
సాక్షి, ముంబై : దేశీయ మార్కెట్లకు నేడు సెలవు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ తిరిగి బుధవారం(15న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు. ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. కాగా సోమవారం సెన్సెక్స్ 470 పాయింట్లు పతనమై 30690 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 8994 వద్ద ముగిసింది. అటు డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా బలపడి 76.27 వద్ద ముగిసింది.