Social Activism
-
సేంద్రియ ఇంటిపంటల ద్వారా సామాజిక మార్పు!
సేంద్రియ ఇంటిపంటల సాగు గౌరవప్రదమైన ఉపాధి పొందడమే కాకుండా.. సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడవచ్చని నిరూపిస్తున్నారు ఉన్నత విద్యావంతులైన అనురాగ్, జయతి దంపతులు... వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుపోయి ఉండటం బహిరంగ రహస్యమే. ఈ ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెట్టడానికి తన వంతుగా ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలనుకున్నాడు 28 ఏళ్ల అనురాగ్ అరోరా. జలంధర్ నగరంలో పుట్టిపెరిగిన అనురాగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ విభాగాధిపతిగా పనిచేస్తూ.. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక మార్పు కోసం తపించే వ్యాపారవేత్తగా మారారు. గత ఏడాది తన భార్య జయతి అరోరాతో కలసి ‘మింక్ ఇండియా’ పేరుతో స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో రెండు విభాగాలున్నాయి. రసాయనిక అవశేషాల్లేని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని మేడలపైన ఎవరికి వారు పండించుకొని తినేలా ప్రోత్సహించడానికి మింక్ ఆర్గానిక్స్ విభాగం పనిచేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి మంచి ఉపాధి మార్గాలను అందిపుచ్చుకునే శిక్షణ ఇవ్వడానికి మింక్ ఎడ్యుకేషన్ విభాగం పనిచేస్తోంది. ఈ రెండు మార్గాల ద్వారా పక్కదారి పడుతున్న పంజాబ్ యువతకు సన్మార్గం చూపాలన్నది అనురాగ్ లక్ష్యం. సేంద్రియ వ్యవసాయంలో ఆధునిక పోకడలపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనురాగ్ శిక్షణ పొందటం ద్వారా పని ప్రారంభించారు. ‘‘రసాయనాల్లేకుండా, వర్మీకంపోస్టు ద్వారా, మట్టి లేకుండా కొబ్బరి పొట్టుకు సహజ ద్రవ పోషకాలు జోడించడం ద్వారా టెర్రస్ పైన షేడ్ నెట్‌హౌస్‌లో సాగు చేస్తున్నాం. మైక్రోగ్రీన్స్, టమాటాలు, వంకాయలు, క్యాబేజి, కాలీఫ్లవర్, ఆనప, సొరకాయలు, ముల్లంగి, ఉల్లిపాయలు, పాక్చాయ్, బ్రకోలి వంటి ఆకుకూరలు, చెర్రీ టమాటాలు, సేంద్రియ మొలకలు, సేంద్రియ కూరగాయలు, ముత్యపుచిప్ప పుట్టగొడుగులు మింక్ ఆర్గానిక్స్ సాగు చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాం.. తమ మేడపై కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి సేవలందిస్తున్నాం..’’ అని అనురాగ్ తెలిపారు. వీటితోపాటు సేంద్రియ గోధుమ నారుతో పొడి, ఎండబెట్టిన పుట్టగొడుగులను కూడా జలంధర్ నగరంలో 25 దుకాణాల్లో వీరి ఉత్పత్తులు అమ్మటంతోపాటు అమెజాన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.మైక్రోగ్రీన్స్, పుట్టగొడుగులకు మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రకాల ఆకుకూరలు,నూనెగింజల విత్తనాలను విత్తుకున్న 6–8 రోజుల్లో 2 అంగుళాలు పెరుగుతాయి. మైక్రోగ్రీన్స్‌ను కత్తిరించి సలాడ్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, సూపులలో వాడుకోవచ్చు. నెల రోజులు పెరిగిన ఆకుకూరల కన్నా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా 40 రెట్లు ఎక్కువగా పోషకాలు పొందవచ్చని అనురాగ్ తెలిపారు. మైక్రోగ్రీన్స్ చిన్న బాక్సుల్లో, లోతు తక్కువ టబ్లలోనూ విత్తుకోవచ్చు. రోజుకు రెండు సార్లు నీరు చిలకరిస్తే చాలు. కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని 5–8 రోజుల వరకు వాడుకోవచ్చు. అనురాగ్ స్టార్టప్ ఏడాదిలో మంచి ప్రగతి సాధించింది. 50 కిలోలతో ప్రారంభమైన పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు 4000 కిలోలకు పెరిగింది. మింక్ బృందం ఇద్దరి నుంచి ఏడాదిలో ఎనిమిదికి పెరిగింది. ఈ ఉత్సాహంతో పంజాబ్‌లోని అన్ని నగరాలకూ తమ కార్యకలాపాలను విస్తరింపజేయాలని అనురాగ్ భావిస్తున్నారు. ముందుచూపుతో అడుగేస్తే సేంద్రియ ఇంటిపంటల సర్వీస్ ప్రొవైడర్ వృత్తి ద్వారా కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్న అనురాగ్, జయతిలకు జేజేలు! పుట్టగొడుగులు, చెర్రీ టమాటాలు మేడపై షేడ్‌నెట్ హౌస్‌లో అనురాగ్ అనురాగ్, జయతిలతో సిబ్బంది -
చర్చ్‌కు వెళ్తున్నారని.. సామాజిక బహిష్కరణ
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణలు ఇప్పటీకి కొనసాగుతున్నాయి. చర్చికి వెళ్తున్నారంటూ 12 కుటుంబాలను సైనీ కమ్యూనిటికి చెందిన పెద్దలు కుల పంచాయతీ పెట్టి సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన యూపీలోని మోరానాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మోరానాబాద్‌కు చెందిన 12 సైనీ కుటుంబాలు ఇటీవల క్రీస్టియన్ మతంలోకి మారి, చర్చికి వెళ్తున్నారని సైనీ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. తమ కుల కట్టుబాట్లకు ఇది విరుద్దమని అందుకే వారిని బహిష్కరించినట్లు కుల పెద్ద శివలాల్ సైనీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వారు చర్చ్‌కి వెళ్తున్నారని, దీనిపై కులంలోని 300 మంది సభ్యులతో చిర్చించిన అనంతరం వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబంపై ఐదువేల జరిమాన కూడా విధించినట్లు ఆయన తెలిపారు. బహిష్కరణకు గురైన కుటుంబంలో ఏలాంటి కార్యక్రమాలు జరిగిన ఎవరు హాజరు కావద్దని, వారితో ఎవరు కూడా మాట్లాడవద్దని కుల పంచాయతీ తీర్మానించినట్లు సైనీ వెల్లడించారు. షాపుల్లో ఏలాంటి సమాన్లు కూడా వారికి విక్రయించకూడదని గ్రామంలోని షాపులను హెచ్చరించారు. తాము క్రీస్టియన్ మతంలోకి వెళ్లలేదని, కేవలం ప్రశాంతత కోసమే చర్చ్‌కి వెళ్తున్నామని బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం తప్పుడు సమాచారంతోనే తమ కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. -
‘లైంగిక నేరాలపై సామాజిక ఉద్యమం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు సామాజిక ఉద్యమం సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. తల్లితండ్రులు తమ కుమారులకు బాధ్యతాయుతంగా మెలగడం నేర్పించాలని సూచించారు.12 సంవత్సరాల లోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన దోషులకు మరణ దండన విధిస్తూ గత వారం ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుటుంబాల్లో కుమార్తెలకు మరింత గౌరవం ఇచ్చే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ కుమారులను బాధ్యతాయతంగా పెంచడంపై మనం దృష్టి సారించాలన్నారు. మనమంతా ఏకమై బాలికలను కాపాడుకునేందుకు సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కథువా, ఉన్నోవ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మైనర్ బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్ననేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. -
దేశాయిపేట్‌లో దళితులకు సాంఘిక బహిష్కరణ
బాన్సువాడ టౌ న్(బాన్సువాడ) : మండలంలోని దే శాయిపేట్‌లో 14 దళిత కుటుంబా లను గ్రామ పెద్ద లు సాంఘిక బహి ష్కరణ చేశారు. వివరాలిలా ఉన్నా యి. గ్రామంలో దళితులు గత 60 ఏళ్లుగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సమయంలో ఉచితంగా డప్పు కొట్టేవారు. ఈసారి తమకు డబ్బులు చెల్లిస్తేనే డప్పులు కొడతామని వాదించారు. దీంతో గ్రామ పెద్దలు సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇన్నేళ్లుగా ఉచితంగా డప్పులు కొట్టి ఈసారి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని, డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. శ్రీరామనవమి రోజు నుంచి 14 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసి, వారిని ఎవరైనా పనిలో పెట్టుకుంటే రూ.2500 జరిమానా చెల్లించాలని హుకూం జారీ చేశారు. దీనికి తోడు జీపీలో పనిచేసే ఇద్దరు దళిత కార్మికులను విధులకు రావద్దని సూచించారు. పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహించే మరో దళితుడిని విధుల నుంచి తొలగించారు. గత 15 రోజులుగా తమను సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులకు కూడా రానివ్వడం లేదని వాపోయారు. గ్రామంలో పని దొరకక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఈ విషయంపై బాన్సువాడ పట్టణ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. -
పెడ పోకడలతో జగతికి విపత్తు
ఒంగోలు కల్చరల్: భారతీయం కళార్చనలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రదర్శించిన సాంఘిక నాటికలు సామాజిక స్పృహను చాటిచెప్పాయి. యంగ్ థియేటర్స్, విజయవాడ కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడ్ని చంపిన మనిషి’ నాటిక నేటి మానవుడు పర్యావరణ విరోధిగా ఎలా మారుతున్నాడో చాటిచెప్పింది. జీవరాశిలో విజ్ఞాన ధనుడిగా మానవుడిని భగవంతుడు సృష్టించాడని అయితే నేడు మనిషి పెడ పోకడలతో అందమైన జగత్తును నాశనం చేస్తూ దైవాంతకునిగా మారుతున్నాడని, ఇది ప్రపంచానికి తీరని ముప్పని ఈ నాటిక హెచ్చరించింది. భాస్కర చంద్ర రచించిన ఈ నాటికకు శశి భాగ్యారావు దర్శకత్వం వహించారు. సాయి ఆర్ట్స్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘నిర్లక్ష్యం ఖరీదు’ బాలల నాటిక ఎయిడ్స్, హెచ్ఐవీ మూలంగా జరిగే అనర్థాలను తెలియజెప్పింది. కె.వెంకటేశ్వరరావు రచించిన ఈ నాటికకు ఎస్కే రసూల్ దర్శకత్వం వహించారు. చింతలపాలెం కోలాట భజన బృందం కళాకారుల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాటకోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం ‘శ్రీకృష్ణ భీమసేనం’ పద్య నాటక ప్రదర్శన, కళారూపాల ప్రదర్శన ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కళాపరిషత్ ఉత్సవాల్లో స్టాల్స్ ఏర్పాటు బుధవారం ప్రారంభమైంది. చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చీరలు నేసేందుకు ఉపయోగించే మగ్గాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. -
అమానుషం.. బాలింత మృతదేహాన్ని వెలివేశారు
సాక్షి, రంగారెడ్డి : మూఢ విశ్వాసంతో ఆ కాలనీవాసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమావాస్యరోజు చనిపోయిందంటూ ఓ బాలింత మృత దేహాన్ని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలి బంధువులు గ్రామ శివారులో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిచించారు. అబ్దుల్లాపుర్మెట్ మండలంలోని తుర్కయాంజల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సాఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మాలతి అనే మహిళ ఈ మధ్యే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఆరోగ్యం క్షీణించటంతో ఆమె చనిపోయింది. అయితే ఆమె అమావాస్య రోజున చనిపోయిందని.. ఊరికి అరిష్టమంటూ మృతదేహాన్ని కాలనీ వాసులు వెలేశారు. దీంతో ఊరి శివారులో టెంట్ వేసి బంధువుల ఆఖరి చూపుల కోసం మృతదేహాన్ని ఉంచారు. చివరకు పొలిమేరలోని చెరువులో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వకుండా చూసుకోవాలని అధికారులు పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
అమావాస్యరోజు చనిపోయిందంటూ.. ఊళ్లోకి రానివ్వకుండా
-
ఐదు కుటుంబాలు సాంఘిక బహిష్కరణ
కల్లూరు: తమనే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కుల పెద్దలు గ్రామంలోని ఐదు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తూ.. పంచాయితీలో తీర్మానం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని శాంతినగర్‌కు చెందిన గుర్రాల సుధీర్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కంటెపూడి సురేష్, వంగూరి ప్రవీణ్‌కుమార్‌ల కుటుంబాలను సాంఘికంగా బహిష్క రించారు. దసరా పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీలు అనంతరం పెద్దల వద్ద ఉన్న డబ్బుల లెక్క చెప్పాలని ఈ ఐదుగురు డిమాండ్ చేశారు. దీంతో స్థానికుల సమక్షంలో లెక్కలు చెప్పారు. ఆ తర్వాత ‘మమ్మల్నే ప్రశ్నించి లెక్కలు అడుగుతారా’ అంటూ పంచాయితీ పెట్టి వారి కుటుంబాలను సాంఘిక బహిష్కణ చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ సంఘటన 28 రోజుల క్రితం జరగగా, కొందరు కుల పెద్దల జోక్యంతో బాధితులు ఇన్నిరోజులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కులపెద్దలు సైతం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశా రు. క్షమాపణలు చెప్పాలని పెద్ద మను షులకు సూచించారు. అయితే పంచా యితీ నిర్వహించి అందరి సమక్షంలోనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. -
సామాజిక మార్పులో కవులే కీలకం
సాక్షి, హైదరాబాద్: సామాజిక మార్పునకు కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలని ఏపీ, తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా అందులో సాహిత్యకారుల పాత్ర ఉంటుందని, ఇందుకు రష్యా, చైనా, వియత్నాం, భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయిధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీలోని చల్లా సోమరాజు, రామ్ ఆడిటోరియంలో విజయవాడ తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సాహితీ విమర్శకుడు సతీశ్‌చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ తాపీ ధర్మారావు మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషంగా కృషి చేశారని, అణగారిన వర్గాలకు బాసటగా నిలిచారని అన్నారు. సతీశ్‌చందర్ ఆధునిక సాహిత్యంలో కవిసామ్రాట్ అని కొనియాడారు. స్పందించే హృదయంతో రాసినందునే ఆయన కవితలు, రచనలు, చీకట్లో వెలుగు కిరణాలయ్యాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సతీశ్‌చందర్ పలు పత్రికల్లో పనిచేసిన అపార అనుభవంతో జర్నలిజం పాఠశాలను పాతికేళ్లుగా నిర్వహిస్తూ అనేకమంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. 25 నుంచి 80 ఏళ్ల వయసున్న వారితో సతీశ్‌కు పరిచయాలున్నాయని, అందువల్ల ఆయన ఆలో చనా ధోరణి విస్తృతంగా ఉందని అన్నారు. ఒక్క సినిమా పాటల్లో తప్ప, మిగిలిన అన్నింట్లోనూ తాపీకి, సతీశ్‌కు సారూప్యం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అలసిపోని రచయిత సతీశ్‌చందర్ అని పేర్కొన్నారు. దళిత దృక్పథాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ప్రభావితం చేశారని అన్నారు. సతీశ్‌చందర్ మాట్లాడుతూ కొత్తపాళీ – పాతపాళీతో రాసినా తాను తాపీగానే రాస్తానని చమత్కరించారు. ఏబీకే ప్రసాద్ నుంచి అధ్యయనం, రామచంద్రమూర్తిని నుంచి వ్యంగ్యాధిక్షేపణ, పతంజలి నుంచి సూటిగా వ్యవహరించటం అలవరచుకొన్నానని చెప్పారు. ఉత్పత్తితో సంబంధంగల భాషే అసలైన తెలుగు భాష అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడివారు తెలంగాణ సాహితీ పౌరసత్వం ఇస్తారో లేదో అనే అనుమానం కల్గుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఏటుకూరి ప్రసాద్, సమావేశకర్త డాక్టర్ సామల రమేశ్‌బాబు, తాపీ ధర్మారావు మనవరాలు విమలా సోహన్, కవులు, రచయితలు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. -
వినియోగదారుల చైతన్యంతోనే... సేంద్రియ పత్తి రైతుకు ఆదాయ భద్రత!
విదేశీ యూనివర్సిటీలో సేంద్రియ సేద్యంపై ఉన్నత చదువు.. పురుగులమందులమ్మే బహుళ జాతి కంపెనీలో లక్షణమైన ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఏసీ కారు.. ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు! ఏటేటా తన జీతం పెరుగుతున్నా తాను అమ్మిన పురుగుమందులు రైతుల జీవితాల్లో నిప్పులు పోస్తుండటం అతన్ని ఆలోచనలో పడేసింది. కేవలం తన ఉద్యోగం తన సంపాదన గురించి మాత్రమే∙ఆలోచించకుండా.. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా చిన్న, సన్నకారు రైతుల జీవితాలకు గౌరవప్రదమైన నికరాదాయం అందించేలా తనకు చేతనైనది చేయాలనే తపన నిత్యం ఆయన మదిని తొలచివేసింది. ఆ తపనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేలా చేసింది. సేంద్రియ రైతుకు ఆదాయ భద్రత లభించాలంటే.. చైతన్యవంతమైన వినియోగదారులు విశ్వసించే పారదర్శక మార్కెటింగ్ గొలుసును నిర్మించడం ఒక్కటే మార్గమని బలంగా నమ్ముతున్నారు. ఆయన పేరు అంబవరం అనిల్‌కుమార్. పుట్టిన ఊరు కడప. విదేశీ కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పందాల మేరకు మన చిన్న, సన్నకారు రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నారు. రాలిన బత్తాయి పిందెల ద్వారా రాయలసీమ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు... సేంద్రియ పత్తి ద్వారా విజయనగరం గిరిజన రైతాంగానికి ఆదాయ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుండటం విశేషం... మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువకుడు అంబవరం అనిల్ కుమార్ నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ(సేంద్రియ వ్యవసాయం) చదివి, ఆరేళ్ల పాటు బహుళజాతి సంస్థల్లో పనిచేశారు. గాలిలో దీపంలా మారిన రైతు జీవితాలను మార్చాలంటే మార్కెటింగ్ వ్యవస్థలో గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. గ్రామీణ వికాస్ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతుల అభ్యున్నతి కోసం అనేక జిల్లాల్లో పనిచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా రైతులు, వినియోగదారుల అనుసంధానం అట్టడుగున పత్తి రైతు బతుకు పచ్చగా ఉండాలంటే.. టీషర్టులు, జీన్స్ వస్త్రాలు కొనుగోలు చేసే దేశ విదేశీ వినియోగదారుల్లో అందుకు సంబంధించిన చైతన్యాన్ని రగిలించాలి. ఇది వినడానికి కష్టతరమని తోచినా అసాధ్యం కాదంటున్నారు అనిల్‌కుమార్. చిన్న, సన్నకారు సేంద్రియ పత్తి రైతులు అనుసరిస్తున్న పర్యావరణ పరిరక్షణ పద్ధతులు, వారి ఆర్థిక అవసరాల గురించి విశ్వసనీయమైన, పారదర్శకమైన అమ్మకపు గొలుసు ద్వారా దేశ విదేశాల్లో చైతన్య సంపన్నులైన వినియోగదారులకు తెలియజెప్పగలిగితే.. మన బడుగు రైతుల జీవితాల్లో అనిశ్చితి చీకట్లను పారదోలి శాశ్వత వెలుగులు నింపవచ్చని అనిల్‌కుమార్ మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. టీషర్టుపై ముద్రించే కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే.. దాన్ని పండించిన రైతు వివరాలు, అనుసరించిన సాగు పద్ధతి వంటి నమ్మకమైన వివరాలు ఒకటిన్నర నిమిషంలో వినియోగదారునికి చప్పున అర్థమయ్యేలా నెదర్లాండ్స్ నిపుణులతో కలిసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తాము చెల్లించే డబ్బు ఆ రైతుకు భద్రంగా చేరుతుందన్న పారదర్శక మార్కెటింగ్ చైన్‌ను నిర్మిస్తే.. అదనంగా డబ్బు చెల్లించడానికి కూడా చైతన్యవంతులైన వినియోగదారులు వెనకాడబోరన్నది ఈ ప్రయత్నం వెనుక ఉన్న భావన. ఉత్తరాంధ్రలో సేంద్రియ పత్తికి శ్రీకారం! అన్విత ఆర్గానిక్ కాటన్ ప్రోగ్రామ్ ద్వారా విజయనగరం జిల్లాలో ఈ ఏడాది 46 మంది గిరిజన రైతులతో 50 ఎకరాల్లో సేంద్రియ పత్తి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. జట్టు ట్రస్ట్ తోడ్పాటుతో కొత్తవలస, దోరజమ్ము, బుడ్డెంకర్జ ప్రాంతాల్లో జన్యుమార్పిడి చేయని హైబ్రిడ్ విత్తనాల ద్వారా సేంద్రియ పత్తిని పండిస్తున్నారు. డచ్ కంపెనీలతో సేంద్రియ పత్తి కొనుగోలు ఒప్పందం చేసుకున్న తర్వాతే రైతులతో సాగు చేయిస్తున్నారు. గతంలో రసాయనిక పద్ధతుల్లో పత్తి సాగు చేసే గిరిజన రైతులతో ఇప్పుడు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. పంట చీడపీడల్లేకుండా చక్కగా ఎదుగుతుండటంతో రైతులు సంతృప్తితో ఉన్నారు. పురుగుమందుల్లో 99 శాతం వృథా.. దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 14 శాతం అయినప్పటికీ 54 శాతం రసాయన పురుగుమందులను చల్లుతున్నారు. ఇందులో 99 శాతం తిరిగి గాలిలో, భూమిలో, నీటిలో కలిసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. రసాయనాల వల్ల ప్రతీ ఏటా పెట్టుబడులు పెరుగుతుండ టంతో పాటు భూసారం తగ్గడం, దిగుబడి లోపించటం వంటి సమస్యలతో గిరిజన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పంచాయతీ బుడ్డెంకర్జ, కొత్తవలస, దోరజమ్ము గ్రామాల్లో ఈ ఏడాది పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తిని సాగు చేయిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులతో ఎకరా పత్తి సాగు చేస్తే రూ. 20 వేల వరకు ఖర్చయ్యేదని, ఖర్చులు పోగా రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఆదాయం వచ్చేదని గిరిజన రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది విత్తనాలు మాత్రమే కొన్నామని, జీవామృతం, కషాయాలను కొద్దిపాటి శ్రమతో తయారు చేసుకుంటున్నామని మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నామని రైతులు అంటున్నారు. –బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం అధిక ధర ఇవ్వడానికి విదేశీ వినియోగదారుల సంసిద్ధత! చిన్న, సన్నకారు రైతుల జీవితాలు మార్కెట్ మాయాజాలం వల్ల గాలిలో దీపాలుగా మారాయి. ఈ మార్కెట్ వ్యవస్థలో రైతు శ్రమకు గుర్తింపు, విలువ లేవు. సప్లై చైన్‌ను పారదర్శకంగా, విశ్వసనీయమైన రీతిలో ఉంచగలిగితే వ్యవస్థాగత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులు పండించే సేంద్రియ పత్తితో తయారైన టీషర్టులు, జీన్స్ వస్త్రాలను అధిక ధర చెల్లించైనా కొనడానికి దేశవిదేశాల్లో చైతన్యవంతమైన వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్గంలో చిన్న రైతుకు ఆదాయ భద్రత కల్పించడమే మా ప్రయత్నం. డచ్ కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ భరోసాతోనే ఇప్పుడు విజయనగరం జిల్లాలో జట్టు ట్రస్టు తోడ్పాటుతో 46 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాం. అమెరికా, ఐరోపా, బెల్జియం కంపెనీలతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. మున్ముందు 50–60 గ్రామాల్లో కనీసం 5 వేల రైతు కుటుంబాలతో సేంద్రియ పత్తి సాగు చేయించాలన్నది మా లక్ష్యం. – అంబవరం అనిల్‌కుమార్ (84890 51484), డైరెక్టర్, గ్రామీణ వికాస కేంద్రం anilwur@gmail.com బత్తాయి పిందెల ద్వారా ఎకరానికి రూ. 30 వేల ఆదాయం! మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న బత్తాయి రైతులకు రాలిన బత్తాయి పిందెల విక్రయం ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాన్ని అనిల్‌కుమార్ అన్వేషించడం విశేషం. బత్తాయి మొక్కలు నాటిన ఐదేళ్లకు కాపుకొస్తాయి. వంద పిందెలు వస్తే కాయలుగా పెరిగేది సుమారు 20% మాత్రమే. సూక్ష్మధాతువుల లోపమో, తెగుళ్లో మరొకటో ఇందుకు కారణమవుతున్నాయి. ఇలా అర్థాంతరంగా రాలిపోతున్న రైతుల ఆశలను కొంతమేరకైనా తీర్చేందుకు అనిల్ కొత్త ఆలోచన చేశారు. ఈ పిందెల్లో హెస్పారిడిన్ అనే ఫ్లావనాయిడ్ ఉంటుంది. అది ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విషయం గ్రహించిన అనిల్‌కుమార్ కడప జిల్లాలో గత మూడేళ్లుగా రైతులు అదనపు ఆదాయం పొందేందుకు దోహదపడ్డారు. సుమారు 40 మంది రైతుల నుంచి పది మెట్రిక్ టన్నుల రాలిన పిందెలు సేకరించారు. జి.వి.కె. కంపెనీ, ఐరోపాకు చెందిన ఫార్మాæ కంపెనీలకు విక్రయించారు. ఎకరానికి సగటున కనీసం రూ. 30 వేల వరకు రాలిన పిందెల ద్వారా బత్తాయి రైతులకు ఆదాయం లభిస్తోందని అనిల్‌కుమార్ చెప్పారు. సేంద్రియ ఎరువులు, కషాయాలను మేమే తయారుచేసుకుంటున్నాం.. ఘన జీవామృతం, జీవామృతం, నీమాస్త్రం వంటి వాటిని సొంతంగానే తయారు చేసుకుంటున్నాం. ఖర్చు లేదు. గతంలో రసాయన ఎరువులు కొనేందుకు ఎకరాకు సుమారు రూ. 20 వేలు ఖర్చయ్యేది. సొంతంగానే పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యం పాడయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు. – గుమ్మడి కృష్ణారావు, గిరిజన పత్తి రైతు,బుడ్డెంకర్జ, విజయనగరం జిల్లా అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం సేంద్రియ ఎరువు తయారు చేసుకొని వాడటం వల్ల ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. గతంలో రసాయన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి పెరగటంతో పాటు మద్దతు ధర లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. కుటుంబ పోషణ కష్టమయ్యేది. సేంద్రియ పద్ధతి వల్ల అధిక ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి కూడా అధికంగానే వస్తుందనుకుంటున్నాం. – కొండగొర్రి గణపతి, గిరిజన పత్తి రైతు,కొత్తవలస, విజయనగరం జిల్లా -
ఈ రోబో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంది!
మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్తరకం రోబోను తయారుచేశారు. సామాజిక అవగాహన వ్యవస్థ (సోషల్ అవేర్నెస్ నావిగేషన్)తో కూడిన ఈ రోబో.. ఎంతటి రద్దీ ప్రాంతంలోనైనా ఎవరినీ ఢీకొట్టకుండా సాగిపోతుందట. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. వాహనం నడిపే డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎలా పరిశీలిస్తూ ముందుకు సాగుతాడో ఈ రోబో కూడా అచ్చంగా అలాగే పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోతుందట. బోస్టన్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రోడ్డుకు కుడివైపునే ప్రయాణించడం, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం, వాహనానికి, వాహనానికి మధ్య ఉండాల్సిన గ్యాప్‌ను కొనసాగించడం, ఎరుపు, ఆకుపచ్చ సిగ్నల్స్ పడినప్పుడు ఆగడం, ముందుకు కదలడం వంటి నియమాలను కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. పరిస్థితులను అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే ఇటువంటి రోబోల రూపకల్పనతో భవిష్యత్తులో మరెన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
భేషైన చట్టం
కుల వివక్ష, నిమ్న వర్గాలపై ఆధిపత్య కులాల ఆగడాలకు సంబంధించిన వార్తలు తరచు కనబడుతున్న దేశంలో సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా తొలిసారి చట్టం వచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఈ విషయంలో చొరవ తీసు కున్నది కులపరమైన ఆగడాలు, పెత్తందారీ పోకడలు విస్తృతంగా కనబడే ఉత్తరాది రాష్ట్రాల్లో కాదు. జాతీయ స్థాయిలోనూ కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ దురాచారానికి వ్యతిరేకంగా చట్టం చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. గోపాల్ హరి దేశ్‌ముఖ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహూ మహరాజ్, విఠల్ రాంజీ షిండే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్లు పుట్టిన మహారాష్ట్ర అనేక సంఘ సంస్కరణోద్యమాలకు వేదికగా నిలిచింది. కులాధిక్య భావన లనూ, అంటరానితనాన్ని, సంప్రదాయం ముసుగులో కొనసాగే అరాచకాన్ని రూపుమా పడం కోసం వీరితోపాటు మరెందరో కృషి చేశారు. కానీ సమాజం నుంచి ఆ దురాచారాలు విరగడ కాలేదు. సరిగదా ఈ పోకడలు నిమ్నకులాల్లో కూడా విస్త రించాయి. నాలుగేళ్లక్రితం మహారాష్ట్రలో షెడ్యూల్ కులానికి చెందిన యువకుడు దీపక్ కాంబ్లేను ప్రేమించి పెళ్లాడి కుటుంబం పరువు తీసిందని ఆగ్రహించి 22 ఏళ్ల ప్రమీలా కుంభార్కర్ అనే యువతిని ఆమె తండ్రే హత మార్చాడు. వారిది సంచారజాతి. పెళ్లి కారణంగా జాతినుంచి తమ కుటుంబాన్ని వెలేయడం అతని ఆగ్రహానికి మూలం. ఆ ఉదంతం మహారాష్ట్రను ఓ కుదుపు కుదిపింది. ఇలాంటి వివక్షపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హేతువాద ఉద్యమ కారుడు నరేంద్ర దభోల్కర్ తన హత్యకు కొద్ది నెలల ముందు ఉద్యమం నిర్మిం చిన పర్యవసానంగా ఈ చట్టం వచ్చింది. మహారాష్ట్రలో సాంఘిక బహిష్కరణ జాడ్యం కులాంతర వివాహాలు ఎక్కువగా చోటుచేసుకునే రాయగఢ్, రత్నగిరి, నాసిక్ జిల్లాల్లో ఉంది. వీటికి వ్యతిరేకంగా కేసులు పెట్టినప్పుడు చట్టాల్లోని లొసు గులను ఆసరా చేసుకుని దోషులు సులభంగా తప్పించుకుంటున్నారు. దాదాపు ప్రతి కులంలోనూ కుల పెద్దలుగా చలామణి అవుతున్నవారు జాతి పంచాయ త్లు ఏర్పాటుచేసి ఇలాంటివి అమలు చేస్తున్నారు. అమలులో ఉన్న చట్టాలు, చేయాల్సిన చట్టాలు సమాజ స్థితిగతులకు అద్దం పడతాయి. పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాల హరణకు బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఎంత అవమానకరమో... అట్టడుగు వర్గాల మనుగడకూ, వారి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ ముప్పుగా పరిణ మించిన దురాచారాల అంతానికి చట్టాలు లేకపోవడం కూడా అంతే అవమా నకరం. షెడ్యూల్ కులాలు, తెగలవారిపై భిన్న రూపాల్లో అమలవుతున్న వివ క్షలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడానికే దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టింది. ఆ చట్ట నిబంధనలను నోటిఫై చేయడానికి మరో ఆరేళ్లు పట్టింది. నిజా నికి మన రాజ్యాంగంలోని 15వ అధికరణ పౌరులపై కులం, జాతి పేరిట వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తోంది. అంటరానితనాన్ని 17వ అధికరణ నిషేధిస్తున్నది. కానీ ఈ అధికరణలకు అనుగుణంగా చట్టం తీసుకురావడానికి ఇంత సుదీర్ఘ కాలం పట్టింది. చట్టాలు తీసుకురావడం ఒక ఎత్తయితే వాటి అమలు మరో సమస్య. చట్టం అమలుకు పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, వివక్షకు సంబంధించిన కేసులు ఎక్కడ వెల్లడైనా సత్వరం స్పందించి కఠినంగా వ్యవహరించడం లాంటివి చేయకపోతే ఆ చట్టాలంటే సమాజంలో భయభక్తులు ఏర్పడవు. ఆంధ్రప్రదేశ్‌లోని గరగపర్రులో దళిత కులాలకు చెందినవారు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడాన్ని సహించలేని ఆధిపత్య కులాలు ఇతర కులాలను సమీకరించి వారిపై సాంఘిక బహిష్కరణకు పూను కోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ బహిష్కరణ కారణంగా దళిత కులాల పౌరులు రెండు నెలలకుపైగా ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నా, ఆ గ్రామంలో జరుగుతున్న వివక్ష గురించి జిల్లా యంత్రాం గానికి తెలిసినా చర్యలు తీసుకోవడంలో తీరని జాప్యం జరిగింది. సుదీర్ఘ ఉద్య మం తర్వాత మాత్రమే ఆ గ్రామ దళితులకు ఉపశమనం లభించింది. మహారాష్ట్ర తెచ్చిన కొత్త చట్టం సాంఘిక బహిష్కరణకు ఇచ్చిన నిర్వచనం విస్తృతమైనది. ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను సామాజిక, మత, కులపరమైన ఉత్సవాల్లో, సభల్లో, సమావేశాల్లో పాల్గొనకుండా నిరోధించినా... వారి స్వేచ్ఛకు అడ్డుతగిలినా అందుకు కారకులైనవారిపై చర్య తీసుకోవాలని నిర్దేశిస్తున్నది. నైతి కత, లైంగికత, రాజకీయ అభిప్రాయాలు వగైరాల పేరిట సంఘ బహిష్కరణకు పాల్పడినా... ఆ కుటుంబాలకు స్మశానాలు, కమ్యూనిటీ హాళ్లు, విద్యాసంస్థలు వగైరాల్లో అనుమతి నిరాకరించినా, వారి పిల్లలను క్రీడాస్థలాల్లోకి రాకుండా అడ్డు కున్నా అది సాంఘిక బహిష్కరణగా పరిగణించాలని చెబుతోంది. ఈ కేసుల్లో నేరం రుజువైనవారికి మూడేళ్ల వరకూ జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరి మానా లేదా రెండూ విధిస్తారు. చార్జిషీటు దాఖలు చేసిన ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని చట్టం చెబుతోంది. అయితే నిందితులకు సులభంగా బెయిల్ లభించేవిధంగా నిబంధనలుండటం ఈ చట్టంలోని ప్రధాన లోపం. బాధితులకు సాంఘిక బహిష్కరణ తెచ్చిపెట్టే సమస్యలు సామాన్యమైనవి కాదు. ఉన్నచోట పనులు దొరకవు. వారితో ఎవరూ సంబంధబాంధవ్యాలు పెట్టుకోరు. దుకా ణాల్లో వారికి నిత్యావసర సరుకులు అమ్మరు. కనీసం మంచినీళ్లు కూడా పుట్టవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉన్న ఊరు వదలకతప్పదు. నిందితులకు ఎంతో పట్టు ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు. అలాంటివారికి సులభంగా బెయిల్ వచ్చే ట్టయితే అది వారి మనోస్థైర్యాన్ని పెంచుతుంది. కనుక బెయిల్‌కు సంబంధించి కఠిన నిబంధనలుండటం శ్రేయస్కరం. ఏదేమైనా మహారాష్ట్రను ఆదర్శంగా తీసు కుని కుల పంచాయతీల పట్టు ఎక్కువుండే హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు సైతం ఈ తరహా చట్టం తీసుకురావాలి. జాతీయ స్థాయిలో ఈ మాదిరి చట్టం వస్తే అది మరింత మంచిది. -
సివిక్ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా?
సెల్ఫ్ చెక్ మనదేశంలో సివిక్సెన్స్ పట్ల ధ్యాస చాలా తక్కువే. రకరకాల సామాజికనేపథ్యాలే దీనికి కారణం కావచ్చు. ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చినా నాగరక ప్రపంచంలో కనీస సామాజిక జ్ఞానం లేకుండా వ్యవహరించరాదు. 1. సివిక్ సెన్స్‌ను పాటించడం అంటే సమాజంలో వ్యక్తిగా పాటించాల్సిన విలువలను గౌరవించడమే... అని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 2. రోడ్ల మీద ఉమ్మడం వంటి సామాజిక జ్ఞానం లేని ప్రవర్తనతో మీకు కలిగిన అసౌకర్యాన్ని మీరు ఇతరులకి కలిగించకూడదని భావిస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను చాలా సాధారణంగా మీది కాని ఏ ప్రదేశంలోనైనా పడేయడానికి వెనుకాడరు. ఎ. కాదు బి. అవును 4. పార్కుల వంటి పబ్లిక్ ప్రదేశాలను ఎంట్రీ టికెట్ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా వాడవచ్చు అనుకోకుండా నియమాలను పాటిస్తారు. ఎ. అవును బి. కాదు 5. మీరు ఉద్దేశపూరకంగా సామాజిక స్పృహను ఉల్లంఘించనప్పటికీ పొరపాటున మీ కారణంగా మరొకరు అసౌకర్యానికి గురయినట్లు గమనిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వాడేసిన బ్యాండేజ్‌లు, స్వైన్ ఫ్లూ నిరోధక మాస్కుల వంటి వాటిని యథేచ్ఛగా పారేయడం ద్వారా అవి ఇతరులను అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి నియమిత పద్ధతిలోనే వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. సివిక్ సెన్స్‌తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. తమతోపాటు, సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిల్లలకు చెబుతారు. అలాగే తోటి పిల్లల సామాజిక నేపథ్యాన్ని విమర్శించడం తప్పని కూడా చెబుతుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సామాజిక జ్ఞానంతో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మీరు సామాజికంగా మీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనుకోవాలి. సమాజంలో పౌరులుగా సామాజిక విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి. -
సంఘ బహిష్కరణకు శిక్షేది?
ఆలోచనం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్.ఆర్. శంకరన్ ఎవరికయినా తలవంచారా? గరగపర్రు గ్రామంలో చెరువొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం నిలబెట్టడం కోసం దళితులు సంఘ బహిష్కరణకు గురికావడం నాకు అనేక జ్ఞాపకాలను తెచ్చింది. అందులో మొదటిది 1927వ సంవత్సరంలో అంబేడ్కర్ మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం ఉద్యమించడం. దానిని వ్యతిరేకించిన సవర్ణులు ‘ఆవు పేడ’తో ఆ చెరువును శుద్ధి చేసుకోవడం. ఇది జరిగి ఇప్పటికి 90 ఏళ్లు. ‘నేను భంగీని’ రచయిత భగవాన్ దాస్ 1957లో, ‘హిందూ మతం మనిషి గుణాన్ని, యోగ్యతల్ని పట్టించుకోకుండా మనిషి పుట్టుకకు ప్రాధాన్యతనిస్తోంది. సమానత్వం, ఐక్యతలను వ్యతిరేకిస్తుంది’ అని రాసి ఇప్పటికి 60 ఏళ్లు. విజయనగరం జిల్లా ‘వసి’ గ్రామంలో దళితులను ఇలాగే ఊరి నుంచి వెలివేసినపుడు, 1999లో బాలగోపాల్ ప్రభుత్వ పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ‘సంఘ బహిష్కరణకు శిక్ష మాటేమి టి’? అనే వ్యాసం రాశారు. ఇది జరిగి నేటికి 18 ఏళ్లు. మనిషి మరో మనిషిపై పుట్టుకతోనే ఆధిపత్య సౌకర్యాన్ని పొందడానికి విశ్వవ్యాప్తంగా మతం కృషి చేయడం, ప్రయాణ సాధనాలు సరిగా లేని ఆ కాలం లోనే ప్రపంచమంతా కూడబలుక్కున్నట్లు ఈ అంతరాల మానవ సమాజాన్ని నిర్మించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని వదిలేసి, సామాజిక మాధ్యమాల్లో కొంత మంది, దళిత రాజకీయ నేతల చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, రాంసే మెక్డొనాల్డ్లు ప్రతిపాదించిన దళిత ప్రత్యేక నియోజక వర్గాల ఆలోచనను వ్యతిరేకించిన గాంధీ ‘ఇలా చేస్తే హిందూ సమాజం ముక్కచెక్కలై పోగలదని’, తిండీ నీళ్లు మానేసి ‘పూనా ఒప్పందం’ చేసుకున్నాడు. అలా దళిత నేతల రాజకీయ ప్రాణాలని, వారి నియోజకవర్గాలలోని సవర్ణ ఓటర్ల చేతిలో పెట్టాడు. సమాజాభివృద్ధికంటే కులమూ, మతమూ ప్రధానాంశాలుగా భావిస్తూ ఓట్లేసే ప్రజలున్న చోట, అసలు రాజకీయమే ఒక జూదం. ఈ జూదంలో, మనుగడకోసం ప్రతి రాజకీయ నేత ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే, కానీ గరగపర్రులో అధికారుల తీరు మాటేమిటీ? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 (యూ), 3 (జెడ్íసీ)ల ప్రకారం సంఘ బహిష్కరణ చేసిన వారికి 6 నెలల నుంచి ఐదేళ్లదాకా శిక్ష విధిం చొచ్చు. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో సీఎం నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేయాలి. ప్రతినెలా జిల్లా కమిటీ రిపోర్ట్ రాష్ట్రానికి పంపాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకి ఒకసారి కచ్చితంగా జరగాలి. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌ని ఈ చట్టం అమలుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి. వీటన్నిటినీ పాటిస్తూ గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? హేమాహేమీలయిన రాజకీయ నాయకులు అడ్డు నిల్చినా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్, ఎస్.ఆర్. శంకరన్, ఎవరికయినా తలవంచారా? మరి గరగపర్రు విషయంలో ఆ జిల్లా కలెక్టర్ ఎందుకలా స్పందించలేకపోయారు? రెండ్రోజుల క్రితం ‘ది టెలిగ్రాఫ్’లో ఒక వార్త. బ్రిటన్‌లో పుట్టిపెరిగిన సందీప్, రీనా అనే హిందూ జంట సంతానలేమితో అక్కడే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనుకున్నారట. దత్తతనిచ్చే స్థానిక సెంటర్‌ని సంప్రదిస్తే, వారు వర్ణవివక్షను మొహమాటం లేకుండా ప్రదర్శిస్తూ, తమ దగ్గర అందరూ తెల్ల పిల్లలే వున్నారని, ఇండియన్స్ తెల్లబిడ్డని దత్తత తీసుకోవడానికి అనర్హులు అని, దరఖాస్తు చేసుకోవడం కూడా అనవసరం అన్నారట. గరగపర్రు దళితులను బహిష్కరించిన సందర్భంలో వచ్చిన ఈ వార్త నాకో ఆలోచన కలిగించింది. ఒక వేళ ప్రపంచమంతా ఒక్కటైపోతే, ఇప్పుడు గరగపర్రు దళి తులపై అత్యాచారం చేసిన బలరామకృష్ణమరాజు, రామరాజు, విషయం తెలిసినా ఊరకున్న సీఎం చంద్రబాబుల పెద్ద కులాల మాటేమిటి? ‘వి హావ్ ఆల్వేస్ ఫెల్ట్ బ్రిటిష్’ అని తెల్లబిడ్డ దత్తత కోరుకున్న ఆ దంపతుల్లాగే మన సవర్ణులూ, మాది చాలా గొప్పకులం అన్నా, అప్పుడు గాంధీకి దక్షిణాఫ్రికాలో జరిగిన అవమానమే వీళ్లకీ జరుగుతుంది కదా. ఎంత కాదన్నా రూపంలో, సంపత్తిలో చాలా దేశాల ప్రజలు మనకంటే చాలా సవర్ణులు కదా మరి. ఆ మధ్య సీఎం తాను, వెంకయ్య ఇద్దరం అమెరికాలో పుట్టివుంటే బాగుండేదని అన్నారు. ఆ అమెరికా స్వాతంత్య్ర దినం ఈ రోజు. వారి యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రెండో పేరా ‘మనుషులం దరూ సమానులుగానే పుట్టారు అనడానికి ఈ వాస్తవాలను ససాక్ష్యంగా ఎత్తిపెట్టాం’ అని మొదలవుతుంది, ఆ స్ఫూర్తితో ‘‘బానిసత్వానికి అనుకూలంగా ఎవరైనా వాదిస్తుండటాన్ని నేను విన్నవ్పుడల్లా, అలా వాదించేవారిపై వ్యక్తిగతంగా ఆ బానిసత్వాన్ని అమలు చేసి చూడాలనే బలమైన భావన నాకు కలుగుతుంది’’ అని ప్రకటించి, బానిసత్వ నిర్మూలన వ్యతిరేకులకు ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు అబ్రహాం లింకన్. సీఎం చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుని, దళితుల సంఘ బహిష్కరణ పట్ల నిజాయితీగా స్పందిస్తే, అప్పుడు ఆయన అమెరికాలో పుట్టాల్సినవాడినంటే మనం కాదంటామా, కావాలంటే అబ్రహాం లింకన్ అంతటివాడివని కూడా అంటాం. - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
హృదయాలను గెలిచిన జననేత
- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి - గరగపర్రు పర్యటనలో జగన్ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు - ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు - సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం - ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు. జగన్ హిత వచనాలపై హర్షం ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. ఇరు వర్గాలతో మమేకం గరగపర్రు దళితవాడలో జగన్ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అడుగడుగునా బ్రహ్మరథం గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రులో మీడియాతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది. ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్ జగన్
ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన -
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు. ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు. -
ఇదెలా కనిపెడుతోందబ్బా!
లండన్: మీరో కంటెయినర్లో ఏదో ఆహారపదార్థం పెట్టి గదిలో ఏ మూలనో పెట్టేస్తే.. మీ పెంపుడు కుక్క దాన్ని కచ్చితంగా గుర్తు పట్టేస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా? అయితే కుక్కలకు ఆ శక్తి ఉందని, అవి మనిషి దృక్పథాన్ని, సంకేతాలను విశ్లేషించి ఆహారపదార్థాలు దాచిన ప్రదేశాలను కచ్చితంగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. మనిషి నిల్చునే స్థానం, వారి కదలికలు, చూపును విశ్లేషించి కుక్కలు ఒక అంచనాకు వస్తాయని పరిశోధకులు తేల్చారు. మానసికశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన మానసిక స్థితిని, భావోద్వేగాలను, ఉద్దేశాలను, విజ్ఞానాన్ని ఎదుటి వ్యక్తి అంచనా వేయగలడని, ఈ సామర్థ్యం మనిషి జీవితంలోని తొలి నాలుగైదు సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందుతుందని, జంతువుల్లో ఇది ఉండదని ఆస్ట్రేలియాలోని మెస్సర్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. మనిషి ముఖ కవళికలను పరిశీలించి కుక్కలు ఒక అంచనాకు వస్తాయనే విషయాన్ని నిరూపించేందుకు పరిశోధకులు ఇద్దరు వ్యక్తులతో ఒక ప్రయోగాన్ని చేశారు. ఒక గదిలో ఉన్న కంటెయినర్లలో ఒక వ్యక్తి ఆహారాన్ని ఉంచుతాడు. ఆ విషయం వేరొక వ్యక్తికి తెలియకుండా అతన్ని దూరంగా ఉంచుతారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులతో పాటు కుక్కను ఆగదిలోకి తీసుకొస్తే.. ఇద్దరు వ్యక్తులూ రెండు వేర్వేరు కంటెయినర్లను చూపిస్తారు. కాని కుక్క మాత్రం 70 శాతం సందర్భాల్లో ఎవరైతే ఆహారాన్ని పెట్టారో ఆ వ్యక్తి చూపించిన కంటెయినర్ దగ్గరికే వెళ్లింది. ఆహారం పెట్టిన కంటెయినర్ గురించి కుక్కకు ఏమాత్రం తెలియనప్పటికీ ఆ వ్యక్తి ముఖ కవళికల ఆధారంగా అది కచ్చితమైన అంచనాకు రాగలిగింది. -
ఆస్ట్రేలియా కెప్టెన్ పై జోకులు
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1తో గెల్చుకుంది. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని భారత్ కైవశం చేసుకుంది. ఆసీస్ ఓటమిపై నెటిజన్లు ట్విటర్ లో జోకులు పేల్చారు. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా, ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఫొటోలకు సరదా కామెంట్లు పెట్టారు. తమదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయిన విరాట్ కోహ్లి, చివరి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేపై సరదా వ్యాఖ్యలు చేశారు. రహానే వరుసగా సిక్సర్లు కొట్టడంపై స్పందిస్తూ.. మీనాకుమారిని బికినీలో చూసినట్టుగా ఉందని నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు. 'రాహుల్ మ్యాచ్ గెలిచాడు. పార్టీ అతడి కోసం ఎదురు చూస్తోంది. మీరు అనుకున్నట్టు ఇది రాజకీయ పార్టీ కాదు. ఇది క్రికెట్' అంటూ మరొకరు ట్వీటారు. 'భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బాగా ఆడాయి. ఇప్పుడు పోటీపడడం ఆపండి. అందరూ కలిపోండి. మీకు మీరుగా జట్లుగా విడిపోండి. ఐపీఎల్ ఆడండి' అంటూ ఇంకొరు ట్వీట్ చేశారు. దలైలామాను స్మిత్ కలిసిన ఫొటోలు పోస్ట్ చేసి జోకులేశారు. 'ఇండియాకు మళ్లీ రాకు' అని కామెంట్ చేసి.. స్మిత్ ను దలైలామా గడ్డం పట్టుకుని మాట్లాడుతున్న ఫొటో పెట్టారు. స్మిత్: మీరు అన్ని విషయాలు తెలిసిన వారు. నాకు సరైన దారి చూపించండి దలైలామా: ఇది ఎయిర్ పోర్టుకు వెళ్లే దారి. అదే మీకు సరైంది. దలైలామా: నీకెప్పుడైనా సందేహం కలిగితే ఎటువైపు చూస్తావు? స్మిత్: డ్రెస్సింగ్ రూము వైపు చూస్తాను దలైలామా: దేవుడా... -
జీజీ నడ్కుడలో సాంఘిక బహిష్కరణ
సమాచార హక్కు చట్టం ఉపయోగించినందుకు.. నందిపేట(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం జీజీ నడ్కుడలో రాజుగౌడ్ అనే గీత కార్మికుడి కుటుంబాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేశారు. గ్రామంలో 8 నెలల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో గృహావసర, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో తెలపాలంటూ రాజు సమాచార హక్కు చట్టం కింద విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులు గ్రామాభివృద్ధి కమిటీకి తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌కోకు దరఖాస్తు చేసుకోవడంపై ఆగ్రహం చెందిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రూ. 60 వేల జరిమానా చెల్లించాలని, లేకపోతే గ్రామం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. విద్యుత్ శాఖతో గ్రామానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోతే డబ్బులు తిరిగి ఇవ్వడా నికి అంగీకరించారు. దీంతో రాజుగౌడ్ జరిమానా చెల్లిం చాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఎన్నికైన గ్రామాభివృద్ధి నూతన కమిటీ సభ్యులను రాజుగౌడ్ కోరగా వారు తిరస్కరించారు. దీంతో అతడు పోలీసు లను ఆశ్రయించాడు. ఆగ్రహించిన గ్రామాభివృద్ధి కమి టీ సభ్యులు ఐదు రోజుల క్రితం రాజుగౌడ్ కుటుంబానికి మరోసారి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. అతడి కుటుంబంతో మాట్లాడితే రూ. 3 వేల జరిమానా విధి స్తామని గ్రామస్తులను హెచ్చరించారు. -
మద్దతు కోసం సామాజిక పోరు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక వైపు ఎమ్మెల్యేలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే సోషల్ మీడియా ప్రచారంతో పన్నీరుసెల్వం పెద్ద ఎత్తున ప్రజల మద్దతు సంపాదించారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, మెయిల్ ఇలా ఏ సామాజిక ప్రచార సాధనాన్ని వదలకుండా ఐదు రోజులుగా శశికళకు వ్యతిరేకంగా పన్నీరు ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారం గురించి ఇన్ని రోజులు పట్టించుకోని చిన్నమ్మ శిబిరం ప్రజల మద్దతు కూడగట్టడంలో తాము వెనుకబడ్డామని గుర్తించింది. ఆదివారం శశికళ తన నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. పన్నీరుసెల్వం డీఎంకేతో కలసి పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారనీ, ప్రజాస్యామ్యాన్ని చెరబట్టారని పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి రాజ్ సత్యన్‌తో శశికళ చర్చించారు. ఒకే రోజులో లక్షల మందికి తమ వాదన వెళ్లేందుకు ఏం చేయాలని కోరారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని, పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రానికి పార్టీ ఐటీ విభాగం సభ్యులతోపాటు కంప్యూటర్ సెంటర్లకు చెందిన ఐదు వేల మందితో 760 బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం నుంచి చిన్నమ్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. దీంతో పాటు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు విస్తృతంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పన్నీరుపై ఎదురు దాడి చేయాలని శశికళ పురమాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలోనూ తమకు మద్దతుగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయడం, వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం హోరెత్తించేందుకు చిన్నమ్మ రంగంలోకి దిగారు. సోమవారం పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మీదకు వచ్చి ప్రజలను కలసి వారితో కరచాలనం చేసి జనంలోకి వెళ్లేందుకు తొలి అడుగు వేశారు. పోయెస్ గార్డెన్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించడం ద్వారా తనకు కూడా జనంలో మద్దతు ఉందని చూపించే ప్రయత్నం చేశారు. ఆమెను చిన్నమ్మ అనొద్దు: పన్నీరు వర్గం తమ వర్గంలోని నాయకులు, కార్యకర్తలెవరూ శశికళను చిన్నమ్మ అని సంబోధించరాదని పన్నీరు వర్గం ఆదేశించింది. చిన్నమ్మ అనడం ద్వారా ఆమె జయలలిత (అమ్మ)కు ప్రతినిధి అనే అభిప్రాయం తామే కల్పించిన వారవుతామని ఆ వర్గం అభిప్రాయ పడింది. అమ్మ సమాధి సాక్షిగా తిరుగుబాటు చేసిన సమయంలో శశికళను ఉద్దేశించి చిన్నమ్మ అని సంబోధించిన పన్నీరుసెల్వం సైతం శనివారం నుంచి ఆమెను శశికళ అనే సంబోధిస్తున్నారు. శశికళ వర్గం నుంచి పన్నీరు వైపు చేరిన ఎంపీలు, ముఖ్య నేతలు సైతం తమ ప్రసంగాల్లో శశికళ అనే మాట్లాడారు. ఈ విషయాన్ని కూడా పన్నీరు శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చిన్నమ్మ నివాసం ఉంటున్న జయలలిత ఇళ్లు వేద నిలయంను స్మారక మందిరంగా మార్చే డిమాండ్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టడానికి కూడా పన్నీరు వర్గం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటోంది. అలాగే పన్నీరుకు మీ మద్దతు ఇవ్వండి అనే నినాదంతో ప్రారంభించిన మిస్డ్ కాల్ ఉద్యమానికి 48 గంటల్లో 38 లక్షల మంది మద్దతు ప్రకటించారని అన్నా డీఎంకే ఐటీ విభాగం మాజీ కార్యదర్శి కె.స్వామినాథన్ వెల్లడించారు. ‘ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. ఓటేసిన ప్రజలను అడగండి. మీరెటు వైపు పోవాలి’ అని 2 నిమిషాల నిడివితో ఒక పాట రూపొందించి ఎమ్మెల్యేలతోపాటు, ప్రజలకు పోస్టింగ్‌లు పెట్టారు. రాజకీయ పోరాటం ఎలా ఉన్నా తనకు ప్రజలే ముఖ్యమని చెప్పే విధంగా ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం సోమవారం సచివాలయానికి వెళ్లి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. తన నివాసం వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను ఆయన కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. -
సామాజిక న్యాయం తుంగలో..
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాచర్లః ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ప్రజా చైతన్య యాత్ర జిల్లా కన్వీనర్ జంగాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పార్టీ ఏరియా కార్యదర్శి బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాలు అభివృద్ధి చెందే విధంగా పాలక వర్గాలు పరిపాలన చేస్తున్నాయని విమర్శించారు. ఉత్పత్తి కులాలు తమ జీవితాలను యంత్రాలకు ధారపోస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పాటుపడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ పాలన చూస్తే శవాలపై చిల్లర ఎత్తుకున్నట్లు ఉందని వైఎస్సార్ సీపీ గిరిజన విభాగ ప్రధాన కార్యదర్శి హనుమంతూనాయక్ విమర్శించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జెట్టిపాలెం వెంకటేష్, బీసీ సంక్షేమ సం«ఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల నాగేశ్వరరావుయాదవ్, నియోజక వర్గ యాదవ్ మహాసభ నాయకుడు ముళ్ల శ్రీనివాస్‌యాదవ్, బార్ అసోసియేషన్ నాయకులు జి.వెంకటేశ్వర్లుయాదవ్, జిల్లా సీపీఐ సభ్యులు గురజాల హుస్సేన్, బండారు శ్రీనివాసరావు, అబ్రహాంలింకన్, మాచర్ల రూబేన్, టి.బాబు, వెంకటేశ్వర్లు, షేక్ షైదా, బాబురావు, నాగేంద్రం బాషా, గాజుల చెన్నయ్య, మందాసంతోష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా సామాజిక వర్గాల సంఘ నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సంఘమిత్ర కథానాయకులు ఖరారు
సంఘమిత్ర చిత్రానికి కథానాయకులు ఎట్టకేలకు ఖరారయ్యారు. దర్శకుడు సుందర్.సీ ఒక గొప్ప సృష్టికి నూతన సంవత్సరం ప్రారంభంలో శ్రీకారం చుడుతున్నారు. ఆయన సంఘమిత్ర పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 100వ చిత్రంగా నమోదు కానున్న చిత్రం సంఘమిత్ర. కాగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో సోషల్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఇందులో కథానాయకులుగా నటించేందుకు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ ప్రయత్నించారు. అందులో ఇళయదళపతి విజయ్, సూర్య, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కథ నచ్చినా ఈ భారీ చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవ్వడంతో ఆ స్టార్ నటులు అన్ని కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కావడంతో నటించేందుకు ముందుకు రాలేకపోయారు. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఎంపికయ్యారని సమాచారం. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం, సాబుశిరిల్ కళాదర్శకత్వం, కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచయిత ప్రభంజన్, దర్శకుడు బద్రిలతో కలిసి సుందర్.సీ కథను తయారు చేశారు. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
భర్త ఇచ్చిన కానుక
లీగల్ స్టోరీస్ కానుకలు సంతోషాన్నిస్తాయి. కాని ఆ కానుక భార్యే అయితే..? గిఫ్ట్ర్యాప్ ఉల్లిపొర చీర అయితే? ఆ సంతోషం ఇంకోవరికో ఇస్తే? భార్యను పణంగా పెట్టిన ధర్మరాజు గురించి చదివాం... నడివీథిలో భార్యను అమ్మిన సత్య హరిశ్చంద్రుడి గురించి విన్నాం... వెగటనిపిస్తోంది.. వేదన కలుగుతోంది..అసహ్యం పుడుతోంది! ఈ కథ రాయాలన్నా.. చదవాలన్నా..అలాగే అనిపిస్తోంది.. కానీ తప్పదు! మన సమాజంలో ఇలాంటి భర్తలూ కొందరున్నారు... భార్యను కానుకగా ఇస్తున్నారు! దీన్ని నిలువరించడానికి బలమైన సెక్షన్లున్నాయి.. అంతకన్నా బలమైన సమాజం ఉంది!! ‘సుజాతా! మా బాస్ వాళ్ల ఫ్యామిలీ ఇంకా ఇక్కడికి షిఫ్ట్ కాలేదు కదా.. పాపం భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేపు ఎలాగూ సండే... అందుకే లంచ్‌కి ఇన్వైట్ చేశాను’ చెప్పాడు భార్యతో ఆనంద్. చిర్రెత్తుకొచ్చింది సుజాతకు ఆ మాట వినగానే. అయినా తమాయించుకుంది. ‘బోలెడన్ని హోటల్స్ ఉన్నాయి. వెళ్లి తినడం నచ్చకపోతే పార్సిల్ తెచ్చివ్వడానికి అటెండర్స్ ఉన్నారు’ అంది... బాస్ తమ ఇంటికి భోజనానికి రావడం తనకు ఇష్టం లేదనే భావన వినిపించేట్టుగా! ‘సుజాతా! ఆయన మా బాస్. అతనితో చాలా పనులుంటాయి’ అన్నాడు తన నిర్ణయానికి తిరుగుండదు అనే అర్థం వచ్చేలా! నిస్సహాయత మౌనాన్ని మిగిల్చింది సుజాతకు. ఫ్రిజ్‌లోంచి కూరగాయలు తీసి తరగసాగింది. మెదడు ఖాళీ లేకుండా ఆలోచనలు ముసురుకున్నాయి. ఈ మధ్య తన భర్త ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. తను పేదింటి పిల్ల. తండ్రి లేడు. డబ్బు లేకపోయినా గుణం ఉంది, అందం ఉంది అని ఆనంద్ వాళ్ల మేనత్త ఈ సంబంధాన్ని కుదిర్చింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయి కావడంతో తన వాళ్లూ కాదనలేదు. కానుకలు తప్ప కట్నం అడగలేదు కాబట్టి వద్దు అనడానికి ఏ కారణమూ కనిపించలేదు. అందుకే మూడుముళ్లూ పడ్డాయి ఏడేళ్ల కిందట. పెళ్లయిన ఏడాదికే భర్త నైజం పూర్తిగా అర్థమైంది. విపరీతమైన ఆశ... డబ్బు సంపాదించాలని. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, ఇంకోవైపు వ్యాపారం చేయాలనే ఆరాటం. దానికోసం అందిన చోటల్లా అప్పులు చేశాడు. ఇప్పుడు తన పనికి ‘ఎప్పుడో ప్రమోషన్ రావాలి.. ఇంకా రాలేదు.. ఎలాగైనా రాబట్టుకోవాలి’ అని ప్రయత్నం చేస్తున్నాడు. భర్త తీరుతో ఒక్కోసారి తను చాలా భయపడుతోంది. ఈ మధ్య అయితే మరీ. అదీ కొత్త బాస్ విషయంలో. ప్రమోషన్ కోసం బాస్‌ను ఇంప్రెస్ చేయడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి, బాధ, చిరాకు, కోపం.. ఏవగింపూ కలుగుతున్నాయి. తనను తాను మరిచిపోతున్నాడు. వ్యక్తిత్వం లేని మనిషిలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటో... అవసరం లేకపోయినా బాస్‌కి తనని పరిచయం చేశాడు. కొలీగ్ కొడుకు బర్త్ డే అయితే అలాంటి గేదరింగ్స్‌కి ఎన్నడూ తనను తీసుకెళ్లని మనిషి కేవలం తన బాస్ వస్తున్నాడని తీసుకెళ్లాడు. ఆ బాసేమో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వెకిలి నవ్వులతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆనంద్‌తో తను చెప్పింది కూడా. ‘సోషల్ పార్టీల్లో అవి కామన్. వాటిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు’ అని కొట్టిపారేశాడు. ఇప్పుడేమో ఏకంగా ఇంటికే తీసుకొస్తున్నాడు భోజనానికి అని. తను భరించలేకపోతోంది. ‘దేవుడా! దీనికి ఎండ్ ఎక్కడా’ అనుకుంది తరిగిన కూరగాయలను చాప్ బోర్డ్ మీద నుంచి గిన్నెలోకి వేస్తూ... మెదడులోని ఆలోచనలకు నిట్టూర్పుతో ఫుల్స్టాప్ పెడుతూ! లంచ్ అవర్ తింటున్నంతసేపూ సుజాతను పొగుడుతూనే ఉన్నాడు ఆనంద్ బాస్. అతనికి వంత పాడుతున్నట్టుగా ఉంది ఆనంద్ వ్యవహారం. వంటింట్లో ఉన్న సుజాతకు ఒళ్లు మండిపోతోంది. సందర్భం లేకపోయినా మాటిమాటికీ భార్యను పిలుస్తూ, ‘బాస్‌కు అది వడ్డించు.. ఇది వడ్డించు’ అని ఆర్డర్ వేస్తున్నాడు. తను వడ్డించొచ్చు కదా... కళ్లల్లో ఆమె మండిపాటు కనపడుతున్నా లెక్క చేయట్లేదు ఆనంద్. భోజనం వంకతో దాదాపు మూడు గంటలు గడిపాడు వాళ్లింట్లో బాస్. యాన్ ఈవెనింగ్ అవర్... ‘మీరసలు మనిషేనా? బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? మీ కొలీగ్స్ అంతా వాళ్ల పెళ్లాలను ఇలాగే ... ’ దుఃఖంతో మాట రావట్లేదు సుజాతకు భర్త ఆలోచన విన్నాక. ‘ఎవరి సంగతి నాకక్కర్లేదు. వాళ్లకు ఈ ఉద్యోగం తప్ప ఇంకే ఆశలు లేవేమో. కాని నేనలా కాదు. ఉన్నదాంతో సర్దుకుపోయే రకం కాదు. అయినా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను నిన్ను పెళ్లిచేసుకోక ముందు నీ పరిస్థితేంటో తెలుసు కదా.. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు మీ అమ్మానాన్నలు నీకు. నా దగ్గర... ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావ్? ఎప్పుడైనా అనుకున్నావా ఇలాంటి జీవితం నీ సొంతమవుతుందని. నేను చేసుకోకపోతే.. ఏ గంతకు తగ్గ బొంతో దొరికుండేవాడు. అలాగే ఓ పూట తింటూ ఓ పూట మాడుతూ చచ్చేదానివి’ ...చాలా తీవ్రంగా ఉంది భర్త గొంతు. ఖంగుతింది సుజాత... అతని మనసులో తన పట్ల ఉన్న అభిప్రాయానికి. ‘పతివ్రత మాటలు మాట్లాడక నేను చెప్పింది చెయ్. నోర్మూసుకొని మా బాస్ దగ్గరకు వెళ్ళు ఈ రాత్రి. అంతే!’ ఆజ్ఞాపించాడు. సుజాత మొహం పాలిపోయింది. నోట మాట రావట్లేదు. నేల కుంగిపోయి తాను అందులోకి జారిపోతే బాగుండు అనుకుంటోంది. వాళ్ల అరుపులు ఎందుకో అర్థం కాని ఆరేళ్ల కొడుకు బిత్తరపోతున్నాడు. బీరువాలో నుంచి ఓ చీర తీసి సుజాత మీదకు విసిరాడు... ‘వెళ్లు.. వెళ్లి చీర మార్చుకురా..’ అన్నాడు. ‘ఏంటీ. మార్చుకునేది’ నిలదీసింది. ఈసారి కోపం ఆనంద్‌కు షిఫ్ట్ అయింది. ‘నేను పెడుతున్న తిండి తింటూ నా మాటకే ఎదురు తిరుగుతావా?’ అంటూ చెంప మీద కొట్టాడు. భర్తను తోసేసింది. అహం దెబ్బతిన్న ఆనంద్ సుజాత జుట్టు పట్టుకొని బాత్రూమ్లోకి ఈడ్చుకెళ్లాడు. ఈ హఠాత్పరిణామానికి భయపడ్డ వాళ్ల అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో వాడిని ఎత్తుకుంటూ ‘బాబును తీసుకొని బయటకు వెళ్తున్నా. త్వరగా రెడీ అవ్వు. ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్‌లో బాస్ వస్తాడు’... బెదిరింపు, ఆజ్ఞాపన కలగలిసి ఉన్నాయి ఆ మాటలో. యూ ఛీట్.... ‘మిస్టర్ ఆనంద్! వాట్ డు యూ థింక్ ఎబౌట్ మి?’ ఫోన్లో అరుస్తున్నాడు బాస్. ‘వాట్.. సర్.. వాట్ హ్యాపెన్డ్?’ అయోమయంతో ఆనంద్. ‘ఏయ్! ఏమీ తెలీనట్టు మాట్లాడకు. నువ్వు, నీ భార్య కలిసి నాటకం ఆడుతున్నారా? లేక నన్ను పట్టిద్దామనుకున్నారా?’ బెదిరిస్తున్నా... బాస్ గొంతులో భయంతో కూడిన వణుకుంది. ‘అయ్యో.. సర్! నిజంగా నాకేం తెలియదు. మా ఆవిడ ఏమన్నా..’ ఆగాడు. ‘యూ.. ’ఆవేశంతో మాట రాక ఆగాడు బాస్. ‘ఇంట్లో నీ పెళ్లాం లేదు ఇడియట్’...గొంతు కాస్త తగ్గించి చెప్పాడు.ఈ సారి ఆనంద్ ఆశ్చర్యపోయాడు.సహాయం కావాలి...రాత్రి పది గంటలు.‘ముందు ఈ నీళ్లు తాగండి’.. నీళ్ల బాటిల్ ఇస్తూ చెప్పింది లాయర్. బాటిల్ నీళ్లను గటగటా తాగేసింది. చీర కొంగుతో మొహానికి, మెడకు పట్టిన చెమటను తుడుచుకుంటూ. ‘సారీ మేడమ్! ఈ టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నా సమస్య అలాంటిది. దారిన వెళ్తూ మీ ఇంటి ముందున్న మీ బోర్డ్ చూసి వచ్చాను’ ... సంజాయిషీ చెబుతున్నట్లుగా అంటోంది సుజాత. ‘పర్లేదు.. అర్థం చేసుకున్నా. ముందు మీరు స్థిమితపడండి..’ అనునయించింది లాయర్. కాస్త ఆగి.. విషయం చెప్పింది సుజాత. ‘భయపడకు.. నీకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా సహాయం చేస్తా’...భరోసా ఇచ్చింది లాయర్. పరిష్కార మార్గం కూడా చూపించింది. ఏమిటా పరిష్కారం? భార్య పట్ల ఆనంద్ ప్రవర్తన క్రూరత్వం, మానసిక వేదనకు గురి చేయడం కిందకు వస్తుంది. భార్యను అలా ఇంకొకరి దగ్గరకు వెళ్లమని బలవంతం చేయడం క్రూరత్వంగా పరిగణిస్తుంది చట్టం. అంతేకాదు మానసిక వేదనకు గురిచేయడం కూడా అవుతుంది. అందుకే అలాంటి కారణాల కింద మహిళలకు హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 13 విడాకులు తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఒకవేళ విడాకులు తీసుకోకుండా... భర్త నుంచి రక్షణ మాత్రమే కావాలనుకునే వాళ్లకు డొమెస్టిక్ వయెలెన్స్ యాక్ట్ ప్రకారం రక్షణ ఉత్తర్వునూ మంజూరు చేసి, భద్రతను కల్పిస్తుంది. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ Parvathi advocate2015@gmail.com - సరస్వతి రమ -
52 కుటుంబాల సాంఘిక బహిష్కరణ
జక్రాన్‌పల్లి(డిచ్పల్లి) : డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం చింతలూర్ గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాల వారు సోమవారం డిచ్పల్లి మండలం ఇందల్వాయి కి తరలి వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, ధర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపిని కలిసి విషయం తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. బహిష్కరణకు గురైన ముదిరాజ్ కుటుంబాల వారికి గ్రామంలోని ఇతర కులస్తులు సహకరించరాదని, ఎవరైనా సహకరిస్తే వారిని సైతం బహిష్కరిస్తామని వీడీసీ సభ్యులు హెచ్చరించారని తెలిపారు. గ్రామానికి చెందిన ముత్తన్న కు సంబంధించిన ఐదు ఇసాల పట్టా భూమిని కాలువ నిర్మాణం కోసం ఇవ్వాలని వీడీసీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ముదిరాజ్ కులపెద్దల ద్వారా ముత్తన్నపై ఒత్తిడి తెచ్చారు. అయితే తాను కోల్పోతున్న భూమికి నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేది లేదని ముత్తన్న స్పష్టం చేశాడు. దీంతో తాము చెప్పిన మాట వినడం లేదనే సాకుతో గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాల వారిని సాంఘిక బహిష్కరణ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో బాధితులు జిల్లా కలెక్టర్ యోగితారాణా ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఈ విషయమై విచారణ జరపాలని డిచ్పల్లి సీఐ తిరుపతిని ఆదేశించినట్లు ఎంపీపీ గోపి తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ
– ఆడపిల్లలను పుడితేనే వదిలేస్తుండటం దారుణం – వివక్షతను అరికట్టడంలో మీడియా పాత్ర అభినందనీయం – రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కర్నూలు (అగ్రికల్చర్): సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, లైంగిక వేధింపులను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. వీటిపై ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత డీఎస్పీలతో మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. అనాథలుగా మారుతున్న బాలికల విషయంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. . ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయని, ఇలాంటివి గుంటూరులో మరీ ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని, పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్నాని ఇందువల్ల వారు బాలకార్మికులుగా మారుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఆరు నెలల కిత్రం బాధ్యతలు చేపట్టానని ఈ వ్యవధిలోని మహిళా కమిషన్‌కు 470 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ మాట్లాడుతూ చిన్న పిల్లలను వదిలేస్తున్న సంఘటనులు ఎక్కువగా జరుగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్ డీడీ శారద, జిల్లా బాలనేరస్తుల పర్యవేక్షణ అధికారి రామసుబ్బారెడ్డి, మహిళా కమిషన్ డైరెక్టర్ సామేజ్ తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమాలపై సమీక్ష: మధ్యాహ్నం ఐసీడీఎస్ కార్యక్రమాల అమలుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గహ హింస చట్టం, వన్ స్టాప్ సెంటర్ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ స్కీమ్, చిల్డ్రన్స్ హోమ్‌ల నిర్వహణ, శిశుగహలోని చిన్నారుల సంక్షేమం తదితర కార్యక్రమాలను సమీక్షించారు. చిల్డ్రన్ హోమ్‌లు, శిశుగహలను మరింత బలోపేతం చేయాలన్నాలని చైర్ పర్సన్ అన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, సీడీపీఓలు, స్వయంసహాక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బుగ్గతండా బాలికలకు పరామర్శా: పత్తికొండ మండలం బుగ్గతండాకు చెందిన బనావత్ రమణమ్మ కామెర్లతో మతి చెందడం, తండ్రి రాంబాబు నాయక్ తాగుడుకు బానిస కావడంతో వారి సంతానమైన మల్లిక, శశిరేఖ, ఇందు, లోకేశ్వరీ, సింధులు దిక్కులేని వారుగా మిగిలారు. వీరి దుస్థితిపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో దాతలు స్పందించి చిన్నారి బాలికలకు చేయాత నిచ్చారు. జిల్లా యంత్రాంగం స్పందించి సింధూ మినహా నలుగురిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించింది. కర్నూలుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఐదుగురు చిన్నారులను పరామర్శించారు. వారికి దుస్తులు అందచేశారు. అనాథలుగా మిగిలిన చిన్నారులను చేసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని శారదనికేతన్ విద్యాసంస్థ ఐదుగురు ఆడపిల్లలను ఇంటర్ వరకు చదివించేందుకు, సెలవుల్లో సంరక్షించేందుకు ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఐదుగురు చిన్నారులను పెద్దపాడు శిశుగహానికి తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చిందన్నారు. పిల్లలను ఇతర జిల్లాలకు పంపవద్దని చిన్నారుల మేనమామ, చిన్నాయన కోరడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథలుగా ఉన్నపుడు లేని ప్రేమ ఇపుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తును మేము చూసుకుంటామని తెలిపారు. -
సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి : మోర్తాడ్ మండలం ధర్మారంలో గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి గౌడ సంఘం సభ్యులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గౌడ సంఘం మండలాధ్యక్షుడు సాయాగౌడ్ నేతృత్వంలో వారు కార్యాలయ సూపరింటెండెంట్ బాల్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ధర్మారం గ్రామంలో 12 మంది గీత కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించి వారికి వైద్యం కూడా అందనివ్వడం లేదని, వారి పిల్లలను పాఠశాలల్లోకి రానివ్వడం లేదని ఇది అమానుష చర్య అని సంఘం అధ్యక్షుడు అన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి బా«ధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పామయ్యగారి ఈశ్వర్‌గౌడ్, వినోద్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు
పుట్టపర్తి అర్బన్ :విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మార్పు తీసుకురావడం ఉపాధ్యాయులతోనే సాధ్యమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్వీజే కల్యాణ మండపంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికపై విద్యాధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య, మంచి నడవడికలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులను తీర్చిద్దిడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సోమవారం నుంచి ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించి, కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ అంజయ్య, కదిరి ఆర్డీఓ వెంకటేశు, వివిధ మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యతోనే సామాజిక మార్పు
పరిగి: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పరిగిలోని అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు ఆదివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే పేదరికం నుంచి బయటపడతారని ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలపారు. అట్టడుగు వర్గాల పిల్లలందరూ బడుల్లో ఉండేలా విద్యావంతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, రవికుమార్, శ్రీనివాస్, శ్రీను, బుగ్గయ్య, బిచ్చయ్య, గోపాల్, వెంకటయ్య, చందు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం విజ్ఞాన కేంద్రాలు దోమ: విజ్ఞాన కేంద్రాలు పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల రాష్ర్ట కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుట్టుకతోనే గొప్పవాడు కాదని మంచి చదువు ఉన్న వారు ఎప్పుడైన, ఎక్కడైనా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి పుస్తకాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో విజ్ఞాన మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంచి జ్ఞానం సంపాదించి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీటీఓ రాంచందర్, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, జెడ్పీటీసీ సభ్యురాలు సరోజ, పశ్చిమ రంగారెడ్డి జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు ఆనందం, కార్యదర్శి బాబూరావు, మండల అధ్యక్షుడు యాదయ్య, దిర్సంపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
పాల్మన్ పేటలో దారుణకాండ
దాడులతో చిగురుటాకులా వణికిన గ్రామం నాలుగు రోజుల్లో మూడు దాడులు తాజా దాడుల్లో వీరంగం చేసిన వందలాదిమంది మూకలు ఒకసారి కాదు.. నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒకే సామాజికవర్గం వారిపై.. మరో సామాజిక వర్గీయులు జరిపిన దాడులతో పాల్మన్‌పేట చిగురుటాకులా వణికిపోయింది. గ్రామంలో భయానక పరిస్థితి నెలకొంది. ఎప్పుడు.. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనన్న భయంతో అక్కడి ప్రభజలు బిక్కుబిక్కుమంటున్నారు. వందల సంఖ్యలో మూకలు కర్రలు, కత్తులు, బల్లాలతో విరుచుకుపడిన తీరు వారిని కంటి మీద కునుకు లేకుండా చేసింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనే ఇంతటి దారుణానికి నేపథ్యం. ఈ నెల 25న కొందరు మత్స్యకార వర్గీయులపై పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన యాదవ వర్గీయులు దాడి చేసి కొట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు గానీ.. యాదవ వర్గీయులు మాత్రం పట్టించుకున్నారు. మాపైనే ఫిర్యాదు చేస్తారా? అన్న ఆగ్రహంతో సోమవారం రాత్రి మళ్లీ మత్స్యకారులపై పడ్డారు. కొందరిని గాయపరిచారు. అప్పుడు కూడా గ్రామ సర్పంచ్ తదితరులు ఫిర్యాదు చేసినా పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఫలితంగా ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం పక్కనున్న తూర్పుగోదావరి జిల్లా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తమ వర్గీయులను రప్పించారు. వారందరూ వాహనాల్లో మారణాయుధాలతో పాల్మన్‌పేటపై దండెత్తారు. వీరవిహారం చేసి గ్రామాన్ని గడగడలాడించారు. సుమారు 50 మందిని గాయపరిచారు. ఇళ్లు, షాపులు, వస్తువులను ధ్వంసం చేశారు. బాధితులు, క్షతగాత్రులందరూ వైఎస్సార్సీపీకి చెందినవారే. తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు ఈ దాడులను ఆపలేకపోగా.. వారి ముగ్గురు గాయపడ్డారు. ఇంత దారుణం జరిగిన తర్వాత అదనపు బలగాలు, పోలీసు అధికారులు తీరిగ్గా వచ్చారు. మత్స్యకారులను సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే తీవ్రంగా నష్టపోయిని బాధితులు వారిని నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడులు జరిగాయని స్పష్టం చేశారు. పక్క జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలకనేత ప్రమేయంతోనే పక్కా వ్యూహంతో తమపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీల ఫ్లెక్సీలను దహనం చేశారు. పాయకరావుపేట: పాల్మన్‌పేటలో ఒక సామాజిక వర్గం వారు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు. వరుస దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. పాత కక్షలతో మండలంలోని పాల్మన్పేటలోని ఒక సామాజిక వర్గంపై మరో సామాజికవ ర్గం వారు పొరుగు జిల్లా గ్రామస్తులతో కలిసి మంగళవారం మరో సారి దాడులు చేసి బీభత్సం సృష్టించారు. పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన వారితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన సుమారు నాలుగు వందల మంది పాల్మన్‌పేట మత్స్యకారులపై కర్రలతో దాడులు చేసి స్వైర విహారం చేసి ఇళ్లు, బైక్‌లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. దొరికినవారిని దొరికినట్టు విచక్షణా ర హితంగా కొట్టడంతో 50 మంది వరకు మత్స్యకారులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సత్యనారాయణ వెళ్లి దాడులు ఆపేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని ఆరోపిస్తూ మత్స్యకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రాంబాబును అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంవల్లే మళ్లీ దాడులు జరిగాయన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీలు ఉన్న ప్లెక్సీలు ధ్వంసం చేసి దహనం చేశారు. దాడులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికారపార్టీ కీలక నేత ప్రమేయంతో వేమవరం, ముసలయ్యపేట ,రాజయ్యపేట, గొల్ల ముసలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన వారు దాడులకు పాల్పడ్డారని మత్స్యకారులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఇళ్లతో పాటు సమారు వంద ఇళ్లలో సామాన్లు, బైక్‌ల వంటి ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టు పక్కల స్టేషన్ల నుండి పోలీసులను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సంఘటనలో గాయపడిన కోడా రామూర్తి, పిక్కి కొండయ్య, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాధం, గోసల అప్పలరాజు, వెంకటలక్ష్మి, జి.నాగమణి, చొక్కా శ్రీను, వంకా మహేష్, గరికిన తిరుపతిరావు, గోసల జగదీష్, గోసల రమణ, భాస్కరరావు, గరికిన ముసలి, సత్యనారాయణ, వంకా రమణ, పిక్కి కోదండ తదితరులకు తుని ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం వారిని నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కోడా రామూర్తి, ముత్తి సత్తిరాజు, యాదాల జగన్నాథంల పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షలే సంఘటనకు మూలం పాల్మన్‌పేటకు చెందిన మత్స్యకారులకు, రాజయ్యపేటకు చెందిన యాదవులకు మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయి. పాల్మన్‌పేటకు చెందిన దోని సాయికుమార్, చొక్కా మణికంఠలు ఈనెల 24న హేచరీలో పనికివెళ్తుండగా రాజయ్యపేటకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈనెల 27 రాత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కందాల సత్తిబాబు, చొక్కా దేవుడు, చింతకాయల నాగరాజు, కందాల రమణ, యజ్జల కృష్ణపై యాదవ సామాజికవర్గానికి చెందిన వారు రెండో సారి దాడికి పాల్పడ్డారు. దాడిలో యజ్జల కృష్ణను ఉరి వేయడానికి ప్రయత్నించారని బాధితులు చెబుతున్నారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో వారు స్పదించలేదని పాల్మన్‌పేట సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ సభ్యుడు గరికిన రమణ ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి ఉంటే మంగళవారం తమపై దాడులు జరిగేవి కావని మత్స్యకారులు చెబుతున్నారు. పోలీసులదే నైతిక బాధ్యత కేవలం మత్స్యకారులను అణగదొక్కాలనే ప్రయత్నంతోనే దాడులు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ దోని నాగార్జున మాట్లాడుతూ, ఈ దాడులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో ఉన్నామనిపిస్తోందన్నారు. తమ వర్గీయులపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింకోకపోవడంవల్లే మళ్లీ దాడులకు దిగారని ఆరోపించారు. ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ ప్రజాప్రనిధులకు రక్షణ లే కుండా పోయిందని, విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులే ప్రత్యక్ష సాక్షులు వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోడా కోటేశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులపై అధికార పార్టీ అండదండలతో దాడులు చేశారన్నారు. ఈనెల 24న మత్య్సకారులపై జరిగిన దాడికి సంబంధించి 25న ఫిర్యాదు చేశామన్నారు. గ్రామానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుని కుమారుడిపై ఫిర్యాదు ఇవ్వడం వల్ల పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. దీనికి తోడు తమపైనే ఫిర్యాదుచేస్తారా అనే ధోరణితో మళ్లీ 27వ తేదీ రాత్రి రెండోసారి దాడిచేశారన్నారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ కోసం పోలీసులు పిలవగా వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో మంగళవారం మూడో సారి దాడులకు తెగబడ్డారన్నారు. అధికారపార్టీ నేత ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో ఎస్ఐతోపాటు పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నారని, మత్య్సకారులపై దాడులకు ప్రత్యక్ష సాక్షులు పోలీసులేనని చెప్పారు. దీనికి నైతిక బాధ్యత పోలీసులే వహించాలన్నారు. గ్రామాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు సంఘటన జరిగిన గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఏఎస్పీ రస్తోగీ, ఆర్డీవో సూర్యారావులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ దాడులకు పాల్పడినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. -
హక్కులే శ్వాసగా..
నినదించిన నారీలోకం ‘మహిళా విధానం’పై సుదీర్ఘ చర్చ ప్రక్షాళనతోనే సమాజ మార్పు ఆకాశం ఆమె.. ఆలోచన ఆమె.. అన్నింటా అభివృద్ధి ఆమె. అయినా ఆమె సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలే. ఇంటా బయటా అంతటా లింగ వివక్షే. పనిచేసే చోట అణచివేత ధోరణులు కనిపిస్తునే ఉన్నాయి. ఓపక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ.. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా ఆమె శ్రమకు దక్కే ప్రతిఫలం మాత్రం సగమే. ఇల్లూ, బడీ, గుడీ, వ్యవసాయం, పారిశ్రామికం.. కార్యక్షేత్రం ఏదైతేనేం.. అన్నింటా వివక్షే. దాన్ని ఛేదించేందుకు దశాబ్దాలుగా పోరాటం చేస్తునే ఉంది. స్త్రీ హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఒకటిన్నర దశాబ్దాల తరువాత భారత ప్రభుత్వం ‘మహిళా విధానాన్ని’ రూపొందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణ భారత మహిళల ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ సంయుక్తాధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. 2016 మహిళా పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత చట్టాలను, విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, వివక్షారహిత సమాజ ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. - సాక్షి, సిటీబ్యూరో న్యాయవ్యవస్థలో మార్పు అవసరం న్యాయ వ్యవస్థను, పోలీసులను సమూలంగా ప్రక్షాళన చేసినప్పుడే స్త్రీల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. స్త్రీలకు ఉద్దేశించిన చట్టాలు మన దేశంలో చాలా తక్కువ. వాటిలో గృహహింసకు సంబంధించిన ఏకైక చట్టం ‘498ఏ’. ఇది దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు చెప్పడం స్త్రీలపట్ల న్యాయ వ్యవస్థకున్న దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది. ఇటువంటి తీర్పులు స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేరళలో కళాలయ జ్యోతి ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అన్ని దశల్లోనూ బాలికల, మహిళల సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అందుకు ప్రత్యేకించిన కౌన్సిలర్స్‌ను కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే యువతకు పెళ్లికి ముందు ఉమన్ కమిషన్, కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాం. పెళ్లికి ముందు మా కౌన్సిలింగ్లో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - కేసి రోజా కుట్టి, కేరళ ఉమన్ కమిషన్ చైర్పర్సన్ మహిళా కమిషన్‌కు అధికారం ఇవ్వాలి స్త్రీలపై వివక్షకు హద్దులేదు. అన్ని రంగాల్లోను అన్ని వర్గాల స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలుంటే చాలదు, అవి సక్రమంగా అమలు జరగాలి. మహిళా కమిషన్ని నామమాత్రంగా ఉంచితే సరిపోదు. దానికి కొన్ని అధికారాలు ఉండాలి. సమానమైన పనికి సమాన వేతనం మన దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదు. క్షేత్రస్థాయి మహిళల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న స్త్రీల వరకు ఎవరికీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సరోగసీ ద్వారా ఒక మహిళ 15 మందికి జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య బాధ్యత ఎవరిది? ఈ పాలసీలో చెప్పాలి. విశాఖ కమిటీ సిఫార్సుల ప్రకారం పని ప్రదేశాల్లో కంప్లెయింట్ బాక్స్‌లు ఉండాలి. ఈ ఫిర్యాదు కమిటీల్లో స్త్రీలకు న్యాయం జరుగుతున్న దాఖలాలు లేవు. దీనికి కారణం యాజమాన్యాలే ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండడం. యాజమాన్యాల భాగస్వామ్యం లేని కమిటీలు కావాలి. - వత్సల, తమిళనాడు వుమన్ కమిషన్ సభ్యురాలు ‘మహిళా పాలసీ’ చేయాలి.. దేశంలో ఎక్కడా ఏ వర్గం మహిళలకూ సరైన గౌరవం దక్కడం లేదన్నది నిర్వివాదాంశం. ప్రధానంగా మైనారిటీ మహిళలు, దళితులు మరింత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయాలి. ఈ చట్టాల అమలుపై పర్యవేక్షణ ఉండాలి. కర్నాటక మహిళా అయోగ్ కమిషన్ ద్వారా కేసులను మేం డీల్ చేస్తున్నాం. కర్నాటకలో వరకట్నం, యువతులపై యాసిడ్ దాడులు తీవ్రమైన సమస్యగా ముందుకొస్తున్నాయి. చట్టాలెన్ని ఉన్నా దోషులు తప్పించుకునే వీలు కూడా ఈ చట్టాల్లోనే ఉంటోంది. దాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం మహిళా విధానాన్ని రూపొందించాలి. కర్నాటకలోనూ మహిళా కమిషన్‌కి ప్రత్యేక బడ్జెట్ లేకపోయినా ప్రభుత్వ సాయంతో హింసకు గురైన మహిళలను ఆదుకుంటున్నాం. - అనితా గుర్జాల్, కర్నాటక మహిళా కమిషన్ సభ్యురాలు స్త్రీల ఆరోగ్య హక్కుల మాటేమిటి? దళిత, ఆదివాసీ స్త్రీల ఆరోగ్యాంశాలను ఈ విధానం స్పృశించలేదు. ఆరోగ్యం ప్రైవేటైజ్ అయిన తర్వాత స్త్రీలకైనా, పురుషులకైనా హక్కులెలా ఉంటాయి? ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కావాలి. ప్రధానంగా స్త్రీల ఆరోగ్యం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యావ్యవస్థ బలోపేతం కాకుండా స్త్రీ విద్య అసాధ్యం. అన్నిరంగాల్లో వివక్ష ఉన్నట్లే కుటుంబాల్లో బాలికల విద్యపట్ల సైతం వివక్ష ఉంది. ఓ పక్క అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ హక్కుల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. ముందుగా స్త్రీల హక్కులు మావన హక్కులేనా కాదా అన్నది చర్చిస్తే.. స్త్రీల హక్కులను మానవ హక్కులుగా గుర్తిస్తే అప్పుడు వారి సమస్యలను సరైన కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. - విమల, రచయిత్రి ‘మహిళా బిల్లు’తోనే సాధ్యం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇంతవరకు సాధ్యం కాలేదు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచించాలి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళా సాధికారత అసాధ్యం. అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచించాలి. గృహహింసకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి. మహిళా కమిషన్‌కు అధికారాలు ఉండాలి. అలాగే కమిషన్‌కి నిధులు కూడా అవసరం. కమిషన్‌కు స్వయం ప్రతిపత్తినివ్వాలి. - త్రిపురాన వెంకటరత్నం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ దళిత స్త్రీల సమస్యలు ప్రధానం దళిత, ఆదివాసీ స్త్రీల సమస్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీలో అది లోపించింది. అన్ని వర్గాల స్త్రీలను ఒకేగాటన కట్టలేం. కుల, లింగ వివక్షకు, అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల స్త్రీల సమస్యలపై పాలసీ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం వుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామిక స్త్రీల సమస్యలను సైతం ఈ పాలసీ విస్మరించింది. ఇంటి పనివారి సమస్యల ప్రస్తావన కూడా ఈ పాలసీలో లేదు. వీరంతా దళిత స్త్రీలే. దళిత, ఆదివాసీ స్త్రీల హక్కులను కాపాడకుండా ఈ దేశం ఎటువంటి అభివృద్ధినీ సాధించలేదు. - రూత్ మనోరమ, జాతీయ దళిత మహిళా సంఘం లింగ వివక్ష అప్రజాస్వామికం బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయకపోతే సమాజం భావ దారిద్య్రంలో మునిగిపోతుంది. జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు కొంత ప్రయోజన కరంగా ఉన్నప్పటికీ, మహిళల విద్యావకాశాల విషయంలో మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. భారతదేశంలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. కుల, లింగ వివక్షతో విద్యను నిరాకరించడం అప్రజాస్వామికం. అలాగే ఐసీడీఎస్‌ల ఉద్దేశం కేవలం పౌష్టికాహారం సరఫరా మాత్రమే కాదు.. ప్రిప్రైమరీ విద్యను అందించడం కూడా. కానీ ఎక్కడా అమలు జరగడం లేదు. - ప్రొఫెసర్ రమా మేల్కొటే మహిళా రైతుల హక్కులను గుర్తించాలి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలను హక్కుదారులుగా గుర్తించడంలో ఇప్పటి దాకా ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మహిళా రైతులను దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగానికి ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలు, సహాయం, రుణాలు అన్నింటిలోను సమాన వాటా ఉండేలా చూడాలి. అందులో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు మరింత ప్రత్యేకమైన సహకారం అందించాలి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలను నడుపుతున్నది కూడా మహిళా రైతులే. కాబట్టి దీనిపై ప్రత్యేకమైన సర్వే నిర్వహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధిలో మహిళలకు సముచిత స్థానం కల్పంచే విధంగా ఈ విధానం రూపొందించాలి. - రుక్మిణీ రావు, గ్రామ్య స్వచ్ఛంద సంస్థ 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి.. స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ యిస్తేనే ఆ రాజకీయ పార్టీకి గుర్తింపునివ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. అలాగే జెండర్ బడ్జెట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగా స్త్రీలకు ప్రత్యేకించిన బడ్జెట్ కేటాయింపులు అవసరం. అన్ని రకాల స్త్రీ హింసలకు అసమానతలే కారణం. అసమానతలను పెంచి పోషించే విద్యావ్యవస్థను నిరాకరించాలి. స్త్రీ, పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యపుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం కొన్ని క ళాశాలల్లో ప్రవేశపెడుతోంది. ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాలి. అన్ని రంగాల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. - కె. లలిత, యుగాంతర్ స్వచ్ఛంద సంస్థ పాఠ్యాంశాల్లో మార్పు అవసరం అన్నిచోట్లా స్త్రీలపై హింస పెరిగిపోతోంది. దీన్ని అడ్డుకోవాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలల్లో మార్పు తీసుకురావాలి. ఇందుకోసం స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించే అంశాలను, సామాజిక స్పృహను అందించే విషయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. వాటిని అన్ని వయసుల్లోను వారికి బోధించాలి. చట్టాలపై అవగాహన కూడా విద్యార్థులకు తప్పనిసరి. ఈ విషయాలన్నింటినీ మహిళా విధానంలో భాగం చేయాలి. - స్వాతి లక్రా, షీటీమ్స్ ఇన్చార్జ్ -
కాల్‌మనీ కోరలు పీకుదాం
అన్నీ మానవీయ కోణంతో ముడిపడిన కేసులే.. పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకెళ్లాలి కాల్‌మనీ వర్క్‌షాపులో పలువురు వక్తలు సాంఘిక దురాచారంగా మారిన కాల్‌మనీ కోరలు పీకాలని విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన కాల్‌మనీ వర్క్‌షాప్‌లో పలువురు పేర్కొన్నారు. సామాజిక చైతన్యం, బ్యాంకర్ల పూర్తి సహకారం ఉన్నప్పుడే ఈ కేసులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. పోలీసులు విస్తృత ప్రచారం చేయడంతోపాటు అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు. -
సామాజిక సౌధం
మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఏటూరునాగారం ఆస్పత్రి 20 రోజుల్లో 34 సాధారణ ప్రసవాలు నవజాత శిశు సంరక్షణకు ఆధునిక వైద్యసేవలు యువ వైద్యుల కృషితో దవాఖాన పనితీరులో పురోగతి ఏటూరునాగారం : ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాల అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కేవలం ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల పరిధిలోని సుమారు 60 పంచాయతీల ప్రజలే ఇక్కడికి వైద్యం కోసం వచ్చేవారు. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి వెంకటాపురం, వాజేడు తదితర మండలాల నుంచి నిత్యం వేలాది మంది ఏటూరునాగారానికి వస్తుండటం గమనార్హం. దవాఖాన సేవల పరిధి పెరిగిందనేందుకు ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ ఆస్పత్రిని ప్రస్తుతమున్న 30 పడకల నుంచి 100 పడకలకు పెంచి, సేవలను అప్‌గ్రేడ్ చేయూల్సిన అవసరముంది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత రక్తనిధి కేంద్రం విస్తరణకు వైద్య,ఆరోగ్య శాఖ సహకారం అందించాలి. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న యువ వైద్యుల బృందం చొరవే ఈ ఆస్పత్రి సేవలు మెరుగుపడేందుకు ముఖ్య కారణం. ఆనవారుుతీ ప్రకారం ఆస్పత్రికి రావడం.. గడియూరం చూసుకొని ఇంటిబాట పట్టడం ఇదంతా నిన్నటి సంగతి. తాము మాత్రం 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించగలమని నిరూపించుకుంటున్నారు యువ వైద్యులు. వారి చొరవ ఫలితంగా ప్రజలకు ఆస్పత్రి పనితీరుపై ఉన్న ప్రతికూల దృక్పథం తుడిచిపెట్టుకుపోరుుంది. ట్రావెలింగ్ ఇంక్యుబేటర్ అత్యవసర పరిస్థితుల్లో శిశువులను వరంగల్‌కు తరలించే సమయంలో వాడేందుకు ట్రావెలింగ్ ఇంక్యుబేటర్ ఏటూరునాగారం ఆస్పత్రిలో ఉంది. దీనిద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు ఆక్సిజన్‌తోపాటు చికిత్స అందిస్తూ వరంగల్‌కు తరలించొచ్చు. ల్యాబ్‌లో అన్ని వైద్యపరీక్షలు హెమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, మలేరియా, వైడల్, బ్లడ్ షుగర్, సిరమ్ బైలీరూబిన్, హెపటైటిస్, హెచ్ఐవీ, యూరిన్, షుగర్, అల్బుమిన్, కఫం(తేమడ) పరీక్ష, గర్భనిర్ధారణ పరీక్షలు ఆస్పత్రిలోనే చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు భాస్కర్, వెంకన్న ఈ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. హెచ్ఐవీ బారినపడే వారికి కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పిస్తున్నారు. ల్యాబ్‌లో వైద్యపరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రరుువేటు ల్యాబ్‌లను ఆశ్రరుుంచి ప్రజలు జేబులు ఖాళీ చేసుకునే పరిస్థితి దూరమైంది. రూ.కోటితో శిశు సంరక్షణ కేంద్రం జిల్లాలోని సీకేఎం, ఎంజీఎం, హన్మకొండ జనరల్ మెటర్నిటీ హాస్పిటళ్లలో మాతా,శిశు సంరక్షణకు సంబంధించిన నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నారుు. ఈ తరుణంలో ఇటీవల మహబూబాబాద్, ఏటూరునాగారంలలో ఎస్ఎన్సీయూ ఆస్పత్రిని నెలకొల్పారు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా వైద్యం చేసేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పథకం ద్వారా రూ.కోటితో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో నెలకొల్పారు. బరువు తక్కువ, కామెర్లతో బాధపడే నవజాత శిశువులను ఇప్పటిదాకా వరంగల్ ఎంజీఎం, జిల్లా కేంద్రంలోని మెటర్నిటీ దవాఖానలకు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మాత్రం స్థానికంగా వైద్యం అందించగలిగేలా వసతులు అందుబాటులోకి వచ్చారుు. ఫొటోథెరపీ వైద్యం, ఇంక్యుబేటర్ వసతితో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఉమ్మనీరు తాగిన పిల్లలకు వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. గర్భిణులకు చక్కటి వైద్యసేవలు గర్భిణుల కోసం ప్రత్యేక ప్రసూతి గదిని ఏర్పాటు చేశాం. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీతో పాటు పెద్దాపరేషన్లు చేసేందుకు అధునాతన శస్త్రచికిత్స పరికరాలు ఉన్నారుు. మే 20 నాటికి 34 నార్మల్ డెలివరీలు చేశాం. నిత్యం అందుబాటులో ఉంటూ గర్భిణులకు చక్కటి వైద్యసేవలు అందిస్తున్నాం. - మానసారెడ్డి, స్త్రీల వైద్య నిపుణురాలు అందుబాటులో అన్ని రకాల మందులు ఎక్స్‌రే, ఈసీజీ సదుపాయం ఆస్పత్రిలో ఉంది. రోగుల సౌకర్యార్ధం వినియోగించేందుకు వీల్చైర్లు, సెక్షన్ మిషన్లు, పల్స్ ఆక్సీమీటర్, ఫీడర్ డాపాలర్లు ఉన్నారుు. రోగులతో వచ్చే సహాయకులకు భోజన వసతితో పాటు పాలు, బ్రెడ్ ఇస్తున్నాం. త్వరలోనే సెల్ కౌంట్ మిషన్ కూడా రాబోతోంది. పాము, తేలు, కుక్కకాటు మందులతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. - వాడె రవీప్రవీణ్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవ చేసేందుకు వైద్యులమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నాతోపాటు మరో ఆరుగురు వైద్యులు దవాఖానలో ఉన్నారు. అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాం. వారు అసౌకర్యానికి గురికాకుండా చూడటమే మా లక్ష్యం. - అల్లి నవీన్, వైద్యుడు, ఏటూరునాగారం -
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్..
టాప్ స్టోరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్వయం ఉపాధికి ఆధునిక పేరు! ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉంటున్న విభాగమిది! ఇందులో ప్రస్తుతం మరో కొత్త విభాగం కీలకంగా మారుతోంది. అదే.. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సామాజిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే సంస్థలను స్థాపించడమే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇందులోని అవకాశాలపై విశ్లేషణ.. ఒకవైపు కెరీర్ పరంగా స్వయం ఉపాధి లక్ష్యాన్ని, మరోవైపు సామాజిక అవసరాలను తీర్చాలనే ఆకాంక్షను నెరవేరేలా చేస్తోంది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది సామాజికంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు మొదలు అభివృద్ధి సమస్యల వరకు పరిష్కారాలను చూపుతోంది. సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎన్నో రంగాలు * సాధారణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పోల్చితే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఆదాయం కొంత తక్కువ ఉంటుంది. కానీ, సమాజాభివృద్ధికి తోడ్పడ్డామన్న సంతృప్తికి కొదవ ఉండదు. * ప్రస్తుతం దేశంలో ఐఐటీల నుంచి సాధారణ కళాశాలల విద్యార్థుల వరకు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై మొగ్గుచూపుతున్నారు. ఔత్సాహికులు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐఐటీ చెన్నైకు చెందిన కృష్ణన్ అనే విద్యార్థి రైల్వేస్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, రూ.2కు లీటర్ నీటిని అందిస్తున్నారు. అమృత ధార పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఆలోచన.. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ సంస్థ నిర్వహించిన పోటీలో విజయం సాధించింది. దీంతో ఆ విద్యార్థి ఆర్థిక సహకారం పొందాడు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సంస్థలకు వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యా రంగానికి కూడా విస్తరిస్తోంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ సంస్థలు, ఈ-లెర్నింగ్ సంస్థలు, వెబ్సైట్లు వంటివన్నీ ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పరిగణించవచ్చు. వీటికి కూడా సీడ్ ఫండింగ్ ఏజెన్సీల నుంచి మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన Edutor ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థకు దాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే హైదరాబాద్ ఏంజెల్స్ సంస్థ రూ.2 కోట్లు సీడ్ క్యాపిటల్ అందించింది. ఉద్యోగావకాశాలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఇందులో ఉద్యోగ అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ విభాగంలో వచ్చే రెండేళ్లలో 70 వేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. కానీ ఇతర ఎంటర్ప్రెన్యూర్ సంస్థలతో పోల్చితే వీటిలో వేతనాలు కొంత తక్కువగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు సైతం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ప్రకారం సంస్థలు తమ నికర లాభంలో రెండు శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలి. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో స్టార్టప్ ఔత్సాహికులకు నిధులను కూడా సమకూరుస్తున్నాయి. కేవలం స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగుపెడతాయనుకుంటే పొరపాటు. పూర్తిస్థాయిలో కమర్షియల్‌గా మారిన రంగాల్లోనూ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన IMPRINT పథకంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు పెద్దపీట వేశారు. ఫండింగ్ ఏజెన్సీలు ACUMEN ఫండ్ SONG: ఈ సంస్థ చిన్న, మధ్య తరహా సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆవిష్కార్ ఇండియా మైక్రో వెంచర్ క్యాపిటల్: ముంబైకు చెందిన ఈ సంస్థ చెత్త నిర్వహణ, ఇంధనం, హస్తకళలు తదితరాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. గ్రే మేటర్స్ క్యాపిటల్ ఫౌండేషన్: హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ మైక్రో ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఫండింగ్ సదుపాయం కల్పిస్తోంది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ఇండియా ఇన్‌క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఓర్పు అవసరం. ప్రారంభంలో లక్షిత క్లయింట్లను చేరుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. నిధుల కోసం సీడ్ ఏజెన్సీలను మెప్పించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల కాలంలో స్టార్టప్ కాంపిటీషన్లలో సోషల్ స్టార్టప్ ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో ఫండింగ్ ఏజెన్సీల ఆలోచన దృక్పథంలోనూ మార్పు వస్తోంది. - రామ్ గొల్లమూడి, ఫౌండర్, ఎడ్యూటర్ -
ఒంటరితనం ‘గుండె’కు చేటు
న్యూయార్క్ : మనలో చాలామంది కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించాలని అభిప్రాయపడుతుంటాం. అప్పుడే ఎలాంటి బాదరాబందీ ఉండవని భావిస్తుంటాం. అయితే అలా ఎక్కువ రోజులు ఎవరూ ఒంటరిగా జీవించలేమట. ఎక్కువ కాలం ఒంటరిగా బ్రతికే వాళ్లకి గుండెపోటులు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించేవాళ్లకి 29 శాతం ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు, 32 శాతం హార్ట్ స్ట్రోకుల కలిగి ఉంటున్నారని తేల్చారు. ఒంటరితనాన్ని, సమాజానికి దూరంగా జీవించేవాళ్లని గుర్తించి, ఈ రెండింటికి సంబంధించిన సమస్యల నుంచి వారిని కాపాడటం ప్రధానమైన కర్తవ్యంగా బ్రిగ్హం యంగ్ యూనివర్సిటీ పరిశోధకలు పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. లక్షా 81 వేల మంది పెద్దలపై మూడు నుంచి 21 ఏళ్లు జరిపిన ఈ పరిశోధనలో, 4,628 కేసులు గుండెకు సంబంధించిన వ్యాధులుగా నమోదు అవగా, మూడువేల స్ట్రోకులను పరిశోధకులు గుర్తించారు. ఎలాంటి వ్యాధులు రాకుండా మనశ్శాంతిగా జీవించేందుకు సామాజికంగా అందరితో కలివిడిగా ఉండాలని తెలిపారు. అయితే టెక్నాలజీ అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో సామాజికంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం కోసం సమర్ధవంతమైన జోక్యాల రూపకల్పనే అతిపెద్ద సవాలని పరిశోధకులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. -
హవ్వా.. చైనా జనాలకు చీమకుట్టినట్లైనా లేదు
బీజింగ్: మానవత్వం భారతదేశంలో రానురాను తగ్గిపోతుందని గగ్గోలుపడిపోతుంటాంకానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనమే నయం అనిపిస్తుందేమో. అవును.. చైనాలో మానవత్వం ఎప్పుడో మంటగలిచిపోయిందని ఈ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో సాధారణంగా చిన్నపిల్లల కిడ్నాప్‌లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయం ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ప్రజలకు ఇలాంటి అంశాలపై ఎంతమేరకు ఆందోళన ఉంటుందో, ఎలా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక చిన్నపిల్లాడిని బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో నిల్చోబెట్టి అందరూ చూస్తుండగా క్లోరో ఫామ్ ముక్కుకు పెట్టి ఎత్తుకెళ్లిపోతున్నట్లుగా ప్రవర్తించారు. ఇలా పార్క్‌లలో, రెస్టారెంట్లలో, వీధుల్లో, కళాశాల వద్ద పరిపరి విధాలుగా కిడ్నాప్ చేస్తున్నట్లుగా నటించారు. కానీ, ఇదంతా చూస్తున్న ఆ చుట్టుపక్కలవారు కనీసం ఆ కిడ్నాపర్‌ను అడ్డుకోలేదు కదా... కనీసం ఆందోళన కూడా పడలేదు. మాకే సంబంధం లేదన్నట్లుగా కనీసం చీమకుట్టినట్లయినా లేకుండా కనిపించారు. ఏ ఒక్కరూ అతడిని గల్లా పట్టుకొని అడుగుతారేమోనని ఆశగా చూసిన అంతా బాధ్యతా రహితంగానే కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. -
బాల్యానికి బరువు బాధ్యతలు
► ఒకే గ్రామంలో ఇద్దరు బాలికలకు నిశ్చితార్థం ► ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలకే కారణం ► తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్ నవాబుపేట: ముక్కుపచ్చలారని బాలికలకు బాల్యంలోనే బాధ్యతలను అంటగడుతున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు.. వంటి సమస్యలు పసితనాన్ని పెళ్లిపీటలు ఎక్కిస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిన ఇద్దరు బాలికలు తమకు పెళ్లివద్దని.. చదువుకుంటామని అధికారుల ఎదుట కన్నీరుపెట్టడం పలువురిని కలిచివేసింది. ఈ విషయం మంగళవారం పల్లెవికాసంలో వెలుగుచూసింది. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ బాలిక నవాబ్‌పేట జెడ్పీ ఉన్నతపాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వచ్చేనెల 1న ఆమెకు తల్లి, బంధువులు కలిసి కోయిల్‌కొండ మండల కేంద్రానికి చెందిన రఘుతో పెళ్లి కుదిర్చారు. తల్లి మాట కాదనలేక.. పెళ్లి వద్దని అడ్డుచెప్పలేక తలదించుకుని తాళిబొట్టు కట్టించుకోవాలనుకుంది. పల్లె వికాసం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన అధికారుల బృందానికి ఈ విషయం తెలిసింది. సదరు బాలిక వద్దకు వెళ్లి అసలు విషయాన్ని ఆరాతీశారు. ‘సర్.. నాకు చదువుకోవాలని ఉంది.. మా అమ్మ, బంధువులు నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారికి ఏమీ చెప్పలేక పోయా..’ అని కన్నీరుమున్నీరైంది. నీకు పెళ్లి ఇష్టమేనా.. అని అడిగేసరికి ఆమె నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. మండల ప్రత్యేకాధికారి సురేష్ గౌతం, తహసీల్దార్ చెన్నకిష్టప్ప బాలిక తల్లి, బంధువులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజర్‌గా మారిన తరువాతే పెళ్లి జరిపించాలని నచ్చజె ప్పారు. అదే గ్రామంలో మరో బాలిక నవాబుపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లి ఈనెల 28న ఆమెకు పెళ్లి నిశ్చయించింది. వివాహ ఏర్పాట్లు కూడా చ కచకా సాగుతున్నాయి. గ్రామంలోకి వెళ్లిన అధికారులకు ఈ విషయం తెలియడంతో తల్లి, ఇతర బంధువులకు అవగాహన కల్పించారు. మైన ర్లకు పెళ్లిచేయడం చట్టరీత్యానేరమని చెప్పారు. ఇదిలాఉండగా, తమ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతోనే పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించామని ఆ బాలికల తల్లులు వాపోయారు. పేదరికమే కారణమంటున్నారు. -
చిన్నారి పెళ్లికూతురితో 65 ఏళ్ల వృద్ధుడి పెళ్లి!
బాల్యవివాహాలపై ప్రజల స్పందన ఎలా ఉంటుంది. ఏమో చాలా సందర్భాల్లో ముక్కుపచ్చలారని పసిపిల్లలను కాటికి కాళ్లు చాపుకొన్న వృధ్దులకు కట్టబెట్టినా.. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లి.. అక్షింతలు వేసి పప్పన్నం తినొచ్చేవాళ్లే చాలామంది ఉంటారు. కొందరు మాత్రం ఏమిటి దారుణమని ప్రశ్నిస్తారు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. 65 ఏళ్ల వృద్ధ వరుడు, 12 ఏళ్ల ముక్కుపచ్చలారని వధువు.. న్యూయార్క్ వీధుల్లో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. టైమ్స్ స్క్వేర్ వద్ద వివాహ దుస్తుల్లో చూడటానికే వింతగా ఈ జంట ఫొటోలు తీసుకుంటుండగా ప్రజలు చాలామంది బిత్తరపోయి చూశారు. ఈ వికృత వ్యవహారాన్ని చూసి చాలామంది ముఖకవళికలు మారిపోయాయి. కొందరు ఈ దారుణాన్ని చూడలేక అక్కడి నుంచి మౌనంగా తప్పుకొన్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఓ మహిళ కంటతడి పెడుతూ కనిపించింది. ఓ యువతి ముందుకొచ్చి 'మీ అమ్మేది' అంటూ చిన్నారి పెళ్లికూతురిని ప్రశ్నించింది. ఆమె తల్లిదండ్రుల అనుమతితోనే తాను ఈ పెళ్లి చేసుకుంటున్నట్టు వృద్ధ వరుడు సెలవిచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె అతణ్ని చెడామడా తిట్టేసింది. మరో వ్యక్తి అయితే ఈ రోత పెళ్లి తంతును చూసి గాబారా పడ్డాడు. ఆందోళన చెందాడు. వరుడితో ఏకంగా గొడవకు దిగాడు. దీంతో సెక్యూరిటీ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. ఇంతమందిలో ఆగ్రహాన్ని, దిగ్భ్రమను కలిగించిన ఈ వ్యవహారం.. నిజానికి నిజం కాదు. చాలా దేశాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌లో ఈ తంతు జరిగితే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి యూట్యూబ్‌కు చెందిన కాబీ పెర్సిన్ గ్రూప్ ఈ సామాజిక ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నటులైన 65 ఏళ్ల వ్యక్తి, 12 ఏళ్ల బాలిక నూతన వధూవరులుగా కనిపించగా.. ఈ రియాల్టీ ఎక్స్పెరిమెంట్పై ప్రజల నుంచి పెద్దస్థాయిలోనే ఆగ్రహం, ఆందోళన వ్యక్తమయ్యాయి. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. -
మదిలో మెదిలే మాట... బయటకు రాదే!
నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్నాను. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మన ఆర్థికశాఖా మంత్రి ఎవరు అని అడిగారు. సమాధానం నాకు తెలుసు. చాలాసార్లు చదివాను. మదిలో మెదులుతూనే ఉంది. కానీ ఎంతకీ గుర్తు రాలేదు. దాంతో మాజీ మంత్రి పేరు చెప్పేశాను. ఇంటర్వ్యూ చేసే ఆయన నవ్వేశారు. ప్రతిసారీ ఇంటర్వ్యూలో ఇదే పరిస్థితి. అన్నీ తెలుసు. కానీ సమయానికి ఒక్కటీ గుర్తు రాదు. ఈ సమస్య తీరేదెలా? - కళ్యాణ్, వైజాగ్ దీన్ని సోషల్ యాంగ్జయిటీ అంటారు. కాలేజీలో చదివే రోజుల్లో ఒక్కసారి కూడా స్టేజి ఎక్కని వారికి, తమపట్ల తమకి అపనమ్మకం ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్టుండి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పొద్దున్నే లేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటూ ఐదు సెకన్లు సన్నగా నవ్వండి. నవ్వినప్పుడు మెదడులో ‘సెరొటొనిన్’ అన్న రసాయనం విడుదలవుతుంది. అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. టెన్షన్ వల్ల విడుదలయ్యే ‘కార్టిజాల్’కి వ్యతిరేకంగా పనిచేసే మందు ‘సెరొటొనిన్’. అందుకే పరీక్ష రాసే టప్పుడు, ఇంటర్వ్యూ సమయాల్లోనూ చిరునవ్వుతో ఉండాలి. మనిషి కంగారుగా ఉన్నప్పుడు మెడ దగ్గర చెమట్లు పట్టడం, చేతివేళ్లు వణకటం, గొంతు తడారిపోవడం మొదలైన పరిణామాలు సంభవిస్తాయి. దీనికి కారణం కొన్ని ఎండార్ఫిన్స్. కొంతమందిపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితుణ్ని తొందరగా సమాధానం చెప్పమని చెప్పి... ‘నువ్వు బ్యాచిలరా ఆన్మ్యారీడా’ అని అడిగి చూడండి. అతను కంగార్లో బ్యాచిలర్ అంటాడు. నిజానికి రెండూ అని చెప్పాలి. కానీ అలా చెప్పడు. కరాటే ఆటగాడు పోటీలో ప్రవేశించబోయే ముందు ఏ విధంగా గాలిలోకి పంచ్‌లు ఇస్తూ, బలంగా ఊపిరి తీస్తూ మూడ్‌లోకి ప్రవేశిస్తాడో... అదే విధంగా ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు నిమిషం పాటు కళ్లు మూసుకుని బలంగా ఊపిరి పీలుస్తూ ఉండండి. నేను నిర్వహించే వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో... సినిమాలు బాగా చూసే విద్యార్థుల్ని స్టేజి మీదికి పిలిచి, ఒక్క నిమిషం టైమ్‌లో పదిహేనుమంది తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పమంటే వారికి కూడా మీలాంటి స్థితే సంభవిస్తుంది. పేర్లు తెలియక కాదు. మానసిక వత్తిడి ఎక్కువయ్యేకొద్దీ న్యూరో ట్రాన్స్మీటర్స్ని మెదడు శూన్యంగా చేసేస్తుంది. ఇలాంటి స్థితి నుంచి కొన్ని టెక్నిక్స్ ద్వారా సులువుగా బయట పడవచ్చు. ఇంటర్వ్యూలో ఇలాంటి పరిణామాలు సంభవించకుండా ఉండటానికి ఏం చేయాలో నా వెబ్సైట్ (yandamoori.com)లో వంద టిప్స్ అనే అధ్యాయంలో రాశాను. స్థలాభావం వల్ల అవన్నీ ఇక్కడ రాయలేను కాబట్టి అక్కడ చదివే ప్రయత్నం చేయండి. నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. అందుకే మ్యూజిక్‌లో డిగ్రీ చేయాలని ఉంది. కానీ మా నాన్నగారికి కళలపై పెద్ద ఇష్టం లేదు. అలాంటివేమీ అక్కర్లేదు, ఎంసెట్ రాసి మెడిసిన్ చేయమంటున్నారు. నాకు ఆసక్తి లేదు. మెడిసిన్ చేయాలంటే చాలా డెడికేషన్ ఉండాలంటారు. అసలు ఇష్టమే లేనప్పుడు నేనెలా మంచి డాక్టర్ని అవ్వగలుగుతాను? ఈ విషయం అమ్మతో చెప్పించినా నాన్న వినడం లేదు. ఆయనకు నా బాధ అర్థమయ్యేలా మంచి సమాధానం ఇవ్వండి. అది చూపిస్తాను. మీలాంటివారు చెబితేనైనా ఒప్పుకుంటారని నా ఆశ. - బిందు, నిజామాబాద్ మీ సమస్య అర్థవంతమయ్యింది. నాకు అర్థమయ్యింది. పిల్లల స్టాండర్డ్ తెలుసుకోలేక పెద్ద పెద్ద ఆశలతో వాళ్లని శాసించి, అన్ని విధాలా నష్టపరిచే తల్లిదండ్రులు కోకొల్లలు. మీ నాన్నగారు కూడా అటువంటి జాబితాలో చేరడం దురదృష్టకరం. నా సమాధానం చూసి మీ నాన్నగారు మనసు మార్చుకుంటారని నేను అనుకోను. మీ బాధను అర్థం చేసుకోగలిగే పెద్దవారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే... వారితో నాన్నకు చెప్పించండి. అప్పటికీ వినకపోతే ఎంసెట్ రాయండి. సీట్ ఎలాగూ రాదు కాబట్టి ఆయనే మీ దారికి వస్తారని ఆశిద్దాం. అయితే ఆయన తరఫు నుంచి కూడా ఒక నిమిషం ఆలోచించాలి మీరు. కేవలం మ్యూజిక్‌లో డిగ్రీ సంపాదించడం వల్ల కచేరీలు చేసి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలరా? లేదా వివాహం చేసుకుని గృహిణిగా స్థిరపడదామను కుంటున్నారా? ఓసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. లేదంటే ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ చేస్తూ మ్యూజిక్‌లో డిగ్రీ చేయండి. ఒకవైపు చదువు, మరొకవైపు అభిరుచి. మంచి కాంబినేషన్! - యండమూరి వీరేంద్రనాథ్ -
పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి
ప్రధాని మోదీ పిలుపు మోదీ సూచనలపై బ్లూప్రింట్ రూపకల్పన న్యూఢిల్లీ: దేశంలోని పోలీసులు పల్స్ పోలియో లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇటీవల గుజరాత్లో పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన డీజీపీలు, ఐజీల సదస్సులో మోదీ చర్చించిన విషయాలపై తాజాగా బ్లూప్రింట్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆయా విభాగాలు తయారుచేసిన బ్లూప్రింట్ ప్రకారం పోలీసులు, సాయుధ బలగాలు పనిచేయడం ప్రారంభించాయి. వారి ఠాణా పరిధిలో పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడం, పాఠశాలలు, కళాశాలల్లో మెరిట్ విద్యార్థులను, వక్తృత్వ పోటీల్లో విజేతలను పోలీసు మెమెంటోలతో అభినందించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని మోదీ పేర్కొన్నారు. ట్వీటర్, ఫేస్బుక్ ఖాతాలను తెరిచి వదంతులను అరికట్టేందుకు కృషిచేయాలన్నారు. రాష్ట్రానికో ‘ఐకాన్’ రైల్వేస్టేషన్ ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్క రైల్వే స్టేషన్‌ను అయినా.. దానికి ఒక విశిష్ట నిర్మాణం (ఐకాన్)గా, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా రూపొందించేలా అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఢిల్లీలో ప్రగతి (క్రియాశీల పరిపాలన, సమయానికి అమలు) సమావేశంలో రాష్ట్రాల్లో కొనసాగుతున్న రోడ్డు, రైల్వే,విద్యుత్ పలు మౌలిక ప్రాజెక్టులపై సమీక్షించారు. -
ఒక వర్గానికే పెద్దపీట
ఎస్వీయూ పాలకమండలిలో సామాజిక అసమతుల్యం మైనారిటీ, మహిళలకు దక్కని చోటు బీసీలకు తగ్గిన {పాధాన్యం యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీకి బుధవారం ప్రకటించిన పాలకమండలిలో సామాజిక అసమతుల్యత నెలకొంది. ఎస్వీయూకు పాలకమండలిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పాలకమండలిలో నియమితులైన తొమ్మిది మందిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంతేగాకుండా మహిళలకు మొండిచేయి చూపించారు. ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పిం చలేదు. అలాగే మైనారిటీలకు అవకాశం కల్పించలేదు. పాలకమండలిలో గల్లా రామచంద్రనాయుడు, గురుప్రసాద్, హరి, అరుణ(పురుషుడు), బాల సిద్ధముని, జీవీ ప్రసాద్, అబ్బయ్య, చంద్ర య్య, బాబుకు చోటు దక్కింది. వీరిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కాగా రెడ్డి, బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరి వంతున ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మహిళలకు అన్యాయం ఎస్వీయూ పాలకమండలిలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించకపోవడం దారుణం. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకరికి మాత్రమే పదవి ఇచ్చారు. అలాగే మహిళలకు ఇవ్వకపోవడంతో మహిళా సాధికారితకు అర్థం లేకుండాపోయింది. ఎస్వీయూలో రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సంస్థ నిర్వాహకులు, ఇతర ముఖ్య పదవుల్లో సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఎస్వీయూ పాలకమండలిని రద్దు చేసి మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించాలి. - వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
షిగ్యారేజ్
ఒకప్పటి పాట- కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? ఇప్పటి పాట- బుగ్గ మీద ఆయిల్ మరక ఎలా వచ్చెనో చెప్పగలవా? ఆడవాళ్లు గ్యారేజ్ నడపడం అన్నది మరీ అంత ఊహకు అందని విషయమేమీ కాదు. కాని ఆడవాళ్ల కింద మగ మెకానిక్‌లు పని చేస్తున్నారంటే మాత్రం ఊహకు అందడం లేదు. సాటి మగవాళ్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి ఎన్నో స్పీడ్ బ్రేకర్లను సామాజిక అవరోధాలను దాటుకొని రోడ్డెక్కిన షీ గ్యారేజ్ - పారామౌంట్. చూస్తే మీరూ అంటారు... ఆడాళ్లూ మీకు జోహార్లు. ‘పారామౌంట్ గ్యారేజ్ ఎక్కడండీ?’ ‘ఆ గ్యారేజ్ అడ్రస్ ఎందుకండీ బాబూ.. అది ఓ మేకప్ గ్యారేజ్! మీ వెహికిల్‌కి మంచి సర్వీసింగ్ కావాలంటే వేరే గ్యారేజ్‌కి వెళ్లండి!’ ‘అరే.. పారామౌంట్ గ్యారేజ్‌లో జాబ్ దొరికిందిరా.. జాయిన్ అవుదామనుకుంటున్నా?’ ‘నీకేమన్నా దిమాగ్ ఖరాబైందారా? పోయి పోయి గండ్ల జాయిన్ అవుతా అంటున్నవ్?’ ‘ఎందుకురా.. జీతం సరిగ్గ ఇయ్యరా?’ ‘జీతం బారాబరే ఇస్తరు.. కానీ ఆడోళ్ల కింద పరిజేసి ఇజ్జత్ దీసుకునుడు అవసరమారా నీకు? ఈడ గాకపోతే ఇంకేడన్నా కొలువు దొరుకుతది. ఇజ్జత్ ముఖ్యం మనకు!’ ‘అన్నా.. పారామౌంట్ గ్యారేజ్‌లో మెకానిక్‌గా ట్రైనింగ్‌కి వెళ్తా అన్నా!’ ‘అక్కడ మగవాళ్లు కాదు ఆడవాళ్లు ఉంటారట. వాళ్లకేం వస్తుందని నీకు నేర్పుతార్రా? ఇంకేదైనా మంచి గ్యారేజ్ చూసుకో!’ పదేళ్ల కిందట ఆ గ్యారేజీ పగ్గాలు చేపట్టినప్పుడు విద్యానంబిరాజన్కు ఇలాంటి హేళనలే ఎదురయ్యాయి. వాటిని భరిస్తూనే ఆమె తన గ్యారేజీని అంతర్జాతీయ ప్రమాణాలకు మారుపేరుగా తీర్చిదిద్దుకున్నారు. ఆడవాళ్ల జాడే లేని ఆటోమొబైల్ మెకానిజంలో అడుగుపెట్టడమే సాహసం అనుకుంటే, అత్యుత్తమ సేవలతో ఈ రంగంలో తన ఉనికిని సుస్థిరం చేసుకున్నారామె. ఇదంతా సాఫీగా సాగిన ప్రయాణం కాదు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉండొచ్చో అంచనా వేయడానికి అదేమీ ఆమెకు తెలిసిన దారి కూడా కాదు. నిజానికి అప్పటి వరకు ఆమె రూటే వేరు. విద్యా నంబిరాజన్ పుట్టింది చెన్నైలో అయినా పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి నంబిరాజన్ ఈసీఐఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి శకుంతల గృహిణి. విద్యకు ఒక అన్న, తమ్ముడు. సవాలుగా స్వీకరించి... విద్య తండ్రి నంబిరాజన్ 1988లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక, సైనిక్‌పురిలోని మధురానగర్ రోడ్ నం:4లో ‘పారామౌంట్ ఆటోబే సర్వీసెస్’ పేరిట గ్యారేజీ పెట్టారు. పన్నెండేళ్లు ఆయనే చూసుకున్నారు. ఆయన ఆరోగ్యం 2000 సంవత్సరంలో క్షీణించింది. అప్పటికే కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు కొడుకుల కంటే ఆయనకు ఎందుకో కూతురి మీదే గురి. అందుకే, ఎంబీఏ చదివి చెన్నైలో మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డ కూతురిని రప్పించారు. ఆమెకు గ్యారేజ్ అప్పగించి, విశ్రాంతి కోరుకున్నారు. అప్పటికి డ్రైవింగ్ తప్ప వెహికల్స్ గురించి విద్యకు ఏమీ తెలియదు. చదివిన చదువుకు, ఉద్యోగానుభవానికి ఏమాత్రం పొంతన లేని బాధ్యత అది. అయినా తండ్రి అప్పగించిన బాధ్యతను సవాలుగా స్వీకరించారామె. ఒంటరి పోరాటం... ‘పారామౌంట్’ బాధ్యతలను విద్య చేపట్టే నాటికి అందులో పన్నెండు మంది మగవాళ్లు పనిచేస్తున్నారు. ఆడబిడ్డ హోదాలో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పలకరించేవాళ్లే యజమాని హోదాలో ఆమె గ్యారేజీ బాధ్యతలను స్వీకరించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్కొక్కరే ఉద్యోగం వదిలి వెళ్లిపోయారు. ‘ఎందుకలా వెళ్లిపోతున్నార’ని తండ్రీ కూతుళ్లిద్దరూ అడిగారు. ‘ఆడవాళ్ల కింద పనిచేయడం ఇష్టంలేదు’.. అందరిదీ ఒకటే మాట. ముగ్గురితో మళ్లీ మొదలు... అప్పటి వరకు పనిచేస్తున్న వాళ్లందరూ వెళ్లిపోయినా, విద్య ఏమాత్రం కుంగిపోలేదు. కొత్తగా ముగ్గురు మెకానిక్‌లను పనిలోకి తీసుకుని, మళ్లీ మొదలుపెట్టారు. ఆ ముగ్గురిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆమ్మాయి పేరు పద్మ. గ్యారేజీని బాగా నడిపించాలంటే తానూ మెలకువలు నేర్చుకోవాలనుకున్నారు విద్య. అందుకే పద్మతో పాటు తాను కూడా ఇద్దరు అబ్బాయిల దగ్గర పని నేర్చుకున్నారు. అయినా, సర్వీసింగ్‌కు వచ్చే కస్టమర్లు అంతంత మాత్రమే! కారణం.. దుష్ర్పచారం. ‘మెకానిక్ పని ఆడోళ్లు చేస్తరా? ఆ గ్యారేజీకి పోతే మీ బండ్లు అంతే సంగతి’ అంటూ మిగిలిన గ్యారేజీల వాళ్లు ప్రచారం చేసేవాళ్లు. అయినా కుంగిపోలేదు విద్య. మార్కెట్లోకి ఏ కొత్త మెషినరీ విడుదలైనా వెంటనే తెప్పించడం మొదలుపెట్టారు. అలా కార్ వాష్ మెషిన్‌ను, ఇంజన్ స్కానర్‌నూ తెప్పించారు. మెషిన్‌తో కార్లు వాష్ చేసిన తొలి గ్యారేజీ ఆమెదే. సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్.. తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటివి నేర్పిస్తే బాగుంటుందనుకున్నారు విద్య. ట్రైనింగ్ సంస్థల సహకారంతో శిక్షణ ఇప్పించారు. వారిని చూసి అబ్బాయిలు కూడా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలనుకున్నారు. వారిని కూడా శిక్షణకు పంపారు విద్య. వర్కర్స్‌ను, గ్యారేజీని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తూ ఇప్పుడు పదిహేను డివిజన్లలో సర్వీసులు అందిస్తున్నారు. మెరుగైన సర్వీసులకు గుర్తింపుగా ‘పారామౌంట్’ గ్యారేజీకి ఐఎస్ఓ సర్టిఫికేట్, జర్మనీలోని డాక్స్ సర్టిఫికేట్ దక్కాయి. ‘పారామౌంట్’ శిక్షణే పాస్‌పోర్ట్... ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందిన వాళ్లకు నిస్సాన్, మహీంద్ర, లక్ష్మీ హ్యూండై వంటి వాళ్లు మంచి జీతంతో ఉద్యోగాలిస్తున్నారు. ‘పారామౌంట్’ వర్కర్స్‌లో నైపుణ్యం పెంపొందించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌లోని పెద్ద కార్ల కంపెనీలతో సమన్వయం కుదుర్చుకున్నారు విద్య. ఇండియన్ మార్కెట్లోకి ఏ కొత్త హైఎండ్ కారు విడుదలైనా ఆయా కంపెనీలకు చెందిన సిబ్బంది ‘పారామౌంట్’కు వచ్చి ఆ కార్ల పనితనాన్ని, మెకానిజం నేర్పించి వెళ్తున్నారు. నంబిరాజన్ ఫౌండేషన్.. పారామౌంట్ ఆటో బే సర్వీసెస్ వ్యవస్థాపకుడు, విద్యా తండ్రి నంబిరాజన్ 2014లో కన్నుమూశారు. తండ్రి పేరు మీద ‘నంబిరాజన్ ఫౌండేషన్’ స్థాపించి ఎందరో అమ్మాయిలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువు మీద ఆసక్తి ఉన్న పేద అమ్మాయిలకు బీఈ, మెకానిజంలో డిప్లొమా కోర్సులు చదవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అబ్బాయిలకూ నామమాత్రపు రుసుముతో శిక్షణను ఇప్పించి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు వందమంది గల్ఫ్ వెళ్లారు. ‘చాలా అవమానాలు, ఆర్థిక భారాలు మోసి ఈ స్థితికి వచ్చా. ఒక్కోసారి జీతాలు ఇచ్చేందుకూ డబ్బు ఉండేది కాదు. అమ్మాయివి నీకెందుకు అని లోకమంతా అంటున్నా నా కుటుంబమే నాకు అండగా నిలబడింది’ అంటారు విద్యా నంబిరాజన్. తల్లిగా, చెల్లిగా, కూతురిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, యజమానిగా ప్రతి బాధ్యతా మహిళకు సవాలే. ప్రతి సవాలులోనూ ఆమెది విజయమే. అలాంటి విజయానికి ప్రతీక విద్యా నంబిరాజన్. ది వన్ అండ్ ఓన్లీ లేడీ ఓనర్ ఆఫ్ ఆటోమొబైల్ వర్క్‌షాప్. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫలించిన వ్యూహం... అమ్మాయిలను ఈ రంగం వైపు ఆకర్షించేందుకు రోడ్ షోలూ నిర్వహించారు. ఆసక్తి ఉన్న అమ్మాయిలు చాలామందే చేరారు. అయితే ఇంట్లో వాళ్లు నిరుత్సాహపరచడంతో మధ్యలోనే మానేసేవారు. దీంతో ఆమె వ్యూహాన్ని మార్చారు. ‘మీ ఇళ్లల్లోని అమ్మాయిలకు పని నేర్పిద్దాం’ అంటూ గ్యారేజ్‌లోని మేల్ వర్కర్స్కు నచ్చచెప్పారు. వాళ్లు సానుకూలంగానే స్పందించారు. కొందరు తమ చెల్లెళ్లను, ఇంకొందరు తమ భార్యలను పనిలో చేర్చారు. అప్పటి నుంచి గ్యారేజీ వాతావరణమే మారిపోయింది. పనిలో సహకారం పెరిగింది. ఆ ఫలితం విద్యలో ఉత్సాహాన్ని నింపింది. ఒకరోజు ‘మీకు తెలిసిన అమ్మాయిలకూ చెప్పండి... ఫ్రీగానే వర్క్ నేర్పించి, పని ఇప్పిస్తా’ అని తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు చెప్పారు. వాళ్ల ద్వారా చాలామందే వచ్చి, గ్యారేజీలోనే స్థిరపడ్డారు. అబ్బాయిల కంటే అమ్మాయిలో నిబద్ధతతో పనిచేయడం గమనించి, వారిని బిల్లింగ్, స్టాక్ చెకింగ్ వంటి కీలకమైన బాధ్యతల్లోనూ నియమించారు. -
ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారు
గోవా సామాజిక వేత్త స్వాతి కేర్కర్ హైదరాబాద్: దేశంలో అన్ని ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నాయని గోవా సామాజిక వేత్త స్వాతి కేర్కర్ అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ యోధులు బిస్మార్క్ స్మృతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి కేర్కర్ మాట్లాడుతూ గోవాలో సెజ్‌ల పేరుతో ప్రజలను కొల్లకొట్టాలని చూశారని, ప్రజలు మేల్కొని ఈ సెజ్‌లు ఒక స్కామ్ అని తెలుసుకొని ఎదిరించారన్నారు. కోర్టు కూడా ఈ సెజ్‌లను వ్యతిరేకించిందని అన్నారు. బిస్మార్క్లాగా అక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యమించారన్నారు. గోవా చూడటానికి ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందో... అదే విధంగా ప్రతి గ్రామంలో ఉద్యమకారులు ఉన్నారని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ బిస్మార్క్ మరణం ఒక పెద్ద ప్రశ్నను సమాజం ముందు పెట్టిందని అన్నారు. శాంతియుతంగా ప్రజల కోసం పోరాడిన అహింసావాదిని చంపడం హేయమైన చర్య అన్నారు. ఇసుక, కిరోసిన్ మాఫియాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను సైతం చంపుతున్నాయని అన్నారు. 16 నెలల మోదీ పాలనలో ఏ ఒక్క సమస్య సాధారణ ప్రజలకు సంబంధించింది కాదని ఆయన విమర్శించారు. ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ నాయకురాలు హేమా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, కవయిత్రి విమల, మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్‌కుమార్ , సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, వి. సంధ్య, వై. నాగేశ్వర్రావు, కొండవీటి సత్యవతి, మాస్టార్జీ, ఫాదర్ బోస్కో, సిస్టర్ లిజీ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు...
మానవ జాతికి మనుగడ ఇచ్చేది మహిళ. తల్లిగా, చెల్లిగా, అక్కగా, కుమార్తెగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా అనేక పాత్రలను సమర్థవంతంగా పోషిస్తోంది. అలాంటి ఆడపిల్లలకు కూడా ఆలోచనలు, అభిరుచులు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, హక్కులు ఉంటాయని సమాజం పూర్తిస్థాయిలో గుర్తించటం లేదు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా మానవ హక్కులు అనుభవించనీయకుండా స్త్రీ ఆంక్షలకు, లింగ వివక్షతకు గురవుతోంది... ప్రాచీన కాలంలో స్త్రీలు పురుషులతో సమానంగా హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించారు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేదని రుగ్వేద శ్లోకాల ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో స్త్రీల పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. మధ్యయుగం నాటికి మతం, సంప్రదాయాలు పేరిట బాల్య వివాహాలు, సతీ సహగమనం, దేవదాసీ, పునర్వివాహాలను అంగీకరించకపోవటం వంటి ఎన్నో దురాచారాలు ఆవిర్భవించాయి. సతీసహగమనం: భర్త మృతి చెందినప్పుడు ఆయన శవంతో పాటు భార్య కూడా చితిమంటలో కాలి మరణించటం సతీసహగమనం. దీన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా చేయించేవారు. ఈ దురాచారం బెంగాల్లో ఎక్కువగా ఉండేది. దయాభాగ విధానం అమల్లో ఉండటం దీనికి కారణంగా చెబుతారు. ఈ విధానం ప్రకారం మరణించిన భర్త ఆస్తిపై వితంతువుకు హక్కు ఉంటుంది. ఈ అడ్డు తొలగించేందుకు సతీసహగమనాన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. స్త్రీకి పసిపిల్లలు ఉంటే వాళ్ల పోషణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పుడు, గర్భిణీగా లేనప్పుడు, రుతుక్రమం లేనప్పుడు, మైనర్లు కానప్పుడు మాత్రమే సతీసహగమనం ఆచరించాలని కొందరు పండితులు చెప్పారు. కానీ, దీన్ని అమలు చేయలేదు. భర్త చనిపోయిన పరిస్థితిలో భార్య మానసిక స్థితిని అంచనా వేయకుండా, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి, బలవంతంగా సహగమనం చేయించేవారు. 1815-1828 మధ్య ఒక్క బెంగాల్లోనే 8,000 మందికి పైగా మహిళలు ఈ దురాచారానికి బలయ్యారు. జౌహర్: ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు. గెలిచిన రాజులు, సైన్యం చేతిలో లైంగిక దాడులకు గురవకుండా, తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు. ఈ ఆచారం రాజపుత్రుల్లో ఎక్కువగా ఉండేది. మధ్యయుగంలో రాణి పద్మావతి జౌహర్ ప్రముఖమైంది. పరదా పద్ధతి: మధ్యయుగంలో ఈ ఆచారం ఎక్కువగా ముస్లింలు, హిందూ కులీనులు, కొన్ని జాతుల్లో కనిపించేది. స్త్రీలు తమ శరీరం బయటకు కనిపించకుండా, తెర వెనుక ఉండటం, మేలి ముసుగు వేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల బయటకు వెళ్లటానికి, స్వేచ్ఛగా ఇతరులను కలవటానికి అవకాశం ఉండేది కాదు. స్త్రీల విద్యాభ్యాసానికి ఇది ముఖ్య అవరోధంగా ఉండేది. దేవదాసీ వ్యవస్థ: దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. పదో శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ ఆచారం ప్రకారం కన్యలను దేవుని విగ్రహంతో వివాహం జరిపిస్తారు. వారు దేవున్ని సేవిస్తూ, సంగీతం, నృత్యాలు చేస్తూ జీవితాంతం కన్యలుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను పక్కదారి పట్టించి, వేశ్యలుగా మార్చారు. బాల్య వివాహాలు: రజస్వల కాకముందే బాలికకు వివాహం జరిపించాలనే దురాచారం భారతీయ సమాజంలో ఉండేది. మూడేళ్లు, అయిదేళ్ల వయసులోనే వివాహాలు జరిపేవారు. ఇది బాలికల విద్యాభ్యాసానికి అవరోధంగా నిలిచేది. పసి వయసులోనే వితంతువులుగా మారి, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చిన్నతనంలోనే గర్భం ధరించటం వల్ల ఇబ్బందులకు గురయ్యేవారు. స్త్రీవాద ఉద్యమాలు భారతదేశంలో స్త్రీవాద ఉద్యమాలను మూడు దశలుగా విభజించవచ్చు.మొదటి దశ (బ్రిటిష్ పరిపాలన కాలం-1915): ఈ దశలో ఐరోపా వలస పాలకులు మూఢాచారాల గురించి బహిరంగంగా మాట్లాడటంతో పాటు వాటి నిర్మూలనకు కొన్ని చట్టాలు చేశారు. స్త్రీల అణచివేతను, మూఢాచారాలను తొలగించేందుకు సంఘ సంస్కర్తలు ప్రయత్నించారు.రెండో దశ (1915-1947): ఈ దశలో స్త్రీలు తమకోసం ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.మూడో దశ (స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకు): ఈ దశలో స్త్రీవాద ఉద్యమాల దృక్పథం, పోరాట పద్ధతుల్లో ఎంతో వైవిధ్యాన్ని గమనించవచ్చు. స్త్రీవాద ఉద్యమాలను కొందరు స్వాతంత్య్ర పూర్వదశ, స్వాతంత్య్ర అనంతర దశగా విభజించారు. స్వాతంత్య్ర పూర్వ దశ: ఈ దశలో స్త్రీవాద ఉద్యమాలను రెండు దశలుగా విభజించవచ్చు. అవి సాంఘిక సంస్కరణ ఉద్యమం, స్వాతంత్య్ర ఉద్యమం. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో స్త్రీలను అణచివేస్తున్న మూఢాచారాల తొలగింపునకు సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరోవైపు స్త్రీలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశంలో సంఘసంస్కరణలకు ఆద్యుడు రాజారాం మోహన్‌రాయ్. ఆయన సతీసహగమన నిషేధం, కులీనుల్లో బహు భార్యత్వం నిర్మూలన, స్త్రీల హక్కులు తదితరాల గురించి పాటుపడ్డారు. ఆయన కృషి వల్ల అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టం (1829, డిసెంబరు 4) చేశాడు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాలు జరిపించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన 1855 జనవరిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ కరపత్రం ప్రచురించారు. ఆయన కృషి కారణంగా ప్రభుత్వం 1856, జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది. విద్యాసాగర్ మొదటి వితంతు వివాహాన్ని 1856, డిసెంబరు 7న జరిపించారు. దక్షిణ భారతంలో వితంతు వివాహాలకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారు. ఆయన 1881, డిసెంబరు 11న వివాహం జరిపించారు. పునర్వివాహం విషయంలో మహదేవ్ గోవింద్ రనడే, విష్ణుశాస్త్రి పండిట్, గోపాల్ దేశ్‌ముఖ్ వంటి ఎందరో సంస్కర్తలు కృషిచేశారు. దేశవ్యాప్తంగా బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, ప్రార్థనా సమాజం (మహారాష్ట్ర) సభ్యులు బాల్య వివాహాల నిషేధానికి, వితంతు వివాహాలకు, స్త్రీ విద్యాభ్యాసానికి కృషి చేశారు.బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవచంద్రసేన్ బాల్యవివాహాల నిర్మూలనకు కృషిచేశారు. ఆయన కృషి వల్ల శారదా చట్టం(1929)వచ్చింది. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 14 ఏళ్లు, బాలుర వివాహ వయసు 18 ఏళ్లు. స్త్రీ విద్యకు మొదట్లో మిషనరీలు కృషి చేశాయి. 1818లో లండన్ మిషనరీ.. బెంగాల్‌లోని చిన్సురాలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది. అగ్రవర్ణాల్లో బాలికల విద్యపై అపోహ తొలగించేందుకు గౌరీ మోహన్ విద్యాలంకార్ 1822లో ‘స్త్రీ శిక్షా విధాయక’ పేరిట కరపత్రం ప్రచురించారు. 1849 మేలో కలకత్తాలో జేఈడీ బెతూనీ ఒక పాఠశాల ప్రారంభించారు. అది 1879 నాటికి మహిళా పాఠశాలగా మారింది. పియరీ చరణ్ సర్కార్ బెంగాల్‌లోని బర్సాత్‌లో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో కాళీకృష్ణా బాలికా ఉన్నత పాఠశాలగా మారింది.ఈ విషయాలను గమనిస్తే దేశంలో స్త్రీలు పురుషుల చేతుల్లో అణచివేతకు గురైంది ఎంత నిజమో, మహిళల బాగు కోసం మొదట కృషి చేసింది పురుషులే అన్నది అంతే నిజం. అయితే వీరు మూఢాచారాలను తొలగించటానికి కృషి చేశారే తప్ప స్త్రీ సాధికారితకు ప్రయత్నించలేదు. కానీ, సంఘసంస్కర్తల కృషి వల్ల ఎందరో స్త్రీలు విద్యావంతులై, ప్రజాసేవలో అనుభవం సంపాదించి తమ హక్కుల కోసం పోరాడే చైతన్యం పొందారని చెప్పొచ్చు. మహిళా సంఘ సంస్కర్తలు స్త్రీ సంఘ సంస్కర్తలకు సంబంధించి మొదటగా చెప్పుకోదగిన వారు సావిత్రీబాయీ ఫూలే, పండిత రమాబాయి. సావిత్రి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె తన భర్త జ్యోతిబా ఫూలేతో కలసి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోవింద్ రనడే భార్య రమాబాయి. ఆమె ‘ది హై క్యాస్ట్ హిందూ ఉమెన్’ పుస్తకంలో స్త్రీల అణచివేత, మతం, వలసవాదం మొదలైన వాటిని విమర్శించారు. పుణెలో సేవాసదన్ సంస్థను స్థాపించి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో స్త్రీ పాఠశాలలు, వితంతు ఆశ్రమాలు స్థాపించారు. రమాబాయి పుణెలో ఆర్య మహిళా సమాజ్ను, బాంబేలో శారదా సదన్‌ను స్థాపించారు. తరతరాలుగా స్త్రీలు అణచివేతకు గురవుతున్నప్పటికీ, కొందరు దాని పరిధి నుంచి తప్పించుకొని తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వారిలో బెంగాల్ రచయిత్రి రసుందరీ దేవి ఒకరు. ఆమె ‘అమర్ జీవన్’ పేరిట 1876లో ఆత్మకథ రాశారు. ఆత్మకథను రాసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. తన ఆత్మకథలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించటంతో పాటు స్త్రీలు చైతన్యవంతులు కావాలని సూచించారు. 19వ శతాబ్దం చివర్లో స్త్రీలు తమ కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వర్ణకుమారీ దేవి ఒకరు. ఆమె 1882లో కలకత్తాలో లేడీస్ సొసైటీని స్థాపించారు. ఇది స్త్రీల విద్యాభ్యాసం, వితంతు వివాహాలు, పేద స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేది. ఆమె భారతి అనే పత్రికను నడిపారు. దీనికి ఎడిటర్‌గా పనిచేసి, తొలి భారతీయ మహిళా ఎడిటర్‌గా గుర్తింపు సాధించారు.జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశంలో సమాజ సమస్యలపై అధ్యయనం కోసం 1887లో ఎం.జి.రనడే ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. ఇందులో మహిళా విభాగం (ఇండియన్ ఉమెన్ కాన్ఫరెన్స్) 1904లో ఏర్పడింది. దీని శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. దేశంలో స్త్రీలను కుల, మత, వర్గ, పార్టీలనే భేదం లేకుండా అందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి స్వర్ణకుమారీ దేవి కుమార్తె సరళాదేవి చౌదరాణి 1910లో ‘భారత స్త్రీ మండల్’ సంస్థను ప్రారంభించారు. లాహోర్, అమృత్సర్, హైదరాబాద్, ఢిల్లీ, కరాచీ వంటి చాలా నగరాల్లో సంస్థ శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ కొంత కాలమే మనుగడ సాగించినప్పటికీ జాతీయ స్థాయిలో స్త్రీలకు ప్రాతినిథ్యం వహించిన మొదటి సంస్థగా చెప్పొచ్చు. స్త్రీలకు రాజకీయ హక్కులు! 1917-1945 మధ్యకాలంలో స్త్రీలకు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల్లో సవరణలు ప్రాతిపదికన స్త్రీ వాద ఉద్యమాలు జరిగాయి. 1917లో అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్ వంటి ఐరిష్ మహిళలు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. వీరు స్వదేశంలో మహిళల ఓటు హక్కుల కోసం పోరాటం సాగించారు. అదే విధంగా భారతదేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం పోరాడారు. 1917 సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్‌లు మహిళల ఓటు హక్కు డిమాండ్‌ను సమర్థించాయి. సరోజినీ నాయుడు ‘మాంటేగ్’ను వ్యక్తిగతంగా కలిసి, స్త్రీలకు ఓటు హక్కు కల్పించేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. పార్లమెంటు కమిటీ లింగ ఆధారిత అనర్హతను తొలగించినా, మహిళలకు ఓటు హక్కు నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలేసింది. స్త్రీలకు ఓటు హక్కు ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి? అనేది రాష్ట్ర శాసనసభల నిర్ణయాధికారంగా చెప్పింది. భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్కోర్-కొచ్చిన్ సంస్థానం. ఇది 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. 1921లో మద్రాస్, బాంబేలు ఓటు హక్కు ఇచ్చాయి. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి. భార్యత్వం, విద్య, ఆస్తి ఉన్న స్త్రీలు మాత్రమే ఓటు హక్కు పొందటానికి అర్హులు. 1926లో కమలా దేవి చటోపాధ్యాయ్ మద్రాస్ శాసన మండలికి పోటీచేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముత్తులక్ష్మీ రెడ్డిని మద్రాస్ ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలిగా నియమించింది. -
తెలుగుసీమకు కల్బుర్గి సందేశం
ఏపీ మెజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా గతంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. పూ ర్వాంధ్రప్రదేశ్లోని మొత్తం 23 జిల్లాలలో వేలాది ప్రదర్శనలివ్వడంతో పా టు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, భువనేశ్వర్, కటక్, రాయపూర్, చెన్నై, బెంగ ళూరు, జైపూర్, భోపాల్, అమృత్సర్, తిరువనంత పురం, కొచ్చిన్ తదితర నగరాలలో కూడా ఇంద్రజా లికునిగా నా ముప్ఫై ఏళ్ల వృత్తిలో ప్రదర్శనలిచ్చాను. కర్ణాటక, ధార్వాడ్‌లో గత నెల 30వ తేదీన మల్లేశప్ప కల్బుర్గి మరణవార్త నన్ను కలచివేసింది. మూఢన మ్మకాల వ్యతిరేక సామాజిక ఉద్యమకారులుగా మా మధ్య పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం ఐదు రోజుల పాటు బెంగళూరులో జరిగిన ఒక సమ్మేళనం సంద ర్భంలో మా మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఆయన హత్య వార్త నన్ను చాలా బాధకు గురిచేసిం ది. విజయవాడ వాసిగా, తెలుగువాడిగా, సాటి మూఢనమ్మకాల వ్యతిరేక ఉద్యమకారుడిగా ఆయ నతో నా అనుబంధాన్ని కన్నీటి అశ్రువు లతో తెలుగు సమాజం దృష్టికి తేవడం నా కనీస ధర్మంగా భావిస్తున్నాను. విజయవాడ నాస్తిక సమాజం సం చాలకులు డా॥విజయం, నిర్వాహకులు డా॥సమరం నన్ను 2013 జూలైలో పిలి పించారు. ఆగస్టు 19 నుంచి 23 వరకూ బెంగళూరులో కర్ణాటక రాజ్య పరిషత్ నిర్వహిస్తున్న అడ్వాన్స్ లెవెల్ నేషనల్ వర్క్‌షాప్ అన్ డెవలప్ మెంట్ అండ్ డెమిస్టిఫికేషన్ ఆఫ్ మిరాకిల్స్కు హాజ రు కావాలని కోరారు. అప్పటికే మూఢనమ్మకాలను బహిర్గతపరిచే లక్ష్యంతో నేను ప్రదర్శిస్తున్న ఇంద్ర జాల ప్రదర్శనలను విజయవాడ నాస్తిక కేంద్రం ఆద రించి ప్రోత్సహిస్తూ ఉండేది. వారి సూచన ప్రకారం బెంగళూరులో ఐదు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నా ను. దానికి సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి ప్రతిని ధులు హాజరయ్యారు. మన తెలుగు సీమ నుంచి నేనొక్కడినే హాజర య్యాను. అందులో నేను గంటకు పైగా మ్యాజిక్ ప్రదర్శన చేస్తూ మూఢనమ్మకాలను బహి ర్గత పరుస్తూ ఇచ్చాను. ఐదు రోజుల పాటు ఆ వర్క్‌షాప్‌లో కల్బుర్గి చాలా క్రియాశీలక పాత్రను పోషించారు. ఆయ న చేసిన సుదీర్ఘ ప్రసంగం బాగా రక్తిక ట్టించింది. భాషా సమస్య వల్ల నాకు పూర్తిగా బోధపడకపోయినా, ప్రేక్షకుల నుంచి తన ప్రసంగానికి లభించిన ఆదరణను గ్రహించగలిగాను. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి మనస్సులలో కల్బుర్గికి ప్రత్యేక స్థానం ఏర్ప డింది. అందుకు ఆయన గుణగణాలే కారణం. అం దరితో కలసి మెలసి తిరిగిన ఆయన రూపం ఇప్ప టికీ నా మనస్సులో మెదులుతూనే ఉంది. మేం వర్క్‌షాప్‌లో ఉండగానే మహారాష్ట్రకు చెం దిన ప్రముఖ హేతువాద ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్ హత్య జరిగిన వార్త (20-08-2013) తెలిసింది. వెంటనే సభ మౌనం పాటించింది. చివరి రోజు (23వ తేదీ) అక్కడికి సుమారు కి.మీ. దూరా న గల ఒక చౌరస్తాలో దభోల్కర్ హత్యకు నిరసనగా జరిగిన ధర్నాలో మేమందరం పాల్గొన్నాం. అం దులో కూడా కల్బుర్గి క్రియాశీల పాత్ర నేటికీ గుర్తే. దభోల్కర్ సంతాప సభలో పాల్గొన్న కల్బుర్గికి రెం డేళ్లు తిరిగే సరికి సంతాప సభలను నిర్వహించే దురదృష్టకర పరిస్థితి వచ్చింది. ఇది నాతో సహా ఆనాటి ధర్నాలో పాల్గొన్న ఎవరినైనా కంట తడిపెట్టి స్తుందనుకుంటాను. దభోల్కర్, పన్సారే, కల్బుర్గీలను హిందూ మతోన్మాదశక్తులు హత్య చేయడాన్ని సాధారణ హిం దువులెవరూ బలపరచరు. ఈ ముగ్గురూ శాంతికా ముకులే. నమ్మిన ఆశయాలకు కట్టుబడ్డవారే. అయి నా రాజ్యాంగేతర హింసాత్మక శక్తుల ఎన్‌కౌంటర్‌కు ఈ ముగ్గురు శాంతి కాముకులూ బలయ్యారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా తెలుగుసీమలో కూడా ప్రజాతంత్ర, లౌకిక ఉద్యమాన్ని నిర్మించడం మనందరి కర్తవ్యం కావాలి. మూఢనమ్మకాల వ్యతి రేక లక్ష్యంతో ముప్ఫై ఏళ్లు తెలుగు సీమలో విస్తృతం గా మ్యాజిక్ ప్రదర్శనలిచ్చిన హేతువాదిగా, భౌతిక వాదిగా, ఇంద్రజాలకునిగా ప్రజలకు ఈ విజ్ఞప్తి చేస్తు న్నాను. కల్బుర్గికి నా కన్నీటి నివాళులివే. వ్యాసకర్త మెజీషియన్, విజయవాడ మొబైల్: 92901 78614 - కె. గౌతమ్ -
ఉపాధి పనుల్లో అవినీతి
సామాజిక తనిఖీలో వెలుగులోకి రూ.37.93 లక్షలు దుర్వినియోగమైనట్లు వెల్లడి నర్సింహులపేట : మండలంలోని చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన పరిశీలనలో ఇది వెలుగులోకి వచ్చింది. మండలంలో సెప్టెంబర్ 1, 2014 నుంచి మే 31, 2015 వరకు 1933 పనులు నిర్వహించారు. ఇందుకోసం రూ.4,29,30,341 విడుదలయ్యూరుు. వీటిపై ఈనెల ఒకటి నుంచి 9వ తేదీ వరకు తనిఖీ చేశారు. జయపురం, కొమ్ములవంచ, కౌంసల్యదేవిపల్లి, దంతాలపల్లి, పెద్దముప్పారం, ఆగపేట, పెద్దనాగారం, గున్నెపల్లిలో చేపట్టిన ఉపాధి హామీల్లో అవినీతి చోటుచేసుకుందని గుర్తించారు. మొత్తం 21 గ్రామాల్లో పనులకు రికార్డులు లేకపోవడం, కొలతల్లో తేడాలు, మరుగుదొడ్లు నిర్మింయచకుండానే బిల్లులు స్వాహా చేయడం, పాత వాటికి రంగులు వేసి బిల్లులు పొందడం, కూలీలు పనులు చేసినా చెల్లించకపోవడం తదితర అక్రమాలు చేసుకున్నట్లు తేల్చారు. రూ.37,93,922 దుర్విని యోగమైనట్లు ప్రజావేదికల్లో తనిఖీ బృందం డ్వామా అధికారుల సమక్షంలోనే వెల్లడించా రు. డ్వామా అడిషనల్ పీడీ శ్రీనివాసుకుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి పర్యవేక్షణలో రూ.3,28,000 రికవరికీ ఆదేశాలు జారీ చేశారు. వంతడపల గ్రామంలో ఎలాంటి అవినీతి జరగలేదని తేలడంతో అక్కడి ఫీల్డ్ అసిస్టెంట్ ను అధికారులు అభినందించారు. -
రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య
* విలేకరులతో విద్యార్థిని తండ్రి మురళీకృష్ణ * బెయిల్ పిటిషన్ కేసు నేటికి వాయిదా సాక్షి, గుంటూరు: రిషితేశ్వరి మృతి సంఘటన తన ఒక్కడి సమస్య కాదని, దీనిని సామాజిక సమస్యగా భావించాలని ఆమె తండ్రి మురళీకృష్ణ చెప్పారు. రిషితేశ్వరి మృతికేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులు హనీ షా, జయచరణ్, శ్రీనివాస్‌ల బెయిల్ పిటిషన్‌పై బుధవారం గుంటూరులోని ఒకటో అదనపు సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. దీన్ని గురువారానికి వాయిదా వేస్తూ ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపీనాథ్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ బాబూరావును వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. -
గుడి చందా ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
మెట్పల్లి రూరల్(కరీంనగర్): గ్రామంలో నిర్మించతలపెట్టిన ఆలయ నిర్మాణానికి చందా ఇవ్వలేమని చెప్పినందుకు సామాజిక బహిష్కరణ విధించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో ఈ వైనం చోటుచేసుకుంది. గ్రామంలో గంగామాత ఆలయం నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) నిర్ణయించింది. కుటుంబానికి రూ.500 చొప్పున నిర్మాణ ఖర్చులకు గాను చందాగా ప్రకటించి, ఆమేరకు అందరూ ఇవ్వాలని కోరింది. అయితే, గ్రామంలోని విశ్వబ్రాహ్మణ, మాల, పద్మశాలీ కులస్తులు తాము అంత చందా ఇచ్చుకోలేమని వీడీసీ పెద్దలకు చెప్పారు. దీంతో ఆయా కులస్తులను సాంఘికంగా బహిష్కరిస్తున్నట్లు పెద్దలు ప్రకటించారు. వారితో మిగతా వారు ఎటువంటి లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవటాలు చేయరాదని హుకుం జారీ చేశారు. ఈ పరిణామంతో బాధితులు ఆందోళన చెందతున్నారు. -
పాతపల్లిలో సాంఘిక బహిష్కరణ
* ఇళ్లను శ్మశానంగా మార్చారు * అంబేద్కర్ మనవడు, ప్రొ.ఆనంద్ తేల్ తుంబ్డే హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో రెండు నెలలుగా 45 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారని, ఇళ్లను శ్మశానంగా మార్చడమే కాక మరో కారంచేడుగా మారుస్తామని హెచ్చరించారని కుల నిర్మూలన పోరాట సమితి(కేఎన్పీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డేతో కలసి పాతపల్లి గ్రామ మాదిగల సంఘీభావ కమిటీగా కేఎన్పీఎస్ ఆ గ్రామాన్ని సందర్శించింది. అక్కడి విషయాలను సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫ్రొఫెసర్ తుంబ్డే మాట్లాడుతూ అనేక పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణలో దళితులపై దాడులు జరగడం, తెలంగాణ ఆవిర్భవించిన 11 నెలలకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ పరిస్థితులను చూస్తే తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని, ఇక్కడి పెత్తందార్లు మరో కారంచేడును చూడాలనుకుంటున్నారని విమర్శించారు. కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మయ్య మాట్లాడుతూ మే 1న పాతపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రఘురాం అనే మాదిగ యువకుడు పెళ్లి చేసుకుని, స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి సమక్షంలో దేవాలయ ప్రవేశం చేసి కొబ్బరికాయ కొట్టినందుకు మాదిగలపై అనేక దాడులు చేసి, సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. గ్రామంలో బోయలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఉన్నా.. మాదిగల గుడిసెల్లో చనిపోయిన బోయలను పాతిపెట్టి వారి నివాసాలను శ్మశానాలుగా మార్చారని దుయ్యబట్టారు. -
'నేను పాజిటివ్... నన్ను తాకండి'
మనుషులలో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుందని అందరు అంటుంటారు... కానీ సామాజిక స్పందనపై చేసిన ఓ సంఘటన అది తప్పు అని నిరూపించింది. జేన్ అంటిన్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం హెచ్ఐవీ సంక్రమించింది. అయితే తనకు ఆ వ్యాధి ఉందని చెబితే చుట్టుపక్కల వాళ్లు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని అతడు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించి ఆ తర్వాత వివరాలను నెట్ లో అప్లోడ్ చేయడంతో వీడియో హల్ చల్ చేస్తుంది. 'నేను హెచ్ఐవీ పాజిటివ్.. నన్ను తాకండి' అని రాసిన రెండు కాపీలు జేన్ తనకు ఇరువైపులా ఉంచి రద్దీగా ఉన్న ఓ స్ట్రీట్ లో నిలుచుంటాడు. తొలుత కొద్ది క్షణాలు ఎవరూ అతడిని తాకరు. ఆ తర్వాత ఒక్కక్కరుగా చాలా మంది అతనికి తాకుతారు. అతడిని తాకిన వారిలో చిన్నారులు, యువతీయువకులు, ఇతర అన్ని వయసుల వారు ఉండటం గమనార్హం. మరికొంతమంది ఏకంగా అతడిని కౌగిలించుకుని తమ ప్రేమను, సానుభూతిని తెలిపి మానవత్వాన్ని చాటుకోవడం విశేషం. తనను తాకిన వారందరికి జేన్ కృతజ్ఞతలు చెబుతుంటాడు. తన మనసులోని బాధను మరిచిపోయి, అతని కళ్లు చెమ్మగిల్లుతాయి. అవి కన్నీళ్లు ఏ మాత్రం కావు.. కొత్త వ్యక్తులు తను ఎవరో తెలియనప్పటికీ వారు చూపించిన అప్యాయతకి జేన్ ఆనందభాష్పాలు రాల్చాడు. -
సాంఘిక బహిష్కరణ రద్దు
ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం డబ్బా గ్రామంలో బుడిగజంగాల కుటుంబాలకు విధిం చిన సాంఘిక బహిష్కరణను వీడీసీ విరమించుకుంది. శనివారం సాక్షి మెరుున్ పేజీలో ‘వీడీసీకి డబ్బులివ్వలేదని సాంఘిక బహిష్కరణ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరాజు, స్థానిక ఎస్సై రాజారెడ్డి స్పందించారు. సాయంత్రం డబ్బా గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వీడీసీ సభ్యులను, బుడిగ జంగాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీడీసీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు విధించడం నేరమన్నారు. వీడీసీల పేరిట బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు. స్పందించిన వీడీసీ సభ్యులు బుడిగ జంగాలకు విధించిన బహిష్కరణను విరమించుకుంటున్నామని, ఇకనుంచి అందరం కలిసిమెలిసి ఉంటామని రాతపూర్వంగా ఒప్పందం చేసుకున్నారు. సీఐ రాజశేఖరరాజు వీడీసీ సభ్యులు, బుడిగజంగాల పెద్దల చేతులు కలిపి అందరూ కలిసుండాలని కోరారు. . -
‘భవన్’లకు బంధనాలు
సామాజిక భవనాల నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు నిధులు కేటాయించినా.. నిర్మాణాలు సున్న భూ వివాదంతో శంకుస్థాపనలకే పరిమితం ఐదు సామాజిక వర్గాల భవన్ల పరిస్థితి ఇదే.. తలలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్మించనున్న సామాజిక వర్గాల భవన్లకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వివిధ సామాజిక వర్గాల వినతి మేరకు రాజధానిలోనే వీటిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు భవన్లు మంజూరు చేశారు. వీటికి నిధులు కేటాయించడంతో పాటు కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇదంతా జరిగి ఆరు నెలలు గడుస్తున్నా... న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ఈ భవన్లకుఇప్పటి వరకు పునాది కూడా పడలేదు. దీనికి ప్రధాన కారణం వీటికి కేటాయించిన భూములు వివాదాల్లో ఉండటమే. - సాక్షి, హైదరాబాద్ ‘కొబ్బరికాయ’ కొట్టారంతే గతంలో ఇచ్చిన హామీల మేరకు హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం జంజారాహిల్స్లో 2014 డిసెంబర్ 11 న జంజారా భవన్, కొమురం భీం భవన్లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బాబు జగ్జీవన్ రాం భవన్‌ను కూడా ఇక్కడే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జంజారా, కొమురం భీం భవన్లకు రూ.2.50 కోట్లు, బాబు జగ్జీవన్ రాం భవన్‌కు రూ.2.50 కోట్ల నిధులను కేటాయించి, నిర్మాణ పనులను గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా మారేడుపల్లి మండలంలోని మహేంద్రహిల్స్‌లో 2014 డిసెంబర్ 23న క్రిస్టియన్ భవన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడే దొడ్డి కొమురయ్య భవన్ నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే క్రిస్టియన్ భవన్ కు రూ.2 కోట్లు, దొడ్డి కొమురయ్య భవన్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. వివాదాల్లో స్థలాలు ... హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఐదు భవన్లకు భూములు కేటాయిస్తే... అవన్నీ న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. దీంతో వీటి నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. జంజారా, కొమురం భీం భవన్లకు జంజారాహిల్స్ సర్వే నంబరు 403 లోని రెండు ఎకరాలు కేటాయిస్తే.. ఈ భూమి తనదేనని మల్బాన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం దీని నిర్మాణంపై హైకోర్టు స్టేటస్కో( యథాతథ స్థితి) విధించింది. దీనిపై కౌంటర్ ఫైలు దాఖలు చేశామని అధికారులు చెబుతున్నారు. అలాగే, క్రిస్టియన్ భవన్, దొడ్డి కొమురయ్య భవన్లకు మహేంద్ర హిల్స్‌లో కేటాయించిన భూములు కూడా వివాదాల్లోనే ఉన్నాయి. ఈ భూములు తనవేనని వడ్డెర సంఘానికి చెందిన పాపయ్య కోర్టు కెళ్లగా.. హైకోర్టు దీనిపై కూడా స్టేటస్కో ఇచ్చింది. మరో నాలుగు భవన్లకు... ఇదిలా ఉండగానే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే యాదవ, బ్రాహ్మణ, సిక్కు భవన్ల కోసం సత్వరమే భూసేకరణ చేపట్టాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కేరళ భవన్‌కు కూడా ఎకరం స్థలం కేటాయిస్తామని గతంలో ఓనం వేడుకల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పటికే కేటాయించిన భూములు వివాదాల్లో ఉండడం ఇప్పుడు మరిన్ని భవనాలకు స్థలాలు కేటాయించాలని సర్కారు ఆదేశించడంతో ఏం చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. -
సర్కారుకు కోటింగ్!
- రూ.2.11 కోట్ల రికవరీకి రూ.కోటి ఖర్చు - సామాజిక తనిఖీల్లో అధికారుల పనితనం - ‘ఉపాధి’ వెలుగు చూస్తున్న అవకతవకలు - ఆరేళ్లలో రూ.4.54 కోట్ల స్వాహా పావలా కోడికి ముప్పావలా మసాలా.. అన్నట్టుంది అధికారుల తీరు. ఉపాధి హామీ పథకం పనుల్లో భారీగా నిధుల స్వాహా జరిగింది. దీనిపై సామాజిక తనిఖీలు, విచారణలకు అక్షరాలా రూ.కోటికి పైగా ఖర్చయింది. ఇంతాచేస్తే కేవలం రూ.2.11 కోట్లు వసూలైంది. అవినీతిపరులకు కళ్లెం వేయాల్సిన సామాజిక త నిఖీలు వారికే ఊతమిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేయడం తప్ప స్వాహా అయిన నిధులను రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని 39 మండలాల్లో 5,803 హేబిటేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,68,632 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేశారు. 31,503 శ్రమశక్తి సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఈ గ్రూపుల్లో 6,75,453 మంది కూలీలున్నారు. ఏటా సరాసరిన నాలుగు లక్షల మం దికి డిసెంబర్ నుంచి మార్చి వరకు 70 లక్షలకు పైగా పనిది నాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు రూ. 75 కోట్లు చెల్లిస్తుంటారు. రూ.300కోట్లకుపైగా విలువైన పను లు జరుగుతుంటాయి. సోషల్ ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అంటే ఆరేళ్ల లో రూ.4,54,31,793లు ప్రజాధనం స్వాహా అయినట్టుగా నిర్ధారించారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకు రూ.2,11,86,010లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ అవకతవకలకు బాధ్యులుగా వివిధ స్థాయిల్లో పనిచేసే 296 మందిని తొలిగించగా, 2260 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ రూ.రెండుకోట్ల రికవరీకోసం సామాజిక తనిఖీలు, విచారణల పేరిట అక్షరాల రూ.కోటికి పైగా ఖర్చు చేశారని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన రూ.4.54కోట్లు అవినీతి జరిగితే రికవరీ చేసింది కేవలం రూ.కోటి మాత్రమేనన్న మాట. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన తీరుకు అద్దంపడుతోంది. ఆరేళ్లలో జరిగిన ఉపాధి హామీ పనులపై మరింత లోతైన విచారణ చేపడితే స్వాహా సొమ్ము కూడా పెద్ద ఎత్తునే ఉంటుందన్న వాదన ఉంది. చాలా కేసుల్లో అక్రమార్కులకు కొమ్ముకాసేలా అధికారులు వ్యవహరించారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
దేశంలో వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : స్థానిక ఎమ్మెల్సీ సీటు కోసం దేశం తమ్ముళ్లు మధ్య వర్గపోరుకు తెరలేచింది. ఈ ఎన్నికల్లోనైనా పనిచేసిన వారికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఆప్కాబ్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో అధినేత చంద్రబాబు మాట తప్పారని, ఈసారైనా పనిచేసిన వారిని గుర్తించాలని ఆశావహులు కోరుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూ బయోడేటాలను ఇస్తున్నారు. సామాజిక వర్గం, పార్టీలోని సీనియార్టీలను పరిగణనలోకి తీసు కోవాలని కోరుతున్నారు. మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించగా, ఈ సారీ అదే సామాజిక వర్గం నుంచి పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మిగిలిన సామాజిక వర్గాల ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పలుకుబడి, ధనబలం కలిగిన వారికి అధినేత ప్రాధాన్యం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని కాపు, మైనార్టీ, వెనుకబడిన వర్గాల ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన ఆశావహులు జిల్లాలోని శాసనసభ్యులు, మంత్రులను కలిసి ఈసారి తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని గణాంకాలతో కూడిన వివరాలను అందజేస్తున్నారు. ఆ సామాజిక వర్గం అభ్యర్థులకు ఇతర జిల్లాల్లో అవకాశం కల్పించాలని కోరు తున్నారు. వీరంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ కన్వీనర్ జీవీ ఆంజనేయులుతోపాటు ఇతర సీనియర్లను కలుస్తున్నారు. పార్టీకి అందించిన సేవలు, ఎన్నిక ఖర్చులకు సమకూర్చుకున్న నిధులు తదితర వివరాలను తెలియచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల్లోనూ గ్రూపులు ఉండటంతో ఒకో గ్రూపు ఒకో సామాజిక వర్గాన్ని భుజాన వేసుకుంటుంది. అవకాశం దొరికినప్పుడు అధినేత చంద్రబాబుకు అభ్యర్థుల గుణగణాలను వెల్లడిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉండాలని చెబుతున్నారు. అయితే సొంత నెట్వర్క్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏ వర్గానికి ప్రాధాన్యం ఇస్తారో వేచి చూడాల్సిందే. -
అంబేడ్కర్ ‘లేబర్ పాలసీ’
‘‘కార్మికులను బానిసల్ని చేసే ఏ చట్టాన్ని నేను అనుమతించను’’ అని కార్మికమంత్రిగా అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ‘‘నేను పేదల్లో పుట్టాను. పేదల్లోనే బతికాను. నేను తడి నేల మీద బల్లచెక్క వేసుకొని నిద్రపోయాను. వారి కష్టాలు నాకు బాగా తెలుసు. నేను నా మిత్రులతో తదితరులతో పూర్వం ఎలా ఉండే వాణ్ణో ఇప్పుడూ అలాగే ఉంటాను. ఢిల్లీలోని నా బంగ్లా తలుపులు అందరికోసం తెరిచివుంటాయి’’ అని మంత్రి అయిన సందర్భంలో అన్నారాయన. సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం తన లేబర్ పాలసీ అని ప్రకటించారు. అందులో కొన్ని... * దేశవ్యాపితంగా కార్మికవర్గ చట్టాల మధ్య ఏకతను సాధించడం. * పారిశ్రామిక వివాదాలను పరిష్కరించగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్మించడం. * అఖిల భారత ప్రాముఖ్యత కలిగిన కార్మికవర్గ సమస్యలను చర్చించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడం. డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956) * 14 ఏప్రిల్ 1891 - భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు. * 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం. * 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత. * 1908 - రామ్బాయ్తో పెళ్లి. * 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత. * మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర. * సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం. * 1922 - గ్రేన్ ఇన్ బార్ఎట్లాకు ఆహ్వానం. * 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం. * 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన. * 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం. * 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన. * 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు. * 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం. * 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం. * 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం. * 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం. * 1936 - ‘కులనిర్మూలన’ రచన * 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ఫెడరేషన్’ స్థాపన. * 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు). * 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన. * 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక. * 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం. * 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం. * 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన. * 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం. * 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన. * 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం. * మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక. * 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం. * డిసెంబర్ 1954 - రంగూన్లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన. * 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం. * 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి). -
నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను
అవిశ్రాంతం -అరవై తర్వాత రాళ్లపల్లి వెంకట నరసింహారావు... ఇంత పొడవు పేరు చెబితే అయోమయం కలుగుతుంది. రాళ్లపల్లి... అనగానే చక్కటి ఉచ్ఛారణ, స్పష్టమైన హావభావాల వ్యక్తీకరణతో అనేక పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. నాటకరంగ నేపథ్యమే తనను ఇంత వరకు నడిపించిందని చెప్పే రాళ్లపల్లి ‘చెడ్డసినిమా ఉంటుందేమో కానీ చెడ్డ నాటకం ఉండదంటారు. రాబోయే ఆగస్టు 15వ తేదీతో డెబ్బైలోకి అడుగు పెట్టనున్న ఆయన అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవితాన్ని ‘అవిశ్రాంతం’గా మలుచుకున్న వైనం ఆయన మాటల్లోనే... ‘‘అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వృత్తిలో కొంత విరామం దొరికినట్లయింది. అప్పటి వరకు ఏడాదికి 365 రోజులు పని చేసిన స్థితి నుంచి నా పని వారానికి మూడు రోజులకే పరిమితమైంది. అది నేను తెచ్చుకున్న విరామం కాదు. ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రభావంతో వచ్చిన విరామం. విద్యార్థి అవతారమెత్తి ఆ ఖాళీని బిజీగా మలుచుకున్నాను. 2011లో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సులో చేరాను. డిస్టింక్షన్లో పాసయ్యాను కూడా. ఇప్పుడు ఎం.ఫిల్ చేస్తున్నాను. రిటన్ టెస్ట్ పూర్తయింది. థీసిస్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత పీహెచ్‌డి చేద్దామనుకుంటున్నాను. అరవై ఆరేళ్ల విద్యార్థి! ఇన్నేళ్లు నటించిన తర్వాత ఇంక నటన గురించి చదువుకోవడమేంటి- అని విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ, విద్యార్థిదశను ఆస్వాదించాను. ఈ తరం యువతతో కలిసి చదువుకోవడం నాకూ- వారికీ పరస్పరం ఉపయుక్తంగానే సాగింది. గతంలో సాంఘిక నాటకాలు రాసిన నేపథ్యం ఉండడంతో నటన, ఉచ్చారణ, అభినయం వంటి అంశాలలో పాఠాలు చెప్పగలిగినంత పట్టు వచ్చింది. ఏదైనా అంశం మీద ఉపన్యసించగలిగిన సామర్థ్యం అలవడింది. నాటకం చూడాలి లేదా చదవాలి! నా దైనందిన జీవితం ఎప్పుడూ ఉదయం ఐదూ ఐదున్నరకే మొదలవుతుంది. పూజ, ధ్యానం తర్వాత ఉపాహారం. ఏదైనా ఓ నాటకాన్ని తీసుకుని చదవడం, మిత్రులను సంప్రదించి నాటక ప్రదర్శన, సాధన గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాను. భోజనం తర్వాత ఓ అరగంట సేపు టీవీ చూస్తాను. సాయంత్రమైతే రవీంద్రభారతిలోనో, తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్లోనో ప్రదర్శించే నాటకాలకు ఆహ్వానాలు సిద్ధంగా ఉంటాయి. మూడు రోజుల కిందట కూడా జ్యోతిరావు ఫూలే మీద నాటకం చూశాను. 1966లో రాష్ట్రపతి భవన్లో రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ప్రదర్శించడం... వంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ విరామమే తగిన సమయం. నాటకానికి టికెట్టు కొనడమా! థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించే నాటకాలకు తప్పకుండా వెళ్తుంటాను. మిత్రబృందంతో కలిసి నాటకాలు ప్రదర్శిస్తుంటాను. నేను పదిసార్లు అమెరికాకు వెళ్లాను. ప్రతిసారీ ఏదో ఒక నాటకాన్ని చూసేవాడిని. మన దగ్గర టికెట్ కొని నాటకం చూసే అలవాటే లేదు. అలాగని నాటకానికి ఆదరణ తగ్గలేదు. కళాపోషకులు ఆసక్తి కొద్దీ ప్రదర్శిస్తే చూసే వాళ్లు మాత్రం ఉన్నారు. గత ఏడాది యాంకర్ ఝాన్సీ మొదలైన వాళ్లం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఒంగోలులో నాటక ప్రదర్శనకు రాత్రి తొమ్మిదికి మొదలైనా సరే ప్రేక్షకులు ఉన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే నాటకం ప్రధానస్రవంతిలోకి రావాలని కోరుకుంటూ పని చేసుకుపోవడం మా వంతు. ఇంకా నాటకాలు వేయడం వల్ల మేము నాటకరంగానికి చేస్తున్న మేలు ఏమీ ఉండదు. ఇదంతా మమ్మల్ని మేము పనిలో నిమగ్నం చేసుకుని సంతోషంగా ఉండడానికే. కళాకారులకు ప్రోత్సాహంగా... పేదరికంలో ఉన్న రంగస్థల నటులకు సన్మానం చేసి పదివేల నుంచి పాతిక వేల వరకు నగదు బహుమతినివ్వడం అనే ఓ వ్యాపకాన్ని పెట్టుకున్నాను. మిత్రుల సహకారంతో ఎనిమిదేళ్లుగా ఆగస్టు 15వ తేదీన నా పుట్టిన రోజు నాడు ఒకరికి బహుమతి ఇస్తున్నాను. మందుల వంటి కనీస ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి నా శక్తి కొద్దీ నేను అందిస్తున్న చిన్న ఆసరా. నాకు చేతనైంది నటించడం... నేర్పించడం నేను మూడు వేల నాటకాలు వేశాను, ఏడు వందలకు పైగా సినిమాలు చేశాను. నాకు చేతనైంది నటించడం, ఎలా నటించాలో నేర్పించడం, చక్కటి కథను ఆసక్తికరమైన కథనంతో తీర్చిదిద్దడం వంటివే. బహుశా అవే నన్ను అవిశ్రాంతంగా ఉంచుతూ నన్నింకా బతికిస్తున్నాయేమో! (నవ్వు) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు:రాజేశ్ రెడ్డి ముగింపు లేని కథ, మారని సంసారం, జీవన్మృతుడు నాటకాలను రాశారు. వరవిక్రయం నాటకాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాతికకు పైగా ప్రదర్శనలిచ్చారు. -
సీఎం అభ్యర్థిగా అన్బుమణి
పీఎంకే సీఎం అభ్యర్థిగా ఎంపీ అన్బుమణి రాందాసు పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు సిద్ధమయ్యారు. సేలం వేదికగా ఈనెల 15న అన్బుమణి పేరును ప్రకటించేందుకు కసరత్తుల్ని వేగవంతం చేశారు. మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సాక్షి, చెన్నై : వన్నియర్ సంఘాన్ని రాజకీయ పార్టీగా ప్రకటించిన పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఏదో ఒక రోజు తాము రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడతామన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు తామెవ్వరితోనూ పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేస్తూనే, ఎన్నికల వేళ ఎవరితోనో ఒకరితో జతకట్టడం ఆయనకు పరిపాటే. అయితే, ఇటీవలి కాలం గా జరిగిన ఎన్నికల్లో పొత్తులు మార్చి మార్చి పెట్టుకున్నందుకు ఆయనకు ఆ సామాజిక వర్గం ఓటర్లే పెద్ద గుణపాఠం చెప్పారు. దీంతోఒకరి గొడుగు నీడన చేరడం కన్నా, తామే ఒక కూటమికి నేతృత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్) ను ప్రకటించారు. అన్ని కుల సంఘాలు, పార్టీలను ఏకం చేయడంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమిలోకే ఇతర పార్టీలు రావాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా అన్భుమణి: సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్‌లోకి కొన్ని చిన్న చిన్న పార్టీలతో సహా, కుల సంఘాలు వచ్చి చేరుతోండడంతో, తమ దైన శైలిలో ముందుకు సాగాలనుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి అడుగులు వేసిన ఆయన ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నామా లేదా..? అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. దీనికి ముగింపు పలకడంతో పాటుగా, ఎవరైనా సరే ఇక, తమ కూటమిలోకి రావాల్సిందేనని చాటే విధంగా భారీ మహానాడుకు నిర్ణయించారు. సేలం వేదికగా ఈ నెల 15న భారీ ఎత్తున ఈ మహానాడుకు కసరత్తులు చేపట్టారు. చెన్నై-సేలం జాతీయ ర హదారిలోని ఇరుమలై లో 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఇందుకు తగ్గ పనుల్ని వేగవంతం చేయిస్తూనే, ఈ మహానాడు వేదికగా పార్టీ వర్గాల అభిప్రాయం, నిర్ణయం మేరకు తన వారసుడు, ఎంపీ అన్భుమణి రాందాసును పీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ వేదిక మీదుగా ఈ ప్రకటనను తప్పకుండా రాందాసు చేయబోతున్నారని, ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఎంకే - బీజేపీల కూటమి బెడిసి కొట్టినట్టేనన్నది ఖాయం అవుతోంది. ఇప్పటికే శ్రీరంగం ఉప ఎన్నికల్లో మద్దతు తిరస్కరించిన రాందాసు, ఇక బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటుగా అన్భుమణి సారథ్యంలో బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీయడానికి రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం -
ప్లే@మెసేజ్
విభిన్న కళలకు వేదిక బంజారాహిల్స్ లామకాన్. గతవారం ఇందులో ప్రదర్శించిన రెండు నాటకాలు ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, కోర్ట్ మార్షల్’ సామాజిక చైతన్యం రగిలించే దిశగా సాగాయి. భిన్నత్వంలో కత్వం సాధించాలన్న కాంక్ష కాంక్షగానే మిగిలిందా అనే ప్రశ్నను సంధిస్తుంది మొదటి నాటకం. నిజాన్ని, దాని నిజస్వరూపాన్ని చూసి కదిలిపోయిన కల్నల్ కథ రెండోది. వేటికవే ప్రత్యేకతను చాటుకున్న ఈ రెండు నాటకాల ‘రివైండ్’... కోర్ట్ మార్షల్ యుద్ధాన్ని, శత్రువుని, చావుని ఎదుర్కోవడానికి ఎన్నడూ వెనకడుగేయని కల్నల్ సూరజ్... నిజాన్ని, దాని నిజ స్వరూపాన్ని చూసి కదిలిపోతాడు. అతని అంతరంగమే ఈ నాటకం. అలాగే... నేరానికి పాల్పడినవారు కళ్లముందే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైతే... ఆ న్యాయమూర్తి అంతరంగం ఎలా ఉంటుందో ఈ ప్లే ఆవిష్కరించింది. దేశంలో అగ్రకులాలు, అధికార దర్పంతో బలహీనులపై కొనసాగిస్తున్న అమానవీయ చర్యలు నేటికీ ప్రతి వ్యవస్థలో కొనసాగుతున్నాయనే చేదు నిజాన్నీ ఈ నాటకం మన ముందు ఉంచుతుంది. కథ విషయానికొస్తే... జవాను రాంచందర్... ఇద్దరు ఉన్నతాధికారులను కాలుస్తాడు. తాను చేసిన పనికి ఏ శిక్షకైనా సిద్ధమని అతడు కోర్టు మార్షల్ ముందు చెబుతాడు. దాడిలో ఇద్దరు అధికారుల్లో వర్మ మరణించగా, మరొకరు కపూర్ ప్రాణాలతో బయటపడతాడు. రాంచందర్ తరపు కెప్టెన్ రాయ్ కేసు వాదిస్తాడు. తన క్లయింట్ హత్య చేయడం నిజమేనని, అయితే అందుకు దారి తీసిన కారణాలు తెలుసుకోవాలంటాడు రాయ్. క్రీడాకారుడిగా, జవానుగా ప్రశంసలు అందుకున్న రాంచందర్ హంతకుడిగా మారిన తీరు దేశంలో నేటికీ కొనసాగుతున్న అనేక సంకుచిత ఆలోచనలు, వ్యక్తులను మన ముందుకు తెస్తుంది. పై అధికారి తప్పును ప్రశ్నించలేక... తోటివారి బాధ చూడలేని... నిస్సహాయతతో ఉడికిపోయే తత్వం రాంచందర్ది. తనను కులం తక్కువ వాడని దూషిస్తున్న అధికారులపై సహనం కోల్పోయి చేసిన దాడే ఈ హత్య అని చెబుతాడు రాయ్. స్వతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా భారత్‌లో కులాల కుంపటిని ఆర్పలేకపోతున్నామని చెబుతుందీ నాటకం. స్వదేశ్ దీపక్ రాసిన ఈ నాటకానికి సమహారా గ్రూప్ రత్నశేఖర్ దర్శకత్వం వహించారు. కెప్టెన్ రాయ్ పాత్రలో కూడా ఆయన చక్కగా ఒదిగిపోయారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ స్వాతంత్య్రానికి ముందు... తరువాత... ఎన్ని మార్పులు వచ్చినా మత వివాదాలకు కాలం చెల్లలేదని చెబుతుందీ కథ. నాటి, నేటి పరిస్థితులు, మారణహోమాలకు అమాయకులు బలవుతున్న తీరు కళ్లకు కడుతుంది. గాంధీ జయంతి సందర్భంగా నిశుంభిత కల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రదర్శించింది. ఈశ్వర్, అల్లా, బాగీ (తిరుగుబాటుదారుడు), సర్వం కోల్పోయిన ఓ రాజు... ఈ నలుగురి మధ్యా పిచ్చాసుపత్రిలో సాగే ఆసక్తికర సంభాషణల్లో... చరిత్రలో జరిగిన దుర్ఘటనలు, యుద్ధాలు, దేశ విభజన ముందు- తర్వాత సాగిన మారణహోమాలు అనేకం మన కళ్ల ముందు కదలాడతాయి. హిందువుల దాడిలో హిందువులు... ముస్లింల దాడిలో ముస్లింలనే బలితీసుకున్న ఘటనల నేపథ్యంలో సొంతవారిని పోగొట్టుకుని లాభపడింది ఎవరో తెలియక రోదిస్తున్న వారిని సమాజం పిచ్చి వాళ్లనే అంటుందేమో... అనే ఆలోచనల్లోకి నెడుతుందీ ప్లే. ఐదు వేల మంది హిందువులు, ఐదు వేల మంది ముస్లింలు చనిపోయారని చెబితే... ‘చనిపోయింది మనుషులని చెప్పటం మరిచారా! మనుషులుగా బతకడం, ఆలోచించడం మానేశారా’ అని ప్రశ్నిస్తాడు బాగీ. ఇన్ని సంఘర్షణల తరువాత పిచ్చాసుపత్రిలో ఉన్నవారు... బయట ఉన్నవారిలో ప్రేమ రగిలించు లేదా వాళ్లనీ పిచ్చివాళ్లని చెయ్యి అని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇంతకీ ఎవరు పిచ్చివాళ్లు..! ప్రేమ కోసం తపిస్తున్న వారా? మనుషులమన్న స్పృహ మరిచి ప్రవర్తిస్తున్న మనమా...! అనే ఓ ఆలోచనాత్మక ప్రశ్నను సంధిస్తూ ముగుస్తుంది నాటకం. పిచ్చివాళ్లుగా నటించిన కృష్ణచైతన్య, కృష్ణ, వినయ్, కేశవ్ అద్భుతమైన అభినయంతో మెప్పించారు. - ఓ మధు -
ఉదయాన్ని స్వప్నిస్తూ నిదురలోకి..
అమరుడైన తమ మనిషి (లెజెండ్)ని ప్రజలు కీర్తిస్తారు. ఒక వ్యక్తి జీవించి ఉండగా లెజెండ్ కావడం అరుదు. మగ్దూం అటువంటి అరుదైన వ్యక్తి ! నా జీవితకాలంలో నేను (నరేంద్ర లూథర్) చూసిన లివింగ్ లెజెండ్ మగ్దూం. ఆయన గుణగానంలో సదా పరవశిస్తాను. మగ్దూం జీవితంలో సాహిత్యం-సామాజిక ఉద్యమాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. మగ్దూం కుమార్తెకు సంధ్యారాగం ‘అసావేరి’ అని పేరు పెట్టారు. అజ్ఞాతవాసంలో ఉండగా పుట్టిన కుమారుడి పేరు ‘సెకండ్ ఫ్రంట్’ ! తర్వాత కాలంలో ‘నుస్రత్’ (విజయం) అయ్యాడు ! ఉర్దూ దినపత్రిక సియాసత్ వ్యవస్థాపకుడు అబిద్ అలీఖాన్ ఇంట్లో ఓ మరుపురాని సాయంత్రం గడిపాం. జమీలా అనే అందమైన యువతి మగ్దూం సమక్షంలో ఆయన కవితలను గానం చేస్తోంది. అప్పుడు మగ్దూం వయసు సమారు 50 ఏళ్లు. నేను 30లోకి రాబోతున్నా.. మగ్దూంలోని యవ్వన కాంతి నన్ను ఆశ్చర్యపరచింది. ఏమిటీ రహస్యం అన్నాను. ‘నీ గురించి చింతించకు. వ్యక్తిగతం కానీ మంచి విషయాల గురించి ఆలోచించు’ అని హితవు పలికారు ! మగ్దూం సలహాను శిరోధార్యంగా భావించాను. వీలైనంత వరకూ అనుసరిస్తున్నాను. సంజీవయ్య ఎదుట కన్నుగీటారు.. ‘మల్లె పందిరి కింద’ కవితాగానం జరిగిన కొద్ది రోజుల తర్వాత మగ్దూంను అరెస్ట్ చేయాల్సిందిగా నేను ఆదేశించాల్సి వచ్చింది. ‘చట్టం అనుమతి లేకుండా వ్యక్తులు సమావేశం కారాదు’ అనే నిబంధనను ఉల్లంఘించిన నెపంతో ! ఆదేశాలు అమలులో ఉండగానే మగ్దూం ముఖ్యమంత్రి సంజీవయ్యను కలిశారు. అక్కడే చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ‘సమాజానికి పెనుముప్పు, పొంచి ఉంటే ప్రజలు కలసి మాట్లాడుకోవడం మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ కనీస జ్ఞానం లేనివాడు మీ చీఫ్ సెక్రటరీ’ అని మగ్దూం చెడామడా తిట్టారు. ప్రజాసంఘాలు, నాయకుల పట్ల అవగాహన ఉన్న సంజీవయ్య, మగ్దూంను విడుదల చెయ్యండి అన్నారు. తలదించుకున్న చీఫ్ సెక్రటరీతో కరచాలనం చేస్తూ, మగ్దూం నా వైపు కన్నుగీటారు ! ఒక ‘బ్రహ్మానందం’! బ్రహ్మానందరెడ్డి హయంలో ఒకసారి మగ్దూం నిరాహారదీక్షకు కూర్చున్నారు. పెరిగిన బియ్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ! మగ్దూం అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. దీక్షలో పరిస్థితి విషమిస్తోంది. విరమింపజేయాల ంటే ప్రభుత్వం నుంచి హామీని రాబట్టాలి. మగ్దూం సహా రాజ్‌బహదూర్ గౌర్ మరికొందరు చర్చలకు ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్‌ల పట్ల విముఖతతో ఉన్నారు. ఏవో ఫైళ్లను చూస్తున్నట్టు నటిస్తూ తల ఎత్తలేదు. మూతి బిగించిన వారితో సంభాషణ సాధ్యమా ? అప్పుడు మగ్దూం తన వాళ్లతో ‘‘బ్రహ్మానందంగా’ ఉండే వ్యక్తి కోసం కదా మనం వచ్చాం. ఇక్కడ అలాంటి వ్యక్తెవరూ లేనట్లుంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నట్లున్నారు. పోదాం పద’ అన్నారట ! ఆ మాటలకు ముఖ్యమంత్రి ‘బ్రహ్మానంద’భరితుడయ్యారు. ఉద్యమకారుల డిమాండ్లకు అంగీకరించారు. ‘రాజ్’ కూడా బ్రహ్మానందం చెందారు. పేదల కోసం విజయవంతంగా దీక్ష చేసిన మగ్దూం ఓ ముద్ద తిన్నారు మరి. నెరవేర్చని వాగ్దానం ‘మగ్దూం చాచా’ అని పిలిచే రాజ్ బహదూర్ గౌర్ కుమార్తె తమారా అంటే ఆయనకు ప్రత్యేక వాత్సల్యం. ఆమెకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మగ్దూం నెరవేర్చలేకపోయారు. 1969లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వి.వి.గిరి గెలిస్తే కోన్ ఐస్‌క్రీం ఇప్పిస్తానన్నారు మగ్దూం. శాసనమండలిలో సీపీఐ సభాపక్షనేతగా రాణించిన మగ్దూం పార్టీ పనులపై ఢిల్లీ వెళ్లారు. ఆగస్ట్ 25 ఉదయం రాజ్ బహదూర్‌కు ఫోన్ చేసి, నిద్రలేపారు. ఒంట్లో బాగోలేదన్నారు. మిత్రుడిని వెంటనే పంత్ హాస్పిటల్లో చేర్చారు గౌర్. మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆ ఒక్క సందర్భమే చాచా అన్న మాట నిలుపుకోలేకపోయారు అంటారు తమారా ! ఢిల్లీ నుంచి వచ్చిన మగ్దూం భౌతికకాయాన్ని సందర్శించేందుకు నగరం జనసంద్రం అయింది. అన్ని అశ్రునయనాలను నగరం ఎన్నడూ చూడలేదు. హజ్రత్ షా ఖామోష్లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అవిశ్వాసిని ఇక్కడ ఖననం చేసేందుకు ససేమిరా అంగీకరించం అన్నారు ఛాందసులు. అభ్యంతరాలను మగ్దూం అభిమానులు తోసిపుచ్చారు. ‘జిందాబాద్’ నినాదాలతో మగ్దూం భౌతికకాయాన్ని సగౌరవంగా విశ్రమింపజేశారు. సమాధిపై ఆయన కవితా పంక్తులు శిలాక్షరాలై ఉన్నాయి.. ‘బజ్న్ మే దూర్ వో గాతా రహా తన్హా తన్హా సో గయా సజ్ పర్ సర్ రఖ్ కే సహర్ సే పహెలె’ (సమూహాలకు దూరంగా పాడుతున్నాడతడు త నువుతో తనువుతో తంత్రిణిపై తలను చేర్చి నిదురలోకి జారాడు ఉదయానికి పూర్వమే) హైదరాబాద్ ఎన్నో ఉదయాస్తమాలను చూసింది. నవాబులు, జ మీందార్లు, పాలకులు.. ఎందరెందరి ఉదయాస్తమాలనో చూసింది ! ఒక అనాథ బాలుడిని ఈ నగరం మగ్దూం అనే మహనీయునిగా మలచింది ! ఆ హీరోకు పలికిన వీడ్కోలుతో సరిసమానమైనది అంతకు ముందు ఆ తర్వాత నగరం ఎన్నడూ చూడలేదు. మగ్దూంలాంటి మరొకరు కనిపిస్తారా..? మగ్దూం కనిపించిన ఉదయం ఆగమిస్తుందా..? ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
కాలంతో పాటు నడిచిన ఏబీకే కలం...
వ్యాస సంపుటి రాజకీయ ఘటనలు, సామాజిక పరిణామాలు సంభవిస్తున్నప్పుడు పాత్రికేయులు వాటిని వ్యాఖ్యానిస్తారు. వర్తమానంలో ఆ వ్యాఖ్యలు భవిష్యత్దర్శనం చేస్తాయి. సరి చేసుకొని ముందుకు సాగడానికి అవసరమైన ఊతకర్రలను అందిస్తాయి. అయితే ఆ ఘటనలు ముగిశాక ఆ వ్యాఖ్యానాలు వర్తమానం కంటే విలువైన చరిత్రగా మారుతాయి. చారిత్రక పత్రాలుగా భావితరాలకు గతం అన్వేషణలో సాయం చేసే సహాయకారులుగా ఉపయోగపడతాయి. ప్రసిద్ధ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ తన పాత్రికేయ జీవనంలో ఏనాడూ వ్యాఖ్యానానికి దూరంగా లేరు. వ్యాఖ్యానం ఎందుకోసం? ఎరుక కలిగించడం కోసం. మంచిచెడ్డలేమిటో ఎంచుకొని ముందుకు సాగడం కోసం. కళ్లకు కనిపించే ఉదంతాల వెనుక దాగిన చీకటి సత్యాల తెలివిడి కోసం. మేకవన్నెపులుల నిజస్వరూపాలు ఎరిగి అప్రమత్తతతో మెలిగి సమాజాన్ని, సాటి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం. ఈ కారణం చేతనే ఏబీకే ప్రసాద్ ‘సాక్షి’ దినపత్రిక వెలువడినప్పటి నుంచి రాసిన సంపాదకీయ పేజీ వ్యాసాలు పాఠకాదరణ పొంది ఇప్పుడు ఇలా ‘కాలంతో కరచాలనం’ పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఈ సంకలనంలోని 133 వ్యాసాలు 1. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు: విభజన రాజకీయాలు 2. జాతీయాంశాలు 3. రాజ్యాంగమూ... చట్టాలూ.. సీబీఐ 4. అంతర్జాతీయం 5. విదేశాంగ నీతి 6. అవీ ఇవీ.. 7. తెలుగుభాష 8. ఆర్థికాంశాలు 9. వాతావరణ సమస్యలు అనే విభాగాల కింద ఆయా అంశాలను లోతుగా చర్చిస్తాయి. ముఖ్యంగా విభజన సమయంలో ఏబీకే ఇరుప్రాంతాల మధ్య సయోధ్య కొరకు, అపోహల తొలగింపు కొరకు తాపత్రయ పడటం, రాష్ట్ర విభజన జాతి విభజగా పరిణమించకూడదు అని తపన పడటం కనిపిస్తుంది. విభజనానంతర విపరిణామాలను సూచిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు కొన్ని ఇప్పుడు సమస్యలుగా మారడం గమనించవచ్చు. అలాగే ‘అంతర్జాతీయం’ విభాగం కింద ఏబీకే రాసిన ‘అరబ్బుల ఆగర్భ శత్రువు అమెరికా’, ‘లాడెన్ మరణం ఒక మిస్టరీ’, ‘డ్రాగన్ పై అమెరికా డేగ కన్ను’ వంటి వ్యాసాలు అలాగే గడాఫీ మీద, ఒబామా వ్యవహార శైలి మీద రాసిన వ్యాసాలు చాలా విలువైనవిగా తోస్తాయి. పర్యావరణ సమస్యల మీద ఉదాహరణకు బి.టి. వంకాయ, ఎల్-నినో, ఆదికణం వంటి అంశాల పై రాసిన వ్యాసాలు విద్యార్థులందరి చేతా తప్పక చదివించ దగ్గవి. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి చర్చించడమేగాక తనదైన వ్యాఖ్యను జత చేయడం ఏబీకే శైలీ. విస్తృతమైన అధ్యయనం, కాలంతో పాటు నడిచే గుణం ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఈ సంకలనాన్ని కేవలం పాత్రికేయవ్యాఖ్యగా చూడకూడదు. ఇది తలపండిన ఒక తరం నేటి తరానికి అందిస్తున్న విలువైన ఆలోచనా ధారగా కూడా చూడాలి. - ఎన్. సురేశ్ ‘అంతర్జాతీయం’ విభాగం కింద రాసిన వ్యాసాలు చాలా విలువైనవిగా తోస్తాయి. కాలంతో కరచాలనం ఏబీకే ప్రసాద్ వ్యాసాలు వెల: రూ.220 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ ఏబీకే నం: 9848318414 -
‘అర్బన్ ఫోక్ మ్యూజిక్
‘భూక్ రోటీ కీ హయ్ తుఝే... ధూండే ఫిర్ క్యోం తూ తుక్డే జమీన్ కీ...’ (అన్నం కోసం ఆకలి వేస్తే భూమిని ఎందుకు లాక్కుంటున్నావ్) అంటూ సామాజిక చైతన్యం రగిలించింది ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’. బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం జనసంవాద్ బ్యాండ్ ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన సురేంద్రసింగ్ నేగి... సామాజిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా వినూత్నంగా సంగీతాన్ని ఎన్నుకున్నారు. ‘టాక్ టు పీపుల్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో ప్రజా చైతన్యం కోసం ముందుకు సాగుతున్న సురేంద్రసింగ్‌ను ‘సిటీ ప్లస్’ పలకరించింది... మాది దిల్లీ. మొదటి నుంచీ సామాజిక సమస్యలపై అవగాహన ఎక్కువ. దిల్లీ యూనివర్సిటీ నుంచి స్పానిష్‌లో పీహెచ్డీ చేశా. తరువాత ఇఫ్లూలో స్పానిష్ లెక్చరర్‌గా అవకాశం వచ్చింది. చదువుకునే రోజుల్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఆలోచింపజేసింది. అప్పుడే సమాజం కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి నుంచి మతసామరస్యం, ఆడవారిపై దాడులు, వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, కశ్మీర్లో మతపరమైన దాడులు, రైతుల ఆత్మహత్యలు, భూ సేకరణ... ఇలా సామాజిక అంశాలను ఎంచుకుని పాటలు రాశా. అదే సమయంలో నాలాంటి ఆలోచనలే కలిగిన తారీఖ్షేఖ్ (బెంగాల్), బేస్ గిటార్ స్పెషలిస్టు సుమిత్ భండారీ (దిల్లీ), ఫ్లూట్ స్పెషలిస్టు దీపక్ సేన్వాల్ (ఫ్లూట్ స్పెషలిస్టు), తబలా ప్లేయర్ సావన్ (హైదరాబాద్)తో పరిచయం ఏర్పడింది. ఆ నలుగురితో కలసి ‘జన్‌సంవాద్’ బ్యాండ్‌కు శ్రీకారం చుట్టాం. 2012లో తొలిసారిగా ఇఫ్లూలో అర్బన్ ఫోక్ మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చాం. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, లామకాన్‌లో నిర్వహించిన మా కన్సర్ట్కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. అలాగే దిల్లీ, బీహార్లలో కూడా ప్రదర్శనలిచ్చాం. ఎక్కడికెళ్లినా మా ఆలోచనకు జేజేలు దక్కాయి. నా మ్యూజిక్ వల్ల వందమందిలో ఒకరు మారినా ఆనందమే. డిఫరెంట్ వాయిద్యాలు... అర్బన్ ఫోక్ మ్యూజిక్‌లో విభిన్న రకాల వాయిద్యాలు ఉపయోగిస్తున్నాం. త్రీ టైమ్స్ గిటార్, రిథమ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, దేశ్ గిటార్, తబలా, ఫ్లూట్, డోలక్లను వాడుతున్నాం. మా టీమ్‌లోని సభ్యులమంతా నగర నేపథ్యం ఉన్నవారం కాబట్టి... ‘అర్బన్ ఫోక్ మ్యూజిక్’ను ఎంచుకున్నాం. నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఈ మ్యూజిక్ చాలా ఉపయోగపడుతోంది. మ్యూజిక్ ప్లే చేసి ప్రజల్లో సామాజిక మార్పు తీసుకొచ్చే దిశగా సాగుతున్నాం. ఇప్పటికే పల్లెల్లో ఘల్లుమంటున్న జానపదానికే సరికొత్త బాణీలు చేర్చి ఇష్యూస్ రైజ్ చేసేలా పాటలు పాడుతున్నాం. - వాంకె శ్రీనివాస్ -
దుబారా వేడుకలు వద్దనీ.. సేవే ముద్దని..!
-
మంత్రి గంటావి అనుచిత వ్యాఖ్యలు
మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ అధ్యక్షురాలు నాగమణి పాలకొండ : మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచిత వాఖ్యలు చేయడం తగదని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భోజన పథకం మన రాష్ట్రంలోనే సక్రమంగా అమలవుతోందన్నారు. కనీస సదుపాలయాలు లేకపోయినా పథకం అమలు చేస్తున్నామన్న విషయాన్ని మంత్రి గంటా గుర్తించాలన్నారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు నిర్వాహణ అప్పగించి, డబ్బులు దండుకోవడానికి మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోక పోతే తీవ్రపరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం వంటగదులు లేకపోయినా పట్టించుకునేవారు లేరన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ. 3 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. సకాలంలో బిల్లులు రాకపోయినా, వసతులు లేకపోయినా, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. తమినాడులో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఇక్కడా కల్పించాలని డిమాండ చేశారు. అమెతో పాటు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పద్మ, ఉపాధ్యక్షురాలు ఎ.మహాలక్ష్మి, నారాయణమ్మ ఉన్నారు. -
నరకయాతన
కంపుకొడుతున్న సులభ్ కాంప్లెక్సులు అక్కరకురాని వ్యక్తిగత మరుగుదొడ్లు బాగుకు నిధులు విదల్చని ప్రభుత్వం మహిళల బహిర్భూమికి చాటు మార్గాలే గతి సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతర్ బహిరంగ మలవిసర్జన సామాజిక నేరమంటూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేపడుతున్నాయి. వాస్తవానికి సామూహిక మరుగుదొడ్లు, సులాబ్ కాంప్లెక్స్‌లతో పాటు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నిధులు విదల్చకపోవడంతో ముఖ్యంగా మహిళలు బహిర్భూమి అవసరాలకు నరకయాతనకు గురవుతున్నారు. ఇప్పటికీ చాటు మార్గాలను వెతుక్కోవలసి వస్తున్నది. ఇటీవల సుప్రీంకోర్టు బృందం పర్యటనలతో ఉరుకుల పరుగుల మీద ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్లు నిర్మించినా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేని వారు ఇప్పటికీ జిల్లాలో వేలాది మంది అవమానాలకు గురవుతూనే ఉన్నారు. జిల్లాలో 10.97 లక్షల కుటుంబాలకు కేవలం లక్షా 50వేలకే వ్యక్తిగత మరుగుదొడ్లున్నాయి. మిగిలిన వారంతా సులభ్‌కాంప్లెక్స్‌లు..బహిర్భూమిలనే ఆశ్రయిస్తున్నారు. విశాఖపట్నం: జిల్లాలోని ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో 20వేలకుపైగా సులభ్ కాంప్లెక్స్‌లున్నాయి. వీటిలో సుమారు పదివేలకు పైగా శిథిలావస్థకు చేరుకోగా. దాదాపు అన్నింటిలోనూ నిర్వహణ అధ్వానంగానే ఉంది. ఏఒక్క దానిలోనూ ఒక్క మరుగుదొడ్డి కూడా సక్రమంగా ఉన్న దాఖలాలు లేవు. లోపలకు వెళ్తే చాలు ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్గంధం వెలువడుతుంటుంది. వీటిలో మలమూత్ర విసర్జించాలంటే ఏ రోగమొస్తుందోననే భయం వెంటాడుతుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలన్న లక్ష్యం నీరుగారిపోతున్నది. జిల్లాలో ఉపాధి హామీలో 2,52,257 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 7,498 మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేయగలిగారంటే వీటి నిర్మాణం పట్ల అధికారులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం వీటి నిర్మాణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు అప్ప గించడంతో మార్చి నాటికి కనీసం 60వేలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక నుంచి ఏడాదికి లక్ష చొప్పున 2019 అక్టోబర్-2 నాటికి జిల్లాలో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా విశాఖ ను తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే స్థాయిలో అవసరాన్ని బట్టి సులభ్‌కాంప్లెక్స్‌ల సంఖ్యను కూడా పెంచుతామని చెబుతున్నారు. -
సామాజిక స్పృహతో రండి
డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఉద్బోధ పవిత్రమైన న్యాయవాద వృత్తిని వ్యాపారాత్మకం చేయొద్దు డబ్బు సంపాదించాలనుకుంటే వ్యాపారాలు చేసుకోండి ఉద్దేశపూర్వకంగా ఏ చిన్న పొరపాటు చేసినా వృత్తికి మచ్చ తెచ్చిన వారవుతారు న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి సాక్షి, విశాఖపట్నం: ‘‘ధనకాంక్షతో న్యాయవాద వృత్తిలోకి రావద్దు. సామాజిక స్పృహతో రండి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు న్యాయ విద్యార్థులకు ఉద్బోధిం చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్యూ) తొలి స్నాతకోత్సవం శుక్రవారం విశాఖపట్నం లో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్నాతకోపన్యాసం చేశారు. ‘‘డబ్బు సంపాదించే ఉద్దేశంతో కొందరు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. అలాంటి ఉద్దేశం ఉంటే తక్షణం మార్చుకోండి. డబ్బు కోసమైతే ఇతర వృత్తులు, వ్యాపారం చేసుకోవచ్చు. పవిత్రమైన న్యాయ వ్యవస్థను వ్యాపారాత్మకం చేయొద్దు. న్యాయవాదుల చేతుల్లోనే భారత భవిష్యత్తు ఆధారపడి ఉంది. న్యాయవ్యవస్థ గొప్పదనాన్ని గుర్తించి సామాజిక స్పృహతో అందరికీ సమానంగా న్యాయసహాయం చేయాలి’’ అని జస్టిస్ దత్తు చెప్పారు. ‘‘మహా భారతంలోని మూల సిద్ధాంతమైన ధర్మసూత్రాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఆచరిస్తోంది. ఎవరికి వారు ధర్మాన్ని ఆచరిస్తే న్యాయ పరిరక్షణ సాధ్యమవుతుంది’’ అని చెప్పారు. ‘‘నేను ఏడో తరగతిలోకి అడుగు పెట్టినప్పుడు రంగనాధరావు అనే ప్రధానోపాధ్యాయుడు మా తరగతి గదిలోకి వచ్చి బోర్డుపై ‘3హెచ్ స్క్వేర్’ అని రాశారు. ఎవరైనా పాఠాలు బోధించే ముందు ఓం అనో, శ్రీ అనో రాస్తారు. కానీ ఆయన ఎందుకిలా రాశారో మాకు అర్థం కాలేదు. అప్పుడాయన చెప్పిన ఫార్ములా ఇప్పటికీ గుర్తుంది. తొలి హెచ్ - హార్డ్‌వర్క్ (శ్రమ), రెండో హెచ్ - హంబుల్‌నెస్ అండ్ హ్యుమానిటీ (అణకువ, మానవత్వం), మూడో హెచ్ - హానెస్టీ (నిజాయితీ).. అని వివరించారు. ఇవి అలవరుచుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పారు. ఆ విషయాలను నేను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లాను. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు మీ ముందు ఈ స్థాయిలో నిలబడ్డాను. జీవితంలో పైకి రావాలంటే ఎలాంటి అడ్డదారులూ లేవు. తపన, సంకల్పం, క్రమశిక్షణ ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చు. అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి. వీటికి ప్రత్యామ్నాయం లేవు. మార్కులు, ఫలితాలు, ర్యాంకులను పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో విజయాలు వరిస్తాయి. ఫస్టా.. లాస్టా అన్నది కాదు.. జీవి తంలో పోరాడటం ముఖ్యం. డిగ్రీలు గుర్తింపు మాత్రమే. మనకు నచ్చిన వృత్తిని ఎంచుకునేందుకు మార్గాలు చూపిస్తాయి. రాణించడమనేది అంకితభావం, కృషి పైనే ఆధారపడి ఉం టుంది. చదువు ముగించుకున్న మీకు జీవితం ఇప్పుడే మొదలైంది. సవాళ్లను ఎదుర్కొనే సమయమిది. వాటిని అధిగమిస్తూ జీవితాన్ని అర్ధవంతం చేసుకోవాలి. చట్ట ప్రకారం న్యాయం పొందడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి’’ అని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా: సీఎం న్యాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేందుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తానని సీఎం చంద్రబాబునా చెప్పారు. యూనివర్సిటీకి అవసరమైన 50 ఎకరాలు ఇస్తామని, భవన నిర్మాణాలకు తక్షణమే రూ.25 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. వీసీ ప్రొఫెసర్ ఆర్జీబీ భగవత్ కుమార్ నివేదికను సమర్పించారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన 43 మందికి డిగ్రీలు ప్రదా నం చేశారు. ఐదుగురు టాపర్స్‌కు స్వర్ణ పతకాలు బహూకరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య, వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘సహకారం’తో సామాజిక ప్రయోజనం
క్రమబద్ధమైన మార్కెట్లు, గ్రేడింగ్, ప్రామాణీకరణ, సరైన తూనికలు,కొలతలు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, మార్కెట్ సమాచారం లభ్యత,సేకరణ, మద్దతు ధరల నిర్ణయం, మార్కెటింగ్ పర్యవేక్షణ డెరైక్టరేట్ ఏర్పాటు లాంటి ప్రభుత్వ చర్యలు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడానికి దోహదపడుతున్నాయి. పెద్ద రైతులకు విక్రయించిన తర్వాత మిగులు అధికంగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల కారణంగా వీరే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తిలో అధిక భాగాన్ని పరపతి అవసరాల కోసం ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారని అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలియజేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే క్రమంలో సహకార మార్కెటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్ సంఘాలుగా ఏర్పడి వస్తువులను విక్రయించుకునే విధానమే సహకార మార్కెటింగ్. సహకార మార్కెటింగ్ భారత్‌లో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండు రకాలుగా ఉంది. మొదటి రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండంచెల్లో ఉంది. దీనిలో భాగంగా కిందిస్థాయిలో ప్రాథమిక సంఘాలు, అత్యున్నత స్థాయిలో రాష్ట్ర సొసైటీ ఉంటాయి. రెండో రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ మూడంచెలుగా ఉంటుంది. ఈ విధానంలో.. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సంఘాలు, జిల్లా స్థాయిలో కేంద్ర మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార సంఘం ఉంటాయి. ఆల్ - ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ సిఫారసుల ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. వీటిని మూడో ప్రణాళికలో విస్తరించారు. ప్రస్తుతం సహకార మార్కెటింగ్ వ్యవస్థలో భాగంగా మండి స్థాయిలో 2633 సాధారణ అవసరాలకు సంబంధించిన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘాలు, నూనె గింజలకు సంబంధించి 3290 ప్రత్యేక ప్రాథమిక మార్కెటింగ్ సంఘాలు, 172 జిల్లా లేదా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో సహకార మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా ‘నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ూఅఊఉఈ)’ను ఏర్పాటు చేశారు. సేకరణ, పంపిణీ, ఎంపిక చేసిన వ్యవసాయ వస్తువుల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను ‘నాఫెడ్’ నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వానికి కేంద్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ త్వరగా పాడవని పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. త్వరితంగా కుళ్లిపోయే బంగాళాదుంప, ఉల్లిపాయలు, ద్రాక్ష, ఆరెంజ్, గుడ్లు, ఆపిల్స్, మిరపకాయలు, బ్లాక్ పెప్పర్ లాంటి విషయంలో మార్కెట్ జోక్యాన్ని చేపడుతుంది. సహకార వ్యవస్థ ద్వారా మార్కెటింగ్ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. కానీ సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా లేదు. అనేక రాష్ట్రాల్లో సహకార మార్కెటింగ్ సంఘాల ఆర్థిక ప్రగతి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల ఇవి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఆహార ప్రాసెసింగ్: ప్రపంచంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పండ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 10% కాగా, కూరగాయల ఉత్పత్తిలో 13%. నేషనల్ హార్టికల్చర్ బోర్డ గణాంకాల ప్రకారం 2012-13లో భారత్‌లో పండ్ల ఉత్పత్తి 81.285 మిలియన్ మెట్రిక్ టన్నులు, కూరగాయల ఉత్పత్తి 162.19 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. పండ్ల ఉత్పత్తి విస్తీర్ణం 6.98 మిలియన్ హెక్టార్లు, కూరగాయల ఉత్పత్తి విస్తీర్ణం 9.21 మిలియన్ హెక్టార్లు. 2013-14లో పండ్లు, కూరగాయల ఎగుమతుల విలువ రూ. 8760.96 కోట్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 35% వృథా కావడానికి అవస్థాపనా సౌకర్యాలైన శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, రిఫ్రిజిరేటేడ్ ట్రక్ల కొరత లాంటివి కారణమవుతున్నాయి. దేశంలో ఇటీవల ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. భారత్‌లో సహకార సంఘాల్లా ఏ ఇతర రంగం కూడా రైతులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో ఆహార ప్రాసెసింగ్ విషయంలో సహకార సంఘాలు దృష్టి సారించడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. సహకార సంఘాలు గిడ్డంగి వసతి, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, త్వరగా పాడయ్యే వస్తువుల రవాణా కోసం రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను సమకూర్చుకోవాలి. సహకార సంఘాలు - సామాజిక ప్రయోజనం 1. సహకార సంఘాల ఉత్పత్తులకు సంబంధించి కామన్బ్రాండ్లను అభివృద్ధి చేసి వాటిని వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా సమాజానికంతటికీ ప్రయోజనం కలుగుతుంది. సహకార సంఘం సభ్యులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా వారి ఆదాయస్థాయి పెరుగుతుంది. ఉదా: ప్రాసెసింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే ఆయా ప్లాంట్లలో సహకార సంఘ సభ్యులకు ప్రత్యక్షంగా, ప్రాసెస్డ్ ఫుడ్ (్కటౌఛ్ఛిటట ఊౌౌఛీ) తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేసే రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 2. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహకార సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో ధరల స్థిరీకరణకు సహకార సంఘాల ఉత్పత్తులు దోహదపడుతున్నాయి. ప్రైవేట్ డెయిరీలు పాల ప్యాకెట్ల సరఫరా విషయంలో సహకార డెయిరీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందువల్ల ధరలు కొంతమేర నియంత్రణలో ఉంటున్నాయి. 3. వ్యవసాయ ఆధారిత సహకార సంఘాలు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌లో విజయవంతమైతే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఫార్మింగ్ కో-ఆపరేటివ్స, సర్వీస్ సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్స, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ యూనిట్లు మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తులు, ఉపాధి పెంపుదలలో ప్రధాన భూమిక పోషిస్తాయి. 4. స్వదేశీ మార్కెట్లో సహకార ఉత్పత్తుల కామన్బ్రాండ్లు అభివృద్ధి చెందితే ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం పెరిగి విదేశీ వాణిజ్యం వృద్ధి చెందుతుంది. భారత్‌లోని డెయిరీ, టెక్స్టైల్స్, తోలు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించి మొదటగా స్వదేశీ డిమాండ్ పెరుగుదలపై సహకార సంఘాలు దృష్టి సారించాలి. 5. సహకార సంఘాల అభివృద్ధి ద్వారా పటిష్టమైన, విలువ ఆధారిత సమాజం రూపుదిద్దుకుంటుంది. తద్వారా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సాధికారత సాధించవచ్చు. 6. {పజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తగిన సేవలు అందించడంలో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బియ్యం, గోధుమ, పంచదార, గోధుమ పిండి, కిరోసిన్‌ను సబ్సిడీ ధర వద్ద పంపిణీ చేయగలుగుతాయి. ప్రభుత్వ ఉచిత పంపిణీ పథకమైన చేనేత వస్త్రాల (చీరలు, దోవతిలు) పంపిణీని సహకార సంఘాల ద్వారా చేపడుతున్నారు. మాదిరి ప్రశ్నలు 1. 1915లో తొలి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) పంజాబ్ 2. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారుల నుంచి రక్షించడానికి ఏర్పాటైన సంస్థ? 1) ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2) ఐఎఫ్ఎఫ్సీవో 3) ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 4) ఏదీకాదు 3. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1957 2) 1963 3) 1964 4) 1969 4. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) హైదరాబాద్ 2) కోల్‌కతా 3) న్యూఢిల్లీ 4) ముంబయి 5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ? 1) రంగరాజన్ కమిటీ 2) వై.కె. అలఘ్ కమిటీ 3) పద్మనాభయ్య కమిటీ 4) వై.వి. రెడ్డి కమిటీ 6. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం? 1) 1961 2) 1962 3) 1963 4) 1964 సమాధానాలు: 1) 2 2) 3 3) 1 4) 4 5) 2 6) 3. సహకార మార్కెటింగ్ ప్రయోజనాలు: 1. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతిమ కొనుగోలుదార్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. 2. రైతులకు తమ ఉత్పత్తుల విక్రయంలో బేరమాడే శక్తి పెరుగుతుంది. 3. సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి రైతులు తగినంత పరపతి పొందగలుగుతారు. తద్వారా గిట్టుబాటు ధరలు లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించకుండా వేచి ఉండవచ్చు. ఫలితంగా వారికి లభించే ప్రతిఫలాల్లో పెరుగుదల ఉంటుంది. 4. సహకార మార్కెటింగ్ సంఘాలకు సొంత రవాణా సాధనాలు ఉండటం వల్ల రవాణా వ్యయంలో తగ్గుదల ఏర్పడుతుంది. 5. సహకార సంఘాలు గిడ్డంగి సౌకర్యాలను కల్పిస్తున్నందు వల్ల గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 6. {శేణీకరణ, ప్రామాణీకరణ ఉంటుంది. 7. మార్కెట్ ధరలు, డిమాండ్, సప్లయ్, ఇతర మార్కెట్ సమాచారం ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు లభిస్తుండటం వల్ల తదనుగుణంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. 8. సహకార మార్కెటింగ్ సంఘాలు ఉత్పాదితాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వినియోగ వస్తువులను అధిక పరిమాణంలో తక్కువ ధరలకే కొనుగోలు చేసి సభ్యుల మధ్య పంపిణీ చేసుకోగలుగుతారు. 9. సహకార మార్కెటింగ్ సంఘాలు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేపట్టవచ్చు. 10. రైతుల్లో ఆత్మవిశ్వాసం, సమష్టి కృషికి సంబంధించిన అవగాహన వల్ల వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు. 11. సమగ్రమైన ప్రణాళికల ద్వారా పంటల తీరులో మార్పు చేపట్టవచ్చు. 12. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి విక్రయం అయిన మిగులులో పెరుగుదల ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టవచ్చు. 13. సహకార సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందిన సంస్థలు. వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
లవ్ కిచిడి
నువ్వు-నేను - శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్ YOU AND I "I believe that marriage is not between a man and woman... but between love and love' అంటాడు ఫ్రాంక్ ఓషన్. ‘సోషల్ కిచిడి’ అనే మార్కెటింగ్ సంస్థను నడిపిస్తున్న .. శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్‌ల పెళ్లి కూడా అలాంటిది. రెండు ప్రేమలు సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో మూడేళ్ల వీళ్ల వైవాహిక జీవితమూ అలాగే ఉంటుంది! శైలేష్‌ది ఉద్యోగ కుటుంబం.. సూర్య వాళ్లది వ్యాపార కుటుంబం. శైలేష్ ఎంబీఏ చేస్తే.. ఆమె మాస్ కమ్యూనికేషన్ చదివింది. ఆయన పక్కా హైదరాబాదీ. సూర్య.. లక్నో వాసి. తొలుత ఆమె జర్నలిస్ట్ హిందుస్థాన్ టైమ్స్‌లో. శైలేష్ అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో ఉన్నాడు. ప్రేమ వివాహం. కలిసింది ఎక్కడ? ఉన్నత చదువుల కోసం ఇద్దరూ యూకే వెళ్లారు. ఒకటే యూనివర్సిటీ. అక్కడ ఇద్దరికీ పరిచయం. అది కాస్తా ప్రణయంగా.. ఆపై పరిణయంగా మారింది. ఆ వివరాలను చెప్తూ శైలేష్ ‘యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి అభిమానం. కలిసి జీవిస్తే బాగుంటుందనుకున్నాం. పీజీ అయిపోయాక తను లక్నో వెళ్లిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేశాను. అప్పుడే మా ఇద్దరికీ ఓ పొలిటికల్ ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం వచ్చింది. అదీ లక్నోలో’ అని ఆపాడు. ‘ఆ టైమ్‌లో మా ఇద్దరి మధ్య మరింత అండర్స్టాండింగ్ పెరిగింది. తర్వాత పెళ్లితో ఒకటయ్యాం’ పూర్తిచేసింది సూర్య. భేదాలే అద్భుతాలు సృష్టిస్తాయి.. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇద్దరివీ ఒకే రకమైన అభిరుచులైనా.. వృత్తిపరంగా బోలెడు వ్యత్యాసం ఉంది. ‘ఆ డిఫరెన్సే మా నుంచి బెస్ట్ ఔట్‌పుట్‌ని రాబడుతోంది. తను చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది. అడ్మిన్‌స్ట్రేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి’ అని భార్యకు కితాబిస్తూనే ‘కాని బయట మార్కెట్ ఎలా ఉన్నదన్న విషయాన్ని గమనించదు’అంటూ సూర్య చూడని యాంగిల్‌నూ చెప్తాడు. ‘నిజమే. శైలేష్ మార్కెటింగ్ స్కిల్స్ సూపర్బ్. నేను ఒకటే యాంగిల్లో ఆలోచిస్తుంటే ఆ అంశానికున్న మిగిలిన డెమైన్షన్స్నూ చూపిస్తాడు. కాబట్టే ‘సోషల్ కిచిడీ’ బ్రహ్మాండంగా రన్ అవుతోంది’ సూర్య. అభిప్రాయభేదాలు తారస్థాయికి చేరవా? ‘ఎందుకు చేరవు. ఒక్కోసారి చాలా సీరియస్‌గా ఉంటాయి’ అని అతను చెప్తుంటే ‘అయితే అవి డిస్కషన్స్గానే ఉంటాయి తప్ప ఆర్గ్యుమెంట్స్‌గా మారవు. చర్చించి ఇద్దరికీ కాస్త దగ్గరగా ఉన్న ఒక పాయింట్ కన్విన్స్ అయిపోతాం. ఆ కామన్ పాయింట్‌నే ఫోకస్ చేస్తాం. బ్రహ్మాండమైన రిజల్ట్స్నిస్తుంది. ఒకే అభిప్రాయంతో ఉంటే ఇలాంటి అద్భుతాలు రావేమో!’ అంది సూర్య. ‘అసలామాటకొస్తే భార్యాభర్తలైన మేమిద్దరం పార్ట్‌నర్స్‌గా ఉండడమే సోషల్ కిచిడీ సక్సెస్. మా ఇద్దరి మధ్య వచ్చిన బిజినెస్ డిఫరెన్సెస్ బయటి బిజినెస్ పార్ట్నర్తో వచ్చుంటే ఇది క్లోజ్ అయిపోయేదేమో’ అన్నాడు శైలేష్. ‘ఈ లెక్కన మా మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టే!’ అంది సూర్య నవ్వుతూ. బలము.. బలహీనత ‘అలా కచ్చితంగా పరిశీలించుకోలేదు మేం. పరిస్థితులకనుగుణంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించుకుంటాం. దానికి తగ్గ సర్దుబాటు ఉంటుంది’ అంటారు సూర్య. ‘మేమిద్దరం వేరనే భావన ఉండదు. ఒకరు ఒక విషయంలో వీక్ ఉంటే ఆటోమేటిగ్గా అవతలివాళ్లు దాన్ని స్ట్రెంతెన్ చేసేస్తారు. ఏ ప్రతికూల పరిస్థితినైనా మాకు అనుకూలంగా మలచుకునే శక్తి మా ఇద్దరికీ ఉంది’ అంటాడు శైలేష్. ‘కాకపోతే కోపం లాంటి ఎమోషన్స్ నాకే ఎక్కువ’ నిజాయితీగా ఒప్పుకుంది సూర్య. ‘ఆ టైంలో నేనూ అరిస్తే ప్రాబ్లం మరింత కాంప్లికేట్ అవుతుంది కదా. అందుకే ఓపికగా ఉంటాను. అయితే తన కోపం పాలమీది పొంగు. చప్పున చల్లారిపోతుంది’ అంటాడు. ‘అవును. అసలు అలిగే చాన్సే ఇవ్వడు. రెండు నిమిషాలకే నవ్విస్తాడు. ఏ విషయం మీద అలగాలనుకున్నానో, కోపం ఎందుకు వచ్చిందో కూడా మరచిపోతా’నని చెప్తుంది ఆమె. మూడేళ్లలో మొదటి అడుగు చూసుకుంటే.. ‘మూడేళ్ల పెళ్లి, అంతకుముందు ఏడాదిన్నర స్నేహం. మొత్తం నాలుగున్నరేళ్లు. డెఫినెట్‌గా లాట్ ఆఫ్ చెంజ్ ఉంది. పెళ్లి భార్యాభర్తలను కాలంతో పరిణతి చెందేలా చేస్తుంది. ఒకరితో ఒకరు సర్దుకుపోయేలా ఇద్దరినీ తీర్చిదిద్దుతుంది’ అని వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చెప్పాడు శైలేష్. ‘మేం పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ ఆర్నెల్లు, అరేంజ్డ్ మ్యారేజ్ ఏడాది సౌఖ్యంగా ఉంటుంది అని కామెంట్ చేశారు. మమ్మల్ని చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’ అంటుంది సూర్య. కుటుంబ వారసత్వానికి భిన్నంగా వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవాలనేది శైలేష్ ప్రయత్నం. అండగా నిలబడింది ఆమె. రాజకీయవేత్త కావాలనేది ఆమె కోరిక. నెరవేర్చే దిశలో ప్రయాణిస్తున్నాడు శైలేష్. అతడు ఆమె సైన్యం... ఆమె అతడి ధైర్యం! ఇదీ వాళ్ల అనుబంధం!. - సరస్వతి రమ -
అఖిలం
అతడి చిత్రం సామాజిక చైతన్యం. కళ్లముందు కదిలి... కాన్వాస్‌పై ఆవిష్కరించే నిజ దృశ్యం. వయసులో చిన్నే అయినా... ఆలోచనలు విశాలం. కూకట్పల్లి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎ.అఖిల్... కుంచెతో చేసే చిత్రాలెన్నో! పెయింటింగ్‌లో ఎన్నో పతకాలు, అభినందనలు అందుకున్న అఖిల్ ‘సిటీ ప్లస్’తో తన అభిరుచి గురించి ముచ్చటించాడు. పర్యావరణం, పరిరక్షణ, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు... పెయింటింగ్ ఏదైనా సామాజిక అంశాన్ని మిళితం చేస్తాడు అఖిల్. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు నాలుగో తరగతి నుంచే ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. యాభైకి పైగా పోటీల్లో సత్తా చాటాడు. మహబూబ్‌నగర్ జిల్లా వంకేశ్వరం స్వగ్రామం. తన ఆలోచనలే కాదు... సినిమా పాటలోని భావాలకు రూపం ఇస్తాడు. పంట పొలాలు, వ్యవసాయం, పక్షులు, ఊళ్లలో జరిగే జాతర... ఇలా ప్రతిదీ అతడికి కళాత్మకమే. స్వాతంత్య్ర సమరయోధులు, దేవతలు, వెయ్యి, ఐదొందల రూపాయి నోట్ల వంటివి అచ్చుగుద్దినట్టు కాన్వాస్‌పై దించేస్తాడు. పతకాలు ఘనం... ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులపై అఖిల్ వేసిన పెయింటింగ్ (2012)కు జాతీయ స్థాయిలో బంగారు పతకం దక్కింది. అలాగే 2012, 13 సంవత్సరాల్లో నెమలి, పర్యావరణ పరిరక్షణపై గీసిన చిత్రాలకు కడప ఫైన్ ఆర్ట్స్ అకాడమీ బంగారు పతకాలు అందించింది. 2013లో సాక్షి నిర్వహించిన ‘నా దృష్టిలో వైఎస్ఆర్’ పోటీల్లో ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. ఆంజనేయుడి రూపంలో వైఎస్ఆర్ చిత్రపటం గీశాడు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ బాలభవన్‌లో జరిగిన నేషనల్ బాలశ్రీ అవార్డు ఫైనల్లో తెలంగాణ నుంచి పాల్గొన్నది అఖిల్ ఒక్కడే. చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, బిర్లా మందిర్, అసెంబ్లీ మధ్యలో మెట్రో రైల్వే ట్రాక్ పెయింటింగ్ వేసి అబ్బురపరిచాడు. ఎవరైనా చేయూతనిస్తే... మరింతగా రాణిస్తానంటున్నాడు అఖిల్. -వాంకె శ్రీనివాస్ -
తూర్పుగోదావరి జిల్లాలో సంఘ బహిష్కరణ
-
అమ్మాయి కనిపిస్తే చాలు..!
-
అనాథలకు ‘అమ్మ’ ఆసరా
కెరమెరి : అమ్మ మృతి చెందడం.. నాన్న తాగుడుకు బానిస కావడంతో అనాథలుగా మారిన చిన్నారుల వైనం ఈ నెల 13న ‘సాక్షి’లో ‘అమ్మ లేదు.. నాన్న రాడు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక స్వచ్చంధ సేవా సంస్థ అనాథ శరణాలయం నిర్వాహకులు చిన్నారుల ఆలనా, పాలనా చూసుకునేందుకు ముందుకొచ్చారు. గురువారం మండలంలోని బాబేఝరి (కొలాంగూడ)లో ఉంటున్న చిన్నారుల నానమ్మ, చిన్నాయన గంగారాంను కలిశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తామని, మా అనాథ శరణాలయంలో చిన్నారులను చేర్పించాలని ఆ సంస్థ ప్రధాన కార్యాదర్శి జాడి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బింజి సుధాకర్ కోరారు. తమ పిల్లలు చాలా చిన్నారులని, మరి కొద్ది మాసాల తర్వాత పంపిస్తామని గంగారాం, పిల్లల నానమ్మ వారితో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల తాత ఇతర గ్రామంలో పాలేరుగా పని చేస్తునాన్నడని, ఆయన రావడానికి మరో మూడు మాసాలు పడుతుందన్నారు. వచ్చాక ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచేలా తీర్చి దిద్దుతామని అమ్మ నిర్వాహకులు చెప్పారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ కూడా వారికి ఎంతో నచ్చజెప్పినా ప్రస్తుతం ససేమిరా అన్నారు. కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేంకుమార్, ప్రధాన కార్యాదర్శి కుర్ర శంకర్ , అంగన్వాడీ కార్యకర్త అనసూయ ఉన్నారు. -
మిగిలిన ఐఐటీలకు భిన్నం..
ఐఐటీ - ఇండోర్ కొత్తగా ఏర్పడినప్పటికీ మిగిలిన ఐఐటీలకు ఏ మాత్రం తీసిపోదు అంటున్నాడు.. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న మేర్గు సూర్యతేజ. పరిశోధనలకు, ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారని అంటున్న సూర్య తన క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నాడిలా.. మై క్యాంపస్ లైఫ్ తాత్కాలిక క్యాంపస్‌లో.. ఐఐటీ - ఇండోర్ 2009లో ఏర్పడింది. అందువల్ల పూర్తిస్థాయీ క్యాంపస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తాత్కాలి క క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉండొచ్చు. బ్యాచిలర్‌స డిగ్రీలో కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక ల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అత్యుత్తమ వసతులు తాత్కాలిక క్యాంపస్‌లో అన్ని వసతులు ఉన్నాయి. క్యాంపస్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది. లేబొరేటరీలు అత్యాధునికంగా ఉంటాయి. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జర్మనీ నుంచి అత్యుత్తమ పరికరాలు తెప్పించారు. లైబ్రరీ, క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆన్లైన్ లైబ్రరీని కూడా విద్యార్థులు వినియోగించుకోవచ్చు. రుచికరమైన దక్షిణ, ఉత్తర భారత వంటకాలు అందించే భోజనశాలలు కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరత ఉన్నా ఐఐటీ-బాంబే.. ఇండోర్ క్యాంపస్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది. అక్కడ నుంచి విజిటింగ్ ఫ్యాకల్టీ ఇక్కడకు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నంతలో అత్యుత్తమ ఫ్యాకల్టీ ఉన్నారు. బోధనలో రీసెర్చ్ ఓరియెంటేషన్, ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను సూచించేలా బోధిస్తారు. మూడే బ్రాంచ్‌లు కావడం.. ఒక్కో బ్రాంచ్‌లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం వల్ల ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఆన్లైన్ వీడియోలు, ప్రొజెక్టర్లు ఉపయోగిస్తారు. వీటివల్ల ఆయా అంశాలపై విద్యార్థులకు సులువుగా పట్టు లభిస్తుంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో మధ్యాహ్నం వరకు తరగతులు, తర్వాత నుంచి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వారంలో మూడు రోజులు ట్యుటోరియల్ సెషన్ కూడా ఉంటుంది. విద్యార్థులకు అకడమిక్‌పరంగా ఎదురయ్యే సందేహాలను ఈ సెషన్లో నివృత్తి చేస్తారు. సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎన్నో అంశాల్లో సహాయమందిస్తారు. అవసరమైతేవారు చేసే ప్రాజెక్టులు/పరిశోధనల్లో జూనియర్స్ సహాయం కూడా తీసుకుంటారు. వినూత్న కరిక్యులం మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ - ఇండోర్ ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఐఐటీల్లో బీటెక్ మొదటి ఏడాదిలో అందరికీ కామన్‌గా.. ఇంజనీరింగ్ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ వాటికి భిన్నంగా ఫస్టియర్ నుంచే విద్యార్థులతో కంప్యూటర్/వీడియో గేమ్స్ డిజైన్ చేయించడంతోపాటు పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. అలా ఏర్పడిందే రేడియో టెలిస్కోప్. దీన్ని బీటెక్ విద్యార్థులే నిర్మించి.. నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏ ఐఐటీ లోనూ రేడియా టెలిస్కోప్ లేదు. దేశవ్యాప్తంగా జరిగిన కోడింగ్ కాంపిటీషన్స్‌లో ఐఐటీ - ఇండోర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఐఐటీల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఒక సర్వేలోనూ క్వాలిటీ రీసెర్చ్, రీసెర్చ్ పేపర్స్ ప్రచురణలలో కొత్త ఐఐటీలన్నింటిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే మైనర్ కోర్సులుగా హ్యుమానిటీస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోపు కనీసం ఐదు హ్యుమానిటీస్ సబ్జెక్టులను పూర్తి చేయాలి. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫ్రెంచి లాంగ్వేజ్, సైకాలజీ, ఫిలాసఫీ వంటివి ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. ఏటా పరిశ్రమలు- విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ కోసం ఇండస్ట్రీ- అకడమియా కాన్క్లేవ్ను నిర్వహిస్తారు. వివిధ కంపెనీలు/ పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ ఇందులో పాల్గొంటారు. కంపెనీలు విద్యార్థుల నుంచి ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారో. అందుకనుగుణంగా ఏయే లక్షణాలను పెంపొందించుకోవాలో తెలుసుకునే సదవకాశం దీని ద్వారా లభిస్తుంది. విదేశీ సంస్థలతో ఒప్పందాలు ఇన్స్టిట్యూట్.. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు చెందిన విద్యా సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, అకడమిక్‌పరంగా పరస్పర సహకారం ఉంటాయి. స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆలోచనల నుంచి ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ఫండింగ్ సదుపాయం కల్పిస్తారు. స్టార్టప్స్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ప్రతి ఏటా కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి సగటున రూ. 10 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. గతేడాది గరిష్టంగా ఏడాదికి రూ.60 లక్షల రూపాయల వరకు వేతనాలు అందించా యి. పదికి 7పైన సీజీపీఏ సాధిస్తే మంచి ప్లేస్మెంట్ ఆశించొ చ్చు. నాకు ప్రస్తుతం 7.8 (పదికి) సీజీపీఏ ఉంది. స్టూడెంట్ జింఖానా ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రతి ఏటా కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో భాగంగా రోబో కాంపిటీషన్స్ వంటివి ఉంటాయి. ఇంకా ఉగాది, శ్రీరామ నవమి, జన్మాష్టమి, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలను బాగా చేస్తాం. చదువు పూర్తయ్యాక సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక. తద్వారా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. -
బడ్జెట్లను మింగే ‘బ్లాక్ హోల్స్’
దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా, రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలన్నా మొదటి షరతుగా ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బులో అనగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ల రూపకల్పన, అమలులో ఆర్థిక ప్రజాస్వామ్యం చోటు చేసుకోవాలి. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక సమానత్వంతో సమానార్థకమైనది కాదని నా అభిప్రాయం. ఇక్కడ ఆర్థిక సమానత్వం అంటే సమాజం ఆర్థిక నియమం కలిగి ఉండటం. ప్రభుత్వంతో సహా సమాజం అంతా ఒక రాజకీయ, ఆర్థిక నియంత్రణకు బద్ధులై ఉన్నప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. అన్ని వ్యాపారాల్లాగే ఎన్నికలు కూడా సరికొత్త పెట్టుబడిగా మారిపోయాయ న్నది కాలానుగుణంగా రుజువవుతూ వస్తున్నది. ఎవరైనా పోటీ చేసే హక్కు ఇంకా అడుగంటిపోలేదు కానీ, కేవలం కొందరే గెలవాలన్న నిర్ధారణ ఈ రాజ్యాంగ సూత్రాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. కొంత విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం ఇప్పుడు సర్వసాధారణం. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు సాధారణ పౌరుల ఊహకు కూడా అందదు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం తీవ్రంగానే ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు వేలు కాదు, లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు ఆస్తులు అమ్మి పోటీ చేస్తున్నారు. మరికొందరు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేస్తున్నారు. అంతులేని రాజకీయ బేరసారాలు అభ్యర్థుల ఖర్చు మీద ఎన్నికల కమిషన్ విధించిన పరిధి గురించి చర్చించి ప్రయోజనం లేదు. దాని లెక్క దానికే. ఎన్నికల్లో చేసే ఖర్చు, మళ్లీ వేరే ఒక్కొక్క అభ్యర్థి పదికోట్ల నుంచి వంద కోట్ల దాకా ఖర్చు చేసినట్టు గత ఎన్నికల అనుభవం చెబుతున్నది. దానితో అభ్యర్థుల ఎంపిక దగ్గరే పార్టీలు ఖర్చును దృష్టిలో పెట్టుకొంటున్నాయి. పార్టీకి నిధులు ఇవ్వగలిగే వాళ్లు, భారీగా ఖర్చు చేయగలిగే వాళ్లు అభ్యర్థులు అవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలదీ అదే దారి. ఇటువంటి అభ్యర్థులకు పార్టీ మీదగానీ, ప్రజల మీదగానీ ప్రేమ, అభిమానాలు లేవు. పైగా పార్టీని, నాయకత్వాలను బ్లాక్ మెయిల్ చేసైనా పదవులు, ఇతర అవకాశాలు సంపాదించడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల తర్వాత మరొక తంతుకు తెర లేస్తున్నది. మెజార్టీ సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహజం. తదనంతరం వివిధ పార్టీల మీద గెలిచిన వాళ్లు అధికార పార్టీల్లోకి దూకడం మామూలైపోయింది. ఇటువంటి వారిని తీసుకోవడానికి అధికార పార్టీ వెనకాడటం లేదు. ఇటీవలి ఎన్నికల్లో ఇది మరింత తీవ్రమైంది. ఎదురు లేకుండా చేసుకోవడానికీ, ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి చేస్తున్న ప్రయత్నమిది. వడ్డీతో సహా రాబట్టుకుంటున్నారు అధికార పార్టీకి అవసరం, ఆసక్తి లేకపోయినప్పటికీ ప్రతిపక్షాల శాసనసభ్యులు వేలం వెర్రిగా పార్టీ మారుతున్నారు. దీని వెనుకఉన్న బలమైన కారణం- ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలను తిరిగి రాబట్టుకోవడం. రాజకీయ ప్రజాస్వామ్యం సాధించుకున్నా, ఆచరణలో అది ధనస్వామ్యంగా మారిపో యింది. దీనితో రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం రెండూ అర్థం లేని అంశాలుగా మారాయి. భారతదేశంలో కులం ద్వారా ధనం ఒనగూడుతున్నది. తరతరాలుగా నిచ్చెన మెట్లపైనే ఉన్న ఆధిపత్య కులాలు ధనార్జనలో కూడా పైననే ఉన్నాయి. దానితో బడుగు, బలహీనవర్గాలు, డబ్బులు లేని నాయకులకు ఎన్నికలు అసాధ్యమైన ప్రక్రియగా మారిపో యాయి. రాజకీయంగా ఓటు హక్కుకు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది. సరిగ్గా ఇక్కడే బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సభలో చేసిన చివరి ప్రసంగంలోని మాటలు గుర్తుకొస్తాయి. ‘‘1950, జనవరి 26 నుంచి అమలులోకి వచ్చే రాజ్యాంగం ద్వారా మనం వైరుధ్యంలోకి అడుగుపెడుతు న్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయ సమానత్వాన్ని అందిస్తున్నాం. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. వీటిని వీలైనంత తొందరలో తొలగించు కోవాల్సి ఉంది. ఒకవేళ ఇవి ఇలాగే కొనసాగితే, రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లకతప్పదు. మనం ఎంతో శ్రమపడి నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్య సౌధం పేకమేడలా కూలిపోతుంది’’. ఈ వ్యాఖ్యలను భారతదేశ రాజకీయ పరిస్థితులకు ఒక హెచ్చరికగా చూడాలి. ధనస్వామ్యం వర్ధిల్లుతోంది రోజురోజుకీ కడు పేదరికంలో కూరుకుపోతూ, ఖరీదైపోయిన ప్రజాస్వామ్య ఫలాలు అందుకోలేని స్థితిలో కొందరుంటే, మరికొందరు కళ్లు మూసి తెరిచేలోగా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. వీళ్లెవ్వరూ పరిశ్రమలు పెట్టడం ద్వారా, వ్యాపారాలు చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం లేదు. ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నుల ద్వారా సమీకరించిన ప్రజాధనాన్ని గుండు గుత్తగా పట్టపగలే కొల్లగొడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్లు, పార్టీలు ఫిరాయిస్తున్న వాళ్లందరూ ఈ కోవలోకే వస్తారు. మన దేశంలో పేదరిక నిర్మూ లన జరగాలన్నా, రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడ సాగించా లన్నా మొదటి షరతుగా ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బులో అనగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ల రూపకల్పన, అమలులో ఆర్థిక ప్రజాస్వామ్యం చోటుచేసుకోవాలి. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక సమానత్వంతో సమానార్థకమైనది కాదని నా అభిప్రాయం. ఇక్కడ ఆర్థిక సమానత్వం అంటే సమాజం ఆర్థిక నియమం కలిగి ఉండటం. ప్రభుత్వంతో సహా సమాజం అంతా ఒక రాజకీయ, ఆర్థిక నియం త్రణకు బద్ధులై ఉన్నప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ఆర్థిక ప్రజాస్వామ్యం ప్రభుత్వానికి సంబంధించినది. ఇది పూర్తిగా చట్టాల, శాసనాల పరిధిలో జరిగేది. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేయాలి. ప్రజలకు కేటాయించిన మొత్తాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొందరు వ్యక్తుల లాభాల్లోకి వెళ్లకూడదు. ఇటీవలి కాలంలో బడ్జెట్ రూపొందడంలో, అమలు చేయడంలో వ్యక్తుల ప్రయోజనాలు ప్రధానమవుతున్నాయి. వారి ప్రయోజనా లను ప్రజల అవసరాలుగా చూపించి సంక్షేమ పథకాల ముసుగులో ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం పరిపాటి అయింది. అదే సమయంలో ప్రభుత్వాలు తాము నిర్వహించే కొనుగోళ్లలో అవకతవకలకు అవకాశం కల్పించి ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఇస్తాయి. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయంతో అమలు జరుగుతున్న కార్యక్రమాలకు అవసరాన్ని మించి కేటాయింపులు జరుగుతున్నాయి. ఉదాహరణకు పది కోట్లు ఖర్చు అయ్యేచోట కేవలం ఐదు కోట్లతో పనులు పూర్తి చేసి మిగిలినదంతా సొంత ఖాతాల్లో జమచేసుకోవడం ఒక పద్ధతి. రెండవది పదికోట్లతో జరిగే పనికి 20 కోట్లకు అంచనాలు పెంచి ఆ విధంగా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జరిగే పనులు కూడా నాసిరకంగా చేసి, మళ్లీ ఆ పనులను తిరిగి టెండర్లు వేయించుకొని నిత్యధనార్జ నకు మార్గం వేసుకుంటున్నారు. బడ్జెట్లో రంధ్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలోని సింహభాగం కాంట్రా క్టర్లు, కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు, బిలియనీర్లకు వెళుతు న్నది. అంటే ప్రజల పేరుతో ఖర్చుచేస్తున్న బడ్జెట్లో ప్రకృతిలో ఉన్న బ్లాక్‌హోల్ తరహా హోల్ (రంధ్రం) తయారైంది (విశ్వంలో కృష్ణబిలాలు లేదా బ్లాక్‌హోల్స్ ఉన్నాయని ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటికి పదార్థాన్ని విశేషంగా ఆకర్షిం చే శక్తి ఉంటుంది). ఎకనమిక్ బ్లాక్ హోల్లోకి ఈ నిధులన్నీ వెళుతు న్నాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోతున్నదో అంతు చిక్కడంలేదు. ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, ఎటువంటి ప్రజల ప్రయోజనాలు నెరవేరకపోవడం దీని ఫలితమే. అందుకే పౌరసమాజం, ప్రజా సంఘాలు ఇతర ప్రజాస్వామిక సంస్థలు ఎవరైనా సరే ప్రజల ప్రగతి గురించి శ్రద్ధ ఉన్నవాళ్లు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాల బడ్జెట్ల గురించి ఆలోచించాలి. ప్రభు త్వ బడ్జెట్లు ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే తప్పనిసరిగా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్న బ్లాక్ హోల్స్ మూతపడాలి. కోట్లు గుమ్మరించి సీట్లు కొని, ఎన్నికల్లో పోటీచేయొచ్చనే భావన అంతరించిపోవాలి. అప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం వైపు సమాజం అడుగులువేస్తుంది. దీంతో కొంతమేరకైనా రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం మనుగడలో ఉండవచ్చు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) - మల్లెపల్లి లక్ష్మయ్య -
ప్రయోగాల ప్రజ్ఞాశాలి పుట్టిన రోజు
పుట్టినరోజు అందరికీ పండుగే. మరి పుట్టింది ఎందుకు అని తెలిసేది ఎందరికి అని ప్రశ్నించాడో మహాకవి. అలా పుట్టుకను సార్థకం చేసుకున్న మహా నటుల్లో కమలహాసన్ ఒకరు. కమలహాసన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈయన పుట్టింది నటన కోసమేనా? అలాంటి నటనకు గౌరవాన్ని ఆపాదించడానికేనా? నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికేనా? అని అనిపిస్తుంది. ఎందుకంటే నాలుగేళ్ల పసి వయసులోనే నటననే కళామతల్లి ఒడి చేరిన కమల్ తొలిచిత్రంతోనే బాల నటుడిగా (కలత్తూర్ కన్నమ్మ) రాష్ట్రపతి అవార్డును, బంగారు పతకాన్ని అందుకున్నారు. కళలకు సంబంధం లేని కుటుంబంలో పుట్టిన కమల్ నేడు భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంత ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు. 1954 నవంబర్ 7న రామనాథపురం జిల్లా పరమకుడిలో జన్మించిన కమలహాసన్ తండ్రి డి.శ్రీనివాసన్ న్యాయవాది. ఆయన సోదరులు చారుహాసన్, చంద్రహాసన్ న్యాయవాదులే. సోదరి నళిని క్లాసికల్ డాన్సర్. నాలుగేళ్ల వయసులోనే కలత్తూర్ కన్నమ్మ చిత్రం ద్వారా బాల నటుడిగా రంగ ప్రవేశం చేసిన కమలహాసన్ 21 ఏళ్ల లోనే హీరోగా అవతారమెత్తారు. కమలహాసన్ హీరోగా నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగళ్. జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ నట సవ్యసాచిని ఫిలింఫేర్ అవార్డు వరిచింది. ప్రయోగాల ప్రభంజనం కమలహాసన్ అంటేనే ప్రయోగాలు పలకరిస్తాయి. మొదట్లో పక్కా క మర్షియల్ చిత్రాల్లో స్టార్ ఇమేజ్ను సాంతం చేసుకున్న ఈ నవరస నాయకుడు ఆ తరువాత కొంగొత్త ప్రయోగాలకు నాంది పలికారు. అమావాస్య చంద్రుడు చిత్రంలో మూగవాడిగా, అసలు మాటలే లేని చిత్రం పుష్పక విమానంలోను తన నట చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇక విచిత్ర సోదరులు చిత్రంలో మరుగుజ్జు వాడిగా నటించి ప్రపంచ సిని మానే తిరిగి చూసేలా చేశారు. దశావతారంలో ఏకంగా పది వైవిధ్యభరిత పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ ప్రతి చిత్రం ఒక ప్రయోగమే. నాయకన్, మహానది, గుణ, మైఖేల్మదన్కామరాజ్ ఇలా తాజా చిత్రం విశ్వరూపం వరకు అద్భుత ప్రయోగాలే. బహుభాషా నట చక్రవర్తి కమల్ తన నట తృష్ణను ఒక్క తమిళ భాషలోనే తీర్చుకోదలచుకోలేదు. తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఏ భాషలో నటించినా ఆ భాషా నటుడి ముద్ర వేసుకున్నారు. అన్ని భాషల్లోనూ కమల్ చిత్రాలు గొప్ప కళా ఖండాలుగా వాసికెక్కడం విశేషం. బహుముఖ ప్రజ్ఞాశాలి కమలహాసన్ ఒక నటనలోనే తన ప్రజ్ఞను సరిపెట్టుకోలేదు. కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, గాయకుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు. అవార్డులకు అలంకారం కమల్ బాల నటుడిగా తొలి చిత్రంలోనే అవార్డును కొల్లగొట్టడం ఆరంభించారు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు, పలు ప్రాంతీయ అవార్డులను, 19 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నప్పటి వరకు కమల్ నటనా ప్రతిభకు గాను కేంద్ర ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును, 2014లో పద్మభూషణ్ అవార్డుతోను ఘనంగా సత్కరించింది. సామాజిక సేవలోనూ.. కమలహాసన్ నాస్తికుడంటారు. ఆయనకు సామాజిక స్పృహ ఎక్కువ. కమలహాసన్ నర్పని ఇయక్కం (అభిమాన సంఘం) పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చెన్నై మాదంబాక్కం సమీపంలోని సరస్సులను శుద్ధి చేసే బృహత్తర కార్యక్రమాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టనున్నారు. నేడు 60వ వసంతంలోకి అడుగిడుతున్న ఈ సకలకళా వల్లభుడికి శుభాకాంక్షలు చెబుతాం. -
జంషెడ్పూర్... భారత కలల నగరం
గాంధీ చెప్పారు. ఇప్పుడు మోడీ కూడా చెప్పారు. శుభ్రత అనేది నాగరికతకు సూచికని, ఆరోగ్యానికి హేతువని. వారు చెప్పింది సామాజిక శుభ్రత గురించి. అయితే ‘సామాజిక శుభ్రత’ అనే మాట వినిపిస్తే ఎంతసేపూ మనకు సస్యశ్యామలంగా ఉండే హర్యానాలోని చంఢీఘర్, లేక రాజరికపు ఆనవాళ్లున్న మైసూరు.. ఇవే ఎందుకు గుర్తొస్తాయి? మన చెవిన పెద్దగా పడని ఒక అందమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరం కూడా ఒకటుంది. అదే జంషెడ్పూర్ (జార్ఖండ్). ఈ పేరును మనం బాగా విన్నా కూడా, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. నిర్మాణం ‘‘ఏ దేశమైతే ఇనుముపై ఆధిపత్యం సాధిస్తుందో, ఆ దేశం బంగారంపై కూడా ఆధిపత్యం సాధిస్తుంది.’’ స్కాట్లాండ్ తత్వవేత్త థామస్ కార్లైల్ 1867లో ఈ వాక్యం చెప్పి ఉండకపోతే ‘జంషెడ్పూర్’ అనే ఒక నగరం మన దేశంలో ఉండేదే కాదేమో! బరోడా పారిశ్రామికవేత్త జంషెడ్జీ నెస్సర్వాన్జీ టాటా ఈ వాక్యంతో ప్రభావితమై ఒక స్టీల్ ప్లాంట్ స్థాపించాలని నిశ్చయించుకున్నారు. దానికోసం కొందరు నిపుణులను నియమించి దేశంలో ఇనుప ఖనిజ నిల్వలుండి, పక్కనే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాన్ని కూడా వెతకండి అని సూచించారు. వారు మూడు సంవత్సరాల పాటు భారతదేశంలో జరిపిన అధ్యయనాల ఫలితంగా ఇనుముతో పాటు మాంగనీస్, లైమ్, బొగ్గు గనులున్న ‘సాక్‌చి’ (నేటి జంషెడ్పూర్) అనే గ్రామం గురించి వారికి తెలిసింది. ఆ గ్రామపరిధిలో విలువైన గనులు, సముద్రమట్టానికి దాదాపు 140 మీటర్ల ఎత్తులో చక్కటి వాతావరణం ఉన్న చోటానాగ్పూర్ పీఠభూమి వారిని బాగా ఆకట్టుకుంది. పైగా చుట్టూ రెండు నదులు. అటువంటి సాక్‌చి ప్రాంతాన్ని పరిశీలించిన టాటా ఇంతకంటే అనువైన ప్రదేశం దొరకదని అక్కడ ఒక మంచి ఊరుని నిర్మించమని సూచించారు. కొత్తగా నిర్మించే నగరం ఎలా ఉండాలని ఆయన కలగన్నారో తెలుసా? ఇరువైపులా చెట్లతో కూడిన విశాలమైన రహదారులు, అవికూడా త్వరగా పెరిగే లక్షణం గల చెట్లు, నిర్మించే ప్రతి భవన, వ్యాపార సముదాయంలో విశాలమైన లాన్‌తో కూడిన కాంపౌండ్లు, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలకు ప్రతి పెద్ద కాలనీల్లో స్థలాలు, ప్రతి కాలనీలో పార్కులు, అక్కడక్కడా కొన్ని పెద్ద పార్కులు, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన వాతావరణంలో విశాలమైన స్థలంలో గుడి, మసీదు, చర్చి కచ్చితంగా ఉండేలా పట్టణాన్ని రూపొందించమని ఆయన సూచించారు. కలలు చాలామంది కంటారు. కానీ టాటా కన్న కల నిజమైంది. ఆయన కోరినట్టే పట్టణం నిర్మితమైంది. ఒక చిత్రకారుడు గీసిన అందమైన చిత్రంలా రూపుదిద్దుకుంది ఆ పట్టణం. ఆయన అంత క్రాంతదర్శి కాబట్టే బ్రిటిష్ పాలకులు కూడా ఆయన దృష్టికి ముగ్ధులై సాక్‌చి పట్టణానికి టాటా పేరు మీదుగానే జంషెడ్పూర్ అని పెట్టారు. సహజమైన నీటి వనరులు వినియోగించుకుని కృత్రిమ సరస్సులను కూడా నిర్మించారిక్కడ. నగరం ప్రత్యేకతలు సుమారు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జంషెడ్పూర్ చక్కటి వాతావరణం ఉన్న నివాస ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి ‘ప్లాన్డ్ ఇండస్ట్రియల్ సిటీ’. సమృద్ధిగా ఉపాధినిచ్చే జంషెడ్‌పూర్‌లో అత్యధికులు ఉద్యోగులే. ఉద్యోగులు కాకుండా ఎవరైనా ఉన్నారంటే వారు కొందరు కాంట్రాక్టర్లు, అక్కడి ఉద్యోగులకు అవసరమైన వస్తువులు, సదుపాయలు, సేవలు అందించే వ్యక్తులు, చిన్న వ్యాపారులు. ఈ నగరానికి ఉన్న కొన్ని విశిష్టతల కారణంగా ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. దీనికింకా చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన నగరం. జనాభా పది లక్షలు దాటినా నగరపాలక సంఘం లేని నగరం.భారతదేశంలో సంపన్న నగరం. అంటే (ఏడాదికి పదిలక్షలు ఆపైన ఆదాయం వచ్చేవాళ్లు అత్యధికంగా ఉన్న నగరం.స్థానికులు అతితక్కువగా ఉండి, అన్నిరాష్ట్రాల ప్రజలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం. భాషాపరంగా ఏర్పడిన సంఘాల ద్వారా కమ్యూనిటీ లివింగ్ ఉన్న ఏకైక నగరం. ప్రభుత్వ ప్రమేయం లేకుండా అత్యంత పరిశుభ్రంగా ఉన్న నగరం. ప్రపంచంలోని వంద వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. తూర్పు ఉత్తర భారతంలో కోల్‌కతా, పాట్నా తర్వాత పెద్దనగరం. జార్ఖండ్ రాష్ర్టంలో తూర్పు సింగ్భమ్ జిల్లా కేంద్రమే అయినా, ఇది మాత్రం రాష్ర్టంలో భౌగోళికంగా, జనాభా పరంగా అతిపెద్ద నగరం. ఈ నగరానికి చాలాపేర్లున్నాయి. టాటా, స్టీల్ సిటీ, టాటానగర్, జాంపాట్, జమ్స్టెర్డామ్, ఇండియా పిట్స్బర్గ్ ఇలా అనే కరకాలుగా పిలుస్తారు. -
సామాజికత తెలుసుకోవడానికి
నయా టెక్నాలజీతో సిటీ పోటీపడుతోంది. ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సరైన వేదిక లేదని గ్రహించిన నగరవాసి వీవీ రాజా ‘లెర్నింగ్ సోషల్’కు అంకురార్పణ చేశారు. ఇప్పుడిది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా ఎంతో మందికి కెరీర్ లబ్ధిని కలిగిస్తోంది. సిటీ యువతే కాదు ఉద్యోగులూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంతో పాటు తాము కూడా పరుగులు పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదివిన చదువుకు వారు ఉద్యోగాలు చేసే కంపెనీల్లో పనికి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత అది పరిష్కారమయ్యేందుకు తమను తాము మార్చుకునే దిశగా నడుస్తున్నారు. చదువులో ఇరగదీసి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్‌తో ఉపాధి దొరకని యువతకు, ఉద్యోగం చేస్తూ ఆధునిక సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడినవారికి ‘లెర్నింగ్ సోషల్’ చక్కని వేదికగా నిలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి, సిటీలో స్థిరపడిన రాజు వనపాల నుంచి వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి బంగారు బాటను చూపిస్తోంది. సమాజంలో చోటుచేసుకుంటున్న నూతన ఒరవడిని ఇలా అందిపుచ్చుకోవచ్చని ఆన్లైన్ వేదికగా పాఠాలు నేర్పుతోంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులను ఇన్స్ట్రక్టర్లుగా తీసుకొని ఈ టెక్నాలజీ టీచింగ్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతోంది. బాస్ ఇచ్చిన పనికి రెట్టింపు చేసి పెడుతున్నారు. ఇది వారి కెరీర్ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్, డాటా అనాలసిస్, డేటా సైన్స్, హడూప్, అనలిటిక్స్, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్.. ఇలా వివిధ కోర్సులతో పాటు ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే టెక్నాలజీ చదువులను అందిస్తోంది. ఉద్యోగం చేసేవాళ్లకు కోచింగ్‌లకు వెళ్లే సమయం లేకపోవడంతో ఈ లెర్నింగ్ సోషల్ వైపు చూస్తున్నారు. ఇంటి వద్దనే ఉండి సాంకేతిక పాఠాలను నేర్చుకొని ఉద్యోగంలో ముందుకు దూసుకెళుతున్నారు. ‘డిజిటల్’ డిమాండ్... ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ-మెయిల్, ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజింగ్ చేయడం ఎలా అనే దానిపై ఇప్పుడున్న యువతకు పెద్దగా అవగాహన లేదు. అందుకు తగ్గ శిక్షణ కేంద్రాలు కూడా కనిపించవు. లెర్నింగ్ సోషల్ ‘డిజిటల్ మార్కెటింగ్’ శిక్షణను ఇస్తోంది. ఆండ్రాయిడ్ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌ను నేర్పుతోంది. వి.ఎస్ ఎంతో మందికి లబ్ధి 2006లో మూడు లక్షలతో ‘వే టు ఎస్ఎంఎస్’ ప్రారంభించి సక్సెస్ సాధించా. ఈ క్రమంలోనే 2012లో నాకు ఎదురైన సమస్యకు ఆన్లైన్లో అనలిటిక్స్ నేర్చుకోవాలనుకున్నా. సెర్చ్ చేశా. అయితే ఇన్స్ట్రక్టర్లు ఉన్న ఏ ఆన్లైన్ వేదికా దొరకలేదు. అప్పుడే లెర్నింగ్ సోషల్‌కు బీజం పడింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా అందరూ కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఆన్లైన్లో ఆయా రంగాల్లో ప్రావీణ్యం పొందిన ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా పాఠాలు చెప్పిస్తున్నా. ఇప్పటికే 300 మందికి పైగా ఇన్స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. సుమారు 70 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. - వీవీ రాజా, లెర్నింగ్ సోషల్ వ్యవస్థాపకుడు -
డాటర్ ఆఫ్ కైలాష్ సత్యార్థి
కైలాష్ సత్యార్థిని నోబెల్ శాంతి బహుమతి వరించడం... యావత్ భారతదేశానికి సంతోషకరమైన విషయం. ఆయనతో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేని వారికి కూడా, ఆయన సేవాకార్యక్రమాలను గురించి, ఆయన సామాజిక నిబద్ధత గురించి వివరంగా తెలుసు. అలాంటి వారందరికీ నోబెల్ వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి కైలాష్ సత్యార్థి కూతురు అస్మిత పరిస్థితి ఏమిటి? నాన్నకు నోబెల్ బహుమతి ప్రకటించారు... అనే శుభవార్త తెలియగానే ఆమె ఎలా స్పందించారు? ‘‘ఆ వార్త తెలియగానే ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆయన చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ పెరిగాను. వాటిలో భాగం పంచుకున్నాను’’ అన్నారు అస్మిత. నాన్నతో సంతోషం పంచుకోవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు అస్మిత. తాను ఊహించినట్లుగా... ఏమీ కనిపించలేదు ఆయన. ఎప్పటిలాగే ఉన్నారు. ‘‘నాకంటే ముందు గాంధీజీకి రావాల్సింది’’ అన్నారు ఆయన, నోబెల్ బహుమతిని ప్రస్తావిస్తూ. గాంధేయవాది అయిన కైలాష్ మాటల్లో ఎక్కడా గర్వపు నీడ కనిపించలేదు. ఆ కళ్లు ఎప్పటిలాగే ‘‘చేయాల్సింది చాలా ఉంది’’ అని చెబుతున్నట్లుగానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బి) స్టూడెంట్ అయిన అస్మిత సత్యార్థి సామాజిక మార్పులో వ్యాపారం ఎంత కీలకమో చెబుతారు. నాన్న తన రోల్‌మోడల్. ఆయన ఆదర్శ భావాలతో లోతుగా ప్రభావితమయ్యారు అస్మిత. ‘‘ఎన్నో కార్యక్రమాలలో నాన్న చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రభావం సహజంగానే నా మీద ఉంది’’ అంటారు అస్మిత. ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేసినా అస్మిత మంచి కథక్ నృత్యకారిణి కూడా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నృత్యప్రదర్శన ఇచ్చారు. విశేషమేమిటంటే, పది సంవత్సరాల వయసులోనే ‘యుఎస్ కాంగ్రెస్’లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది అస్మిత. మళ్లీ నోబెల్ దగ్గరికి వద్దాం... నోబెల్ శాంతి బహుమతితో కైలాష్ సత్యార్థి బాధ్యత రెట్టింపు అయింది అనేదానితో అస్మిత ఏకీభవిస్తున్నారు. ‘‘నాన్న చేస్తున్న పనులను చూసి గర్వించడమే కాదు... ఆయన అడుగు జాడల్లో నడవడం కూడా ఇప్పుడు నా భుజస్కంధాలపై ఉన్న బాధ్యత’’ అంటున్నారు అస్మిత. లైక్ ఫాదర్ లైక్ డాటర్! -
డొనేట్ ఏ స్మైల్...
బాలీవుడ్ తారలు ఓ సోషల్ కాజ్ కోసం కదిలారు. కూకట్పల్లి మంజీరా మాల్.. అనాథ బాలల ఎన్జీఓ ‘యువత’కు ఆర్థిక సాయమందించేందుకు నిర్వహిస్తున్న ‘డొనేట్ ఏ స్మైల్’లో భాగస్వాములయ్యారు. జేఎన్టీయూలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ‘విత్ రోర్’ హిందీ చిత్రం తారలు అభినవ్ శుక్లా, ఆదిల్ చాహల్, నౌరాఫతేహి పాల్గొన్నారు. - సాక్షి, సిటీ ప్లస్