‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల పట్ల నిర్లక్ష్యం తగదు’ | MLA Kokkiligadda Rakshana Nidhi Visited Kidney Disease Victims | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 1 2018 6:20 PM | Last Updated on Mon, Aug 20 2018 6:05 PM

MLA Kokkiligadda Rakshana Nidhi Visited Kidney Disease Victims - Sakshi

ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: గంపలగూడెం మండంలంలోని ఎస్సీ కాలనీ, వినగడప తండాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఆదివారం పర్యటించారు. కిడ్నీవ్యాధి  బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. తిరువూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు-పరిష్కారాలపై నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని డిమాండ్‌ చేశారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యాధిబారిన పడ్డవారికి, వారి కటుంబ సభ్యులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు సత్వర ఆర్థిక సాయం అందించాలనీ,  2500 రూపాయలు పింఛన్‌ కూడా ఇవ్వాలన్నారు. కిడ్నీవ్యాధి సోకి చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement