వైఎస్ జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి గూడెం, పిప్పర మీదగా 11 గంటలకు గరగపర్రు చేరుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్యే కొడాలి నాని, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ నేతలు వంగవీటి రాధ, మేరుగ నాగార్జున, ప్రసాద్‌రాజు, గ్రంధి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, ఖాజా రాజ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.