జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు.
అనంతపురం అర్బన్ : జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి జన్మదినాన్ని నగరంలోని ఆయన స్వగహంలో అభిమానులు వేడుక నిర్వహించారు. మంత్రికి పూలమాలలు వేసి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో ఉన్న సంతప్తి ఎందులోనూ లభించదన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి తగ్గట్టుగా ప్రజాసేవ చేయాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.