Kokkiligadda rakshana nidhi
-
డబ్బుతో రాజకీయం.. కాలం చెల్లింది
సాక్షి, విజయవాడ: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నూతన అధ్యయనాన్ని సృష్టించబోతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డబ్బు, మద్యం, పక్షపాతంగా ఎన్నికలు జరిపించారని విమర్శించారు. బాబు సృష్టించిన ఈ చెడ్డ సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిళించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బుతో రాజకీయం చేయాలనే రోజులకు కాలం చెల్లిందన్నారు. పాలన, పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాము పాలన సాగించామని తెలిపారు. మరో నాలుగేళ్లు ప్రజలకు జవాబుదారీతనంగా పాలన అందిస్తామన్నారు. అవినీతి కనుచూపు మేరలో కనబడకుండా సంక్షేమ పాలన సాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేయబోతున్నామో వివరించి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. 22 డివిజన్లతోపాటు, మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుని వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు.(రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా) అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లిన పథకాలే మా విజయానికి నాంది. నూటికి 80 శాతం మంది పేద ప్రజానీకానికి అవసరమైన పథకాలను ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలు చివరి ఆరు నెలల్లో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చుతాయి. కానీ సీఎం జగన్ మొదటి ఆరునెలల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. గత పాలకులు లక్షకోట్ల రాజధాని మాటలను ప్రజలు గమనించారు. సామాన్యులకు లక్ష కోట్ల రాజధాని అవసరం లేదు. ఆర్ధిక సంపన్నులకు ఉపయోగపడే రాజధాని అవసరం లేదు. పథకాలను ప్రజలు మెచ్చారు, అందుకే సీఎం జగన్‌కు అధికారం ఇస్తారు. స్థానిక సంస్థల్లో 99 శాతం సీట్లు కైవసం చేసుకుని వైసీపీ విజయఢంకా మోగిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. (తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్) తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన రెండు స్కీంలు స్థానికంగా ప్రతి ఇంటికి చేరాయన్నారు. ప్రతి ఒక్క గ్రామపంచాయతీలోనూ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఆశించిన విజయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సంక్షేమ పాలనపై ప్రజలే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగనన్న మాకు మంచి పధకాలు ఇచ్చారని.. గెలిపిస్తే మరిన్ని పథకాలు తెస్తారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్తుల నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. తిరువూరులోని నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
‘ఆ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’
సాక్షి, గంపలగూడెం: ఇసుక కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే రక్షణ నిధి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు, గోసవీడులో ఇసుక వారోత్సవాల్లో భాగంగా రెండు రిచ్‌లను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ నిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న దీక్ష.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని’ ఎద్దేవా చేశారు. దీక్షను చూసి రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్నారు. గత టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీ..రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఇసుక పుష్కలంగా లభిస్తోంది.. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక పుష్కలంగా లభిస్తోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైస్ జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికి, వక్ర బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని రక్షణనిధి పేర్కొన్నారు. -
‘వైఎస్సార్ పాలనను సీఎం జగన్‌లో చూస్తున్నారు’
సాక్షి, కృష్ణా: రైతు భరోసా పథకంతో దేశంలోనే చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ఆయన ప్రశంసించారు. ఆదివారం ఎమ్మెల్యే తిరువూరులో రైతులతో కలిసి బాణాసంచా పేల్చి ఆనంద వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు దివంగత నేత వైఎస్సార్ పాలనను సీఎం జగన్ పాలనలో చూస్తున్నారని పేర్కొన్నారు. గత పాలనలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. కాగా సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 85 శాతం నెరవేర్చారని రక్షణనిధి తెలిపారు. -
ఏపీలో ఘనంగా వాల్మీకీ జయంతి వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాల్మీకీ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకుల పెద్దెత్తున పాల్గొన్నారు. కృష్ణా : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంజరావు, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి,చలమాల సత్యనారాయణ,కలకొండ రవికుమార్ పాల్గొన్నారు. అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన వాల్మీకీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . రామగిరి మండలం, నసనకోట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి సోదరులు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ : కడప జిల్లా వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ట్రాఫిక్ స్టేషన్ ఎదురుగా ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర అధికారులు.రాజంపేట మండలం బోయపాలెంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసుల రెడ్డి, ఆర్.డి.ఓ ధర్మ చంద్రా రెడ్డి పాల్గొన్నారు. -
హలో గుడ్ మార్నింగ్.. నేను మీ ఎమ్మెల్యే
సాక్షి, కృష్ణా: ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి హలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆయన తిరువూరు పట్టణంలో పలు కాలనీల్లో, మురికివాడల్లో పర్యటించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి పారుదలకై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దోమల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. పట్టణంలోని 20 వార్డుల్లో దోమల మందును పిచకారీ చేయాలని సూచించారు. విజృంభిస్తోన్న జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే రక్షణనిధి స్పష్టం చేశారు. -
అవినీతిని ప్రోత్సహించే ప్రస్తకే లేదు : ఎమ్మెల్యే రక్షణ నిధి
సాక్షి, కృష్ణా : నియోజకవర్గంలో అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్పష్టం చేశారు. తిరువూరు పట్టణ సమస్యలపై ఎమ్మెల్యే రక్షణనిధి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని, ప్రజలకు నాన్ అమృత్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో పాలకులు పట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పి కేవలం శిలాఫలకాల పేర్లకే ప్రాముఖ్యత ఇచ్చారని, గత పాలనలో జరిగిన అవినీతినపై దర్యాప్తు చేపడతామని అన్నారు. వర్షాలకు ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మత్తులు చేపడతామని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉన్నత సేవలను అందించేలా మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు -
వైఎస్ జగన్ పాలనలో రైతేరాజు: కొక్కిలిగడ్డ
-
బాబువి ఊసరవెల్లి రాజకీయాలు
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు తమని విమర్శించడం సిగ్గు చేటని వైఎస్పార్సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మండిపడ్డారు. శనివారం ఆయన తిరువూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతుగా తెలంగాణ కేసీఆర్ నిలబడుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా వారి ఫెడరల్ ప్రంట్ కూడా మన ప్రత్యేక హోదాకు డిమాండ్ కు మరింతగా మద్దతు చేకూరుతుందనే వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అభిప్రాయం అని అన్నారు. బాబు మీలాగా ప్రజలకు పూటకో మాట, గంటకో అబద్ధమాడటం ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మాకు చేతకాదని అన్నారు. ఏపీ ప్రయోజనాలు విషయంలో రాజీలేని పోరాటం చేయబట్టే జాతీయ పార్టీలకు ఏనాడు లొంగకుండా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 13 రాజకీయ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జాతీయ పార్టీలతో లాలూచీ పడబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కేసులు లేకుండా, ఉన్న కేసులు ముందుకు కదలకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే ఒంటరిగానే వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని రక్షణనిధి తెలిపారు. -
‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల పట్ల నిర్లక్ష్యం తగదు’
సాక్షి, విజయవాడ: గంపలగూడెం మండంలంలోని ఎస్సీ కాలనీ, వినగడప తండాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఆదివారం పర్యటించారు. కిడ్నీవ్యాధి బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. తిరువూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు-పరిష్కారాలపై నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యాధిబారిన పడ్డవారికి, వారి కటుంబ సభ్యులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు సత్వర ఆర్థిక సాయం అందించాలనీ, 2500 రూపాయలు పింఛన్ కూడా ఇవ్వాలన్నారు. కిడ్నీవ్యాధి సోకి చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించాలన్నారు. -
'ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం'
విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్టు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీకి చెందిన కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి మండిపడ్డారు. టీడీపీలో చేరాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి, మంత్రులను కలిసినట్టు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.