
సాక్షి, విశాఖపట్నం : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాల్మీకీ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకుల పెద్దెత్తున పాల్గొన్నారు.
కృష్ణా : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంజరావు, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి,చలమాల సత్యనారాయణ,కలకొండ రవికుమార్ పాల్గొన్నారు.
అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన వాల్మీకీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . రామగిరి మండలం, నసనకోట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి సోదరులు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్ : కడప జిల్లా వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ట్రాఫిక్ స్టేషన్ ఎదురుగా ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర అధికారులు.రాజంపేట మండలం బోయపాలెంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసుల రెడ్డి, ఆర్.డి.ఓ ధర్మ చంద్రా రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment