సివిక్‌ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా? | Dealing with Civic Sense? | Sakshi
Sakshi News home page

సివిక్‌ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా?

Published Thu, Jul 13 2017 11:56 PM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

సివిక్‌ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా? - Sakshi

సివిక్‌ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా?

సెల్ఫ్‌ చెక్‌

మనదేశంలో సివిక్‌సెన్స్‌ పట్ల ధ్యాస చాలా తక్కువే. రకరకాల సామాజికనేపథ్యాలే దీనికి కారణం కావచ్చు. ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చినా నాగరక ప్రపంచంలో కనీస సామాజిక జ్ఞానం లేకుండా వ్యవహరించరాదు.

1.    సివిక్‌ సెన్స్‌ను పాటించడం అంటే సమాజంలో వ్యక్తిగా పాటించాల్సిన విలువలను గౌరవించడమే... అని మీ అభిప్రాయం.
ఎ. అవును   బి. కాదు

2. రోడ్ల మీద ఉమ్మడం వంటి సామాజిక జ్ఞానం లేని ప్రవర్తనతో మీకు కలిగిన అసౌకర్యాన్ని మీరు ఇతరులకి కలిగించకూడదని భావిస్తారు.
ఎ. అవును   బి. కాదు

3. మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను చాలా సాధారణంగా మీది కాని ఏ ప్రదేశంలోనైనా పడేయడానికి వెనుకాడరు.
ఎ. కాదు   బి. అవును

4. పార్కుల వంటి పబ్లిక్‌ ప్రదేశాలను ఎంట్రీ టికెట్‌ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా వాడవచ్చు అనుకోకుండా నియమాలను పాటిస్తారు.
ఎ. అవును   బి. కాదు

5. మీరు ఉద్దేశపూరకంగా సామాజిక స్పృహను ఉల్లంఘించనప్పటికీ పొరపాటున మీ కారణంగా మరొకరు అసౌకర్యానికి గురయినట్లు గమనిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు.
ఎ. అవును   బి. కాదు

6. మీరు వాడేసిన బ్యాండేజ్‌లు, స్వైన్‌ ఫ్లూ నిరోధక మాస్కుల వంటి వాటిని యథేచ్ఛగా పారేయడం ద్వారా అవి ఇతరులను అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి నియమిత పద్ధతిలోనే వాటిని డెస్ట్రాయ్‌ చేస్తారు.
ఎ. అవును   బి. కాదు

7. సివిక్‌ సెన్స్‌తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మీకు తెలుసు.
ఎ. అవును   బి. కాదు

8. తమతోపాటు, సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిల్లలకు చెబుతారు. అలాగే తోటి పిల్లల సామాజిక నేపథ్యాన్ని విమర్శించడం తప్పని కూడా చెబుతుంటారు.
ఎ. అవును   బి. కాదు

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సామాజిక జ్ఞానంతో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మీరు సామాజికంగా మీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనుకోవాలి. సమాజంలో పౌరులుగా సామాజిక విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement