datils
-
హృదయాలను గెలిచిన జననేత
- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి - గరగపర్రు పర్యటనలో జగన్ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు - ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు - సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం - ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు. జగన్ హిత వచనాలపై హర్షం ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. ఇరు వర్గాలతో మమేకం గరగపర్రు దళితవాడలో జగన్ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అడుగడుగునా బ్రహ్మరథం గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రులో మీడియాతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది. ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్ జగన్
ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన -
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు. ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు.