అనంతపురం అర్బన్ : హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆదేశించారు. హంద్రీ–నీవా పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై బుధవారం స్థానిక నగర పాలక అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో అడ్డంకులు ఎదురైతే ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. రైల్వే, అటవీ అనుమతుల అడ్డంకి తొలగిందన్నారు. కాబట్టి పనుల వేగవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
హంద్రీ–నీవా పనులు వేగవంతం చేయండి
Published Thu, Sep 15 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
Advertisement
Advertisement