Manipur Video: PM Narendra Modi Reacts On Manipur Women Harassment Incident - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ కీచకపర్వంపై ప్రధాని మోదీ సీరియస్‌.. సిగ్గుపడాల్సిన విషయం..

Published Thu, Jul 20 2023 10:46 AM | Last Updated on Thu, Jul 20 2023 2:07 PM

PM Narendra Modi Reacts On Manipur Women harassment Incident - Sakshi

సాక్షి, ఢిల్లీ: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ముందర.. కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన మణిపూర్‌ దారుణ ఘటనపై స్పందించారు. 

మణిపూర్‌ ఘటన బాధాకరం. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మాటిస్తున్నాం.. అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ వదలబోం. మణిపూర్‌ దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారాయన.  ‘‘ఇది ఎవరు చేసారు, బాధ్యులెవరు అనేది కాదు.. ఇది యావత్‌ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఘటన. రాజకీయాలకు మించినది మహిళ గౌరవం. కాబట్టి.. నిందితులెవరూ తప్పించుకోలేరు. దీని వెనుక ఉన్న వారిని క్షమించబోం’’

మణిపూర్‌ రేపిస్టులను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ.. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.

సంబంధిత వార్త: నగ్నంగా ఉరేగిస్తూ.. తాకుతూ.. ఆపై పొలాల్లోకి లాక్కెల్లి గ్యాంగ్‌రేప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement