ప్రియుడికి మరొకరితో పెళ్లి.. | ttc student commit suicide in kurnool district over love affair | Sakshi
Sakshi News home page

ప్రియుడికి మరొకరితో పెళ్లి..

Published Sat, Jun 3 2017 10:19 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

ప్రియుడికి మరొకరితో పెళ్లి..

ప్రియుడికి మరొకరితో పెళ్లి..

గూడూరు: ప్రియుడికి వేరే యువతితో పెళ్లి జరిగిందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని కె.నాగులాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీత (17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. పక్క గ్రామమైన పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్‌రెడ్డి కర్నూలులో డిగ్రీ చదువుతున్నాడు. కొంత కాలం క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో మూడు నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకున్నారు.

ఇటీవల గ్రామానికి చెందిన పెద్దలు వీరిని పిలిపించి పంచాయితీ చేశారు. పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు కొంత నగదును సోమశేఖర్‌రెడ్డి కుటుంబీకులు చెల్లించేలా తీర్మానం చేసి ఆ మేరకు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అయితే సోమశేఖర్‌రెడ్డికి మరో యువతితో పెళ్లి నిశ్చయించి గురువారం పెంచికలపాడులో వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న గీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement