సంఘమిత్ర కథానాయకులు ఖరారు | Sanghamitra heroes finalized | Sakshi
Sakshi News home page

సంఘమిత్ర కథానాయకులు ఖరారు

Published Sat, Dec 31 2016 2:26 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

సంఘమిత్ర కథానాయకులు ఖరారు - Sakshi

సంఘమిత్ర కథానాయకులు ఖరారు

సంఘమిత్ర చిత్రానికి కథానాయకులు ఎట్టకేలకు ఖరారయ్యారు. దర్శకుడు సుందర్‌.సీ ఒక గొప్ప సృష్టికి  నూతన సంవత్సరం ప్రారంభంలో శ్రీకారం చుడుతున్నారు. ఆయన సంఘమిత్ర పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో  వెండితెరపై ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్‌ ఫిలింస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 100వ చిత్రంగా నమోదు కానున్న చిత్రం సంఘమిత్ర. కాగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో సోషల్‌ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఇందులో కథానాయకులుగా నటించేందుకు కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖ స్టార్స్‌ ప్రయత్నించారు.

అందులో ఇళయదళపతి విజయ్, సూర్య, టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కథ నచ్చినా ఈ భారీ చిత్రానికి 250 రోజుల కాల్‌షీట్స్‌ అవసరం అవ్వడంతో ఆ స్టార్‌ నటులు అన్ని కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి కావడంతో నటించేందుకు ముందుకు రాలేకపోయారు. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి యువ స్టార్స్‌ జయంరవి, ఆర్య ఎంపికయ్యారని సమాచారం. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్ సంగీతం, సాబుశిరిల్‌ కళాదర్శకత్వం, కమల్‌ కన్నన్ గ్రాఫిక్స్‌ అందించనున్నారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో  ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచయిత ప్రభంజన్, దర్శకుడు బద్రిలతో కలిసి సుందర్‌.సీ కథను తయారు చేశారు. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు అందులో ఒకరు బాలీవుడ్‌ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement