ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు | social change of teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు

Published Sun, Jul 31 2016 11:44 PM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

social change of teachers

పుట్టపర్తి అర్బన్‌ :విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మార్పు తీసుకురావడం ఉపాధ్యాయులతోనే సాధ్యమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌వీజే కల్యాణ మండపంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికపై విద్యాధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య, మంచి నడవడికలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.


పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులను తీర్చిద్దిడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సోమవారం నుంచి ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించి, కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ అంజయ్య, కదిరి ఆర్డీఓ వెంకటేశు, వివిధ మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement