
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు.
ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.