Dr. B. R. Ambedkar
-
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై : దేశీయ మార్కెట్లకు నేడు సెలవు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ట్రేడింగ్ తిరిగి బుధవారం(15న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు. ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. కాగా సోమవారం సెన్సెక్స్ 470 పాయింట్లు పతనమై 30690 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 8994 వద్ద ముగిసింది. అటు డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా బలపడి 76.27 వద్ద ముగిసింది. -
అమరశిల్పి అంబేడ్కర్
అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు. కత్తి పద్మారావు అంబేడ్కర్ జీవితంలోని లోతు తాత్త్వికమైంది. భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్ ఆర్థిక, తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది. అస్పృశ్యత మూలాల నిర్మూలన మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడింది! మనిషిని మనిషిగా చూడటమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక, విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడింది. బౌద్ధాన్ని ఆయన వాఙ్మయంగానే కాక, తత్త్వశాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్యయనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చివేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొందించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం, అవమానించటం, అపహాస్యం చేయటం, అణచివేయటం. మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజమూ చేస్తుంది. ఈ మూడింటిని ఈ ఆర్టికల్ నిరోధిస్తుంది. రాజ్యాంగంపై అంబేడ్కర్ జీవిత ప్రభావం అంబేడ్కర్ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్ కీర్ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు. బాబాసాహెబ్ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయులందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి. (వ్యాసకర్త దళితకవి, సామాజిక కార్యకర్త, ఫోన్: 9849741695) డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956) * 14 ఏప్రిల్ 1891 - భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు. * 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం. * 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత. * 1908 - రామ్బాయ్తో పెళ్లి. * 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత. * మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర. * సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం. * 1922 - గ్రేన్ ఇన్ బార్ఎట్లాకు ఆహ్వానం. * 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం. * 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన. * 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం. * 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన. * 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు. * 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం. * 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం. * 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం. * 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం. * 1936 - ‘కులనిర్మూలన’ రచన * 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ఫెడరేషన్’ స్థాపన. * 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు). * 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన. * 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక. * 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం. * 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం. * 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన. * 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం. * 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన. * 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం. * మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక. * 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం. * డిసెంబర్ 1954 - రంగూన్లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన. * 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం. * 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి). -
అంబేడ్కర్ ‘లేబర్ పాలసీ’
‘‘కార్మికులను బానిసల్ని చేసే ఏ చట్టాన్ని నేను అనుమతించను’’ అని కార్మికమంత్రిగా అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ‘‘నేను పేదల్లో పుట్టాను. పేదల్లోనే బతికాను. నేను తడి నేల మీద బల్లచెక్క వేసుకొని నిద్రపోయాను. వారి కష్టాలు నాకు బాగా తెలుసు. నేను నా మిత్రులతో తదితరులతో పూర్వం ఎలా ఉండే వాణ్ణో ఇప్పుడూ అలాగే ఉంటాను. ఢిల్లీలోని నా బంగ్లా తలుపులు అందరికోసం తెరిచివుంటాయి’’ అని మంత్రి అయిన సందర్భంలో అన్నారాయన. సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం తన లేబర్ పాలసీ అని ప్రకటించారు. అందులో కొన్ని... * దేశవ్యాపితంగా కార్మికవర్గ చట్టాల మధ్య ఏకతను సాధించడం. * పారిశ్రామిక వివాదాలను పరిష్కరించగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్మించడం. * అఖిల భారత ప్రాముఖ్యత కలిగిన కార్మికవర్గ సమస్యలను చర్చించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడం. డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956) * 14 ఏప్రిల్ 1891 - భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు. * 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం. * 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత. * 1908 - రామ్బాయ్తో పెళ్లి. * 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత. * మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర. * సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం. * 1922 - గ్రేన్ ఇన్ బార్ఎట్లాకు ఆహ్వానం. * 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం. * 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన. * 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం. * 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన. * 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు. * 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం. * 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం. * 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం. * 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం. * 1936 - ‘కులనిర్మూలన’ రచన * 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ఫెడరేషన్’ స్థాపన. * 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు). * 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన. * 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక. * 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం. * 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం. * 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన. * 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం. * 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన. * 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం. * మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక. * 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం. * డిసెంబర్ 1954 - రంగూన్లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన. * 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం. * 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి). -
అంబేడ్కర్‌వాద రాజకీయాలు
ఇప్పటి అవ సరం ఏమిటంటే అంబేడ్కర్ వాదులు అంబేడ్కర్‌ను సరిగా అర్థం చేసుకుని, అంబేడ్కర్‌వాద వ్యతిరేక రాజకీయాల నుంచి అంబేడ్కరవాద రాజకీయాలను కాపాడుకోవడం. అవినాశ్ మిశ్రా 1991లో జరిగిన బాబా సాహెబ్ అంబేడ్కర్ శత జయంతి... నవ్యాధునిక భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమకాలీన సహచరులందరి కన్నా ఎత్తై నాయకునిగా ఆయనను సుస్థిరపరచడమే కాకుండా, దళిత రాజకీయాల సరళిని కూడా పెద్ద ఎత్తున మార్చివేసింది. అప్పటి వరకు ప్రధాన రాజకీయ ప్రక్షాల అలక్ష్యానికి గురై ఉన్న అంబేడ్కర్ ప్రజాస్వామ్య, పౌరహక్కుల అవగాహన... అకస్మాత్తుగా ఆయా పక్షాల ఎన్నికల నియమావళిలో ప్రధాన ఎజెండాగా చోటు సంపాదించుకుంది. దేశం కూడా వారసత్వ, కుటుంబ, ఏకపక్ష పాలన నుండి రాజకీయాలు దూరంగా జరగడాన్ని వీక్షించింది. ఇలా అనడం, 1991 ముందు నాటి దళిత రాజకీయ చైతన్యాన్ని తక్కువ చెయ్యడం కాదు. అయితే 1991 అనంతరం దళితుల రాజకీయ దృక్పథంలో స్పష్టంగా కనిపించిన మార్పులు విస్మరించలేనివి. 1991లో పునరావిష్కృతమైన అంబేడ్కర్‌వాద రాజకీయాలతో దళిత రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పక్షాలను ఢీకొనాలని కాన్షీరామ్ తీసుకున్న నిర్ణయం అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రజల చెంతకు తీసుకెళ్లింది. అంబేడ్కర్ పట్టణ దళితులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించలేదని గ్రామీణ దళితులలో కాన్షీరామ్ విశ్వాసం నెలకొల్పారు. దళిత రాజకీయాలు ప్రభుత్వంలో ఉన్నత హోదాలు పొందాలనుకుంటున్న వారి కోసం ఉద్దేశించినవి కాదనీ, జీవన పోరాటం చేస్తున్న లక్షలాది శ్రామికుల కోసమేనని ఆయన చెప్పగలిగారు. అలా ఆయన దళిత ఉద్యమస్వామ్యాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయిలోని వారికి అందుబాటులోకి తెచ్చారు. ఆ క్రమంలో అంతవరకు వదిలివేయబడిన వర్గంలో ఉన్న కులాలన్నిటినీ ఆయన అంబేద్కర్ వాద సంరక్షణలోకి తేగలిగారు. ఇంకోమాటలో చెప్పాలంటే 1991 తర్వాతి పరిణామాలను ‘నిర్వర్గీకరణ దళిత రాజకీయాలు’గా అర్థం చేసుకోవచ్చు. కాగా అంబేడ్కర్ ఎప్పుడూ తన జీవితకాలంలో సూత్రీకరణలు చేయలేద న్న విషయం అర్థం చేసుకోవడంలో మన నాయకులు విఫలమయ్యారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆయన ప్రయోగాలు చేస్తూ వెళ్లారు. అలా చేయడంలో ఉన్న ప్రమాదం ఏమిటంటే అదొక నిలకడలేనితనంగా కనిపించడం. కానీ ఆయన నిలకడకన్న బాధ్యతకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలను ఆయన సమస్యకు కారణాలను విశ్లేషించగల విజ్ఞులుగా చూడదలచుకున్నారు. ఇప్పటి అవ సరం ఏమంటే అంబేడ్కర్ వాదులు అంబేడ్కర్‌ను సరిగా అర్థం చేసుకుని, అంబేడ్కర్‌వాద వ్యతిరేక రాజకీయాలనుంచి అంబేడ్కర్‌వాద రాజకీయాలను కాపాడుకోవడం. (వ్యాసకర్త జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ రాజకీయ అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ avinashmishra.jnu@gmail.com) -
డా. అంబేడ్కర్ ఎవరికి చెందినవాడు?
అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్‌కు గాని ఆ మాటకు వస్తే బీజేపీకి, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు. ప్రొ. హరగోపాల్ బాబాసాహెబ్ అంబేడ్కర్, ఆయన ఆలోచనా విధానం సమకాలీన భారతదేశంలో ఒక కీలకమైన దశలో ఉంది. ఆయన ఎవరికి చెందినవాడు అనే కాక ఆయన ఆలోచనా విధానానికి నిజమైన వారసులు ఎవరు అనే చర్చ కూడా జరుగుతున్నది. అంబేడ్కర్ జన్మదినాన్ని జరపడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీ పడుతున్నాయి. ఇది గమనించిన ఎవరికైనా లేదా కొంచెం చరిత్ర తెలిసిన వారికి తప్పక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంబేడ్కర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీని, దానికంటె మించి గాంధీజీని వాళ్ళ రాజకీయాలను వ్యతిరేకించాడు. ఇది వ్యక్తిగత వ్యతిరేకం కాదు, ఒక సైద్ధాంతిక భూమిక మీద ఏర్పడ్డ భావ సంఘర్షణ. ప్రధానంగా దళిత ఉద్యమాలకు వస్తే, ఇది చాలా సున్నిత అంశంగా మారింది. ఎలాంటి చర్చ జరిగినా వివాదాస్పదమవుతున్నది. ఒక కోణం నుంచి డాక్టర్ అంబేడ్కర్ కచ్చితంగా దళిత పోరాటాలకు చెందినవాడే. దళిత వర్గాలకు ఆయన మీద, ఆయన భావజాలం మీద న్యాయమైన క్లెయిమ్ ఉంది. అయితే అంబేడ్కరిజం దళిత వర్గాలకు మాత్రమే పరిమితమా, ఆయన కేవలం దళితుల గురించే మథనపడ్డారా అని ఆలోచిస్తే, అంబేడ్కర్‌కు మహిళల పట్ల కూడా అంతే ప్రజాస్వామ్యమైన మానవీయమైన భావాలుండేవి. ఉన్నత కులాల మహిళల గురించి ముఖ్యంగా బ్రాహ్మణ మహిళల గురించి, వాళ్ళ విధవత్వాన్ని గురించి చాలా మథనపడ్డాడు. ప్రతినెలా మహిళలను బహిష్ఠులైనప్పుడు మూడు రోజులు ఇంటి బయట పెట్టడాన్ని అంటరానితనంతో పోల్చాడు. బౌద్ధానికి మహిళల పట్ల చిన్నచూపు అనే ఒక అంశాన్ని గురించి చాలా పరిశోధన చేసి, బుద్ధుడికి మహిళల పట్ల ఉండే గౌరవాన్ని సోదాహరణంగా విశ్లేషించాడు. అలాగే మొత్తం కులవ్యవస్థ నిర్మూలన జరగాలి, దానిని కూకటివేళ్ళతో కూల్చాలని తన (అజీజిజ్చ్టీజీౌ ౌజ ్టజ్ఛి ఛ్చిట్ట్ఛ) కుల నిర్మూలన వ్యాసంలో ప్రతిపాదించాడు. అంటే కులాన్ని వ్యతిరేకించిన ప్రతి వ్యక్తికి, సమూహానికి అంబేడ్కర్ మీద క్లెయిమ్ ఉంటుంది. అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్‌కు గాని ఆ మాటకు వస్తే బీజేపీ, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు. నిజానికి అంబేడ్కర్ దళిత ఉద్యమాలకి, మహిళా ఉద్యమాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే ఏ ఉద్యమానికైనా చెందినవాడే. అలాగే కులరహిత వర్గరహిత ప్రత్యామ్నాయ సమాజం కొరకు త్యాగాలు చేస్తూ పోరాడే విప్లవ శక్తులకు కూడా ఆయన ఆత్మబంధువే! (వ్యాసకర్త పౌర హక్కుల నేత, ఫోన్: 9989021741) -
అతడు ఈ దేశం ‘డీఎన్ఏ’లో ఇంకిపోయిన వాడు!
జాన్సన్ చోరగుడి ఆయన ఇప్పుడు లేరు. ఏడు దశాబ్దాల కాలంలో మొదటి పదేళ్లే ఆయన మనతో భౌతికంగా ఉన్నారు. అయినా, ఇప్పటికీ ఉన్నారు ‘అంబేడ్కరిజం’ పేరుతో. అది - 1935. అనారోగ్యంతో మంచంలో ఉన్న - ‘ఆమె’. ‘ఒకసారి నన్ను పంఠాపూర్ గుడికి తీసుకెళ్లండి’ - అడిగిందామె. ‘‘మనల్ని అంటరానివారిగా వెలిగా ఉంచిన ఆ గుడికి మనం వెళ్లేదేమిటి, నేనే అటువంటి గుడిని నీకోసం కడతాను’ ఆయన వాగ్దానం! క్షణం తీరిక లేదు. ఎలా ఉన్నావ్ అని ఆగి ఆమెను పలకరించడానికి టైం లేదు, సరైన నిద్ర లేదు. ఎవరి కోసం ఈ మనిషి ఇలా తనను తాను హననం చేసుకుంటున్నాడు? ఆమె మనసు, శరీరం రెండూ విశ్రాంతి కోరాయి. చివరికి ఆమె కన్ను మూసింది. క్రియాశీలంగా ముమ్మరంగా ఉన్న కాలంలో 13 ఏళ్ల ఒంటరితనం. చెట్టుకు చెద పట్టినట్టుగా ఒళ్లంతా తొలుస్తున్న - షుగర్ వ్యాధి. ఇన్సులిన్ తీసుకునేవారు. ఏమో, అయినా తొలుస్తున్నది వంటికి వచ్చిన వ్యాధా? లేక మనసుదా? తన సమాజం కోసం తాను స్వప్నించి రచించినవేవీ తనవాళ్లకు ఎందుకు ‘కనెక్ట్’ కావడం లేదు? సమస్య తనకు - తనవారికీ మధ్య ఉన్న ‘వేవ్ లెంగ్త్’ది అయితే, అందుకు ఉన్న పరిష్కారం ఏమిటీ? చివరికి ఆయన్ని కాపాడుకోవడం కోసం, ఆయన ‘ఆధునీకరించ’డానికి ప్రయత్నించిన బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచే వైద్యురాలిగా, భార్యగా డా. సవిత ఆయన జీవితంలో ప్రవేశించారు. ఇది స్తబ్దమైన వ్యవస్థ - ఆధునికతకు దీనిలో ఆస్కారం లేదు - దీన్ని ‘బ్రేక్’ చేయాలి - తప్పదు ధిక్కారాన్ని ప్రకటించాలి - ఎప్పుడు? జీవించి ఉండగానే - ఒక పక్క సమయం లేదని శరీరం సంకేతాలు పంపుతున్నది. బౌద్ధమత స్వీకరణ (అక్టోబర్ 1956) ఆ వేలితో ‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ గ్రంథం కూడా రాయడం పూర్తి అయి ప్రింటుకు సిద్ధమయింది. రోజులు బాగా భారంగా గడుస్తున్నాయి. ఒకటి - రెండు - మూడు - నాలుగు... ‘ఆయన కన్ను మూశారు’ (6 డిసెంబర్ 1956) ఒక ‘సాఫ్ట్వేర్’గా అంబేడ్కర్‌ది నూటికి రెండొందల శాతం విజయం! రాజ్యానికి అభివృద్ధి - సంక్షేమం రెండు కళ్ల వంటివి అయితే, రాజ్యాంగ ప్రతికి రెండు షెడ్యూళ్లుగా ఆయన జతచేసిన జాబితాలు - అందుకు ప్రధాన మానవ వనరు అయ్యాయి. ‘హార్డ్‌వేర్’గా అరకొర వైఫల్యాలు. అయినా, కాలానికి ఎదురీదిన వాడ్ని ‘కాలం’ గుర్తించి అక్కున చేర్చుకుంది. తిలక్ - గాంధీజీ - అంబేడ్కర్ - నెహ్రూ.... అదొక పాలపుంత అనబడే - ‘గెలాక్సీ’. అంతెత్తున మిగిలి, దేశం దేహంలో డి.ఎన్.ఎ. అయినవాడ్ని; మళ్లీ ఎవరైనా మా వాడు అనడం, ఆరోగ్యవంతమైన దేహం మీద - కణితిని కోరుకోవడం అవుతుంది. (వ్యాస రచయిత అభివృద్ధి - సామాజిక అంశాల వ్యాఖ్యాత) -
జయ జయ అంబేడ్కరా!
తెలుగునేల మీద పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు అక్షరహారతి పట్టారు. మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకు దక్కుతుంది. బోయి భీమన్న ‘జయ జయ జయ అంబేడ్కర’ దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధి. డా. శిఖామణి నవ భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల ప్రదాత, భారతదేశ ప్రథమ న్యాయశాఖామాత్యులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దేశంలోని అనేక రాష్ట్రాలను ప్రభావితం చేసినట్టుగానే ఆంధ్రదేశాన్నీ ప్రభావితం చేశారు. నందనార్ హరిశ్చంద్రుడి పట్టువదలని పూనికతో అంబేడ్కర్ 1942 సెప్టెంబర్ 28న అనకాపల్లిలో అడుగుపెట్టారు. అప్పటి దళిత నాయకులు ఈలి వాడపల్లి, పాము రామ్మూర్తి, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి వంటి వారు ఆ పర్యటనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ను కనులారా చూసిన ఆ ప్రజలు అదృష్టవంతులు! అయితే, అంబేడ్కర్ మరణించిన దశాబ్దాలకు గానీ ఆయన జీవితం, రచనలు చదివే అవకాశం తెలుగు దళితులకు దక్కలేదు. 1968లో మొదటిసారి యెండ్లూరి చిన్నయ్య రాసిన డా॥అంబేడ్కర్ జీవిత చరిత్ర దళితులకు ఆరాధ్య గ్రంథం అయింది. ఆ కాలంలోనే అంబేడ్కర్ ‘ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథానికి యెండ్లూరి చిన్నయ్య, బోయి భీమన్నల అనువాదాలు వచ్చాయి. ఆ తర్వాత అంబేడ్కర్ జీవిత చరిత్రను గ్రంథస్తం చేసిన వారిలో బి.విజయభారతి, అమూల్యశ్రీ, పి.అబ్బాయి, ఉదయకీర్తి వంటి వారున్నారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. పద్యకావ్యాలు, శతకాలు, గేయాలు, వచన కవితలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఒకటేమిటి అన్ని ప్రక్రియల్లోనూ అంబేడ్కర్ ఆవిష్కరించబడ్డాడు. బోయి భీమన్న ‘నమస్సుల్, డాక్టరంబేడ్కరా!’ మకుటంతో రాసిన అంబేడ్కర్ సుప్రభాతం, రాపాక ఏకాంబరం ‘అంబేడ్కరో! సమరసింహా!’, చోడగిరి చంద్రరావు ‘భీమరాయ శతకం’, ముఖ్యంగా దళిత ఉపాధ్యాయ వర్గాల నుండి వచ్చిన కవులు మల్లవరపు జాను, మల్లవరపు వెంకటరావు, బుంగా ఆడమ్బాబు, రాచమల్లు దేవయ్య, తోటకూర జార్జి, పలిమెల సుదర్శనరావు, గుర్రం ధర్మోజి, నక్కా అమ్మయ్య వంటి వారు అంబేడ్కర్‌కు పద్య నీరాజనాలు పలికారు. ఇక గేయ సాహిత్యంలో భీమన్న రాసిన ‘‘జయ జయ జయ అంబేడ్కర’’ దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధికెక్కింది. చోడగిరి చంద్రరావు ‘‘డాక్టరో నీ నాయకత్వము లోకమంతయు మేలికొలిపెను’’ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించింది. అరుణ్ శౌరి, రంగనాయకమ్మ అంబేడ్కర్‌పై విషం చిమ్మడానికి ప్రయత్నించినపుడు దళిత సాహిత్యం నిప్పుల నాలుకలతో భగ్గున పైకి లేచింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ‘‘అంబేడ్కర్ ఎక్కడని లెక్కదీసి అడుగుతావా/ దిక్కులేని గుండెల్లో దీపమై వెలుగుతుండు’’ అని అంబేడ్కర్ స్థానాన్ని గుర్తు చేశాడు. వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ‘‘వైతాళికా! ఈ యుగము నీదిరా’’ అని వైతాళిక గీతాన్ని ఆలాపిస్తే, మట్టి బిడ్డ జయరాజు ‘‘మా బల్లో టీచర్ అంబేడ్కర్/ మా బతుకు ఫ్యూచర్ అంబేడ్కర్’’ అని తమ బతుకు ఆశగా వర్ణిస్తాడు. మాష్టార్జీ, పావన ప్రసాద్, శ్రమశ్రీ, భీమసేన, రాంచందర్, శుక్తి, భీమసేన, లెల్లె సురేశ్, సవేరా వంటి కవులు పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు గేయ హారతి పట్టరు. నగేష్‌బాబు, ఖాజా సంపాదకత్వంలో వెలువడిన ‘విడి ఆకాశం’ కవితా సంకలనానికి ‘అంబేడ్కరిస్టు ప్రేమ కవిత్వం’ అని పేరు పెట్టారు. ‘‘అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ’’ అని అంబేడ్కర్ ఏమిటో గోరుముద్దల ద్వారా తెలియజేస్తాడు ఎండ్లూరి సుధాకర్. ‘‘మహాత్ములూ వద్దు/ మావోలూ వద్దు/ అంబేద్కరయ్యే మాకు ముద్దు’’ అంటాడు నేతల ప్రతాప్ కుమార్. వంగపండు ప్రసాదరావు, కలేకూరి ప్రసాద్, గూటం స్వామి, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, జి.వి. రత్నాకర్, బన్న అయిలయ్య, పైడి తెరేష్‌బాబు, విరియాల లక్ష్మీపతి, కత్తి పద్మారావు, ‘సత్య’మూర్తియైన శివసాగర్, సౌదా అరుణ, పాటిబండ్ల ఆనందరావు ‘నిలువెత్తు ఆత్మగౌరవంలా/ నిలబడ్డ బాబాసాహెచ్’ మూర్తిమత్వాన్ని దర్శింపచేశారు. జై భీమ్! (వ్యాసకర్త ప్రముఖ కవి, ఫోన్: 9848202526)