సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరారు. వీరిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ అసెంబ్లీ సీటును సుజాతమ్మకు కేటాయించాలంటూ ఈ సందర్భంగా కోట్ల వర్గీయులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం రేగడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఒక చెప్పు వేదిక ముందు పడింది. ఆ సమయంలో వేదికపై సూర్యప్రకాశ్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సెక్యురిటీ వెంటనే స్పందించి వేదిక ముందు పడిన చెప్పును అక్కడి నుంచి తొలగించారు. (కోట్ల కుటుంబం రహస్య మంతనాలు)
చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదరలేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. డోన్ సీటును సుజాతమ్మకు కేటాయిస్తే కేఈ ప్రతాప్‌కు ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడుమూరు టీడీపీ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరుకాకపోవడం అనుమానాలు రేకిస్తోంది. (సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా)
Comments
Please login to add a commentAdd a comment