GARAGAPARRU
-
రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు
సాక్షి, పశ్చిమగోదావరి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్ నేడు, రేపు భారీ వర్షాలు -
వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం
కడుపున పుట్టిన బిడ్డలపై తల్లిదండ్రులకు చనిపోయేంత వరకూ వాత్సల్యం పోదు.. కానీ పిల్లలకు అలా కాదు.. నేటి తరానికి అయితే మరీనూ.. ఉద్యోగంలో బిజీ అనో.. ఎంతోదూరంలో ఉన్నామనో.. ఫ్యామిలీలో సమస్యలనో.. ఆర్థికంగా ఇబ్బందులనో.. తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అమ్మనాన్నలను అనాథలను చేస్తున్నారు.. కొందరైతే సంతానం లేక.. ఆదరించే వారు లేక ఒంటరిగా మిగులుతున్నారు.. అలా ఆదరణ కోల్పోయిన వృద్ధులను ఎంతో వాత్సల్యంతో అక్కున చేర్చుకుంటోంది పాలకోడేరు మండలం గరగపర్రులోని వసుధ వాత్సల్య నిలయం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, భీమవరం: ఉభయ తెలుగురాష్ట్రాల్లో డబ్బులు తీసుకుని వృద్ధులను ఆదరించేందుకు అనేక ఆశ్రమాలున్నాయి. ఇటువంటి ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన రామలింగరాజు పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వసుధ వాత్సల్య నిలయం పేరుతో ఉచిత అనాథాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సంవత్సరాలు తరబడి ఎంతో శ్రద్ధతో దీనిని నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోని గరగపర్రు గ్రామంలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవంతులు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో.. 2002లో వసుధ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 46 సేవా సంస్థలను ఏర్పాటు చేసి కుల,మత భేదాలకు తావులేకుండా ఎంతోమంది అభాగ్యులకు సేవలందిస్తున్న రామలింగరాజు స్వగ్రామం గరగపర్రు. అందుకే ఆయన స్వగ్రామంలోనూ వసుధ వాత్సల్య నిలయం ఏర్పాటు చేశా>రు. విశాలమైన ప్రదేశంలో పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తోన్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వృద్ధులు, 10 మంది విద్యార్థులూ ఉన్నారు. వీరికి ఉచిత భోజనం, వసతి, వైద్యం అందించడమేగాక విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది అంధ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరికీ వేళకు భోజనం పెట్టడమేగాక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిత్యం వైద్యసేవలందే ఏర్పాటు చేశారు. వృద్ధుల్లో ఓపిక ఉన్నవారు మాత్రం కాలక్షేపం కోసం మొక్కలకు నీరు పోయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తుంటారు. నా అన్నవాళ్లు లేకనే.. నా భర్త నాగిరెడ్డి కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలు కూడా చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను వసుధ వాత్సల్య నిలయం ఆదుకుంది. నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నా, కన్నబిడ్డల కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూస్తున్నారు. – కొవ్వూరి చెల్లాయమ్మ, పెంటపాడు పనిచేసే ఓపిక లేక.. నా వయస్సు 65 ఏళ్లు. కులవృత్తి చేనేతతో నాభర్త వీరాస్వామి కంటికి రెప్పలా నన్ను చూసుకునేవారు. సంతానం లేదు. ఆయన మరణంతో కొంత కాలం ఇళ్లల్లో పాచి పనిచేసి జీవనం సాగించాను. పనిచేసే ఓపిక నశించి గ్రామస్తుల సలహాతో వాత్సల్య నిలయంలో చేరాను. ప్రస్తుతం ఇక్కడ సంతోషంగా గడుపుతున్నాను. – వింజమూరి విజయలక్ష్మి, ఉండి గ్రామం ఏ లోటు లేకుండా ఆనందంగా.. భార్య, బిడ్డలు దూరం కావడంతో 80 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడపడం దుర్భరంగా మారింది. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తరుణంలో ఆత్రేయపురం వసుధ ఫౌండేషన్ కార్యకర్తలు వసుధ వాత్సల్య నిలయానికి పంపించారు. ఏ లోటు లేకుండా అందరితో ఆనందంగా గడుపుతున్నా. – వేగేశ్న సత్యనారాయణరాజు, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా ఎంతో ఆదరణతో చూస్తున్నారు నా వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. నన్ను ఆదరించేవారెవరూ లేరు. పనిచేసే ఓపిక లేదు. అగమ్యగోచరంగా జీవితం. ఇటువంటి తరుణంలో 4 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చేరా. రామలింగరాజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ఆదరణతో చూస్తున్నారు. భగవంతుని ధ్యానిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను. – కలికి సుబ్బారావు, చిలకంపాడు అనాథలను ఆదుకోవాలనే.. వసుధ ఫౌండేషన్ ద్వారా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నా. సొంతంగా ఆశ్రమం నిర్వహించాలనే సంకల్పంతో 12 ఏళ్ల క్రితం 25 మందితో ఆశ్రమం ప్రారంభించి ప్రస్తుతం 40 మందితో నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఆదరణకు నోచుకోని వారిని ఆదరించాలనే సంకల్పంతోనే వృద్ధాశ్రమం ఏర్పాటుచేశాం. – మంతెన రామలింగరాజు, వసుధ ఫౌండేషన్ చైర్మన్ -
చలో గరగపర్రు భగ్నం
పాలకోడేరు: దళిత సంఘాల చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. గరగపర్రు గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు తమ వలయంలోకి తీసుకుని నిర్బంధించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను గ్రామంలోకి రాకుండా మండలంలోని వేండ్ర రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో గరగపర్రు గ్రామంలోని దళితులంతా ర్యాలీగా గ్రామ సెంటర్లోకి చేరుకుని నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన ముగ్గురు దళిత యువకులు వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేశారు. దీంతో ఒక దశలో గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక దశలో ఏమవుతుందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. డీఎస్పీ పూర్ణచంద్రరావు వస్తున్నారు.. మీతో మాట్లాడతారు వెనక్కి పదండి అని పోలీసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంతానికి తీసుకువచ్చారు. మంత్రులు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాలని వారు కోరగా అందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నర్సాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న దళిత నేతలతో చర్చించి కొంత మంది ప్రతినిధులు నరసాపురం కార్యాలయానికి వస్తే చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపుతామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను దళితులు విరమించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు కారుమంచి క్రాంతి, ఎరిచర్ల రాజేష్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డీఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని, ఒకవేళ కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల చలో గరగపర్రుకు పిలువు ఇవ్వడంతో గరగపర్రు వెళ్లే ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వారి గుర్తింపు కార్డులు చూసి నిర్ధారించి గ్రామంలోకి పంపించారు. -
గరగపర్రులో మళ్లీ టేన్షన్
-
గరగపర్రు చెప్పే చేదు నిజం
డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఎవరో పనిలోకి రావద్దంటే బతకలేని దుర్భర స్థితి దళితులది. ఒక్క గరగపర్రుని చూస్తే దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లోని దళితుల దయ నీయ పరిస్థితులు ఎలాంటివో అర్థమవుతాయి. ఇవాళ గరగపర్రు రాజులు కొత్తగా దళితుల్ని వెలి వేయలేదు. దేశంలో దళితులలో నూటికి 90 శాతం ఇంకా వెలిలోనే ఉన్నారు. అంట రానితనాన్ని, సాంఘిక బహిష్కరణను పాలకులే స్వయంగా పాటిస్తున్నారు. ఆ వాస్తవాన్నే గరగపర్రు నేడు దేశానికి చూపిస్తోంది. డెబ్భై వసంతాల స్వాతంత్య్రం సందర్భంగా దేశం సంబరాలకు సిద్ధమవుతుండగా గరగపర్రులాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉండటం ఏమిటి? అంబేడ్కర్ విగ్రహం పెట్టుకుంటామంటే ఏకంగా దళిత జాతినే వెలివేస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ నియోజకవర్గంలోని భీమవరం పట్టణానికి అతి సమీపాన ఉన్న గ్రామం గరగపర్రు. తాడేపల్లిగూడెం నుంచి ఆ ఊరుకు వెళ్తుంటే, దారిలో నాట్లకు సిద్ధం చేసిన వరి పొలాలు కనిపించాయి. కొన్ని పొలాలు అప్పటికే నాట్లు పడి పచ్చగా కళకళలాడుతున్నాయి. కొంచెం దూరం వెళ్లేసరికి పొలాలు మాయమై చేపల చెరువులు, రొయ్యల చెరువులు దర్శనమిచ్చాయి. కొందరు మిత్రులు ఆ ఊరి దళితవాడలోని చర్చికి తీసుకుపోయారు. అక్కడ జరిగిన ఘటనకంటే దారుణమైన విషయాలను నేను కళ్లారా చూశాను, చెవులారా విన్నాను. అల్లూరి సరసన అంబేద్కరా? గరగపర్రు దళిత యువకులు తమ పాలిటి దేవుడులాంటి అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామంలో పెట్టాలనుకున్నారు. అంబేడ్కర్ అందరికీ ఆరాధ్యనీయుడేనని భావించి.. ఊరి చెరువు పక్కన కాటన్ దొర, అల్లూరి సీతారామరాజు, గాంధి, పొట్టి శ్రీరాములు తదితరుల విగ్రహాల చెంతనే ఆయన విగ్రçహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతికి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నా, ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 23 రాత్రి 11 గంటల సమయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చి, తాత్కాలికంగా చెరువు గట్టు పక్కన ఉంచి, తెల్లారాక విగ్రహ ప్రతిష్టాపన జరపాలనుకున్నారు. కానీ తెల్లారేసరికి విగ్రహం మాయమైంది. ఇది పెద్ద కులాల వారి కుట్రేనని భావించిన రెండు వాడల దళితులూ రోడ్డుపై బైఠాయించి, రహదారిని స్తంభింపజేశారు. దీంతో హుటాహుటిన అధికారులు రంగప్రవేశం చేశారు. విగ్రహం కోసం వెదికించి, పాత పంచాయతీ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపల బందీగా ఉన్న విగ్రహాన్ని బయటకు తీయించారు. రోడ్డును విశాలం చేసేటప్పుడు అడ్డం కావచ్చు కాబట్టి పాత పంచాయతీ కార్యాలయం ముందు విగ్రహాన్ని ఉంచితే మంచిదన్న డిప్యూటీ కలెక్టర్ సూచనను దళితులంతా అంగీకరించారు. పోలీసుల్ని కాపలా వుంచి అధికారులు వెళ్లిపోయారు. ధిక్కారానికి విరుగుడు వెలి ఇక్కడితో కథ ముగియడం కాదు, అసలు ఇక్కడే మొదలైంది. పాత పంచాయతీ కార్యాలయం ఊరికి, చెరువుకు మధ్యనున్న రహదారి పక్కనే ఉంది. అగ్రకులాలు, బీసీ కులాల వారంతా పాత పంచాయతీ కార్యాలయం ముందున్న అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తూ ఊళ్లోకి వెళ్లాలి, బయటకు పోవాలి. రోడ్డుకు ఇటు పక్కన అల్లూరి సీతారామరాజు విగ్రహం వుంది. దానికి ఎదురుగా అటు పక్కన అంబేడ్కర్ విగ్రహం ఉంది. అల్లూరి కులానికి చెందిన రాజులదే గరగపర్రులో ఆధిపత్య స్థానం. రాజుల్లో చాలా మందికి మనసులో కొంచెం కెలికినట్టున్నా, ఇద్దరు, ముగ్గురికి మాత్రం తల తీసేసినట్టయిందని, వారి అహం దెబ్బ తిందని దళిత సంఘాలు, వామపక్షాలు, తదితరుల కథనం. ఏమైనా ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించాలి. ఎలా? వెంటనే ఆ ఊరిలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక రాజు తక్షణమే దళితులు మినహా అన్ని కులాలను సమావేశపరిచాడు. మే 5 లోగా విగ్రహాన్ని తొలగిస్తే సరేసరి. లేదంటే మొత్తం దళితుల్ని మనమే మన పొలాలు, ఇళ్లు, గొడ్ల చావిళ్లు, ఫ్యాక్టరీల పనుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అంటే దళితులకు సాంఘిక బహిష్కారం విధించారు. ఇది, 14 కులాలు కలసి తీసుకున్న నిర్ణయమే అయినా నిర్ణయాధికారం రాజులదే. గ్రామంలో సిరిసంపదలు ఎవరి చేతుల్లో వుంటాయో అధికారాలు కూడా వారి చేతుల్లోనే వుంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొత్తానికి వెలి అనే మహా నాటకానికి తెర లేచింది. దళితులు లొంగలేదు. కౌలు భూములు, పనులు, జీవనోపాధి పోయినా, ఊళ్లో పలకరించేవారు లేకపోయినా.. తమ ఆత్మ గౌరవానికి చిహ్నమైన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసేది మాత్రం లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ వెలి ఘోరం నెలన్నరకు పైగా బయటకు పొక్క లేదు. చివరికి 10 టీవీ, సాక్షి టీవీలు ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాకగానీ ఇది లోకానికి తెలియలేదు. ఆ తర్వాతైనా ప్రధాన స్రవంతి మీడియా ఈ ఘటన పట్ల పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. దళితుల మహాపరాధం అటు వైపు వారు చెప్పే విషయాలూ తెలుసుకున్నాను. ఆ ఊరి సర్పంచ్ ఎలిజబెత్ రాణి దళితురాలే గానీ రాజుల పక్షాన నిలిచారు. ఆవిడ మాట్లాడిన వాట్సాప్ వీడియోను చూశాను. దళితులే చాలా ఘోరమైన తప్పిదం చేశారు, దొంగచాటుగా విగ్రహం పెట్టాల్సిన పనేంటి, మాకు (అంటే ఆ ఊళ్లో పెద్దలనుకుంటున్న వారికి) చెప్తే మేమే ఆ మహానుభావుడి విగ్రహం పెట్టేవారం కదా అంటూ ఆమె మాట్లాడారు. ధర్మ ప్రభువులైన రాజులకూ, ఊరికీ అపఖ్యాతి తెచ్చే పని దళితులు చేస్తే, వారి పక్షాన ఎందుకు మాట్లాడతానని ఆమె వాదించారు. రాజులలో నాకు తెలిసిన చాలా మంది మిత్రులు జరిగిన దానికి విచారాన్ని వ్యక్తం చేయగా, కొందరు ఇదేదో పాత గొడవల కొత్త మలుపు అన్నారు. గోరంతను కొండంత చేశారని ఆరోపించారు. ఏదేమైనా దళితులను మూకుమ్మడిగా వెలి వేశారనేది స్పష్టంగానే కనబడుతోంది. దళితులు కౌలు చేసుకుంటున్న భూములను వేరే వారికి కట్టబెట్టడాన్ని చూస్తేనే అది అర్థమవుతోంది. అది లోకానికి వెల్లడయ్యాక, అనివార్యంగా జరగాల్సిన తతంగమంతా జరిగింది, జరుగుతోంది. పార్టీల వారూ, దళిత సంఘాల వారూ వచ్చి సానుభూతిని తెలియజేసి, ఉప్పు, పప్పు, బియ్యం బస్తాలు కుమ్మరించి పోతున్నారు. అధికారులు, పోలీసులు, నాయకులు ఇరు పక్షాలకీ రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద ముగ్గురిని అరెస్టు చేశారు. వాళ్లు బెయిలు మీద బయటకొచ్చిన రోజునే.. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, పీస్ కమిటీలో దళితుల వాదనను బలంగా విని పించిన యాకోబ్‌ను లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఇది ముమ్మాటికీ హత్యేనని దళితులు అంటున్నారు. కాదు యాక్సిడెంటే అంటున్నారు కొందరు. దేశంలోని దళితుల దుస్థితికి నిలువుటద్దం ఇప్పుడు మనమిక ఈ ఘటన మూలాల్లోకి వెళ్లి అసలు విషయాలను చూద్ధాం. ఈ ప్రాంతంలో రాజులకు, దళితులకు మధ్య పెద్దగా ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ దారుణానికి ఒక కులాన్ని బోనెక్కించడానికి వీల్లేదు. రాజు కాకుంటే మరో దొరగారు ఎవరో ఒకరు ఉంటారు. ఇలాంటి ఘటనలు లెక్కకు మించి జరగడానికి అనువైన పరిస్థితులు దేశంలో ఇంకా పుష్కలంగా ఉన్నాయన్నదే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఎవరో పనిలోకి రావద్దంటే బతకలేని దుర్భర స్థితి. ఎవరో నా పొలంలోకి అడుగు పెట్టొద్దంటే మట్టికి దూరమైపోతామని గింజుకునే నిస్సహాయ స్థితి. ఎవరో వద్దన్నందుకు ఏ ఫ్యాక్టరీలోనూ పని దొరకదని వేదన పడే సంకట స్థితి. వెలి వేస్తున్నారంటే అయ్యో అంటూ విలవిల్లాడిపోయే దౌర్భగ్య స్థితి. ఊరవతల దశాబ్దాల క్రితం పుణ్యాత్ములెవరో దయతలచి పారేసిన నేల మీద నాలుగు గోడలు నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితి. దీని గురించే ఇప్పుడు ఆలోచించాలి. ఒక్క గరగపర్రుని చూస్తే దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లోని దళితుల దయనీయ పరిస్థితులు ఎలాంటివో అర్థమవుతుంది. ఇవాళ గరగపర్రు రాజులు కొత్తగా దళితుల్ని వెలి వేయలేదు. దేశంలో దళితులలో నూటికి 90 శాతం ఇంకా వెలిలోనే ఉన్నారు. అంటరానితనాన్ని, సాంఘిక బహిష్కరణను పాలకులే స్వయంగా పాటిస్తున్నారు. ఆ వాస్తవాన్నే గరగపర్రు నేడు దేశానికి చూపిస్తోంది. గరగపర్రులోని సుమారు నాలుగొందల దళిత కుటుంబాలలో కేవలం 20 కుటుంబాలకు, మొత్తం 20 ఎకరాల భూమి ఉంది. అంటే 5 శాతం దళితులకే అంతో ఇంతో భూమి ఉంది. అతి కొద్ది శాతంగా ఉండి, గ్రామాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే భూమి ఇంకా కేంద్రీకృతమై ఉంది. ఎందుకు? భూ సంస్కరణల డ్రామా ఎప్పుడు కోమాలోకి పోయింది? ఇది ఏ రకం వెలి? ఏ రకం సాంఘిక బహిష్కరణ? ఇలాంటి చాలా ప్రశ్నలను గరగపర్రు దేశం ముందు ఉంచింది. ఆ ఊర్లో విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్న దళితులు లేనే లేరు. డిగ్రీ దాకా నెట్టుకొచ్చిన నలుగురైదుగురు యువకులు రొయ్యల ఫ్యాక్టరీల్లో కార్మికులుగానే మిగిలారు. నిర్బంధ ఉచిత విద్య ఏమైపోయింది? రిజర్వేషన్లు ఏమైపోయాయి? ఈ చీకట్లకు ఏం పేరు పెట్టాలి? గరగపర్రు దళితుల్లో చాలా మంది ఉఫ్‌మని ఊదితే పడిపోయే తాటాకు గుడిసెల్లోనే బతుకులు నెట్టుకొస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితమే స్థలాలు ఇచ్చినా, ఇంకా పక్కా ఇళ్లు రాలేదు. కొందరు కాయకష్టంతో కడుపు కట్టుకుని ఇళ్లు కట్టుకున్నారు. దళితుల కోసం కట్టిన మరుగుదొడ్లు ఇంకా బేస్మెంట్ దశ దాటలేదు. దాపరికంలేని దగా బతుకులు వారివి. వెలి బతుకులు ఇంకెన్నాళ్లు? ఇంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నవారిని కొత్తగా వెలి వేయడం ఏమిటి? దశాబ్దాలుగా వెలిలోనే ఉన్నారుగా. అసలు ఊరికి వెలుపల ఎక్కడో తలదాచుకునే దౌర్భాగ్యం ఇంకా దళితులను వెంటాడటమే ఒక భయానక బహష్కరణ కాదా? ఇంత జరిగాక ఎలాగూ ఇక రాజీ ప్రయత్నాలు అనివార్యం. అంతా కలసి సామరస్య వాతావరణం నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. రాజీ కృషి ఫలించి ఒప్పందం కుదిరిందని, దళితులు అది లిఖితపూర్వకంగా ఉండాలని పట్టుబడుతున్నారని తాజా సమాచారం. అంతా సవ్యంగా జరిగి, అన్నీ సద్దుమణిగినా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఈ వెలి ఎన్నటికి తొలగిపోతుంది? తమ భూముల్లో తామే పనిచేసుకునే అదృష్టం దళితులకు ఏనాటికి ప్రాప్తిస్తుంది? ఒకరి దయాదాక్షిణ్యాల మీద కాక తమ కాళ్ల మీద తామే నిలబడే సత్తువ వారికి ఎప్పటికి సిద్ధిస్తుంది? దశాబ్దాలుగా అమలవుతున్నా, రిజర్వేషన్లు 90 శాతం దళితులకు ఎండమావులుగానే ఎందుకు మిగిలిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికైనా అంతా అన్వేషించాలి. ఈ వ్యాసాన్ని ముగిస్తుండగా ‘ప్రజలకు శాంతి, సౌఖ్యం కలిగించే దేశమె దేశం’ అనే పాట గుర్తుకొచ్చింది. దాంతో పాటూ కన్నీళ్లూ వచ్చాయి. - డాక్టర్ ప్రసాదమూర్తి వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : pramubandaru@gmail.com -
గరగపర్రు సమస్యకు పరిష్కారం
చెరువుగట్టున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒప్పందం ఇరువర్గాలు చేతులు కలిపి.. కలసిమెలసి జీవిస్తామంటూ హామీ దళితవాడలో సౌకర్యాలు కల్పిస్తామని మంత్రుల భరోసా భీమవరం: ఉండి నియోజవర్గంలోని గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ సమస్య పరిష్కారమైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి నక్కా ఆనందబాబు, కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ రెండు రోజులు పాటు చర్చలు జరిపి అగ్రవర్ణాలు, దళితుల పెద్దలతో చేతులు కలిపి భాయిభాయి అనిపించి మంగళవారం వివాదానికి శుభం కార్డు వేశారు. అయితే దాదాపు నాలుగు నెలల పాటు సాగిన వివాదంలో ప్రభుత్వ పరంగా బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం పంపిణీ తప్ప ఇతరత్రా ఎటువంటి ప్రయోజనం సమకూరకపోవడం విశేషం. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏప్రిల్‌లో మంచినీటి చెరువుగట్టున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. గ్రామంలో 14 కులాలు ఒక వైపు దళితులంతా ఒక వైపు ఉండి దాదాపు మూడు నెలల పాటు ఉద్యమాన్ని నడిపించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోయింది. మేము దళితులను సాంఘిక బహిష్కరణ చేయలేందటూ దళితేతరులు చెబుతుండగా.. తామ సాంఘిక బహిష్కరణకు గురై తీవ్ర మానసిక క్షోభ, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక బహిష్కణకు కారకుడైన ప్రధాన నిందితుడు ఇందుకూరి బలరామకృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తరువాత బలరామకృష్ణంరాజుతోపాటు మరో ఇరువుర్ని అరెస్టు చేశారు. ఈనెల 24న రాష్ట్ర మంత్రులు ఆనందబాబు, జవహర్, పితాని సత్యనారాయణ గరగపర్రు గ్రామం దళితవాడలో సమావేశం ఏర్పాటుచేసి గ్రామంలోని 63 కుటుంబాలకు రూ. లక్ష సాంఘిక సంక్షేమశాఖ నిధులు పరిహారంగా అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే 335 కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో ఎవరికీ సహాయం అందించకుండానే ఆరోజు చర్చలు ముగిశాయి. తిరిగి మంగళవారం పాలకోడేరులోని మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో దళితుల తరపున శిరంగుల వెంకటతర్నం, ఎరిచర్ల రాజేష్, విప్పర్తి ఏసుపాదం, విజయకుమార్, రెండవ వర్గం తరపున చింతలపాటి సూర్యనారాయణరాజు, ముదునూరి రామకృష్ణంరాజు, అన్నవరం, మేకల చంద్రరావు, అబ్బులు పెద్దలుగా వ్యవహరించడంతో రెండు వర్గాలు శాంతియుతంగా ఎటువంటి అరమరికలు లేకుండా జీవిస్తామంటూ చేతులు కలిపాయి. -
గరగపర్రులో మంత్రుల వరాల జల్లు
పాలకోడేరు : గరగపర్రు వచ్చిన వచ్చిన ముగ్గురు మంత్రులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు దళితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజుతో కలిసి సోమవారం గరగపర్రు వచ్చారు. గరగపర్రులోని 63 మంది బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని వారు ప్రకటించారు. దీనికి దళితులు నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నష్టపరిహారం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిసేపు తర్జన భర్జనల అనంతరం అన్ని బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తామని వారు ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటనే ఉంచుతామని, పాత పంచాయతీ కార్యాలయాన్ని అంబేడ్కర్ భవనంగా నిర్మిస్తామని ప్రకటించిన మంత్రి ఆనంద్‌బాబు కొద్దిసేపటికే స్వరం మార్చారు. పక్కకు వెళ్లి ఎమ్మెల్యేతో తర్జనభర్జనలు జరిపి మీరు కోరుకున్న మరో చోట అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని, మీరనుకున్నచోట వివాదాస్పద స్థలంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. దీన్ని దళితులంతా వ్యతిరేకించారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పినా దళితులు ఒప్పుకోలేదు. మంత్రులు పితాని, జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని 36 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయించామని మీకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరంతా కలసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఎస్పీ పూర్ణచంద్రరరావు, ఆచంట మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, సిరింగుల బాబి, సిరింగుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
భీమవరంలో ఉద్రిక్తత
►గరగపర్రు రోడ్డు ప్రమాద బాధితుడి మృతదేహానికి పోస్టుమార్టం ►ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చాలంటూ దళిత సంఘాల డిమాండ్ భీమవరం టౌన్: ఒక వైపు దళిత సంఘాల నేతలు.. మరోవైపు పోలీసుల మోహరింపుతో భీమవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గరగపర్రు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు శవపంచనామా రాసే విషయంలో దళిత సంఘాల నేతలు సూచనలు చేయడం, అందుకు పోలీస్ అధికారులు ఆలోచించడం ఇలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఎడతెగని చర్చలు సాగాయి. మరోవైపు యాకోబు మృతి రోడ్డు ప్రమాదంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 302ను ఎఫ్ఐఆర్లో అల్టర్ చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, అడిషనల్ ఎస్పీ వి.రత్న, డీఎస్పీలు జి.పూర్ణచంద్రరావు, సత్యానంద్‌తో వైఎస్సార్ సీపీ నాయకుడు, దళిత సంఘం నేత కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యదేవర వరప్రసాద్, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, సీపీఎం నాయకుడు జేఎన్వీ గోపాలన్ తదితరులు చర్చలు జరిపారు. అయితే బయట ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలు మాత్రం తక్షణం ఎఫ్ఐఆర్లో 302 సెక్షన్‌ను అలర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని గరగపర్రు పంపించేందుకు 108 అంబులెన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన అంబులెన్స్‌ను తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. అడిషనల్ ఎస్పీ రత్న ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశామని నచ్చచెప్పారు. మృతుని కుటుంబీకులు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంతేటి ఆదాము నుంచి కూడా వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు కోరికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని దర్యాప్తు అధికారి కేసు దర్యాప్తు చేస్తారన్నారు. దళితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య యాకోబు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఊరేగింపుగా పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు శవపేటికను ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచి గరగపర్రుకు ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యానంద్, సీఐలు, ఎస్సైలు, పోలీసులు స్పెషల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహించారు. బాధితులకు సర్రాజు పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చినకాపుల యాకోబు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పరామర్శించారు. చికిత్స పొందుతున్న కంతేటి ఆదామును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడికి వచ్చిన గరగపర్రు దళితులకు మనోధైర్యం కల్పిస్తూ ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, పోలీస్ అధికారులతో సర్రాజు మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కూడా ఆస్పత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. దళిత, మానవహక్కుల వేదిక నాయకుల రాక ఉభయ తెలుగు రాష్ట్రాల మానవహక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.సుధ, సభ్యులు భీమవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. గరగపర్రు ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమిళనాడుకు చెందిన విముక్తి చిరుతల అధ్యక్షుడు విద్యాసాగర్, మాలమహానాడు మహిళా విభాగం అధ్యక్షరాలు గొట్టిపాటి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో దళితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ గరగపర్రు రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు అధికారిగా భీమవరం వన్‌టౌన్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావును ఆదివారం మధ్యాహ్నం నుంచి నియమించారు. తొలుత పాలకొల్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్‌ను నియమించినా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న దృష్ట్యా ఆ స్థానంలో వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు నియమించారు. -
గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఛలో గరగపర్రుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలుచేశారు. గ్రామంలోకి వెళ్లే అన్ని మార్గాలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి,పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డు లేనివారిని గ్రామంలోకి అనుమతించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. ఇప్పుడిప్పుడే గరగపర్రులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, అనుమతి లేనిదే విద్యార్థులు రాకూడదన్నారు. మరోవైపు ఛలో గరగపర్రు కార్యాక్రమాన్ని ఏయూ విద్యార్థి జేఏసీ వాయిదా వేసింది. ఈ నెల 19న ఛలో గరగపర్రు చేపట్టనున్నట్లు ఏయూ విద్యార్థి జేఏసీ నేత ఆరేటి మహేష్ తెలిపారు. -
అది గతం చేసిన గాయమే!
కొత్త కోణం మిగిలిన దళితేతరులు కూడా దళితులకు వ్యతిరేకంగా నిలబడి స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో ఎక్కువ కులాలకు భూమి లేకపోయినప్పటికీ, పేదరికంలో మగ్గుతున్నప్పటికీ దళితులను సమర్థించలేకపోయారు. కారంచేడు, చుండూరులలో జరిగింది కూడా ఇదే. దాడులకు ఆధిపత్య కులాలు నాయకత్వం వహించినప్పటికీ అన్ని కులాలు అందులో పాల్గొన్నాయనేది వాస్తవం. ఇది కుల వ్యవస్థ ముఖ్య లక్షణం. ఇది అంతం కాదు కూడా. కారణం –అంటరానితనం హిందూ సమాజం విద్వేషంతో విధించిన అమానుషమైన శిక్ష. దేశం సగర్వంగా ప్రకటించుకునే భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాపాడాలని భావించి ఉండకపోతే, దేశ సమగ్రతే అన్నింటికంటే ముఖ్యమని తలచి ఉండకపోతే, సర్వమానవ సమానత్వమే ఈ దేశానికి రక్ష అని భావించి ఉండనట్టయితే, దేశ ప్రజలను కాపాడగలిగేది యుద్ధం కాదు శాంతి మాత్రమేనని నమ్మి ఉండకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించి ఉండేవారు కాదు. ఇస్లాంలోనికో, క్రైస్తవ మతంలోనికో మారమని ఆయా మతాల పెద్దలు ఆహ్వానించారు. పదవులను కట్టబెడతామని ప్రతిపాదిం చారు. ఆయన తిరస్కరించారు. ఈ దేశానికున్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాపాడుతూనే, 2,600 ఏళ్లనాడే సమానత్వ నినాదాన్నిచ్చిన బౌద్ధ తత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు. ఈ దేశంలోని దళితులను కాపాడగలిగే బౌద్ధాన్ని ఒక మతంగా కాక, సమానత్వ భావనగా స్వీకరించారు. అందుకే ‘పుట్టుక నాకు సంబంధం లేనిది, హిందువుగా పుట్టినా హిందువుగా మరణించనని’ చెప్పారు. బుద్ధుడి మార్గాన్ని అనుసరించమని ఈ దేశంలో అస్పృశ్యులుగా, తరాలుగా వెలివేతకు గురై, దారిద్య్రంలో కూరుకుపోయిన దళితజనావళికి ప్రబోధించారు. ఈ దృష్టితో అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఆయన కేవలం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం, కొన్ని సంస్కరణల కోసం మాత్రమే కృషి చేశాడనే సంకుచితత్వం నుంచి బయటపడతాం. మనం గౌరవించే జాతీయనాయకులందరికన్నా కూడా దేశం కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి మహనీయుడి విగ్రహ ప్రతిష్టను అడ్డుకొని, దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం కుల దురహంకారానికి పరాకాష్ట. అడుగంటిన ప్రజాస్వామ్య భావజాలానికి నిదర్శనం. విగ్రహానికీ అంటరానితనమేనా! అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటున్న మన దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఒక ఊరు ఊరునే వెలివేసి, వెలివాడను చేసిన దారుణం నెల తరువాతగాని వెలుగులోనికి రాలేదు. నెలరోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ అకృత్యాన్ని పెద్దగా పట్టించుకున్నదీలేదు. నిజానికి మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ వెలివేతలు కొత్తకాదు. అది మాట్లాడుకునే ముందు అక్కడసలేం జరిగిందో పరిశీలిద్దాం! పాలకోడేరు మండలం గరగపర్రులో మాలపేటకు చెందినవాడు ఎరిచెర్ల రాజేశ్ (31). ఈ దళిత యువకుడు ఆ ఊరు భూస్వామి ముదునూరి నాగరాజు దగ్గర రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రి పెంటయ్య, సుబ్బన్న ఇదే భూమిలో కౌలు చేశారు. రెండు పంటలకు దాదాపు 90 బస్తాల వరి పండితే, 30 బస్తాలు భూస్వామికి ఇవ్వాలి. రెండు పంటలకు దాదాపు రూ. 45,000 ఖర్చు అవుతున్నట్టు రాజేశ్ చెప్పారు. అన్ని ఖర్చులు పోను నికరంగా రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు మిగులుతున్నట్టు తెలుస్తున్నది. ఏప్రిల్‌లో గ్రామంలో జరిగిన సంఘటనల వల్ల రాజేశ్ జీవనాధారమైన కౌలుభూమిని భూస్వామి లాక్కున్నారు. ఇద్దరు పిల్లలు, భార్యను పోషించుకోవడం అతడికి కష్టంగా మారింది. భవిష్యత్తు అంధకారంగా, అగమ్యగోచరంగా తయారయింది. దీనికి మూలం గరగపర్రు మాల, మాదిగ పేటల్లోని దళితులు తమ చైతన్యానికి ప్రతీక, తమ ప్రియతమ నాయకుడు అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకోవడమే. దీనిని ఆధిపత్య కులాలు అడ్డుకున్నాయి. ఈ వివాదమే రాజేశ్ వంటి 1,400 మంది దళితులను ఈరోజు ఆకలితో మలమల మాడేటట్టు చేసింది. అంబేడ్కర్ విగ్రహాన్ని తమ వాడలో కాక, గ్రామ చెరువు దగ్గర ప్రతిష్టిస్తే బాగుంటుందని దళితులు భావించారు. ఆ చెరువు ఒడ్డున గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్ ఆర్థర్ కాటన్, తాండ్ర పాపారాయుడు విగ్రహాలు ఉన్నాయి. అందువల్లనే దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించ దలిచారు. ఏప్రిల్ 23వ తేదీన ఆవిష్కరించుకున్నారు కూడా. కానీ ఒక్కరోజు కూడా గడవకుండానే విగ్రహాన్ని ఆధిపత్యకులాలు తీసేసి, దాచిపెట్టాయి. దళితులు ఆందోళన చేయడంతో విగ్రహాన్ని బయటకు తీసి కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పెట్టారు. ఎందుకంటే, చెరువు దగ్గర ప్రతిష్టించకుండా ఉండేందుకు ఆధిపత్య కులాలు కోర్టు నుంచి స్టే తెచ్చాయనీ, దానివల్ల పంచాయతీ ఆవరణలో పెడుతున్నామనీ కలెక్టర్ చెప్పారు. అయితే దళితులు తమ నిరసనను విరమించుకోలేదు. విగ్రహాన్ని దొంగిలించిన వారిని శిక్షించాలని కోరారు. దీనితో మే 5వ తేదీ నుంచి దళితులను అన్ని కార్యక్రమాల నుంచి ఆధిపత్య కులాలు వెలివేశాయి. కౌలు భూములు లాక్కున్నారు దళితులకు కౌలుకు ఇచ్చిన భూములను భూస్వాములు వెనక్కి తీసుకున్నారు. గ్రామంలోని 3,000 ఎకరాల వ్యవసాయ భూములలో 2400 ఎకరాలు క్షత్రియులవే. వ్యవసాయ పనులకు, ఇతర పనులకు పిలవడం ఆపేశారు. నిత్యావసర వస్తువులను అమ్మడం మానేశారు. చివరకు దళితవాడలో వైద్యం చేసే డాక్టర్‌ను బెదిరించి ఆ సేవలు కూడా నిలిపివేశారు. డెబ్భై యేళ్ల స్వతంత్ర భారతంలో కూడా గరగపర్రు దళితులు అగ్రకులాల ఆధిపత్యం కింద నలిగిపోయారు. దేశం నలుమూలలా నిశ్శబ్దంగా సాగుతున్న వివక్షలో వారూ భాగస్వాములయ్యారు. గ్రామంలో దాదాపు 60 దళిత కుటుంబాలకు కౌలు భూమే ఆధారం. వీరందరి భూములను భూస్వాములు లాగేసుకున్నారు. గ్రామంలోని 400 దళిత కుటుంబాలలో 20 మందికి మాత్రమే భూములున్నాయి. మిగిలిన 380 కుటుంబాల వారు వ్యవసాయ కూలీలు. పనులు లేక, దళిత పేటల నుంచి వందమంది మహిళలు 20 మందికిపైగా పురుషులు గల్ఫ్ దేశాలకు వలసలెళ్లారు. ప్రభుత్వోద్యోగాలు చేసేవారు నలుగురికి మించిలేరు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. దళితుల పేదరికాన్ని ఆసరా చేసుకొనే ఆధిపత్య కులాలు పెట్రేగిపోతున్నాయి. గ్రామంలో బతకాలంటే చెప్పుల మాదిరిగా పడి ఉండాల్సిందేనన్న అహంతో బహిష్కరణకు తెగబడ్డారు. మిగిలిన దళితేతరులు కూడా దళితులకు వ్యతిరేకంగా నిలబడి స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో ఎక్కువ కులాలకు భూమి లేకపోయినప్పటికీ, పేదరికంలో మగ్గుతున్నప్పటికీ దళితులను సమర్థించలేకపోయారు. కారంచేడు, చుండూరులలో జరిగింది కూడా ఇదే. దాడులకు ఆధిపత్య కులాలు నాయకత్వం వహించినప్పటికీ అన్ని కులాలు అందులో పాల్గొన్నాయనేది వాస్తవం. ఇది కుల వ్యవస్థ ముఖ్య లక్షణం. ఇది అంతం కూడా కాదు. కారణం– అంటరానితనం హిందూ సమాజం విద్వేషంతో విధించిన అమానుషమైన శిక్ష. అందువల్లనే అన్ని కులాలు అంటరాని కులాల పట్ల వివక్షతో మాత్రమే కాక, వ్యతిరేకతతో, విద్వేషంతో రగిలిపోతుంటాయి. కుల వివక్షను ఎదుర్కొంటున్న వెనుకబడిన కులాలు కూడా దళితుల విషయానికొచ్చేసరికి కులాధిపత్యాన్నీ, విద్వేష భావాన్నీ మాత్రమే అనుసరిస్తున్నాయి. ఈ దేశంలో కుల సమాజం కొనసాగడానికీ, దానికి మూలమైన హిందూమతం మనగలగడానికీ వెనుకబడిన కులాల మద్దతే ప్రధానమని బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్ అంబేడ్కర్ తన విశ్లేషణలో సోదాహరణంగా వివరించారు. ఆ ఇనుప కంచె అభేద్యం భారత సమాజం వర్ణ వ్యవస్థతో ప్రారంభమై, తరువాత కుల వ్యవస్థగా మారింది. అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం భారత సమాజం వర్ణ, అవర్ణ సమాజాలుగా విడిపోయి ఉంది. వర్ణ సమాజంలో ద్విజులు, శూద్రులు అనే తేడా కూడా ఉంది. నిజానికి ద్విజులలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. వారి మధ్య యుద్ధాలు జరిగినట్టు చరిత్ర చెబుతున్నా, ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఆ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. ఆ తరువాత ద్విజులు, శూద్రుల మధ్య కూడా తేడాను చూడవచ్చు. అయితే వీరు ఎప్పుడైనా వర్ణ సమాజంలో భాగంగానే వ్యవహరించారు. భారతంలో సూతపుత్రుడు కర్ణుడిని రాజుని చేసి తమలో ఒకడిగా చేసుకోవడం ఇందులో భాగమే. అవర్ణ సమాజాన్ని కూడా అంబేడ్కర్ మూడు భాగాలు చేశారు. వారు– మైదాన ప్రాంత ఆదివాసులు, అడవిలోని ఆదిమజాతులు, అంటరానికులాలు. ఆదిమజాతులు కూడా అంటరాని కులాలను దూరంగానే ఉంచాయి. అస్పృశ్యులుగానే చూశాయి. ఇప్పటికీ దళితులను ఆదివాసీలు సైతం అంట రానివారుగా చూడడం మనకు తెలుసు. మరోవైపు హిందూమతం ఆదిమజాతులను, ఆదివాసీలను తమలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఫలి తాన్ని కూడా పొందింది. దేవాలయాలలోనికి, హిందువుల ఇళ్లలోనికి వారు నేరుగా ప్రవేశించవచ్చు. ఎటువంటి అడ్డంకులూ ఉండవు. కానీ అంటరాని కులాలకు అటువంటి అవకాశం లేదు. అందుకే అంబేడ్కర్ మొత్తం హిందూ సమాజాన్ని ఒకవైపు, అంటరాని కులాలను రెండోవైపు నిలబెట్టారు. వీటి మధ్య అభేద్యమైన ఇనుపకంచె ఉందని చెప్పారు. హిందూ సమాజానికి అంటరాని కులాలపట్ల ఇటువంటి విద్వేషం ఉండడానికి గల కారణాన్ని కూడా అంబేడ్కర్ తన ‘అస్పృశ్యులెవ్వరు?’ పరిశోధనా గ్రంథంలో చెప్పారు. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలూ, హిందూ ధర్మక ర్తలూ చెప్పినట్టు అపరిశుభ్రత, గోమాంస భక్షణ అంటరానితనానికి కారణం కావని అంబేడ్కర్ వివరించారు. భారతదేశంలో సామాజిక విప్లవ కెరటంగా ఆవిర్భవించిన బౌద్ధాన్ని అనుసరిస్తూ, హిందూ దాడులను తట్టుకొని తమ ఉనికిని చాటుకుంటున్న నిజమైన బౌద్ధులను అంటరాని ముద్రతో సమాజం వెలివేసినట్టు అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో బౌద్ధులపై కొన్ని వందల దాడులు జరిగాయి. వేలాది మంది హతులయ్యారు. అయినా తాము బౌద్ధ ధర్మాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసిన వారిని ఈ సమాజం విద్వేషంతో వెలివేసింది. ఆనాడు నాటిన విషబీజం 2,500 ఏళ్ల తరువాత కూడా దళితసమాజాన్ని వెంటాడుతూనే ఉంది. అందుకే గరగపర్రు దళితుల వెలివేత ఇప్పటికిప్పుడు జరిగిన ఘటన కాదు. తరాల నుంచి మండుతున్న కులాధిపత్య విద్వేషాగ్ని మాత్రమే. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం
-
సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం
గరగపర్రు, చాపరాయి ఘటనలపై సాక్షి, అమరావతి : గరగపర్రు, చాపరాయి గ్రామాల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చాపరాయిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనులు మృత్యువాతపడ్డారని, కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది కాదన్నారు. తాను జోక్యం చేసుకున్న తర్వాత గానీ రెండు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, ఇందుకు అందరూ పనిచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నానిలు చేసిన కామెంట్లను పరోక్షంగా ప్రస్తావించారు. నేతలందరూ ఇష్టానుసారం చేసిన కామెంట్ల జాబితాను బయటకు తీయిస్తానని చెప్పి ఇకపై ఇలాంటి కామెంట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
సంఘ బహిష్కరణకు శిక్షేది?
ఆలోచనం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్.ఆర్. శంకరన్ ఎవరికయినా తలవంచారా? గరగపర్రు గ్రామంలో చెరువొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం నిలబెట్టడం కోసం దళితులు సంఘ బహిష్కరణకు గురికావడం నాకు అనేక జ్ఞాపకాలను తెచ్చింది. అందులో మొదటిది 1927వ సంవత్సరంలో అంబేడ్కర్ మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం ఉద్యమించడం. దానిని వ్యతిరేకించిన సవర్ణులు ‘ఆవు పేడ’తో ఆ చెరువును శుద్ధి చేసుకోవడం. ఇది జరిగి ఇప్పటికి 90 ఏళ్లు. ‘నేను భంగీని’ రచయిత భగవాన్ దాస్ 1957లో, ‘హిందూ మతం మనిషి గుణాన్ని, యోగ్యతల్ని పట్టించుకోకుండా మనిషి పుట్టుకకు ప్రాధాన్యతనిస్తోంది. సమానత్వం, ఐక్యతలను వ్యతిరేకిస్తుంది’ అని రాసి ఇప్పటికి 60 ఏళ్లు. విజయనగరం జిల్లా ‘వసి’ గ్రామంలో దళితులను ఇలాగే ఊరి నుంచి వెలివేసినపుడు, 1999లో బాలగోపాల్ ప్రభుత్వ పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ‘సంఘ బహిష్కరణకు శిక్ష మాటేమి టి’? అనే వ్యాసం రాశారు. ఇది జరిగి నేటికి 18 ఏళ్లు. మనిషి మరో మనిషిపై పుట్టుకతోనే ఆధిపత్య సౌకర్యాన్ని పొందడానికి విశ్వవ్యాప్తంగా మతం కృషి చేయడం, ప్రయాణ సాధనాలు సరిగా లేని ఆ కాలం లోనే ప్రపంచమంతా కూడబలుక్కున్నట్లు ఈ అంతరాల మానవ సమాజాన్ని నిర్మించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని వదిలేసి, సామాజిక మాధ్యమాల్లో కొంత మంది, దళిత రాజకీయ నేతల చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, రాంసే మెక్డొనాల్డ్లు ప్రతిపాదించిన దళిత ప్రత్యేక నియోజక వర్గాల ఆలోచనను వ్యతిరేకించిన గాంధీ ‘ఇలా చేస్తే హిందూ సమాజం ముక్కచెక్కలై పోగలదని’, తిండీ నీళ్లు మానేసి ‘పూనా ఒప్పందం’ చేసుకున్నాడు. అలా దళిత నేతల రాజకీయ ప్రాణాలని, వారి నియోజకవర్గాలలోని సవర్ణ ఓటర్ల చేతిలో పెట్టాడు. సమాజాభివృద్ధికంటే కులమూ, మతమూ ప్రధానాంశాలుగా భావిస్తూ ఓట్లేసే ప్రజలున్న చోట, అసలు రాజకీయమే ఒక జూదం. ఈ జూదంలో, మనుగడకోసం ప్రతి రాజకీయ నేత ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే, కానీ గరగపర్రులో అధికారుల తీరు మాటేమిటీ? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 (యూ), 3 (జెడ్íసీ)ల ప్రకారం సంఘ బహిష్కరణ చేసిన వారికి 6 నెలల నుంచి ఐదేళ్లదాకా శిక్ష విధిం చొచ్చు. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో సీఎం నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేయాలి. ప్రతినెలా జిల్లా కమిటీ రిపోర్ట్ రాష్ట్రానికి పంపాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకి ఒకసారి కచ్చితంగా జరగాలి. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌ని ఈ చట్టం అమలుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి. వీటన్నిటినీ పాటిస్తూ గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? హేమాహేమీలయిన రాజకీయ నాయకులు అడ్డు నిల్చినా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్, ఎస్.ఆర్. శంకరన్, ఎవరికయినా తలవంచారా? మరి గరగపర్రు విషయంలో ఆ జిల్లా కలెక్టర్ ఎందుకలా స్పందించలేకపోయారు? రెండ్రోజుల క్రితం ‘ది టెలిగ్రాఫ్’లో ఒక వార్త. బ్రిటన్‌లో పుట్టిపెరిగిన సందీప్, రీనా అనే హిందూ జంట సంతానలేమితో అక్కడే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనుకున్నారట. దత్తతనిచ్చే స్థానిక సెంటర్‌ని సంప్రదిస్తే, వారు వర్ణవివక్షను మొహమాటం లేకుండా ప్రదర్శిస్తూ, తమ దగ్గర అందరూ తెల్ల పిల్లలే వున్నారని, ఇండియన్స్ తెల్లబిడ్డని దత్తత తీసుకోవడానికి అనర్హులు అని, దరఖాస్తు చేసుకోవడం కూడా అనవసరం అన్నారట. గరగపర్రు దళితులను బహిష్కరించిన సందర్భంలో వచ్చిన ఈ వార్త నాకో ఆలోచన కలిగించింది. ఒక వేళ ప్రపంచమంతా ఒక్కటైపోతే, ఇప్పుడు గరగపర్రు దళి తులపై అత్యాచారం చేసిన బలరామకృష్ణమరాజు, రామరాజు, విషయం తెలిసినా ఊరకున్న సీఎం చంద్రబాబుల పెద్ద కులాల మాటేమిటి? ‘వి హావ్ ఆల్వేస్ ఫెల్ట్ బ్రిటిష్’ అని తెల్లబిడ్డ దత్తత కోరుకున్న ఆ దంపతుల్లాగే మన సవర్ణులూ, మాది చాలా గొప్పకులం అన్నా, అప్పుడు గాంధీకి దక్షిణాఫ్రికాలో జరిగిన అవమానమే వీళ్లకీ జరుగుతుంది కదా. ఎంత కాదన్నా రూపంలో, సంపత్తిలో చాలా దేశాల ప్రజలు మనకంటే చాలా సవర్ణులు కదా మరి. ఆ మధ్య సీఎం తాను, వెంకయ్య ఇద్దరం అమెరికాలో పుట్టివుంటే బాగుండేదని అన్నారు. ఆ అమెరికా స్వాతంత్య్ర దినం ఈ రోజు. వారి యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రెండో పేరా ‘మనుషులం దరూ సమానులుగానే పుట్టారు అనడానికి ఈ వాస్తవాలను ససాక్ష్యంగా ఎత్తిపెట్టాం’ అని మొదలవుతుంది, ఆ స్ఫూర్తితో ‘‘బానిసత్వానికి అనుకూలంగా ఎవరైనా వాదిస్తుండటాన్ని నేను విన్నవ్పుడల్లా, అలా వాదించేవారిపై వ్యక్తిగతంగా ఆ బానిసత్వాన్ని అమలు చేసి చూడాలనే బలమైన భావన నాకు కలుగుతుంది’’ అని ప్రకటించి, బానిసత్వ నిర్మూలన వ్యతిరేకులకు ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు అబ్రహాం లింకన్. సీఎం చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుని, దళితుల సంఘ బహిష్కరణ పట్ల నిజాయితీగా స్పందిస్తే, అప్పుడు ఆయన అమెరికాలో పుట్టాల్సినవాడినంటే మనం కాదంటామా, కావాలంటే అబ్రహాం లింకన్ అంతటివాడివని కూడా అంటాం. - సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
గరగపర్రు ఘటన దురదృష్టకరం: ఆళ్ల నాని
కామవరపుకోట: పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రు ఘటన దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. మాజీ సర్పంచ్ కె.వెంకటరెడ్డి మృతిచెందడంతో ఆయన కుటుంబీకులను పరామర్శించేందుకు మండలంలోని ఆదివారం జలపవారిగూడెం వచ్చిన నాని విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గరగపర్రులో పర్యటించి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషిచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు. పార్టీ నాయకులతో జగన్ ఒక కమిటీ ఏర్పాటు చేశారని, తమ పార్టీ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలో సామరస్యపూర్వక, శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈనెల 8, 9 తేదీల్లో జరిగే వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి జిల్లా నుంచి లక్షలాదిమంది కార్యకర్తలు తరలి వెళతారన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, తదితరులు ఉన్నారు. -
హృదయాలను గెలిచిన జననేత
-
హృదయాలను గెలిచిన జననేత
- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి - గరగపర్రు పర్యటనలో జగన్ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు - ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు - సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం - ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు. జగన్ హిత వచనాలపై హర్షం ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. ఇరు వర్గాలతో మమేకం గరగపర్రు దళితవాడలో జగన్ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అడుగడుగునా బ్రహ్మరథం గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రులో మీడియాతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది. ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. -
అరెస్ట్.. అలర్ట్..!
►జగన్ పర్యటనతో సర్కారులో వణుకు ►గరగపర్రు ఘటనలో నిందితుల అరెస్ట్ ►హడావుడిగా కదిలిన యంత్రాంగం ఆపదలో ఉన్న భక్తుల కోసం పూరీ జగన్నాథుడు కదిలినట్టుగా.. ఆపన్నుల కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరలి రానుండడంతో అధికార యంత్రాంగం కదిలింది. వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలు అన్న నినాదం సమరశంఖమై సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న చందంగా.. గరగపర్రు విద్వేషాలతో రగులుతుంటే.. రెండునెలల నుంచీ మొద్దు నిద్రపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా చర్యలకు ఉపక్రమించింది. దళితులు, దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా.. నిందితుల అరెస్ట్‌కు తాత్సారం చేసిన సర్కారు ఎట్టకేలకు అధికారులను పరుగులు పెట్టించి నిందితులను అరెస్ట్ చూపించింది. – సాక్షి ప్రతినిధి, ఏలూరు గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై రెండు నెలలుగా మీనమేషాలు లెక్కించిన అధికార యంత్రాంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పర్యటనతో చలనం వచ్చింది. ఇప్పటివరకూ విచారణ జరుపుతున్నామని, అరెస్ట్‌కు సమయం పడుతుందని చెబుతూ వచ్చిన పోలీసు అధికారులు గురువారం ఉదయం హడావుడిగా భీమవరంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ వివాదంలో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో ఈనెల 24న పాలకోడేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, 60 మంది సాక్షులను విచారించి నిందితులు ఇందుకూరి బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ ప్రకటించారు. తొలి నుంచీ తాత్సారమే..! గరగపర్రు విషయంలో అధికారులు, సర్కారు తొలి నుంచీ తాత్సార ధోరణే అవలంబించాయి. ఏప్రిల్ 23న గరగపర్రు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మంచినీటి చెరువు గట్టుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించారు. దీంతో వివాదం మొదలైంది. ఈ సమాచారం పంచాయతీకి అందడంతో గ్రామ కార్యదర్శి అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని పాత పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఆ మరుసటి రోజు దీనిని నిరసిస్తూ.. ఎస్సీ సామాజిక వర్గం వారు ధర్నా, వంటావార్పు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, భీమవరం రూరల్ సీఐ, ట్రైనీ అడిషనల్ ఎస్పీ గ్రామానికి చేరుకుని దళితులకు నచ్చ చెప్పి తిరిగి విగ్రహాన్ని పంచాయతీ కార్యాలయం ముందు పెట్టించారు. ఈ వివాదంతో గ్రామస్తుల మధ్య విబేధాలు పెరిగాయి. ఇవి విద్వేషాల స్థాయికి చేరాయి. ఫలితంగా మిగిలిన సామాజికవర్గాల వారంతా కలిసి దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. దీనిపై దళితులు ఎంతగా మొరపెట్టుకున్నా.. దళిత సంఘాలు ఆందోళన చేసినా అధికార యంత్రాంగంలో కదలిక లేకపోయింది. దీంతో రోజురోజుకూ ఆందోళన తీవ్రమై గత శనివారం పతాక స్థాయికి చేరింది. ఫలితంగా హడావుడిగా దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ సీపీ బృందం రాక దీనిపై ప్రసారమాధ్యమాల్లో కథనాలు రావడంతో జాతీయ ఎస్సీ, కమిషన్ సభ్యుడు కె.రాములు గ్రామానికి వచ్చి అధికారుల తీరును తప్పుబట్టారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ సీపీ బృందం గ్రామాన్ని సందర్శించి బాధితుల్లో ధైర్యం నింపింది. స్థానిక పరిస్థితులను పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అదేరోజు ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, మంత్రులు గ్రామాన్ని సందర్శించి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించినా.. అధికారులు ముందుకు వెళ్లలేదు. జగన్ పర్యటన ప్రకటనతో హడల్ ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహనరెడ్డి శుక్రవారం గరగపర్రు రానున్నట్టు ప్రకటించడంతో సర్కారు గుండెల్లో వణుకు మొదలైంది. ప్రజాప్రతినిధులు గ్రామానికి వరుస కట్టడం ప్రారంభించారు. అధికారులూ ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను పర్యవేక్షించారు. జగన్ పర్యటనకు ముందు రోజు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు పీవీరావు మాలమహానాడు నేత గుమ్మాపు సూర్యవరప్రసాద్, కేవీపీఎస్ నేతలు రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు సిరింగుల స్వరూపారాణి, ఎరిచర్ల రాజేష్ తదితరులు గురువారం ఉదయం నుంచి నిరశనæ దీక్షకు దిగారు. జగన్ పర్యటన, దళిత నేతల దీక్షల వల్లే హడావుడిగా నిందితులను అరెస్ట్ చూపించారనే వాదన వినిపిస్తోంది. నిందితులంతా అధికారపార్టీవారే.. నిందితులంతా అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతోనే అరెస్ట్‌కు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని భీమవరం సబ్ జైలుకు తరలించారు. అరెస్ట్‌లను నిరసిస్తూ.. ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ గ్రామంలోని దళితేతరులూ ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గరగపర్రు దళితులను పరామర్శించారు. జగన్ పర్యటనకు ఏర్పాట్లు గరగపర్రు బాధిత దళితులకు సంఘీభావం ప్రకటించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి శుక్రవారం రానున్నారు. దీనికోసం పార్టీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ కొయ్యే మోషేన్‌రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్ జగన్
ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన -
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
-
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు. ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు. -
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
-
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి గూడెం, పిప్పర మీదగా 11 గంటలకు గరగపర్రు చేరుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్యే కొడాలి నాని, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ నేతలు వంగవీటి రాధ, మేరుగ నాగార్జున, ప్రసాద్‌రాజు, గ్రంధి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, ఖాజా రాజ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
గరగపర్రు ఘటనలో ముగ్గురి అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు కారణమైన బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంబేడ్కర్ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూముల్ని దళితుల వద్ద నుంచి వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం మానేసిన విషయం తెలిసిందే. కాగా దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగప ర్రులో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 30, జులై 1వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇవాళ గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమని, వారికి న్యాయం జరిగేవరకు వారి వెన్నంటే ఉంటామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల భూమి కేటాయించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. -
రేపు గరగపర్రుకు జగన్
ఏలూరు : గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించేందుకు విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 30న జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా గరగపర్రు చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడ దళితులతో మాట్లాడిన తర్వాత నేరుగా తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని వివరించారు -
గరగపర్రు ఘటనలో తహసీల్దార్, ఎస్సై సస్పెన్షన్
జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన కారెం శివాజీ సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు (మెట్రో): గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై సకాలంలో స్పందించని పాలకోడేరు మండల తహసీల్దార్ జి.రత్నమణి, ఎస్సై వి.రాంబాబును సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ చెక్ పవర్ రద్దు చేయాలన్నారు. మంగళవారం కారెం శివాజీ, మంత్రులు నక్కా ఆనందబాబు, కేఎస్ జవహర్ గరగపర్రులో గ్రామ సభ నిర్వహించారు. కాగా, గరగపర్రు ఘటన సున్నితమైందని, నిజనిర్దారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చెప్పారు. -
30న గరగపర్రుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన గంగపర్రు గ్రామంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. జూన్30న వైఎస్ జగన్.. పాలకోడేరు మండలం గంగపర్రుకు రానున్నట్లు మంగళవారం వైఎస్సార్సీపీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంలు ఈ మేరకు ప్రకటనలు చేశారు. 30న(శుక్రవారం) గరగపర్రులో బాధితులను జగన్ పరామర్శిస్తారని, మరుసటిరోజు జులై1(శనివారం) తూర్పుగోదావరి జిల్లాలోని చాపరాయికి వెళ్ళి విషజ్వరాల బారినపడినవారిని పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
గరగపర్రులో వైఎస్ఆర్సీపీ బృందం పర్యటన
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మేరుగ నాగార్జున తదితరులు దళితవాడలో బాధితులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ గరగపర్రు ఘటనపై బాధితులు మాట్లాడుతూ...‘ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్లో పెట్టాం. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదం ఉన్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అన్ని విగ్రహాలను తొలగించే సమయంలో మేం కూడా అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. గ్రామంలోని అన్ని కులాలు శివాలయంలో సమావేశం అయ్యారు. మే 5వ తేదీ లోపు విగ్రహం తొలగించాలని డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు, కూరగాయలు, మందులు కూడా అందకుండా చేశారు.’ అని తమ ఆవేదన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో సామాజిక బహిష్కరణ కేసు విచారణ రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు గరగపర్రు సందర్శించి సంఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పూర్వాపరాలను విచారించారని చెప్పారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. -
గరగపర్రు వివాదంపై వైఎస్ఆర్ సీపీ కమిటీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు వివాదంపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు మంగళవారం గరగపర్రులో పర్యటించి, వాస్తవాలను తెలుసుకోనున్నారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు .....కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పలువురు దళిత సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఒకరిని రాజమండ్రిలో విడిచిపెట్టగా...మిగిలిన నాయకులను పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిపై పోలీసులు మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. -
‘ న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం’
పాలకోడేరు: పశ్చిమగోదావరి జల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులకి న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర పాలక మండలి సభ్యులు కొయ్యే మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజులు అండగా ఉంటామన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదంలో రెండు నెలలుగా దళితులపై జరుగుతున్న పలు సంఘటనలను వారు ఖండించారు. గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణను వారు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా దళితపేటను సందర్శించి సాంఘిక బహిష్కరణపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజుల నుంచి వివిధ దళిత సంఘాలు గ్రామానికి రావడంతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. గ్రామంలో దళితులందరు ఏకమై సాంఘిక బహిష్కరణకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ధర్నా చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు సాంఘిక బహిష్కరణకు కారణమైన గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ ఇందుకురి బలరాంరాజును వెంటనే అరెస్టు చేసి గరగపర్రు దళితులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయతలపెట్టిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మరో వర్గం వారు రాత్రికిరాత్రి తరలించడంతో దళి తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా మారి ధర్నా, రాస్తారోకోకు దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని బస్టాండ్ సెంటర్లో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం రాత్రి విగ్రహాన్ని తెచ్చి ఆ ప్రాంతంలో ఉంచారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన కొందరు పంచాయతీ కార్యదర్శి సహకారంతో విగ్రహాన్ని తరలించి పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలిసిన దళితులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ ఇంటికి వెళ్లి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ ఎస్సీ అయినా ఆందోళనకారులకు భయపడి ఇంట్లోంచి రాలే దు. అక్కడి నుంచి దళితులు గ్రామంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ భీమవరం–తాడేపలి్లగూడెం రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో సాగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, దళిత ఐక్యవేదిక, వైఎ స్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సుందర్‌కుమార్, జిల్లా మాలమహానాడు నాయకులు గుమ్మాపు వరప్రసాద్, మాలమహానాడు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మంతెన యోగీం ద్ర కుమార్ తదితరులు ఇక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ దశలో కొందరు ఆందోళనకారులు వాటర్ ట్యాం క్ ఎక్కి నిరసన తెలిపారు. నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆందో ళనకారులతో చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం అభ్యంతరకరమైందని, వేరేచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దళితులు ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించాలని, విగ్రహం తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పెట్టాలని, లేకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటుకు సబ్‌కలెక్టర్ స్థలం ప్రతిపాదించడంతో ఆందోళన ముగిసింది. ఉండి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి బుట్టాయగూడెం: అంబేడ్కర్‌పై ప్రేమను తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం తొలగించడంపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమాధానం చెప్పాలని నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. -
బైక్ చెట్టును ఢీకొని యువకుడి మృతి
పాలకోడేరు : బైక్ చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం సాగుపాడు గ్రామానికి చెందిన గోపే హేమంతకుమార్(25) తన అన్న చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై భీమవరం రైల్వేస్టేషన్‌కు బయలుదేరాడు. పాలకోడేరు మండలం గరగపర్రు సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి మంచువల్ల దారి కనపడకపోవడంతో బైక్ చెట్టును ఢీకొట్టింది. దీంతో హేమంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. హేమంత్‌కుమార్ భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శశికుమార్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి
పాలకోడేరు రూరల్ : మండలంలోని గరగపర్రు గ్రామంలో పోలిశెట్టి నాగేశ్వరరావు (55) అనే లారీ డ్రైవర్ గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఏఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. గరగపర్రులో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగేశ్వరరావు గురువారం రాత్రి నీరసంగా ఉన్నారని, అతని మొదటి భార్య కుమారుడు రాంబాబు తన చెల్లి పద్మకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె అత్తవారింటి నుంచి వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు మృతిచెందారు. మృతిపై కుమార్తె పద్మ అనుమానం వ్యక్తం చేయడంతో అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వీఆర్వో సుబ్రహ్మణ్యం శవ పంచనామ నిర్వహించగా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఏఎస్సై రమేష్‌బాబు తెలిపారు.