ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు సామాజిక ఉద్యమం సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. తల్లితండ్రులు తమ కుమారులకు బాధ్యతాయుతంగా మెలగడం నేర్పించాలని సూచించారు.12 సంవత్సరాల లోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన దోషులకు మరణ దండన విధిస్తూ గత వారం ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుటుంబాల్లో కుమార్తెలకు మరింత గౌరవం ఇచ్చే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు.
బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ కుమారులను బాధ్యతాయతంగా పెంచడంపై మనం దృష్టి సారించాలన్నారు. మనమంతా ఏకమై బాలికలను కాపాడుకునేందుకు సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కథువా, ఉన్నోవ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మైనర్ బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్ననేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment