న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65)కి సోమవారం నిర్వహించిన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం జైట్లీతోపాటు ఆయనకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య బృందం తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన శస్త్రచికిత్స నాలుగున్నర గంటలపాటు సాగింది.
అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. 20 మంది వైద్యులతో కూడిన బృందం జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించింది. జైట్లీ దూరపు బంధువు, మధ్య వయస్కురాలైన ఓ మహిళ తన మూత్రపిండాన్ని దానమిచ్చేందుకు ముందుకు రావడంతో సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. అంతకు కొద్దిసేపటి ముందు ప్రధాన మంత్రి మోదీ జైట్లీతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment