speed up
-
ఈ సూట్ వేసుకుంటే సూపర్ స్పీడ్‌గా పరిగెత్తొచ్చు
సూపర్ స్పీడ్ గా పరుగెత్తాలనుకుంటున్నారా? అయితే ఈ సూట్ మీ కోరికను నెరవేర్చనుంది. నిజం, దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అల్ట్రా–లైట్ ఎక్సోసూట్ను రూపొందించారు. ఇది మనిషి.. వేగంగా దూరాలను అధిగమించడంలో సహాయపడుతుంది. 2.5 కిలోల బరువు ఉండే ఈ సూట్‌ని ధరిస్తే దాదాపు సెకనుకు 200 మీటర్లు పరుగెత్తగలం. ఈ ప్రత్యేకమైన ఎక్సోసూట్.. పవర్ ప్యాక్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ సూట్ పరిశోధన దశలోనే ఉన్నా త్వరలోనే అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మరింత తక్కువ బరువుతో మరింత వేగంగా పరుగెత్తించగల సూట్నీ తయారుచేసే పనిలో ఉన్నామనీ చెబుతున్నారు. -
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!
సాక్షి, అనంతపురం శ్రీకంఠంసర్కిల్: రెండు రోజుల క్రితం అనంతపురం జేఎన్టీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య కేసు దర్యాప్తును వన్‌టౌన్ పోలీసులు ముమ్మరం చేశారు. జేఎన్టీయూ (ఏ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతుల కుమారుడు చాణిక్య నందరెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వర్సిటీలోని ఎల్లోరా హాస్టల్లో చాణిక్య ఉంటున్న నంబర్ 131 గదిలోని నలుగురు విద్యార్థులతో పాటు చాణిక్య ఆత్మహత్య చేసుకునే ముందు నిద్రించిన గదిలోని అత్యంత సన్నిహితున్ని శుక్రవారం విచారణకు పిలిచారు. ఎవరితో పెద్దగా విభేదాలు లేవని, ప్రేమ వ్యవహారాలు కూడా నడవలేదని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై తమకూ స్పష్టత లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే, డిసెంబరు 31 రాత్రి నుంచి చాణిక్య మూడీగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు 134 గదిలోకి.. చాణిక్య తను ఉండాల్సిన 131 నంబరు గదిలో కాకుండా 134లోకి రావడానికి కారణాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. తనతో పాటు ఇంటర్ నుంచి కలసి చదువుతున్న విద్యార్థి నరేంద్ర సీఈసీ తీసుకున్నాడు. తను 134 గదిలో ఉంటున్నాడు. దీంతో ఎక్కువగా చాణిక్య కూడా అతనితో గడిపేవాడు. చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా చాణిక్య అక్కడే పడుకున్నాడు. కాగా తను ఎప్పుడు నిద్ర లేచి వెళ్లాడో తెలియదని నరేంద్ర అంటున్నాడు. తను చనిపోయిన విషయం హాస్టల్లో విద్యార్థులకు కూడా ఆరు గంటల దాకా తెలియదంటున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ టెర్రస్ పైభాగాన చాణిక్య చెప్పులు వదిలేసి ఉండటం పోలీసులకు అనుమానాన్ని పెంచుతోంది. సెల్ఫోన్లోనూ నో క్లూ.. చాణిక్యనందరెడ్డి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ వ్యవహారాలుంటే అందులో ఏదో ఒక చోట సంభాషణ, లేదా పంపిన సందేశాలుండేవి. అయితే, అలాంటివి లేవంటున్నారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ బ్యాచ్‌ల్లో చాణిక్య ఉన్నాడా? అని కూడా ఆరా తీయగా, వాటితో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలుండవచ్చనే కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవముండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందేమోగాని.. చాణిక్య వరకు అలాంటి ఇబ్బంది లేదు. కారణం తను దుబారా ఖర్చులు చేసేవాడు కాదట. చదువు మినహా మరో వ్యాపకం కూడా లేదని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా తనకు వచ్చిన రూ. 60 వేల స్కాలర్ షిప్ కూడా తండ్రి ఖాతాలోకి మళ్లించాడు. లోన్‌యాప్స్, క్రెడిట్‌కార్డులు లాంటి అవకాశం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. సెల్ఫోన్లో ఎక్కడా ఆ జాడలు లేవు. కాని చాణిక్య తను చనిపోయే ముందు సెల్ఫోన్లో టైప్ చేసి ఉంచిన మైఫైల్స్ సందేశంలో మాత్రం.. వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నట్లు ఉంది. తన సోదరి గీతారెడ్డికి పంపిన సందేశంలోని సారాంశాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ ఆర్థిక పరిస్థితితోనే చాణిక్య ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. (చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్) -
మునుగోడుపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్
-
తక్షణమే పూర్తి చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు
-
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో కీలక పురోగతి
-
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
తల వెంట్రుకల ఎక్సపోర్ట్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
గడువు గండం
సాక్షి, వనపర్తి : గడువు గండం ఉండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.750కోట్లు కేటాయించి కేవలం స్వల్ప కాల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో రూ.60కోట్ల వ్యయంతో 1,642 సీసీరోడ్ల పనులకు అనుమతిచ్చింది. మార్చి 31లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కాంట్రాక్టర్లు, నిర్మాణదారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. వాగుల నుంచి తెచ్చిన ఇసుకకు బదులు మట్టి, రాతిపొడిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదు. ఫలితంగా సుమారు 20ఏళ్ల పాటు మన్నిక ఉండాల్సిన సీసీరోడ్లు ఏడాది కూడా పటిష్టంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం 758 పనులు మాత్రమే పూర్తి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శనివారం నాటికి సీసీరోడ్ల నిర్మాణానికి ఇచ్చిన గడువు ముగిసింది. జిల్లాలో ఇప్పటివరకు 758 రోడ్ల నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మంజూరైన 1642లో 884రోడ్లు ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. కేవలం రూ.24కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రభుత్వం నుంచి గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు వెలువడితే తప్ప పనులు కొనసాగే అవకాశం లేదు. లేదంటే మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది. నిర్మాణ పనులకు సంబంధించి వారం పదిరోజుల్లో ఓ స్పష్టత వస్తుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక నేతలే.. గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ సిమెంట్, కాంక్రిట్ రోడ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించింది. రోడ్ల పనులను గ్రామాల్లో సర్పంచ్‌లు, స్థానిక నాయకులు కాంట్రాక్టర్లుగా పనులు చేపడుతున్నారు. పనులను హడావుడిగా చేపట్టడంతో నాణ్యత దెబ్బతిన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశీలనలో కొన్ని.. చిన్నంబావి మండలం పెద్దమారులో రూ.90లక్షలతో చేపడుతున్న రోడ్డు శనివారం సాయంత్రం వరకు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్ గడువులోగా పూర్తిచేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాడు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలనే ఆతృతతో రేవల్లి మండలం చీర్కపల్లి శివారులో ఓ రైతు పొలం నుంచి తీసుకువెళ్లిన మట్టితో కూడిన ఇసుకను వాడుతున్నారు. వనపర్తి మండలం అప్పాయిపల్లిలో ఇసుకకు బదులుగా మట్టిని వాడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీపనగండ్ల మండలం వల్లాభాపురంలో నిబంధనల ప్రకారం వేయాల్సిన మందంలో రోడ్డు నిర్మాణం చేపట్టడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ఇవ్వాలి మా గ్రామానికి రూ.1.40కోట్లు మంజూరయ్యాయి. దీనిలో రూ.40లక్షల వ్యయంతో నేను పని తీసుకున్నాను. జిల్లావ్యాప్తంగా ఒకేసారి పనులు జరుగుతుండటంతో కూలీలు, మిషన్ల కొరతతో పనులు సగం కూడా పూర్తి కాలేదు. మరో వారం రోజలు అయినా పొడిగిస్తే పనులు పూర్తవుతాయి. లేదంటే నిధులు వెనక్కి వెళ్తాయి. – గోవింద శ్రీధర్‌రెడ్డి, పెద్దమారు నాణ్యతకే ప్రాధాన్యం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం ఆలస్యమైంది. వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాం. అయినప్పటికీ గడువు లేకపోవడంతో జిల్లాలో 50శాతం కూడా పూ ర్తికాలేదు. పనులు నెమ్మదించినా సరే నా ణ్యత విషయంలో తేడావస్తే బిల్లులు మం జూరుచేయబోం. ప్రభుత్వం గడువు పెంచుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలనుంది. – శివకుమార్, పీఆర్ ఈఈ, వనపర్తి జిల్లా -
‘బెటాలియన్’ పనులు వేగవంతం
