
సాక్షి, రంగారెడ్డి : మూఢ విశ్వాసంతో ఆ కాలనీవాసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమావాస్యరోజు చనిపోయిందంటూ ఓ బాలింత మృత దేహాన్ని ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలి బంధువులు గ్రామ శివారులో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిచించారు. అబ్దుల్లాపుర్‌మెట్ మండలంలోని తుర్కయాంజల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వైఎస్సాఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మాలతి అనే మహిళ ఈ మధ్యే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఆరోగ్యం క్షీణించటంతో ఆమె చనిపోయింది. అయితే ఆమె అమావాస్య రోజున చనిపోయిందని.. ఊరికి అరిష్టమంటూ మృతదేహాన్ని కాలనీ వాసులు వెలేశారు. దీంతో ఊరి శివారులో టెంట్ వేసి బంధువుల ఆఖరి చూపుల కోసం మృతదేహాన్ని ఉంచారు. చివరకు పొలిమేరలోని చెరువులో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వకుండా చూసుకోవాలని అధికారులు పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.