palle raghunathreddy
-
పల్లె.. నీకిది తగునా?
కొత్తచెరువు : ‘పార్టీ జెండా మోయలేదు. కనీసం సభ్యత్వం కూడా లేదు. అలాంటి వ్యక్తికి టీడీపీ మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారు. పల్లె..నీకిది తగునా?’ అంటూ తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిపాటి రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తచెరువు మండల టీడీపీ కన్వీనర్‌గా దామోదర్‌నాయుడును మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సోమవారం ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో విభేదాలు తలెత్తాయి. మంగళవారం కొత్తచెరువులోని నెహ్రూకూడలిలో తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర కాళ్లకు సంకెళ్లు వేసుకుని నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడటమే గాక పోలీస్ కేసులు కూడా భరించామన్నారు. అటువంటి వారిని మరచి కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ విభేదాలు సృష్టిస్తున్నారని పల్లెపై మండిపడ్డారు. ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి రవిచంద్రను స్టేషన్‌కు తరలించారు. కాగా.. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున రవిచంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఓ ప్రకటనలో తెలిపారు. -
పల్లె ఔట్.. కాలవ ఇన్
చివరి నిమిషంలో చాంద్‌కు చేజారిన అవకాశం – కాలవకు మంత్రి పదవి కట్టబెట్టడంతో మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లోనూ వ్యతిరేకత – పార్టీకోసం శ్రమించిన బీకే పార్థసారథి, పయ్యావులకు చంద్రబాబు మొండిచేయి – సిసలైన కార్యకర్తలను గుర్తించడంలో అధిష్టానం విఫలమైందని పెదవివిరుపు – ‘అనంత’ టీడీపీలో చిచ్చురేపుతోన్న మంత్రివర్గ విస్తరణ (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై చంద్రబాబు వేటు వేశారు. చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి కేబినెట్లో చోటు కల్పించారు. పార్టీ కోసం సుదీర్ఘంగా శ్రమించిన తమకు మంత్రి పదవి లభిస్తుందని బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి కాకుండా ‘రిజర్వేషన్ల’ పేరుతో రాజకీయం చేసేవారికి మంత్రి పదవి కట్టబెట్టడంపై బీకే, కేశవ్ తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ‘అనంత’లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కాలవకు పదోన్నతి కల్పించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో జిల్లాలో బలహీనపడిన టీడీపీలో తాజా మంత్రివర్గ విస్తరణ చిచ్చురేపుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 12 అసెంబ్లీస్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి అధికారం దక్కిన తర్వాత పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు కేబినెట్లో చోటు కల్పించారు. అయితే వీరిద్దరి పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవులు అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా, ఆర్థికంగా లబ్ధి పొందడం మినహా పార్టీ బలోపేతానికి వీరు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరినీ తప్పించి కొత్తవారిని తీసుకోవాలని భావించారు. అయితే పల్లె రఘునాథరెడ్డిని మాత్రమే తప్పించి సునీతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖాళీ స్థానంలో బీసీలకు కేటాయించాల్సి వస్తే పార్టీలో సీనియర్ నేత అయిన తనకే ప్రాధాన్యం ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి భావించారు. పదేళ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించానని, తనకు చోటు ఖాయమనుకున్నారు. ఇదే క్రమంలో 2004–14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీ ఉన్నతి కోసం పాటుపడిన వారిలో తాను కూడా ఉన్నానని, 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతోనే మంత్రి పదవి దూరమైందని, విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని కేశవ్ ఆశపడ్డారు. పైగా కేబినెట్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా కేశవ్‌ను నియమించడంతో విస్తరణలో తన ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి మొండిచేయి చూపించి ‘లాబీయింగ్’కే చోటు కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలవకు చోటుపై ఎమ్మెల్యేల మండిపాటు కాలవ శ్రీనివాసులు 1999 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. అనంతపురం ఎంపీగా బీసీ, బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో కాలవ శ్రీనివాసులు పేరును పయ్యావుల కేశవ్ అప్పట్లో సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో కాలవ విజయం సాధించారు. ఆపై 2004, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. ఆపై 2014 ఎన్నికల్లో కూడా రాయదుర్గం టిక్కెట్టును కేశవ్ ఇప్పించారని చెబుతున్నారు. 2004–14 వరకు ఓడిపోయిన పదేళ్లు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మినహా పార్టీ అభివృద్ధి కోసం ఏ రకంగానూ కాలవ పాటుపడలేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కాలవకు ఓ కేడర్ లేదని, వ్యక్తిగతంగా కనీసం 500 ఓట్లను సాధించే చరిష్మా కూడా లేదంటున్నారు. ఇలాంటి వ్యక్తికి చీఫ్‌విప్‌గా చోటు కల్పించారని, అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించామంటున్నారు. కానీ పని చేసిన వారికి న్యాయం చేయాల్సిన సమయంలో చంద్రబాబు రిజర్వేషన్లను సాకుగా చూపి తమకు మొండిచేయి చూపారని కేశవ్, పార్థ తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇవ్వాల్సి వస్తే తనకంటే కాలవకు ఉన్న అర్హతలేమిటో చెప్పాలని బీకే తన సన్నిహిత ఎమ్మెల్యేతో వాపోయినట్లు తెలుస్తోంది. నిర్వేదంలో కేశవ్ మంత్రివర్గంలో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విశ్వప్రయత్నాలు చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరితో పాటు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేశవ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకోవడంతో రాష్ట్రంలో మరో కమ్మ సామాజిక వర్గం వారికి చోటు కల్పించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. మంత్రి పరిటాల సునీతను దాదాపు మూడేళ్లపాటు కొనసాగించారని, పార్టీ కోసం శ్రమించినా తనకూ రెండేళ్లు అవకాశం ఇవ్వలేరా? అని కేశవ్ సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంత శ్రమించినా ఫలితం లేదన్నపుడు, ఎందుకు పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలని కేశవ్ వారితో వేదనపడ్డారని తెలుస్తోంది. విస్తరణలో పార్టీ సమన్యాయం చేయకపోగా పార్టీ కోసం శ్రమించినవారిని కాదని పత్రికా యజమానులు చెప్పిన వారికి చోటు కల్పించారని, వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మెజార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన పల్లె రఘునాథరెడ్డికి చీఫ్ విప్ ఇస్తారని సమాచారం. అయ్యో అత్తార్ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు మైనార్టీ కోటాలో తొలుత కేబినెట్లో బెర్త్ ఖరారు చేశారు. దీంతో ‘అనంత’కు మూడు మంత్రుల పదవులు వచ్చినట్లు అయ్యింది. తనకు మంత్రి పదవి ఖరారు అయిందనే సమాచారాన్ని చాంద్‌బాషా కదిరిలోని తన కుటుంబ సభ్యులు, అనుచరులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో కదిరిలో అత్తార్ అనుచరులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో మునిగి ఉండగానే టీవీలో షాకింగ్ న్యూస్ వెలువడింది. ఆఖరి నిమిషంలో చాంద్‌బాషా స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు బీసీ కోటాలో చంద్రబాబు మంత్రి పదవి ఖరారు చేశారు. దీంతో అత్తార్ మంత్రి పదివి ఆశలు అడియాసలు అయ్యాయి. -
ఆ వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరు : మంత్రి పల్లె
అమరావతి : నందమూరి వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలక్రిష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మినహాయింపును ఎవరైనా వ్యతిరేకించారా అని మీడియా ప్రశ్నించగా, నందమూరి వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరని బదులిచ్చారు. అంత ధైర్యం ఎవరికైనా ఉందా అని వ్యాఖ్యానించారు. రుద్రమదేవి సినిమాకు దరఖాస్తు ఆలస్యంగా వచ్చిందని.. అందుకే మినహాయింపు ఇవ్వలేదని వివరించారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను రాయితీ కల్పించటంపై కేబినెట్లో చర్చకు వచ్చిన సమయంలో తాను ఉండనంటూ మంత్రి యనమల రామకృష్ణకు బాధ్యతలు అప్పగించి సీఎం చంద్రబాబు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. బుధవారం ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు ఎలాంటి జీవో లేకుండానే పన్ను రాయితీ ఇవ్వటంపై హైకోర్టు వివరణ కోరిన విషయం విధితమే. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపైనా మంత్రివర్గం చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. ఆందోళనలకు ఇది సమయం కాదని అన్నారు. ఇది అభివృద్ధిని వ్యతిరేకించే చర్య అని పేర్కొన్నారు. అసెంబ్లీ భవనం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు 638ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించింది. అనంతపురం జిల్లాలో 500మెగావాట్లా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కు 4018ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకుండా విశేష ఉపగుత్తేదారు అయిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.95 కోట్లు ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. -
చదువుకున్న అజ్ఞాని మంత్రి పల్లె..
అమడగూరు : ఉన్నత చదువులు చదువుకున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడని పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన జేకేపల్లిలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టేయమన్నట్లు, బుక్కపట్నం చెరువు వివరాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టరును ఆదేశించిన వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ్ముళ్లకు పోటీలు పెట్టించి మరీ చెరువులో పని చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయాలంటే ముందుగా అధికారులు ఎస్టిమేషన్ తయారు చేసి, టెండర్లు పిలిచి సంబంధింత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే మండలాధికారులకే తెలియకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చెరువులో పడి పనులు చేసుకోవడం ఏమాత్రం సమంజసం అని దుయ్యబట్టారు. మంత్రి పల్లె అండదండలతోనే తెలుగు తమ్ముళ్లంతా ఇలా తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పిచ్చిమొక్కల తొలగింపు (జంగిల్ క్లీనింగ్) పేరుతో రూ.3 కోట్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. అంతేకాక చెరువులో అంత లోతుగా గుంతలు తీయడం ద్వారా నీటి నిల్వ ఎక్కువై చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ముందన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువులో పనులు చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కన్వీనర్ శేషూరెడ్డి, బుక్కపట్నం కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నాగరాజు, బొట్టుస్వామి, నక్కలచిన్నప్ప, జయప్ప, సురేంద్రరెడ్డి, లోకేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవిని కాపాడుకునేందుకే ‘పల్లె’ తంటాలు
- జగన్‌ను విమర్శించడం వెనుక అసలు కారణమదే - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎద్దేవ అనంతపురం : ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తేనే తనకు మంత్రి పదవి ఊడిపోదని పల్లె రఘునాథరెడ్డి, కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఆశతో చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తదితరులు కలలు కంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుంటనే తమ అధినేత వాటిని బయట పెడుతుండటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. పట్టిసీమ పేరుతో రూ. రూ. 1600 కోట్లు కైంకర్యం చేశారని, పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లోచ్చాయా చూపించాలని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 45 టీఎంసీలు తెస్తే ప్రకాశం బ్యారేజీ నుంచి 50 టీఎంసీలకు పైగా సముద్రంలోకి కలిసిపోయాయన్నారు. దీనివల్ల ఏం ఉపయోగమో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేçపడతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుంటున్న వైనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి బయట పెడుతుండటంతోనే అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. హంద్రీనీవాకు కూడా పూర్తిస్థాయిలో నీళ్లు తేవలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మీ మోసాలు, తప్పులు, అక్రమార్జనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క పనినీ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
పల్లె... నిజాయితీ నిరూపించుకో
నల్లమాడ : గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి దోస్తీ వాస్తవమేనని, మంత్రి మాటలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. నల్లసింగయ్యగారిపల్లిలోని ఇంట్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకరులతో మాట్లాడారు. బుక్కపట్నం మండలం యర్లంపల్లికి చెందిన గ్యాంగ్‌స్టర్ మధుతో పరిచయాలు ఉన్నాయని, 2014 ఎన్నికల్లో తన విజయానికి మధు సహకరించాడని, తాను బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఫోన్ చేస్తుంటాడని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించడం వారిరువురిసంబంధాలను తేటతెల్లం చేస్తున్నాయన్నారు. బెంగళూరు స్థావరంగా గ్యాంగ్‌స్టర్ మధు కొన్నేళ్లుగా సాగిస్తున్న దందాలు, సెటిల్మెంట్లలో పల్లె ర ఘునాథరెడ్డి సూత్రధారి అనే విషయం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. మధును అడ్డం పెట్టుకొనే పల్లె జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై విచారణకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా కోరి, నిజాయితీ నిరూపించుకోవాలని శ్రీధర్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె సంబంధాలపై విచారణ చేయించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు సుధాకర్‌రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, వెంకటప్పనాయుడు, ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులయాదవ్, విజయమ్మ, సుకన్యా శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాబూఖాన్, కుళ్లాయిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజాసేవలోనే సంతప్తి
అనంతపురం అర్బన్ : జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి జన్మదినాన్ని నగరంలోని ఆయన స్వగహంలో అభిమానులు వేడుక నిర్వహించారు. మంత్రికి పూలమాలలు వేసి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో ఉన్న సంతప్తి ఎందులోనూ లభించదన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి తగ్గట్టుగా ప్రజాసేవ చేయాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మైనార్టీల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయం
చిలమత్తూరు : మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని రక్ష అకాడమీని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా ముస్లిం మైనార్టీ యువకులకు కానిస్టేబుల్స్, జైళ్ల శాఖలో ఉద్యోగాల కోసం రక్ష అకాడమీలో ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందిని ఎంపిక చేసి 300 మందికి రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కో వ్యక్తి మీద ప్రభుత్వం సుమారు రూ.18 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ కమిషనర్ మహమ్మద్ ఇక్బాల్, ఎండీ అరుణకుమారి, సీఈఓ శాస్త్రి, కమాండెంట్ చియన్న, జెడ్పీ చైర్మన్ చమన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు తదితరులు ఉన్నారు. -
హంద్రీ–నీవా పనులు వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్ : హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆదేశించారు. హంద్రీ–నీవా పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై బుధవారం స్థానిక నగర పాలక అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో అడ్డంకులు ఎదురైతే ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. రైల్వే, అటవీ అనుమతుల అడ్డంకి తొలగిందన్నారు. కాబట్టి పనుల వేగవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు
పుట్టపర్తి అర్బన్ :విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మార్పు తీసుకురావడం ఉపాధ్యాయులతోనే సాధ్యమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్వీజే కల్యాణ మండపంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికపై విద్యాధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య, మంచి నడవడికలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులను తీర్చిద్దిడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సోమవారం నుంచి ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించి, కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ అంజయ్య, కదిరి ఆర్డీఓ వెంకటేశు, వివిధ మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రిపై ఎమ్మెల్సీ ఫైర్
మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశాల్లో నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. సోమవారం అనంతపురంలోని కమ్మభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు జయనాగేశ్వరరెడ్డి, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఎదుట పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు మీడియాను అనుమతించలేదు. కొందరు నేతలు బయటకు వచ్చాక నేతల తీరును బాహాటంగానే విమర్శించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీరుపై నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట నేతృత్వంలో నేతలు ఆగ్రహించారు. స్టోర్ డీలర్లను తొలగించాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నట్లు జయనాగేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉంటూ ప్రొటోకాల్ పేరిట వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్నారు. ఇక ఎమ్మెల్సీ శమంతకమణి తనదైన శైలిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో.. ఎవరు చేయలేదో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎవరి విషయంలో మాట్లాడుతున్నారని జయనాగేశ్వరరెడ్డి అడగ్గా.. వడ్డెర్ల కార్పొరేషన్ చైర్మన్‌గా మురళీని ఎవరిని అడిగి ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీంతో మంత్రి పల్లె తానే వేయించానని చెప్పారు. ‘నువ్వొక్కడివే ఎలా నిర్ణయం తీసుకుంటావ’ని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి సునీత కూడా తనకు సమాచారం లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మరికొందరు కూడా గళం విప్పారు. ఉక్కిరిబిక్కిరైన మంత్రి పల్లె.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడిగే ఇచ్చామని చెప్పారు. ఇవ్వాలా, వద్దా అని అడిగితే ఇవ్వండని చెప్పినట్లు చౌదరి అంగీకరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు కొన్ని సమావేశాల్లో మాత్రమే కన్పిస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలోనూ మంత్రి పల్లెపై ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రత్యేక వర్గాన్ని పెంచిపోషిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల రగలగా.. నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. -
'ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు'
రేణిగుంట : ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాష్ట్రంగా చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు స్థాపిస్తారని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐటీ రంగం ద్వారా పలు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే భావితరాల వారి పరిస్థితి మృగ్యమవుతుందని తెలిపారు. రేణిగుంట, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు అనుగుణంగా ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఐటీ స్పెషల్ సెక్రటరీ కిషోర్, ఐటీ సీఈవో నిఖల్ అగర్వాల్, మహిళా యూనివర్శిటీ వీసీ వరలక్ష్మి, ఏపీఐఐసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలివి..
విజయవాడ : విజయవాడ క్యాంపు ఆఫీసులో శనివారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 42 అంశాలపై చర్చించామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, జరిగిన చర్చ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు.. సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కు గతంలో భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో రద్దు ఈ ప్రాంతంలో మల్టీ ప్రాడక్ట్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలని నిర్ణయం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు ప్రపంచంలోని టాప్ ఇరవై విశ్వవిద్యాలయాలను ఇక్కడికి ఆహ్వానిస్తాం సుబాబుల్ ను పేపర్ గా మార్చే పరిశ్రమలను వ్యాట్ అయిదు శాతంకు కుదింపు నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు నిర్ణయం వ్యర్థాల నుంచి వచ్చే ఇంధనాలకు 14 శాతం వ్యాట్ తొలగింపు విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాల ఏర్పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుకు నిర్ణయం పేదలకు అరవై గజాల వరకు ఉచిత క్రమబద్దీకరణ సింహాచలంలో 12,149 మందికి చెందిన భూముల క్రమబద్దీకరణ 60 నుంచి 300 గజాల వరకు 1998 బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ మూడు వందల గజాలకు పైన అయితే ప్రస్తుతం ఉన్న బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ దేవాదాయశాఖలో బోర్డుల పరిమితి రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం రాజధాని మాస్టర్ డెవలప్ మెంట్ పై చర్చ, కార్మిక సంస్కరణలపై చర్చ చిత్తూరులో హెల్త్ సిటీ స్థాపనకు నిర్ణయం, ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై నిర్ణయం ఆర్థికనేరాలు, చిట్‌ఫండ్ కంపెనీల మోసాలపై కఠిన చర్యలపై చర్చ ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియేట్ స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేయాలని నిర్ణయం -
పల్లె.. నోరు అదుపులో పెట్టుకో
వైఎస్సార్ సీపీ నాయకుల ఆగ్రహం అనంతపురం: పల్లె.. నోరు అదుపులో పెట్టుకో.. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తే మంత్రి పదవి అలాగే ఉంటుందనే భ్రమలో ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె. వెంకట్చౌదరి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యు.పి.నాగిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వెన్నపూస రామచంద్రారెడ్డి మాట్లాడారు. మంత్రి పల్లె రాఘునాథరెడ్డి మతిభ్రమించి వై.ఎస్.జగన్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా విమర్శలు చేసి మంత్రి పదవి కాపాడుకోవాలని చూస్తున్నారని, ఇప్పటికే మంత్రి పల్లె స్థానంలో పయ్యావుల కేశవ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చి.. వారిలో ఒక భరోసా కల్పిస్తున్న వై.ఎస్.జగన్‌పై విమర్శలు తగదని హితవు పలికారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు పుష్కరాల పేరుతో రూ.800 కోట్లు సొంత ఖాతాలో జమ చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి అక్రమాలు మంత్రికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహిళలు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. యువత ఉపాధి లేక వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. -
'ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదు'
హైదరాబాద్ : ఏపీ రాజధాని గ్రామాల్లో గురువారం సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి స్పందించారు. పవన్ ఏమన్నారో తమ దృష్టికి రాలేదని, తమ ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ తో పాటు అన్ని వర్గాల సహకారం ఉందని మంత్రి రఘునాధ్ రెడ్డి అన్నారు. అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని , ఎవరైనా ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదన్నారు. 50-100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మించాలనుకుంటున్నామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసిందని మంత్రి చెప్పారు.