‘‘కార్మికులను బానిసల్ని చేసే ఏ చట్టాన్ని నేను అనుమతించను’’ అని కార్మికమంత్రిగా అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ‘‘నేను పేదల్లో పుట్టాను. పేదల్లోనే బతికాను. నేను తడి నేల మీద బల్లచెక్క వేసుకొని నిద్రపోయాను. వారి కష్టాలు నాకు బాగా తెలుసు. నేను నా మిత్రులతో తదితరులతో పూర్వం ఎలా ఉండే వాణ్ణో ఇప్పుడూ అలాగే ఉంటాను. ఢిల్లీలోని నా బంగ్లా తలుపులు అందరికోసం తెరిచివుంటాయి’’ అని మంత్రి అయిన సందర్భంలో అన్నారాయన.
సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం తన లేబర్ పాలసీ అని ప్రకటించారు. అందులో కొన్ని...
* దేశవ్యాపితంగా కార్మికవర్గ చట్టాల మధ్య ఏకతను సాధించడం.
* పారిశ్రామిక వివాదాలను పరిష్కరించగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్మించడం.
* అఖిల భారత ప్రాముఖ్యత కలిగిన కార్మికవర్గ సమస్యలను చర్చించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడం.
డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956)
* 14 ఏప్రిల్ 1891 - భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు.
* 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం.
* 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత.
* 1908 - రామ్‌బాయ్‌తో పెళ్లి.
* 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత.
* మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర.
* సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం.
* 1922 - గ్రేన్ ఇన్ బార్‌ఎట్‌లాకు ఆహ్వానం.
* 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం.
* 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన.
* 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం.
* 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన.
* 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్‌దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు.
* 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం.
* 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం.
* 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం.
* 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం.
* 1936 - ‘కులనిర్మూలన’ రచన
* 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్‌ఫెడరేషన్’ స్థాపన.
* 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్‌లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు).
* 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన.
* 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక.
* 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం.
* 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం.
* 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన.
* 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం.
* 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన.
* 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం.
* మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక.
* 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం.
* డిసెంబర్ 1954 - రంగూన్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం.
* మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన.
* 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం.
* 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం.
* 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి).
అంబేడ్కర్ ‘లేబర్ పాలసీ’
Published Tue, Apr 14 2015 12:42 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM
Advertisement
Advertisement