
రేపు గరగపర్రుకు జగన్
ఏలూరు : గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించేందుకు విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు.
జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా గరగపర్రు చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడ దళితులతో మాట్లాడిన తర్వాత నేరుగా తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని వివరించారు