- జగన్‌ను విమర్శించడం వెనుక అసలు కారణమదే
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎద్దేవ
అనంతపురం : ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తేనే తనకు మంత్రి పదవి ఊడిపోదని పల్లె రఘునాథరెడ్డి, కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఆశతో చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తదితరులు కలలు కంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుంటనే తమ అధినేత వాటిని బయట పెడుతుండటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.
పట్టిసీమ పేరుతో రూ. రూ. 1600 కోట్లు కైంకర్యం చేశారని, పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లోచ్చాయా చూపించాలని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 45 టీఎంసీలు తెస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి 50 టీఎంసీలకు పైగా సముద్రంలోకి కలిసిపోయాయన్నారు. దీనివల్ల ఏం ఉపయోగమో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేçపడతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుంటున్న వైనాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయట పెడుతుండటంతోనే అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. హంద్రీనీవాకు కూడా పూర్తిస్థాయిలో నీళ్లు తేవలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మీ మోసాలు, తప్పులు, అక్రమార్జనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క పనినీ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మంత్రి పదవిని కాపాడుకునేందుకే ‘పల్లె’ తంటాలు
Published Wed, Dec 28 2016 10:31 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement