
30న గరగపర్రుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన గంగపర్రు గ్రామంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. జూన్30న వైఎస్ జగన్.. పాలకోడేరు మండలం గంగపర్రుకు రానున్నట్లు మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంలు ఈ మేరకు ప్రకటనలు చేశారు.
30న(శుక్రవారం) గరగపర్రులో బాధితులను జగన్ పరామర్శిస్తారని, మరుసటిరోజు జులై1(శనివారం) తూర్పుగోదావరి జిల్లాలోని చాపరాయికి వెళ్ళి విషజ్వరాల బారినపడినవారిని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.