Kodumuru
-
కోడుమూరు గడ్డ వైఎస్ జగన్ అడ్డా: ఆదిమూలపు సతిష్
-
భారీ క్రేన్ తో జగనన్నకు పూల మాల
-
జగన్ మంచి మనసు..అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం
-
Kurnool: శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు
కోడుమూరు: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. కోడుమూరులోని కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకు బొంకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే వింత ఆచారం. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (క్లిక్: మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం) మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియుడి మోజులో మహిళ దారుణం..
సాక్షి, కర్నూలు(కోడుమూరు): ప్రియుడి మోజులో పడి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే కడతేర్చింది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం కోడుమూరు పట్టణంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్ ఎదుట హాజరు పరిచారు. పట్టణంలోని హరిజన వాడకు చెందిన సుధాకర్(37), కల్లూరుకు చెందిన లక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అదే పని చేస్తున్న దస్తగిరి అనే వ్యక్తితో సుధాకర్ భార్య లక్ష్మికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం బయట పడటంతో పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు దస్తగిరితో కలసి సుధాకర్‌ను చంపేందుకు పథకం రూపొందించింది. చదవండి👉🏾 హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ రాత్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసి ముళ్ల పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నారు. కాగా మృతదేహం కనిపించకుండా మరుసటి రోజు ఇద్దరు వెళ్లి మృతదేహాన్ని హంద్రీ నదిలో పూడ్చి పెట్టారు. కాగా రెండు రోజులుగా కుమారుడు కనిపించక పోవడంతో సుధాకర్ తండ్రి లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి, దస్తగిరిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. శవాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతాన్ని నిందితులు శుక్రవారం చూపెట్టారు. కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్, తహసీల్దార్ ఉమామహేశ్వరమ్మ, కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్ఐ విష్ణు నారాయణ సుధాకర్ సమక్షంలో శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్
సాక్షి, కర్నూలు: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. (ఆత్మస్థైర్యంతో జయించా) -
కరోనా :ఆత్మస్థైర్యంతో జయించా.. ఎమ్మెల్యే
కర్నూలు(హాస్పిటల్): సంజామల మండలం నొస్సం గ్రామంలో నివాసముండే రాజస్థాన్‌కు చెందిన యువకునికి ఈ ఏడాది మార్చి 28న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇదే తొలి కేసు. ఇది వెలుగు చూసిన వారం రోజుల తర్వాత నుంచి కేసులు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. అయితే.. జూన్ ఒకటి నుంచి లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో కొందరు మాస్క్‌లు ధరించకపోవడం, చేతులను శుభ్రం చేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కేసుల సంఖ్య మళీ పెరుగుతోంది. జిల్లాలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కన్పిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో రికవరీ అయ్యే బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారిని ఆత్మస్థైర్యంతో జయించానని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. 21 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండి కరోనాను జయించిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా జూన్ 25న నిర్ధారణ అయ్యింది. మొదట్లో భయపడ్డా. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కళ్లముందు మెదిలారు. మొదట్లో కరోనాను జయిస్తానా అన్న ప్రశ్న తలెత్తింది. కానీ మంచి ఆహారం, ప్రాణాయామం, సరైన నిద్ర, డాక్టర్ల సూచనలు పాటించడం ద్వారా హోం క్వారంటైన్‌లోనే ఉండి వైరస్‌ను జయించా. స్పెషలిస్ట్ డాక్టర్ల నుంచి ఫోన్లో ఎప్పటికప్పుడు వైద్య సహాయం తీసుకున్నా. ఆహారం విషయంలోనూ శ్రద్ధ చూపా. ఉదయం నూనె లేకుండా టిఫిన్, రెండు గుడ్లు, అల్లం టీ, మధ్యాహ్నం చికెన్, అన్నం, సాయంత్రం తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, నిమ్మకాయ నీళ్లు, రాత్రి అల్పాహారం, పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకున్నా. వేడినీళ్లు ఆవిరి పట్టా. ప్రతిరోజూ వేడినీళ్లు మాత్రమే తాగేవాడిని. శ్వాసకు సంబంధించిన 15 రకాల వ్యాయామాలు చేశా. ఒంటరితనం నుంచి బయటపడడానికి వీలుగా వైఎస్సార్, అంబేడ్కర్ జీవిత చరిత్రలు చదివా. ఇలా క్రమశిక్షణ, మనోధైర్యంతో మహమ్మారిని జయించా. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. కరోనా వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.’ -
టీడీపీ దౌర్జన్యం.. ఎమ్మెల్యేతో కలిసి ఫిర్యాదు..
సాక్షి, కర్నూలు : అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వమేదైనా అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ తామే తీసుకుంటామని, అడ్డొస్తే అంతమొందిచేందుకు వెనుకాడేది లేదని గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు అభివృద్ధి పనుల కింద రూ.40లక్షలు విడుదలయ్యాయి. పనులను పాఠశాల పేరెంట్స్ కమిటీకి అప్పగించింది. దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యురాలు సుజాత ఆధ్వర్యంలో పాఠశాలకు మరుగుదొడ్లు, ప్రహరీ తదితర పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం సాయంత్రం టీడీపీ కోడుమూరు ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సాయికృష్ణ, గిడ్డయ్య పాఠశాల వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. పనులు తామే చేస్తామని, కాదంటే అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. ఆదివారం మరో టీడీపీ నాయకుడు గిరి.. సుజాత ఇంటికి వెళ్లి కాంపౌండ్‌లోని వస్తువులను ధ్వంసం చేసి, చీర లాగి, కులంపేరుతో దూషించాడు. అడ్డొచ్చిన ఆమె మరిది మాసుంపై దాడికి దిగాడు. చదవండి: చంద్రబాబు, రామోజీలకు లీగల్ నోటీసు ఎమ్మెల్యేతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు తమపై దాడి జరిగిందని బాధితురాలు సుజాత, ఆమె మరిది మాసుం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి బాధితులను వెంటబెట్టుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఓబులేసుకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుంచి గ్రామంలో ఘర్షణ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
చికెన్ రూ.100కే.. అగ్గువ రండన్నో!
కర్నూలు, కోడుమూరు: ‘ఏమన్నా..కోడికూర కావాలా? మా దగ్గర చాలా ఛీపు. రండి రండి ఎనభై రూపాయలకే కేజీ ఇత్తాం’ అంటూ వ్యాపారుల పిలుపు.,‘మరీ అంత అగ్గువా? ఐతే కేజీ కొట్టు. మంచి ఛాన్స్ ఇదే. ఫుల్లుగా లాగించేయాలి!’ అంటూ వినియోగదారుల సంతోషం.ఇదీ మంగళవారం కోడుమూరులో పరిస్థితి. వ్యాపారుల మధ్య పోటీ కారణంగా చికెన్ ధర అమాంతం తగ్గించేశారు. పట్టణంలో ఇటీవల రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి హోల్‌సేల్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిలో రూ.130 చొప్పున చికెన్ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. ఈ లెక్కన కిలో చికెన్ రూ.100కే దొరుకుతుండడంతో వినియోగదారులు భారీగా ఎగబడ్డారు. దీంతో మిగిలిన వ్యాపారులూ ‘చౌక బేరం’ మొదలుపెట్టారు. మంగళవారం స్థానిక కోట్ల సర్కిల్లో మాసుం అనే వ్యాపారి రూ.100కే కిలో చికెన్ విక్రయించాడు. దీంతో సురేష్ అనే వ్యాపారి మరీ తక్కువగా రూ.80తో అమ్మడం మొదలుపెట్టాడు. జనం ఎగబడ్డారు. ఒక్క రోజులోనే 200 కిలోలకు పైగా చికెన్అమ్ముడుబోయినట్లు సురేష్ తెలిపాడు. వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం బహిరంగ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.180, స్కిన్‌తో కలిపి రూ.150 ధర పలుకుతోంది. -
కొనసాగుతున్న వింత ఆచారం
సాక్షి, కోడుమూరు : భక్తులు ఎక్కడైనా దేవుళ్లకు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటారు. ఇందుకు భిన్నంగా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి భక్తులు తేళ్లను నేవేద్యంగా పెడుతున్నారు. ఈ వింత ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా శ్రావణమాసం మూడవ సోమవారం కొండల రాయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో సోమవారం నియోజవర్గ కేంద్రంతో పాటు చుట్ట పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. కొండపైన ఉన్న చిన్న చిన్న రాళ్లను ఎత్తి వాటి కింద ఉండే తేళ్లను భయపడకుండా చేతులతో పట్టుకుని స్వామికి కానుకగా సమర్పించారు. పట్టుకునే సమయంలో తేలు కుట్టితే స్వామి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది వారి నమ్మకంగా చెప్పారు. ఇదిలా ఉంటే స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ సంరక్షకుడు రామమనోహర్‌రెడ్డి తీర్థప్రసాదాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. -
ఈ చిన్నారికి ఎంత కష్టం
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన వయసులో ఆ చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. చేతులు, కాళ్లకు వాపు రావడంతో నడవలేకపోతోంది. ఇంటి వద్ద మంచానికే పరిమితమైంది.ఆడుకోవడానికి శరీరం సహకరించకపోవడంతో తల్లడిల్లిపోతోంది. తాను కూడా బడికి పోతానని, ఆడుకుంటానని.. ఆ చిన్నారి మారాం చేస్తుంటే తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు. చిన్న వయస్సులోనే సోకిన పెద్ద జబ్బును చెప్పలేక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సాక్షి, కోడుమూరు(కర్నూలు) : కల్లపరి గ్రామానికి చెందిన జంగం చంద్రయ్య, లలితమ్మ దంపతులకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. ప్రతి రోజూ కూలికెళితేగాని పూటగడవని పరిస్థితి వారిది. వారి కుమార్తె జయలక్ష్మి ఎంతో చురుకుగా ఉండేది. ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఆటలాడుకుంటుంటే తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఐదేళ్ల వయస్సులో కల్లపరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రెండేళ్ల పాటు ఎంతో చక్కగా జయలక్ష్మి చదువుకుంది. అయితే గత ఏడాది మార్చి నెలలో చిన్నారికి ఉన్నట్టుండి ముఖం, కాళ్లు, చేతులు, గొంతు మొత్తం వాపు రావడం ప్రారంభించాయి. భయపడిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపుత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కిడ్నీ వ్యాధని డాక్టర్లు చెప్పడంతో రూ.3లక్షలకు పైగా అప్పులు చేసి బళ్లారి, రాయచూరు తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. మాత్రల కోసం నెలనెలా రూ.5వేలకు పైగా ఖర్చు వస్తోంది. కూలినాలి చేసిన డబ్బులన్నీ పాప వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. రోగం నయం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఎవ్వరైనా సాయం చేయదలచిన వారు జంగం లలిత, కెనరా బ్యాంకు, అకౌంట్ నెం : 1679101011237లో డిపాజిట్ చేయాలని వేడుకుంటున్నారు. వివరాలకు సెల్ నెం : 9502127063 సంప్రదించాలని కోరుతున్నారు. -
చార్ధామ్ యాత్రకు వెళ్లి ..
సాక్షి, కోడుమూరు(కర్నూలు) : చార్ధామ్ యాత్రకు వెళ్లిన కోడుమూరు పట్టణానికి చెందిన ఓ మహిళా భక్తురాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఈనెల 27న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోడుమూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రుడు భార్య ధర్మాంబ (65) నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు బంధువులతో కలిసి వెళ్లింది. యాత్రలో భాగంగా ఈనెల 27న ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయంలో దర్శనం నిమిత్తం క్యూలో నిలబడిన ధర్మాంబ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. గమనించిన బంధువులు అక్కడే ఉన్న వైద్యుడిని సంప్రదించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ధర్మాంబ మృతదేహాన్ని కోడుమూరుకు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ జిల్లా అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. శనివారం విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కోడుమూరుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మృతురాలికి భర్తతో పాటు, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
చంద్రబాబు సభ; చెప్పు విసిరిన దుండగుడు
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరారు. వీరిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ అసెంబ్లీ సీటును సుజాతమ్మకు కేటాయించాలంటూ ఈ సందర్భంగా కోట్ల వర్గీయులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం రేగడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఒక చెప్పు వేదిక ముందు పడింది. ఆ సమయంలో వేదికపై సూర్యప్రకాశ్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సెక్యురిటీ వెంటనే స్పందించి వేదిక ముందు పడిన చెప్పును అక్కడి నుంచి తొలగించారు. (కోట్ల కుటుంబం రహస్య మంతనాలు) చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదరలేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. డోన్ సీటును సుజాతమ్మకు కేటాయిస్తే కేఈ ప్రతాప్‌కు ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడుమూరు టీడీపీ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరుకాకపోవడం అనుమానాలు రేకిస్తోంది. (సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా) -
మా నాయకుడి ఇలాకాలో పంచాయితా?
కర్నూలు సీక్యాంప్: సొంత పొలం కోసం వెళ్లిన వ్యక్తులపై దారుణంగా దాడి చేసిన ఘటన ఆర్కే దుద్యాలలో ఆదివారం చోటు చేసుకుంది. ‘మా నాయకుడి ఇలాకాలోనే పంచాయితీ పెడతారా’ అంటూ తెలుగు దేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన బోయ రాముడు, లక్ష్మీదేవి దంపతులు కొన్నాళ్ల క్రితం గ్రామాన్ని వీడి లక్ష్మీదేవి స్వగ్రామమైన నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చేరుకున్నారు. వీరికి చెందిన 12 ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన శేఖర్, బాలచంద్రుడు, రంగయ్య, నగేశ్, లక్ష్మన్న కుటుంబీకులు ఆక్రమించుకుని పంటలు సాగు చేస్తున్నారు. వారం క్రితం లక్ష్మీదేవి దంపతులు దుద్యాలకు చేరుకుని తమ పొలం తమకివ్వాలని కోరారు. అయితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెడదామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం లక్ష్మీదేవి తన సోదరులు బి. చంద్రస్వామి, రామస్వామిని వెంట తీసుకెళ్లింది. ఆర్.కొంతలపాడు, తులశాపురం, ఆర్.కె.దుద్యాల వాసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని లక్ష్మీదేవి పొలం ఆమెకు ఇచ్చేలా పంచాయితీ చేశారు. దీనిని జీర్ణించుకోలేని శేఖర్, బాల చంద్రుడు, రంగయ్య, నగేశ్,కుటుంబ సభ్యులు బి.చంద్రస్వాములు, బి.రామస్వామిపై కత్తులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తాము విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులమని, తమ నాయకుడి ఇలాకాలో పంచాయితీ పెడతారా అంటూ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తాలుకా పోలీసులు తెలిపారు. -
టీడీపీకి అమ్ముడుపోయా
-
తేలు కుట్టినా ఏమీ కాదంటా..!
కోడుమూరు: సాధారణంగా విష పురుగులైన తేళ్లను చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఈరోజు (మూడో శ్రావణ సోమవారం) కోడుమూరు వాసులు ఏమాత్రమూ భయం లేకుండా తేళ్లను పట్టుకున్నారు. వాటిని చేతులపై, తలపై, నాలుకపై ఉంచుకొని నృత్యాలు చేశారు. ఈరోజు తేలు కుట్టినా ఏమీ కాదని, ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే విషప్రభావం తగ్గిపోతుందని వారు తెలిపారు. అదే మిగతా రోజుల్లో అయితే సమస్య వస్తుందని చెప్పారు. శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని కోడుమూరు సమీపంలోని కొండపై వేడుకను వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ఇష్టదైవమైన కొండలరాయుడి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తేళ్లను పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ వేడుక ఆనవాయితీగా జరుగుతోంది. ఈసారి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
అట్ల.. ఎట్టెట్టా..!
► టీడీపీ నాయకుడి అక్రమాలు ► ఈర్లదిన్నెలో భూముల కబ్జా ► ఇతరుల భూములకు తన పేరు చూపి రుణం ► బ్యాంకులను మోసం చేసిన కృష్ణారెడ్డి ► సింగిల్ విండో డైరెక్టర్ కావడంతో అక్రమాలను పట్టించుకోని అధికారులు! టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి అతనికి ఉన్నది మూడెకరాల పొలం.. నేడు అతనికి ఉన్న పొలం 13.64 ఎకరాలు.. ఇది కష్టార్జితం కాదు.. రికార్డులు మాయ చేసి సంపాదించింది.. కబ్జాలు చేసి కూడబెట్టుకుంది.. ఇందుకు సాక్షాలుగా.. వెబ్‌ల్యాండ్‌లో ఒక విస్తీర్ణం.. పాసుపుస్తకంలో మరో విస్తీర్ణం.. కనిపిస్తోంది! మరొకరి భూమిని తనదిగా చూపించి ఇతను బ్యాంకులనే బురిడీ కొట్టించాడు!! సి.బెళగల్ మండలంలో టీడీపీ నాయకుడి అక్రమాల బాగోతమిదీ!!! కోడుమూరు : టీడీపీ నాయకుల భూదందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లొంగదీసుకొని ఇష్టానుసారంగా వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చుకుంటున్న బాగోతం సి.బెళగల్ మండలంలో వెలుగులోకొచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతుండడంతో పట్టా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సి.బెళగల్ మండలం కొత్తకోట మజారా గ్రామమైన ఈర్లదిన్నెలో టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇతరుల భూములను తన పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రూ.19.64లక్షలు రుణం తీసుకోవడం అక్రమాలకు పరాకాష్ట. భూమిని ఎలా మార్చారంటే... అట్ల రాధాకృష్ణారెడ్డికి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి కేవలం మూడెకరాలు మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల అండదండలతో 13.64 ఎకరాల భూమి ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకొని రూ.19.64లక్షల రుణం తీసుకున్నారు. కృష్ణారెడ్డికి ఖాతా నెంబర్ 941లో 13.37ఎకరాల భూమి ఉన్నట్లు వీఆర్వో అక్బర్‌సాహెబ్ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. ఆ ఖాతా నెంబర్లో ఉన్న సర్వేనెంబర్లు ప్రభుత్వ భూములు కావడంతో రిజిష్టర్ ఆఫీస్ మార్టిగేజ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కృష్ణారెడ్డి.. సింగిల్ విండో డైరెక్టర్ కావడంతో అదే ఖాతా నెంబర్లో ఇతరుల భూమిని తన పేరు మీద నమోదు చేయించుకొని.. కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి వెబ్‌ల్యాండ్ ఆధారంగా 10.29ఎకరాలు ఉంది. పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న వివరాలకు, వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలు పరిశీలిస్తే ఎన్నో తేడాలు కన్పిస్తున్నాయి. నిజానిజాలు ఇవీ.. ♦ అట్ల కృష్ణారెడ్డికి 312/1ఎ, 312/1ఈ సర్వే నెంబర్లలో రెండెకరాల భూమి ఉంది. కొండాపురంలో సర్వే నెంబర్ 427లో ఒక ఎకరా భూమి కలదు. ♦ కొండాపురం గ్రామంలో సర్వే నెంబర్ 322/2లో వెంకటలక్ష్మమ్మకు 1.77సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కృష్ణారెడ్డి తన పేరు మీద వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్నారు. ♦ కొత్తకోటలోని 387సర్వే నెంబర్లో భూమి విస్తీర్ణమే లేదు. రుణం తీసుకునే సమయంలో 1.44సెంట్ల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో చూపించారు. ♦ 386 సర్వేనెంబర్లో పూర్తి విస్తీర్ణం 56సెంట్లు. ఇందులో కృష్ణారెడ్డి 36సెంట్లు, కె.రంగనాథరావు అనే రైతుకు 20సెంట్ల భూమి ఉంది. అయితే మొత్తం 56సెంట్లు తనదేనని కృష్ణారెడ్డి ఆన్లైన్లో చూపించారు. ♦ ఈర్లదిన్నె గ్రామంలోని 352, 353, 354 సర్వే నెంబర్లలో పూర్తి విస్తీర్ణం 20.55ఎకరాల భూమిలో 13.68ఎకరాల భూమిని కృష్ణారెడ్డి సోదరుడు (డాక్యుమెంట్ నెంః 2007/2014, 2008/2014) కొనుగోలు చేశారు. మిగిలిన భూమి 6.87ఎకరాలను కృష్ణారెడ్డి తనకు వంశపారపర్యంగా వచ్చినట్లు ఆన్లైన్లో చూపించుకున్నారు. తనకున్న 3ఎకరాలు తీసేస్తే 10.67సెంట్ల భూమి ఇతరులది తన పేరు మీద నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు.. వెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లను రాత్రికి రాత్రే మార్చివేసి రుణాలు పొందారు. -
ప్రియుడికి మరొకరితో పెళ్లి..
గూడూరు: ప్రియుడికి వేరే యువతితో పెళ్లి జరిగిందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని కె.నాగులాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీత (17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. పక్క గ్రామమైన పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్‌రెడ్డి కర్నూలులో డిగ్రీ చదువుతున్నాడు. కొంత కాలం క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో మూడు నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన పెద్దలు వీరిని పిలిపించి పంచాయితీ చేశారు. పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు కొంత నగదును సోమశేఖర్‌రెడ్డి కుటుంబీకులు చెల్లించేలా తీర్మానం చేసి ఆ మేరకు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అయితే సోమశేఖర్‌రెడ్డికి మరో యువతితో పెళ్లి నిశ్చయించి గురువారం పెంచికలపాడులో వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న గీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
ఎమ్మెల్యే చెప్పిన అభివృద్ది ఏదీ ? ఎక్కడా ?
-
కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం
– కోడుమూరులో వింత ఆచారం – దశాబ్ధాలుగా కొనసాగిస్తున్న భక్తులు కోడుమూరు రూరల్: ఆలయాల్లో దేవుళ్లకు పండ్లు, పాలు, పాయసాన్ని నేవేధ్యంగా పెట్టడం ఆనవాయితీ. అయితే ఇందుకు అతీతంగా కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడికి ఆ ప్రాంత ప్రజలు తేళ్లను పట్టుకుని స్వామివారిపై వదిలి నేవేద్యంగా సమర్పిస్తున్నారు. ఏటా శ్రావణమాస మూడో సోమవారం రోజు ఈ వింత ఆచారాన్ని పట్టణ ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడుతుంటారు. ఇక్కడి కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుగొంకులేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం సాయంత్రం పట్టణ ప్రజలు వేలాదిగా కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రజలకు శ్రీలక్ష్మీవెంకటేశ్వర ఆలయ చైర్మన్, భారతి సిమెంట్ డిస్ట్రిబ్యూటర్ ఎద్దుల మహేశ్వరరెడ్డి అల్పాహారం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కోడుమూరు ఎస్ఐ మహేష్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు. -
మామిడితోటలో యువకుడి ఆత్మహత్య
కోడుమూరు (కర్నూలు) : ఓ యువకుడు మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. మద్దిగేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఎరుకలి సురేష్ అనే యువకుడు తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫన్‌చాయతీ
కోడుమూరు: ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. నాయకుల్లో స్వార్థం పెరిగిపోవడం.. అధికారులు చేయి తడిస్తే చాలనుకోవడం వల్ల గ్రామాల్లో దారిద్య్రం తాండవిస్తోంది. ఐదేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే ఆశ తప్పిస్తే.. అభివృద్ధిలో తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుదామనుకునే వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోడుమూరు మండలంలోని పంచాయతీలకు వివిధ గ్రాంట్స్ రూపంలో దాదాపు రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీ జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.45లక్షల వరకు కేటాయించారు. మేజర్ పంచాయతీలకు రూ.2కోట్లు విడుదలయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ నిధుల వినియోగం చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. ఉదాహరణకు మండల పరిధిలోని ప్యాలకుర్తి పంచాయతీని పరిశీలిస్తే.. గ్రామానికి రూ.42,09,597ల నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగవు. కాల్వల్లో ఎక్కడికక్కడ సిల్టు పేరుకుపోయింది. ప్రజలు మురికినీటి కుంటల మధ్యే జీవనంసాగిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోయాయి. రెండు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు ఉన్నా.. మూడేళ్లుగా నీళ్లు ఎక్కంచని పరిస్థితి. 11 మినీ ట్యాంకుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. 8వేల జనాభా కలిగిన ప్యాలకుర్తిలో అడుగడుగునా సమస్యలే. తాగునీటి ఇక్కట్లతో గ్రామస్తులు చుక్కలు చూస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుకు రూ.8.34 లక్షలు ఖర్చు చేసినట్లు సర్పంచ్ లెక్కలు చూపారు. తాగునీటి కోసం ఒక్క ఏడాదిలో ఇన్ని లక్షలు ఖర్చు పెడితే ప్రజల గొంతు ఎందుకు ఎండుతుందో ఆ నేతకే ఎరుక. ఇదే కాదు.. పంచాయతీ భవన నిర్వహణకు రూ.8,750.. మురుగు కాల్వల శుభ్రానికి, చెత్త ఎత్తివేతకు రూ.6లక్షలు ఖర్చు చేశారట. ఇంకా ఈ పంచాయతీలో రూ.23.62 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మొత్తానికి ఎలాంటి లెక్కలు చూపుతారో వేచి చూడాలి. ఒక్క ప్యాలకుర్తిలోనే కాదు.. దాదాపు అన్ని పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. సర్పంచ్‌లు నిధులను దుర్వినియోగం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తితో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అనుగొండ గ్రామ సర్పంచ్‌గా సుజాత ఎన్నికయ్యారు. ఈమె రాజకీయాలకు కొత్త కావడంతో ఓ వ్యక్తి షాడో సర్పంచ్‌గా చక్రం తిప్పుతున్నాడు. రికార్డులతో పాటు చెక్ బుక్కు కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రూపాయి ఖర్చు చేయాలన్నా సర్పంచ్ కూడా ఆయన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మార్చి చివరిలోపు ఖర్చు చేయకపోతే మురిగిపోతాయి. ఈ నేపథ్యంలో చిల్లబండ, పులకుర్తి గ్రామ పంచాయతీల్లో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామ సర్పంచ్ గెలుపునకు రూ.7లక్షలు ఖర్చు చేశానని చెప్పుకుంటున్న ఓ నేత సర్పంచ్‌పై పెత్తనం చెలాయిస్తూ నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. గతంలో సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తి తన డబ్బు తిరిగిచ్చిన తర్వాతే అలా చేయాలని బెదిరించినట్లు చర్చ జరుగుతోంది.