సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసి రాజ్యాంగ రచయితను ఘోరంగా అవమానించారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా జంగారెడ్డిగూడెం, లక్కవరం మండలాల్లో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాల్లాడుతూ..
అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని హామీ ఇచ్చారు. మేధావి, మహనీయుడు, ప్రతిభావంతుడైన అంబేడ్కర్‌కు ఘోర అవమానం జరిగిందని, అతని విగ్రహానికి చెప్పుల దండ వేయటం చాలా బాధాకరం ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆకాశం లాంటి వారని, ఆయన మీద ఉమ్మి వేసే ఆలోచన చేస్తే అది వారి మీదే పడుతుంది ఆయన వ్యాఖ్యనించారు. దళిత సంఘాలతో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment