shankarnarayana
-
‘పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యిందని దుయ్యబట్టారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం. ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘జనసేన కాదు.. అది ‘నారా-నాదెండ్ల’ సేన. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోక కల్యాణం. పవన్‌కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ.’’ అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మాజీ ఎంపీ ఉండవల్లి ‘‘మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్‌కు వేరే ఆఫీసు ఎందుకు?. రాజకీయ కరువు బాధితుడు పవన్‌కు స్పెషల్ ప్యాకేజీలు అందాయి. టీడీపీ హయాంలో దుష్టచతుష్టయం, పవన్ కడుపు నిండింది. జనం కడుపు ఎండింది. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే జుట్టు పెంచుతున్నాడు. ప్రతి నమస్కారంతో పాటు ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం జగన్‌కే సొంతం’’ అన్నారు. -
రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోకకల్యాణం
-
పెనుకొండకు సీఎం జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు
-
ఏపీలో ఘనంగా వాల్మీకీ జయంతి వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాల్మీకీ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకుల పెద్దెత్తున పాల్గొన్నారు. కృష్ణా : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంజరావు, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి,చలమాల సత్యనారాయణ,కలకొండ రవికుమార్ పాల్గొన్నారు. అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన వాల్మీకీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . రామగిరి మండలం, నసనకోట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి సోదరులు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ : కడప జిల్లా వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ట్రాఫిక్ స్టేషన్ ఎదురుగా ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర అధికారులు.రాజంపేట మండలం బోయపాలెంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసుల రెడ్డి, ఆర్.డి.ఓ ధర్మ చంద్రా రెడ్డి పాల్గొన్నారు. -
‘అనంత’కు నీళ్లిచ్చిన అపర భగీరథుడు వైఎస్సార్
ప్లీనరీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి హంద్రీ- నీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శంకర నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సమస్యలపై ఆయన వైఎస్సాసీపీ జాతీయ ప్లీనరీలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని కొనియాడారు. అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవా పథకానికి రూపకల్పన చేసి, తద్వారా డిస్ర్టిబ్యూటరీల ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ- నీవా ద్వారా కేవలం రిజర్వాయర్లును నింపేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో తీసుకున్న మేరకు హంద్రీ-నీవా ద్వారా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు ఇచ్చిన 21 హామీల నెరవేర్చాలన్నారు. అనంతపురం జిల్లా ప్రతి ఏడాది కరువు, కాటకాలతో అల్లాడిపోతోందని, వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో కరువుతో సతమతమయ్యే అనంత రైతాంగాన్ని ఆదుకునేందుకు పాడిపరిశ్రమను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా హార్టికల్చర్‌ను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ర్పింక్లర్లు ఇచ్చి ఆదుకున్నారన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లా రైతులు కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్లి తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నారనీ, అలాంటి వారిని ఆదుకునేందుకు స్థానికంగానే ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. -
అపర భగీరథుడు వైఎస్ఆర్: శంకర్ నారాయణ
గుంటూరు: అపర భగీరథుడు వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో హంద్రీనీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చారని, జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని వైఎస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ కొనియాడారు. అనంతపురం జిల్లా సమస్యలపై ఆయన వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ హంద్రీనీవా పథకానికి రూపకల్పన చేసినవిధంగానే డిస్టిబ్యూటరీల ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలి. అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు 21 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేర్చాలి. ప్రతి ఏడాది జిల్లాలో కరువు, కాటకాలు ఏర్పడుతున్నాయి. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి' అని శంకర్‌నారాయణ కోరారు. -
పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలి
- ఎమ్మెల్యే విశ్వ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ - ‘మేలుకొలుపు పాదయాత్ర’ పోస్టర్ల ఆవిష్కరణ అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టబోయే పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గంలో ఈనెల 24 నుంచి చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి వాల్‌పోస్టర్లను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో శింగనమల నియోజకవర్గాన్ని వందేళ్ల వెనక్కు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. తుంగభద్ర హెచ్ఎల్సీ కింద జిల్లాలో ఉన్న ఆయకట్టులో దాదాపు సగం శింగనమల నియోజకవర్గంలోనే ఉందన్నారు. మూడేళ్లలో ఈ ఆయకట్టుకు కనీసం ఆరుతడి పైరుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గతేడాది హెచ్ఎల్సీ, హంద్రీనీవాకు 36 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక ఎకరాకు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎక్కడో ఉన్న గొల్లపల్లికి నీళ్లు పోయాయని, హెచ్ఎల్సీ సిస్టం కింద కూతవేటు దూరంలో ఉన్న శింగనమల, బుక్కరాయసముద్రం చెరువులతోపాటు నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుకూ నీళ్లివ్వలేదని విచారం వ్యక్తం చేశారు. కూలీలను ఇంకుడు గుంతలకు మాత్రమే పరిమితం చేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఉపాధిహామీ పనులను జేసీబీలతో చేయించి రూ.కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిరంతర ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈనెల 26 నుంచి జూన్ 4 వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. చివరిరోజు గార్లదిన్నెలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యల్లనూరు జెడ్పీటీసీ కేవీ రమణ, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నార్పల, పుట్లూరు, శింగనమల మండలాల కన్వీనర్లు రఘునాథరెడ్డి, రాఘవరెడ్డి, చెన్నకేశవులు, మార్కెట్‌యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడు ముసలన్న, జిల్లా కమిటీ మెంబరు అమ్మవారిపేట రామ్మోహన్‌రెడ్డి, బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లు పట్టుకునే సంస్కృతి టీడీపీదే
వైఎస్ జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటి? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గోరంట్ల (సోమందేపల్లి) : ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలు ఢిల్లీ పెద్దల వరకూ అందరి కాళ్లు పట్టుకున్న నైజం చంద్రబాబుదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ విమర్శించారు. పదేళ్ల పాటు ఉమ్మడి హక్కు ఉన్న హైదరాబాద్‌ను వదిలి రావడంతో పాటు ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించాలని గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రైతు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ బ్యాంకులకు టోకరా వేసిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి గంటా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకున్నారో? ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. రెయిన్ గన్స్‌తో రక్షక తడుల పేరుతో దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేసి జిల్లాలో కరువును తరిమేశానని గొప్పలు చెప్పిన బాబు... ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారన్నారు. గత ఏడాది పంట సాగు ద్వారా రైతులు రూ. 4 వేల కోట్లు నష్టపోతే, వారికి కనీసం రూ.వెయ్యి కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించలేదన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా నుంచి కరువును శాశ్వతంగా పారదోలేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో హంద్రీ-నీవా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాక, పట్టిసీమ ప్రాజెక్ట్‌ల్లో రూ.వందల కోట్లను కమీషన్ల రూపంలో దండుకున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ పట్టణానికి పైపులైన్ ద్వారా తాగునీటిని అందిస్తామంటూ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇస్తున్న హామీల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. పర్సెంటేజీల కోసం పాకులాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి గండికొడుతున్నారని విమర్శించారు. ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలించి రూ. కోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఫకృద్దీన్, మేదర శంకర, సింగిల్‌విండో అధ్యక్షుడు గంపల రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, నాగలూరు బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల స్వార్థానికి పెన్నా ఖాళీ
- వారి ఇసుక దందాతో రైతులకు తీవ్ర నష్టం - ఇలాగైతే ముందుముందు తాగునీరు కూడా దొరకదు - పెన్నానది పరిశీలనలో శంకరనారాయణ నారనాగేపల్లి(రొద్దం) : స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న ఇసుక దందాతో పెన్నానది ఖాళీ అవుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. మండలంలోని నారనాగేపల్లి గ్రామ సమీపంలోని పెన్నానదిని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు బెంగళూరు, పావగడ ప్రాంతాలకు రాత్రింబవళ్లూ ఇసుకను తరలిస్తూ పెన్నాను తోడేస్తున్నారని, దీంతో పెన్నాను నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు రోడ్డున పడాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బోర్లు ఎండిపోయి వందలాది మంది రైతులు నష్టపోతున్నారన్నారు. మండంలో అనేక మంది పెన్నా ఒడ్డున పూల తోటలు సాగు చేసేవారని, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిన పూలతోటలే దర్శనమిస్తున్నాయని ఆవేదన చెందారు. ఇసుకాసురులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో తాగునీరు కూడా దొరకదన్నారు. ఇసుక మాఫియా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అధికారులు, పోలీసుల ఎదుటే ఇసుక అక్రమ దందా సాగిస్తున్నా వారు ఎందుకు అరికట్టలేకపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటివారిని ప్రోత్సహించడం వల్లే వారు ఇష్టానుసారం దోపిడీ పాల్పడుతున్నారని విమర్శించారు. ఇసుకాసురులు ఏర్పేడులో 15 మందిని పొట్టున పెట్టుకున్నా, కారకులైన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అందులో టీడీపీ వారు ఉండటం వల్లే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై రైతులు పలుమార్లు ఆందోళనలు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కొన్ని గ్రామాల్లో ఇసుకమాఫియా రైతులపై దాడులకు దిగిన సందర్భాలు, పెన్నానదిలో రైతుల బోర్లు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక ఉచిత ఇసుక పాలసీ తెచ్చి అధికార పార్టీ నేతల జేబులు నింపారని దుయ్యబట్టారు. మహిళా సంఘాల పేరున ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇసుక రవాణాను అరికట్టకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే కేసులా?
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజం పరిగి (పెనుకొండ రూరల్ ) : అధికారులపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేసి, హింసించడం దారుణమన్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తే వారి ఇళ్లు, పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీ నాయకులు ప్రజల పక్షాన మాట్లాడే అర్హత లేదా ?అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. -
రాష్ట్రంలో రౌడీ రాజ్యం
= అధికారులపై తమ్ముళ్ల దౌర్జన్యాలు తగదు = కేశినేని, బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలి = వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ సోమందేపల్లి : రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అన్నారు. అధికారులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. ఆదివారం ఆయన పరిగిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం విజయవాడలో ఆర్టీఏ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. అధికారికి రక్షణగా ఉన్న గ¯ŒSమెన్లపై కూడా చేయి చేసుకోవడం టీడీపీ ప్రజాప్రతినిధుల గుండాగిరికి నిదర్శనమని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక విషయంలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై చేయి చేసుకున్నప్పుడే మఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేయించి ఉంటే టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురేవి కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు వారి పనులను స్వేచ్ఛగా చేయలేకపోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని నానిపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పరిగి మండల వైఎస్సార్సీపీ నాయకులు జయరాం, రమణ, మారుతీశ్వర్‌రావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
‘ఓటుకు నోటు కేసులో బాబుకు జైలు తప్పదు’
సోమందేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ.ఐదు కోట్లు ఎరచూపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా దొరికిపోయాడని, భవిష్యత్తులో జైలుకెళ్లడం ఖాయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. సోమందేపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డిపై బురద జల్లేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబు విమర్శించడం తగదన్నారు. ఓటుకునోటు కేసులో బయట పడటానికి ప్రధాని నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు కాళ్లు పట్టుకుని ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారన్నారు. అలాగే కేసీఆర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని రాజధానిపేరుతో విజయవాడ, అమరావతికు పారిపోయి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న ఆయన జగన్మోహన్రెడ్డి జైలుకు వెళతారని తన మంత్రులు ఎమ్మెల్యేలతో ఉదరగొట్టడం గురువిందసామెతను గుర్తుకు తెస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, తుంగోడు సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అనంతపురం రూరల్ : కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన ప్రభుత్వంపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ మేరకు స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట వారు చేపట్టిన దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చంద్రబాబు అవసరం తీరాక తెప్ప తగలేసే రకం’ అని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ తెచ్చిందే తానని, అధికారం చేపట్టగానే క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో గద్దెనెక్కిన బాబు ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లు కావస్తున్నా మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాల సంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బాబుకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియ¯ŒS నాయకులు ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు చింతా సోమశేఖర్‌రెడ్డి, పార్వతి, ఐద్వా సంఘం నాయకులు సావిత్రి, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవిని కాపాడుకునేందుకే ‘పల్లె’ తంటాలు
- జగన్‌ను విమర్శించడం వెనుక అసలు కారణమదే - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎద్దేవ అనంతపురం : ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తేనే తనకు మంత్రి పదవి ఊడిపోదని పల్లె రఘునాథరెడ్డి, కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఆశతో చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తదితరులు కలలు కంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుంటనే తమ అధినేత వాటిని బయట పెడుతుండటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. పట్టిసీమ పేరుతో రూ. రూ. 1600 కోట్లు కైంకర్యం చేశారని, పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లోచ్చాయా చూపించాలని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 45 టీఎంసీలు తెస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి 50 టీఎంసీలకు పైగా సముద్రంలోకి కలిసిపోయాయన్నారు. దీనివల్ల ఏం ఉపయోగమో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేçపడతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుంటున్న వైనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి బయట పెడుతుండటంతోనే అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. హంద్రీనీవాకు కూడా పూర్తిస్థాయిలో నీళ్లు తేవలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మీ మోసాలు, తప్పులు, అక్రమార్జనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క పనినీ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
బాధితులకు పరామర్శ
హిందూపురం అర్బన్ : అధికారం ఉందనే సాకుతో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పరిగి మండలం పైడేటి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రెండు రోజుల క్రితం టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితులు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేరారు. వారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ శనివారం సాయంత్రం పరామర్శించారు. వివరాలు.. పైడేటి గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దేవాదప్పతో టీడీపీ నాయకులు నంజుండప్ప, గోవిందు, రామాంజినేయులు గొడవపడి కొట్టారు. అనంతరం దేవాదప్ప మనుషులు సత్యప్రకాష్, ఆదినారాయణ, ఆదెమ్మ టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు నలుగురిపై మూకుమ్మడిగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో సత్యప్రకాష్, దేవాదప్ప, ఆదినారాయణకు తలలు పగిగాయి. ఈమేరకు టీడీపీ నాయకులు వెంకటేష్, దినేష్, నారప్ప, ఆదిలక్ష్మి తమపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. బాధితులపై కేసులు నమోదు చేయడమేంటి ? ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణంలో శంకర్‌నారాయణ, నవీన్‌నిశ్చల్ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి, స్థానిక ఎంపీపీ సత్యనారాయణ ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడిలో గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న పెనుకొండ నియోజకవర్గంలో కక్షలు, దౌర్జన్యాలను ఉసి కొల్పుతున్నారని మండిపడ్డారు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
బాబు నాటకాలను ఎండగడదాం
పెనుకొండ : ‘ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత రుణాలు రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు. బాబు నాటకాలను ఎండగడదాం. 5వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాకు తరలిరండి’ అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలో సుమారు 200 ద్విచక్రవాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రుణమాఫీ చేయని చంద్రబాబు వెంటనే గద్దెదిగాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను శంకరనారాయణ పంచుతూ ధర్నాకు రావాలని కోరారు. దర్గా సర్కిల్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రుణాల మాఫీ ఫైలుపై చంద్రబాబు సంతకం చేసినా అమలు మాత్రం కావడం లేదన్నారు. నేడూ, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పంట రుణాలు కూడా రెన్యూవల్ చేయకపోవడంతో రానున్న రోజులు రైతులకు మరింత ఆందోళనకరంగా ఉంటాయన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 20 శాతం జమ చేస్తామని చెబుతున్నా రైతులు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజధాని పేరుతో సింగపూర్, జపాన్ అంటూ విదేశాలకు వెళ్లడం సీఎంతో పాటు మంత్రులకు అలవాటుగా మారిపోయిందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూనే విరాళాలు ఇవ్వాలని అర్థించడం ఏ మాత్రం సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ఇప్పటికే రైతుల్లో ఏవగింపు కలిగిందన్నారు. బాబు సీఎం అయ్యాక రైతులు బీమా కోల్పోయారని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని, పింఛన్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపులు రద్దంటూనే లెసైన్స్ బెల్ట్ షాపులు తెచ్చారన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 5న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ వెంకటరామిరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సానిపల్లి మహీధర్, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, రహంతుల్లా, ఉమర్ ఫారూక్, మురళి, గుట్టూరు శ్రీరాములు, కే.రమేష్‌బాబు, సర్పంచ్‌లు శ్రీకాంతరెడ్డి, సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, యస్బి.శీనా, ఇలియాజ్, ఇర్షాద్, బోయ నరసింహ, మునిమడుగు శ్రీనివాసులు, శ్యాం నాయక్, గౌస్‌లాజం, సోమశేఖరరెడ్డి, కొండలరాయుడు, జాఫర్, వెంకటేశు, నాయుడు, రత్నాలు, జయచంద్రారెడ్డి, మొబైల్స్ ఫణి, అంజేనాయక్, ఆదినారాయణరెడ్డి, మదన్, రామచంద్రరెడ్డి, సదాశివరెడ్డి, బోయబాబు, సి.శ్రీరాములు, రామాంజినేయులు, రవి, వెంకటేష్, శంకర్, ఆదిశేషు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు తరలిరండి ఉరవకొండ : కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు తరలిరావాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మి మహిళలు మోసపోయారన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మెత్తం వూఫీ చేస్తావుని హమీ ఇచ్చి, ప్రస్తుతం సంఘానికి రూ.10 వేలు వూత్రమే చెల్లిస్తావుని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం జిల్లాలో 90 శాతం సంఘాలు డీఫాల్డ్గా మిగిలి పోనున్నాయుని, పేద వుహిళలలు తిరిగి రుణాలు కట్టే దుస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. ‘తొలి సంతకానికే విలువ లేదు’ కదిరి : ‘రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి..బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు బయటకు రావాలంటే బాబు రావాలి..జాబుకావాలంటే బాబు రావాలి..ఇలా టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఊదరగొట్టారు. గోడలమీద తాటి కాయంత అక్షరాలతో రాయించుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు చేసిన తొలి సంతకానికే విలువ లేకుండా పోయింది. తొలి సంతకం అంటే ఏంటో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒక సారి గుర్తు చేసుకో’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు సవా లక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఏడ్పిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని విమర్శించారు. ‘నిరుద్యోగులకు రూ 2 వేలు చొప్పున నిరుద్యోగభృతి అని చెప్పి ఓట్లు వేయించుకున్నావ్..ఎవరికిచ్చావు? ఎక్కడిచ్చావ్ ?’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలంటూ ఈ నెల 5న (రేపు) కలెక్టరేట్ ముందు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు జగన్, శివశంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రగుంట్ల ఎంపీడీఓపై క్రిమినల్ కేసు
ఎర్రగుంట్ల: సాక్షర భారత్ నిధులు స్వాహా చేసిన సంఘటనకు సంబంధించి సాక్షర భారత్ డిప్యూటీ డెరైక్టర్ సత్యనారాయణ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ, మండల సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ శంక రనారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. మండలంలోని సాక్షర భారత్ నిధులు సుమారు 19 లక్షల 35 వేల 480 రూపాయలను స్వాహా చేసినట్లు సాక్షర భారత్ డీడీ సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ జయసింహ, కో-ఆర్డినేటర్ శంకర్నారాయణలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
జాతీయ రహదారి దిగ్బంధం
రామగిరి/మడకశిర రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్ ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అరెస్ట్‌కు నిరసనగా గురువారం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్ఎస్గేట్ సమీపాన 44వ జాతీయ రహదారిని గంట పాటు దిగ్బంధించారు. శంకరనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని మొదట్నుంచి పోరాడుతున్నది వైఎస్సార్సీపీ ఒక్కటేనన్నారు. సమైక్యం కోసం అసెంబ్లీలో గళం విప్పిన వైఎస్ విజయమ్మను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో సీఐ నరసింగరావు, ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వచ్చి వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పోలేపల్లి ఓబిరెడ్డి, నాయకులు రామాంజినేయులు, అంకే లక్ష్మన్న, రవీంద్రారెడ్డి, సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ‘సమైక్య’ తీర్మానం చేసి టీ బిల్లుపై చర్చించాలని పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కై విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలమని చెబుతున్నా... కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓంకారస్వామి, జిల్లా యువత ఉపాధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, మండల ఎస్సీసెల్ కన్వీనర్ వెంకటరమణ, యువత నాయకులు సుదర్శన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నిద్రగట్ట నటరాజు తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్ పనైపోయింది
కదిరి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలకు కాలం చెల్లిందని, ఆయన మాయ మాటలను వినే పరిస్థితిలో జనం లేరని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అన్నారు. విభజన బిల్లు విషయంలో కిరణ్, చంద్రబాబు అవలంభిస్తున్న మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కదిరిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. కిరణ్, చంద్రబాబు పరోక్షంగా బిల్లుకు సహకరిస్తున్నారన్నారు. వారు ఎక్కడి నుంచి పోటీ చేసినా చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు ఈ విషయాన్ని గ్రహించి టీడీపీకి దూరంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాన్ గాలికి టీడీపీ, కాంగ్రెస్ కొట్టుకు పోవడం ఖాయమని అన్నారు. తెలంగాణపై చివరిబంతి ఇంకా వుందని ముఖ్యమంత్రి సీమాంధ్ర వాసులను ఇప్పటికీ మోసగిస్తున్నారని, ఆయన చెప్పడంతోనే కాంగ్రెస్ అధిష్టానం విభజనపై ముందుకు దూసుకుపోతోందని అన్నారు. ఏపీఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కాకుండా ఓ పథకం ప్రకారం..పరోక్షంగా విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లైతే రాష్ట్రానికి ఈ గతి పట్టేదే కాదన్నారు. మహానేత వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు సరిగా అమలు కావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. సమైక్యం కోసం ఉద్యమించిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆ పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ.. మహానేత వైఎస్ అన్ని వర్గాలను సమంగా చూశారని, ఆయన హయాంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి తలుపు తట్టాయన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సభలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్, నేత జక్కల ఆదిశేషు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వీరంజనేయులు, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశే ఖర్‌రెడ్డి, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేడు సమైక్య తీర్మానం చేయండి
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పంచాయతీలలోనూ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ సర్పంచులకు పిలుపునిచ్చారు. తీర్మాన ప్రతులను ప్రధానితోపాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌స (జీఓఎం)కు ఫ్యాక్స్‌ద్వారా పంపించాలని సూచించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నేడు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసేందుకు సర్పంచులందరూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని కోరారు. రాష్ర్ట విభజనకు పూనుకున్న సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, ఆంటోని, కేసీఆర్ దిష్టిబొమ్మలను నరకచతుర్దశి రోజున దహనం చేస్తామన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 6, 7న చేపట్టబోయే ర హదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతిని పరిరక్షించుకునేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతం కావడంతో కేంద్రంపై ఒత్తిడి వచ్చిందని వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై సుప్రీం కోర్టుకెళతామని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మొదట అఖిలపక్షంలో తమ వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే విధానాలను టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి షరతులు లేని బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమం మరింత ముందుకు పోతుందని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు చుక్కలూరు దిలీప్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, కోటి వెంకటేశ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కనగానపల్లివాసులు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ వైఖరిని నిరసిస్తూ కనగానిపల్లిలోని 50 కుటుంబాలవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ కండువా వేసి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. చంద్రబాబు నాయు డు కూడా తెలంగాణ కు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల చేతుల్లో పెట్టారన్నారు. రెండు పార్టీల వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీని ఏపీఎన్జీఓలు, ఆర్టీసీ జేఏసీ, వైద్య, ఆరోగ్య జేఏసీ, కార్మికులు, రైతులు, మహిళలు స్వాగతిస్తున్నారన్నారు. చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చేతులు కలిపి జగన్‌కు బెయిల్ రాకుండా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. పార్టీ జిల్లా ముఖ్యనేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంతో సీమాంధ్ర అగ్నిగుండంలా మారిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలు అడ్రస్ లేకుండా పోతాయన్నారు. పార్టీలో చేరిన వారిలో వై జయప్ప, పీ ఉజ్జన్న, బీ ఉజ్జినప్ప, కే సంగాలప్ప, వైసీ ముత్యాలప్ప, పీసీ ముత్యాలప్ప, పీపీ ముత్యాలప్ప, పామల గోవిందరాజు, మలగవేలు నారప్ప, బీ వీరనారప్ప, అంకె రామాంజినేయులు, మిడతల పెద్దయ్య, కరణం జగన్నాథ రావు, మిడతల బాలవీరన్న, పూజారి సుబ్బరాయుడు, ఉలిగొండ ఈశ్వరయ్య, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, మిద్దె భాస్కర్ రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, పూలకుంట శివారెడ్డి, దిలీప్ రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కసనూరు రఘునాథ్‌రెడ్డి, మధు, పూలకుంట భాస్కర్‌రెడ్డి, జయరాం నాయక్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, హజరాంబి తదితరులు పాల్గొన్నారు.