‘అనంత’కు ఆరు కిలోమీటర్ల దూరంలో.. రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మాణాలు అనంతపురం సెంట్రల్ జైలు సమీపంలో 118 ఎకరాల్లో బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తొలివిడతగా రూ. 13కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో తొలుత ఎంపిక చేసిన స్థలం చుట్టూ ప్రహరీ, విద్యుత్, అంతర్గత రహదారులు, నీటి వసతి పనులు పూర్తి చేశారు. అదే సమయంలో పాలక భవనం, మన్ బ్యారక్, సిబ్బంది క్వాటర్స్, ఆయుధగారం పనులు చేపట్టారు. ఈ పనులు శరవేగంతో పూర్తి అవుతున్నాయి. రానున్న కాలంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, రక్షక విభాగాలకు సంబంధించిన మూడు నుంచి నాలుగు వేల మంది నివాసముండేలా 800 క్వాటర్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. చుట్టూ పరుచుకుంటున్న పచ్చదనం ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతం చుట్టూ పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాటిన రెండు వేల మొక్కలు పచ్చదనాన్ని సంతరించుకుని విస్తరిస్తున్నాయి. బ్లాక్‌ల వారిగా వరుస క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. విశాలమైన మట్టి రోడ్లనే వేశారు. పాలక భవనం దాదాపు పూర్తి కావస్తోంది. బెటాలియన్ సిబ్బందికి ఇక్కడ వివిధ రంగాలలో ప్రత్యేక శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది ; జగదీష్‌కుమార్, కమాండర్ బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి తొలుత అడ్మినిస్ట్రేషన్ భవనం, మన్ బ్యారెక్, ఆయుధగారం వంటి నిర్మానాలు చేస్తున్నాం. మరిన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు నిధుల అవసరం చాలా ఉంది. ఏదేమైనా నిర్మాణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. -
మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
కామారెడ్డి రూరల్: గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణ పనులను వేగవం తం చేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డు, శ్మశానవాటికల పనులలతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభిం చాలని, హరితహా రంలో భాగంగా మొ క్కలు నాటిన కూలీ ల కు డబ్బులు చెల్లించాలని, మొక్క ల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏపీవో సాయిబాబా, టెక్నికల్ అసిస్టెంట్లు మహిపాల్‌రెడ్డి, నరేశ్, స్వప్న, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
సత్వర న్యాయమే ధ్యేయం
జనగామ: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే తమ ప్రధాన ధ్యేయమని జనగామ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) తేజావత్ వెంకన్న అన్నారు. కొత్త జిల్లాలో పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జనగామ నూతన జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. పోలీసు వ్యవస్థ నిర్వహణకు సంబంధించి మరికొన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి.. జనగామ జిల్లా మీదుగా 163 నేషనల్ హైవే ఉంది. ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించబోతున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాహనాల తనిఖీలు చేపడుతాం. అలాగే రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తాం. నిరంతరం పెట్రోలింగ్ చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను నియమిస్తాం. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాం. జనగామతోపాటు వర్ధన్నపేట, స్టేష¯ŒSఘ¯ŒSపూర్ పరిధిలో 15 పోలీసుస్టేçÙన్లు ఉన్నాయి. జనగామ, స్టేష¯ŒSఘ¯ŒSపూర్ ఎస్‌హెచ్‌ఓలతోపాటు నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, వర్ధన్నపేట సీఐ సర్కిళ్లు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల సూచనలు తీసుకుంటాం.. భూవివాదాల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారుల సూచనలు తీసుకుంటాం. సర్వే నంబర్లు, బౌండరీల ఏర్పాటులో తలెత్తే వివాదాలపై తహసీల్దార్ల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తాం. సివిల్ విషయాల కంటే క్రిమినల్ కేసులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తాం. న్యాయం కోసం నేరుగా ఆశ్రయించవచ్చు.. న్యాయం కోసం సామాన్య ప్రజలు నేరుగా పోలీసులను ఆశ్రయించవచ్చు. పోలీసులు 24 గంటలపాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారు. కొత్త జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నాం. -
వెలగపూడి రియాల్టి షో
-
హంద్రీ–నీవా పనులు వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్ : హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆదేశించారు. హంద్రీ–నీవా పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై బుధవారం స్థానిక నగర పాలక అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో అడ్డంకులు ఎదురైతే ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. రైల్వే, అటవీ అనుమతుల అడ్డంకి తొలగిందన్నారు. కాబట్టి పనుల వేగవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
ఎంపీ నిధుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : ఎంపీ లాడ్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై పంచాయతీరాజ్ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన శనివారం సమీక్షించారు. గత సంవత్సరం ఎంపీ లాడ్స్‌కు సంబంధించి కాకినాడ డివిజన్లో 57 పనులకు 47, రాజమండ్రి డివిజన్లో 22కు 10, అమలాపురం డివిజన్లో 76కు 66 పనులు పూర్తయ్యాయన్నారు. 18 పనులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 17 పనులూ పూర్తి కాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులకు సంబంధించిన సమస్యలను గుర్తించి అవసరమైతే ఎంపీల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో భవనాన్ని 590 ఎస్ఎఫ్టీలలో రూ.7.50 లక్షలతో నిర్మించాలన్నారు. అంగన్వాడీ భవన నిర్మాణాల భూమి లెవెలింగ్‌ను ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టాలన్నారు. తక్కువ పిల్లల హాజరు ఉన్నచోట మంజూరు చేసినవి రద్దు చేసి, ఎక్కువ హాజరున్నవాటికి రీ శాంక్షన్ ఇస్తామన్నారు. రెండు అంగన్వాడీ భవనాలు కలిపి ఒకేచోట నిర్మించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ మోహనరావు, ప్రణాళిక అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహనరావు, పంచాయతీరాజ్ ఈఈలు ఎం.నాగరాజు, రాఘవరెడ్డి, బి.సత్యనారాయణరాజ్ పాల్గొన్నారు. -
సాదాబైనామాల వేగం పెంచాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: సాదాబైనామా నోటీసులు జారీచేయడంలో వేగం పెంచాలని సీసీఎల్ఏ రేమండ్ పీటర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సాదాబైనామా నోటీసులు వెంటనే జారీచేసి ఆగస్టులో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పుష్కరాలు లేని మిగతా మండలాల్లో సాధాబైనామా ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అసైన్డ్‌ల్యాండ్ వివరాలను వెంటనే పంపించాలని సూచించారు. జీఓ 58, ముటేషన్లు, ఎఫ్‌లైన్ పిటిషన్ల పురోగతిపై చర్చించారు. సమావేశంలో జేసీ రాంకిషన్, డీఆర్వో భాస్కర్, ఎస్ఎల్ఆర్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు. రైతులకు పారదర్శకసేవలు రైతులకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయశాఖ డైరెక్టర్ జీడీ ప్రియదర్శినితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. వ్యవసాయశాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. మాభూమి పోర్టల్, అగ్రీస్ నెట్ సర్వర్ల ద్వారా రైతుల వివరాలు తెలుసుకుని వారికి రుణాల మంజూరు, బీమా, పావలావడ్డీ, సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని వివరాలను రైతు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేడీఏ బాలునాయక్, సీపీఓ లలిత్‌కుమార్, డీడీఏలు సింగారెడ్డి, నాగేంద్రయ్య, ఏడీలు యశ్వంత్‌రావు, హైమావతి పాల్గొన్నారు. -
‘మిషన్’ పనులు పూర్తి చేయండి
అధికారులను ఆదేశించిన నీటిపారుదల ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల్లో బాగా వెనుకబడిన జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు తరుఫున జోషి మిషన్ కాకతీయపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మిషన్ కాకతీయ పనులు చాలా వెనుక బడ్డాయన్నారు. సరిగా పనిచేయని ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వారికి మెమోలు జారీ చేయాలని పేర్కొన్నారు. -
వ్యాపమ్ కుంభకోణంలో సీబీఐ దూకుడు
-
విభజన వేగంగా జరగాలని కేంద్రం ఒత్తిడి