చిలమత్తూరు : మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొడికొండ చెక్‌పోస్టులోని రక్ష అకాడమీని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా ముస్లిం మైనార్టీ యువకులకు కానిస్టేబుల్స్, జైళ్ల శాఖలో ఉద్యోగాల కోసం రక్ష అకాడమీలో ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 500 మందిని ఎంపిక చేసి 300 మందికి రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కో వ్యక్తి మీద ప్రభుత్వం సుమారు రూ.18 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ కమిషనర్ మహమ్మద్ ఇక్బాల్, ఎండీ అరుణకుమారి, సీఈఓ శాస్త్రి, కమాండెంట్ చియన్న, జెడ్పీ చైర్మన్ చమన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు తదితరులు ఉన్నారు.
మైనార్టీల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయం
Published Thu, Sep 15 2016 10:55 PM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement