాలను, కిడ్నీ జబ్బులను అరికట్టే వీలుంటుంది. అందుకే మీ ముద్దులొలికే చిన్నారి కోసం కొంచెం శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంకండి. -
బతకాలని ఉంది..
గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్తురాలి కన్నీటి వినతి దాతల సాయం కోసం ఎదురు చూపు గోరుచుట్టుపై రోకటి పోటులా.. కిడ్నీ వ్యాధి కబళిస్తుంటే.. గుండె జబ్బు తోడైంది. వారానికోసారి డయాలసిస్ చేయించకపోతే ప్రాణాలకే ముప్పన్న వైద్యుల హెచ్చరిక చెవుల్లో మార్మోగుతోంది. మాయదారి జబ్బును వదిలించుకుందామంటే పేదరికం అడ్డం పడుతోంది. కిడ్నీ మార్పిడికి రూ.లక్షల వ్యయమవుతుంది. అయిదు వేళ్లు నోట్లోకెళ్లేందుకే ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. ఈ పరిస్థితిలో ఎలా వైద్యం చేయించుకోవాలో తెలియని ఓ ఇల్లాలు కుంగిపోతోంది. బతకాలని ఉందని కన్నీటితో వేడుకుంటోంది. దాతలు కరుణిస్తే ఆరోగ్యవంతురాలినౌతానంటోంది. ఆమె రాఘవాపురానికి చెందిన మారుమూడి లక్ష్మి. చింతలపూడి : రాఘవాపురానికి చెందిన మారుమూడి లక్ష్మి రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోకపోతే ప్రాణానికి ముప్పని వైద్యులు హెచ్చరించారు. చెప్పారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం లక్ష్మిది. భర్త వెంకటేశ్వరరావు కూలి పనులకు వెళ్లి కూడబెట్టిన సొమ్ముతో భార్యకు వైద్యం చేయిస్తున్నాడు. దొరికిన చోటల్లా అప్పులు కూడా చేశాడు. భార్య అనారోగ్యంతో కుమార్తెను తమ్ముడి వద్ద ఉంచి చదివిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయాసంతో ఊపిరందక బాధపడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు చింతలపూడిలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చూపించారు. వారి సూచనలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు లక్ష్మికి రెండు కిడ్నీలు పాడైనట్టు తెలిపారు. కిడ్నీలతో పాటు గుండె కూడా పెరిగిందని చెప్పారు. అప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయిస్తున్నారు. డయాలసిస్‌కు తీసుకెళ్లి వచ్చేందుకు, మందులకు నెలకు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని భర్త వెంకటేశ్వరరావు తెలిపాడు. స్థానిక బండి ఫౌండేషన్ నిర్వాహకుడు బండి రఘువీర్ తమ అవస్థ చూసి డయాలసిస్‌కు నెలకు రూ.వెయ్యి సాయం చేస్తున్నట్టు చెప్పాడు. కిడ్నీ మార్పిడి చేస్తే లక్ష్మి బతుకుతుందని, అందుకు రూ. 8 ల క్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపాడు. మనసున్న దాతలు 9542018305 నంబర్‌ను సంప్రదించాలి లేదా మారుమూడి వెంకటేశ్వరరావు, స్టేట్‌బ్యాంక్, చింతలపూడి శాఖకు చెందిన 31691258282 ఖాతా నంబర్‌కు విరాళాలు అందజేయాలి. -
ఊపిరి పోయరూ...!
కన్న కొడుకు కోసం తల్లి యాతన వైద్యానికి చిల్లిగవ్వలేక అల్లాడుతున్న తండ్రి ప్రాణం పోయమని వేడుకోలు ప్రసవం నాడు ఆ తల్లి ఎంత వేదన అనుభవించిందో గానీ ఇప్పుడు ఆ బిడ్డను కాపాడుకునేందుకు అంతకంటే ఎక్కువ వేదనే పడుతోంది. కొడుకుకు జబ్బు చేసిందని తెలిసి ఆ తల్లి గుండె తల్లిడిల్లిపోతోంది. తన చేయి పట్టుకుని నడచిన బిడ్డ చేయందిస్తే గానీ లేవలేని స్థితిలో ఉండడంతో ఆ తండ్రి కళ్లు కన్నీటిధారలవుతున్నాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుమారుడిని బతికించుకోవడానికి ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు దాతల సాయం అర్థిస్తున్నారు. ఇప్పటికే గుండె జబ్బుతో కుమార్తెను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కల్లేపల్లి(లక్కవరపుకోట) : మండలంలోని కళ్లేపల్లి గ్రామానికి చెందిన అయ్యలసోమయాజుల శ్రీనివాసప్రసాద్, లక్ష్మీఅపర్ణ దంపతుల కుమారుడు మణికంఠ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బాలుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తొలుత ఆరోగ్యంగానే ఉండేవాడు. అయితే తర్వాత అనారోగ్యం చేయడంతో వైద్య పరీక్షలు చేయగా గుండె జబ్బు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయినా ఆ తల్లిదండ్రులు స్థాయికి మించి వైద్యం చేయిం చారు. కానీ తర్వాత వారి గుండెపై మరో పిడుగు పడింది. బిడ్డకు కిడ్నీల వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారు తల్లిడిల్లిపోతున్నారు. విశాఖలోని సెవెన్ హిల్స్‌లో వైద్యం చేయించగా కిడ్నీసమస్యఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వైద్యం కోసం అవస్థలు... కిడ్నీలు పాడైపోవడంతో మణికంఠకు ప్రస్తుతం డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఓ సారి ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి రూ10 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. తరచూ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుండడంతో వీరు వేపగుంటలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. మణికంఠ ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్‌కు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వీరు ఏం చేయాలో తెలీక బాధపడుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వీరి కుమార్తె నాగ సుప్రజ 2010లో గుండె జబ్బుతో మృతి చెందింది. తాను చిన్న ఉద్యోగం చేస్తున్నానని, ఆ జీతం తమ పొట్టపోషణకే సరిపోవడం లేదని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. దాతలు సాయం చేసి తమకు పుత్రబిక్ష పెట్టాలని ఆయన కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు ఫోన్ నంబర్ 8008286124, 9989768484ను సంప్రదించాలని తెలిపారు. -
అంతూలే మృతి
మహారాష్ట్ర తొలి ముస్లిం సీఎంగా రికార్డు సాక్షి, ముంబై: కాంగ్రెస్ కురువృద్ధుడు, మహారాష్ట్రకు తొలి ముస్లిం ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే(85) ఇకలేరు. సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారమిక్కడి బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అపస్మారకంలో ఉన్న అంతూలే ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన రాయగఢ్ జిల్లా అంబేత్ గ్రామంలో బుధవారం నిర్వహించనున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అంతూలే 1980-82 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాడు మహారాష్ట్రలో చోటుచేసుకున్న సిమెంట్ స్కామ్‌పై పార్లమెంటు చాలారోజులు స్తంభించడంతో ఇందిర బలవంతంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. తను నెలకొల్పిన ఇందిరాగాంధీ ప్రతిభా ప్రతిష్టాన్ ట్రస్టుకు బిల్డర్ల నుంచి విరాళాలు తీసుకుని వారికి ఆనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిమెంట్ కోటాను పెంచారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతూలే 1962లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980 జూన్ 9న సీఎం అయ్యారు.నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా, రెండు పర్యాయాలు రాజస్యసభ ఎంపీగా ఉన్న ఆయన 1995-96లో, యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సంతాపం: అంతూలే మృతిపై కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. -
భర్తల కోసం భార్యల పరస్పర కిడ్నీ దానం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధి కారణంగా మృత్యువుకు చేరువైన తమ భర్తలను కాపాడుకునేందుకు ఇద్దరు భార్యలు పరస్పరం కిడ్నీదానం చేశారు. దీంతో వారి భర్తలకు పరస్పర కిడ్నీ మార్పిడి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. బొకారోలోని సెయిల్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎస్బీ రామ్(61), ఎన్డీఎంసీకి చెందిన సీనియర్ అధికారి శాంత్ రామ్(58)లు రెండేళ్ల నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల మూత్రపిండాలు మార్పిడి చేసేందుకు వీలుకాకపోవడం, తగిన దాతలు కూడా దొరకకపోవడంతో రెండేళ్లుగా వారు డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని బీఎల్కే హాస్పిటల్ వైద్యులు ఎస్బీ రామ్, శాంత్ రామ్ భార్యలు ఊర్మిళ, గంగాదేవీలను కలిపి పరిస్థితిని వివరించారు. వారిద్దరూ పరస్పర కిడ్నీదానానికి అంగీకరించడంతో ఒకరి కిడ్నీని మరొకరి భర్తకు ఇటీవల విజయవంతంగా అమర్చారు. వీరిలాగే అందరూ ‘పరస్పర కిడ్నీ మార్పిడి’ పద్ధతికి ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు సూచించారు.