సమావేశంలో జేసి రాంకిషన్
సాదాబైనామాల వేగం పెంచాలి
Published Thu, Jul 28 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: సాదాబైనామా నోటీసులు జారీచేయడంలో వేగం పెంచాలని సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సాదాబైనామా నోటీసులు వెంటనే జారీచేసి ఆగస్టులో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పుష్కరాలు లేని మిగతా మండలాల్లో సాధాబైనామా ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అసైన్డ్‌ల్యాండ్ వివరాలను వెంటనే పంపించాలని సూచించారు. జీఓ 58, ముటేషన్లు, ఎఫ్‌లైన్ పిటిషన్ల పురోగతిపై చర్చించారు. సమావేశంలో జేసీ రాంకిషన్, డీఆర్వో భాస్కర్, ఎస్‌ఎల్‌ఆర్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు.
రైతులకు పారదర్శకసేవలు
రైతులకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయశాఖ డైరెక్టర్ జీడీ ప్రియదర్శినితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. వ్యవసాయశాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. మాభూమి పోర్టల్, అగ్రీస్ నెట్ సర్వర్ల ద్వారా రైతుల వివరాలు తెలుసుకుని వారికి రుణాల మంజూరు, బీమా, పావలావడ్డీ, సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని వివరాలను రైతు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేడీఏ బాలునాయక్, సీపీఓ లలిత్‌కుమార్, డీడీఏలు సింగారెడ్డి, నాగేంద్రయ్య, ఏడీలు యశ్వంత్‌రావు, హైమావతి పాల్గొన్నారు.
Advertisement