Slipper hurled
-
అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసి రాజ్యాంగ రచయితను ఘోరంగా అవమానించారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా జంగారెడ్డిగూడెం, లక్కవరం మండలాల్లో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాల్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని హామీ ఇచ్చారు. మేధావి, మహనీయుడు, ప్రతిభావంతుడైన అంబేడ్కర్‌కు ఘోర అవమానం జరిగిందని, అతని విగ్రహానికి చెప్పుల దండ వేయటం చాలా బాధాకరం ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆకాశం లాంటి వారని, ఆయన మీద ఉమ్మి వేసే ఆలోచన చేస్తే అది వారి మీదే పడుతుంది ఆయన వ్యాఖ్యనించారు. దళిత సంఘాలతో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. -
సీఎం అభ్యర్థిపై చెప్పులు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్ని జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నాయకులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆగంతకులు ఆయన మీదకు చెప్పులు విసిరారు. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చారు తేజస్వీ. సభా వేదికపై కూర్చుని ఉండగా.. ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే తేజస్వీపైకి చెప్పులు ఎవరు విసిరారో.. ఎందుకు వేశారో మాత్రం తెలియలేదు. (చదవండి: హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ) ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఈ ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ ఖండించారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతలకు సరైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ కూటమి తలపడుతుంది. మొత్తం 243 స్థానాలకు గాను 144 చోట్ల ఆర్జేడీ తన అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
చంద్రబాబు సభ; చెప్పు విసిరిన దుండగుడు
-
చంద్రబాబు సభ; చెప్పు విసిరిన దుండగుడు
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరారు. వీరిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ అసెంబ్లీ సీటును సుజాతమ్మకు కేటాయించాలంటూ ఈ సందర్భంగా కోట్ల వర్గీయులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం రేగడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఒక చెప్పు వేదిక ముందు పడింది. ఆ సమయంలో వేదికపై సూర్యప్రకాశ్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సెక్యురిటీ వెంటనే స్పందించి వేదిక ముందు పడిన చెప్పును అక్కడి నుంచి తొలగించారు. (కోట్ల కుటుంబం రహస్య మంతనాలు) చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదరలేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. డోన్ సీటును సుజాతమ్మకు కేటాయిస్తే కేఈ ప్రతాప్‌కు ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడుమూరు టీడీపీ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరుకాకపోవడం అనుమానాలు రేకిస్తోంది. (సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా) -
నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం
సాక్షి, చెన్నై: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం తమిళనాడు పర్యటన సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి జరిగింది. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్ర అలసత్వానికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఆమె రాక విషయం తెలిసిన డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్ జంక్షన్ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి రచ్చ రచ్చ చేశారు. ఊహించని ఈ పరిణామంతో కేంద్ర మంత్రి ఖంగుతిన్నారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమె తన పర్యటనను కొనసాగించారు. ఇక దాడి విషయం తెలుసుకున్న కొందరు బీజేపీ కార్యకర్తలు.. డీఎంకే కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కావేరీ మేనేజ్మెంట్ బోర్డును కోరుతూ తమిళనాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలను కూడా అడ్డుకున్నాయి. ఇక ఆందోళనలో భాగంగా ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లగా.. డీఎంకే తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. -
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
సేలం: కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.