అనుమానాస్పద స్థితిలో డ్రైవర్‌ మృతి | DRIVER SUSPICIOUS DEATH | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో డ్రైవర్‌ మృతి

Published Sat, Aug 20 2016 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

DRIVER SUSPICIOUS DEATH

పాలకోడేరు రూరల్‌ : మండలంలోని గరగపర్రు గ్రామంలో పోలిశెట్టి నాగేశ్వరరావు (55) అనే లారీ డ్రైవర్‌ గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఏఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. గరగపర్రులో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగేశ్వరరావు గురువారం రాత్రి నీరసంగా ఉన్నారని, అతని మొదటి భార్య కుమారుడు రాంబాబు తన చెల్లి పద్మకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె అత్తవారింటి నుంచి వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు మృతిచెందారు. మృతిపై కుమార్తె పద్మ అనుమానం వ్యక్తం చేయడంతో అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వీఆర్వో సుబ్రహ్మణ్యం శవ పంచనామ నిర్వహించగా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఏఎస్సై రమేష్‌బాబు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement