ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు త్వరలో జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. కాగా, సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాజరు కాలేదు.
2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం జైట్లీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. డయాబెటిక్‌తో బాధపడుతున్న జైట్లీ బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. తొలుత మ్యాక్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ జరగ్గా, కొన్ని సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం జైట్లీని ఆయన నివాసంలో ఎయిమ్స్ వైద్యులు పరీక్షిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అవసరమా, లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో టవర్‌లో జైట్లీని అడ్మిట్ చేస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment