హృదయాలను గెలిచిన జననేత | Ys jagan mohan reddy won the hearts of the people | Sakshi
Sakshi News home page

హృదయాలను గెలిచిన జననేత

Published Sat, Jul 1 2017 3:53 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

హృదయాలను గెలిచిన జననేత - Sakshi

హృదయాలను గెలిచిన జననేత

- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి 
- గరగపర్రు పర్యటనలో జగన్‌ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు 
- ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు 
- సోషల్‌ మీడియాలోనూ ప్రశంసల వర్షం 
- ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం:  పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్‌ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్‌ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్‌ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు.  
 
జగన్‌ హిత వచనాలపై హర్షం 
ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్‌ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్‌ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్‌ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్‌ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్‌ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్‌ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. 
 
ఇరు వర్గాలతో మమేకం 
గరగపర్రు దళితవాడలో జగన్‌ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్‌ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్‌ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. 
 
అడుగడుగునా బ్రహ్మరథం 
గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement