జనగామ: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే తమ ప్రధాన ధ్యేయమని జనగామ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) తేజావత్ వెంకన్న అన్నారు. కొత్త జిల్లాలో పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జనగామ నూతన జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. పోలీసు వ్యవస్థ నిర్వహణకు సంబంధించి మరికొన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి..
జనగామ జిల్లా మీదుగా 163 నేషనల్ హైవే ఉంది. ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించబోతున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాహనాల తనిఖీలు చేపడుతాం. అలాగే రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తాం. నిరంతరం పెట్రోలింగ్ చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను నియమిస్తాం. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాం. జనగామతోపాటు వర్ధన్నపేట, స్టేష¯ŒSఘ¯ŒSపూర్ పరిధిలో 15 పోలీసుస్టేçÙన్లు ఉన్నాయి. జనగామ, స్టేష¯ŒSఘ¯ŒSపూర్ ఎస్‌హెచ్‌ఓలతోపాటు నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, వర్ధన్నపేట సీఐ సర్కిళ్లు ఉన్నాయి.
రెవెన్యూ అధికారుల సూచనలు తీసుకుంటాం..
భూవివాదాల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారుల సూచనలు తీసుకుంటాం. సర్వే నంబర్లు, బౌండరీల ఏర్పాటులో తలెత్తే వివాదాలపై తహసీల్దార్ల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తాం. సివిల్ విషయాల కంటే క్రిమినల్ కేసులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తాం.
న్యాయం కోసం నేరుగా ఆశ్రయించవచ్చు..
న్యాయం కోసం సామాన్య ప్రజలు నేరుగా పోలీసులను ఆశ్రయించవచ్చు. పోలీసులు 24 గంటలపాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారు. కొత్త జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నాం.
సత్వర న్యాయమే ధ్యేయం
Published Sat, Oct 15 2016 10:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement