బైక్ చెట్టును ఢీకొని యువకుడి మృతి
పాలకోడేరు : బైక్ చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం సాగుపాడు గ్రామానికి చెందిన గోపే హేమంతకుమార్(25) తన అన్న చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై భీమవరం రైల్వేస్టేషన్‌కు బయలుదేరాడు. పాలకోడేరు మండలం గరగపర్రు సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి మంచువల్ల దారి కనపడకపోవడంతో బైక్ చెట్టును ఢీకొట్టింది. దీంతో హేమంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. హేమంత్‌కుమార్ భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శశికుమార్ తెలిపారు.