Jayanravi
-
సంఘమిత్ర కథానాయకులు ఖరారు
సంఘమిత్ర చిత్రానికి కథానాయకులు ఎట్టకేలకు ఖరారయ్యారు. దర్శకుడు సుందర్.సీ ఒక గొప్ప సృష్టికి నూతన సంవత్సరం ప్రారంభంలో శ్రీకారం చుడుతున్నారు. ఆయన సంఘమిత్ర పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 100వ చిత్రంగా నమోదు కానున్న చిత్రం సంఘమిత్ర. కాగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో సోషల్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఇందులో కథానాయకులుగా నటించేందుకు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ ప్రయత్నించారు. అందులో ఇళయదళపతి విజయ్, సూర్య, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కథ నచ్చినా ఈ భారీ చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవ్వడంతో ఆ స్టార్ నటులు అన్ని కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కావడంతో నటించేందుకు ముందుకు రాలేకపోయారు. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఎంపికయ్యారని సమాచారం. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం, సాబుశిరిల్ కళాదర్శకత్వం, కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచయిత ప్రభంజన్, దర్శకుడు బద్రిలతో కలిసి సుందర్.సీ కథను తయారు చేశారు. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ఆయన చిన్న కమలహాసన్!
నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ అని తెలిపారు. ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్ చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్ చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ ఇద్దరి కాంబినేషన్లో మరో భారీ చిత్రం
హిట్ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతుందంటే దాని క్రేజే వేరు. వరుస విజయాలతో యమ జోష్‌లో ఉన్న హీరో జయంరవి. ఇక ఊహకందని కథ, కథనాలతో రూపొందిన నాణయం, సైనికదళం నేపథ్యంలో వరస హత్యల సైకో ఇతి వృత్తంతో నాయిగళ్ జాగ్రత్తై జోంబిల కథతో మిరుదన్ అంటూ హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శక్తి సౌందరరాజన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రమే మిరుదన్. ఈ చిత్రం విశేష పజాదరణ పొందిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుందన్నది తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నెమీచంద్ జపక్ ప్రొడక్షన్స్ అధినేత వి.హటేశ్ జపక్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించారు. జయంరవి ప్రస్తుతం ప్రభుదేవా నిర్మిస్తున్న బోగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. -
శింబు తారుమారు పాట
నటుడు శింబు చర్య ఏదైనా ఒక సంచలనమే. ఆడినా,పాడినా, నటించినా వాటికి విశేష ప్రచారం లభిస్తుంది. శింబుకు నటన వృత్తి అయితే పాడడం ఫ్యాషన్. ఇంతకు ముందు ఆయన పాడిన పాటలకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.ఎక్కువగా తన చిత్రాలకే పాడుకునే శింబు ఇటీవల ఇతర హీరోల చిత్రాలకు తన గానాన్ని పంచుతున్నారు. తాజాగా విక్రమ్‌ప్రభు చిత్రానికి ఒక పాట పాడారు. ఇంతకు ముందు జయంరవి,హన్సిక హీరోహీరోయిన్లుగా రోమియో జూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ఎస్.నందకుమార్ తాజాగా విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.షామిలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గణేశ్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన సంగీత సారథ్యంలో తారుమారు అనే పాటను నటుడు శింబు పాడారు. దీన్ని ఇంతకు ముందు దండామారి ఊదారి, ఎంగ తల ఎంగ తల వంటి సూపర్‌హిట్ పాటలను రాసిన రోఖేశ్ ఈ తారుమారు పాటను రాశారు. శింబు పాడిన ఈ పాటా మార్కెట్లో విడుదలైన తరువాత ఊరువాడ మారుమోగుతుందంటున్నారు వీరశివాజి చిత్ర యూనిట్. -
అసలైన ఆనందంలో అన్నయ్య
ఇప్పటి వరకూ తన సంతోషంతోనే తృప్తిపడిన అన్నయ్య ఇప్పుడే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నారు నటుడు జయంరవి. ఏమిటి అసలు ఆనందం, కొసరు సంతోషం అదేమిటో చూద్దాం. జయంరవి తన అన్నయ్య మోహన్‌రాజా (జయంరాజా పేరు మార్చుకున్నారు) దర్శకత్వంలో నటించిన ఆరవ చిత్రం తనీఒరువన్. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల విడుదలయిన తనీఒరువన్ విశేష ప్రజాఆధరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ను నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు, తన సోదరుడు ఇప్పటి వరకూ నా సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ వచ్చారు. దర్శకుడిగా పలు విజయాలను పొందినా రీమేక్‌ల రాజాగానే పిలవబడ్డారు. ఇవన్నీ చూస్తూ అన్నయ్య తానేమిటో నిరూపించుకునే రోజు వస్తుందని నేను మనసులోనే అనుకునేవాడిని. అది ఈ తనీఒరువన్ చిత్రంతో జరిగింది. ఇది అన్నయ్య తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం. చాలా పెద్ద విజయం సాధించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిత్రం విడుదలకు ముందే చిత్రం ఘన విజయం సాధిస్తుందని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అన్నయ్య మోహన్‌రాజాగా పేరు మార్చుకున్నట్లు తనీఒరువన్ చిత్రం విజయం తరువాత తనీఒరువన్ రవిగా పేరు మార్చుకుంటారా? అని అడుగుతున్నారని తొలి చిత్రం జయం నాకు అడ్రస్ నిచ్చింది. అందువల్ల జయంరవి పేరును మార్చుకునే ప్రశక్తే లేదు.అయితే తనీఒరువన్ నా గుండెల్లో చెరగని పచ్చబొట్టుగా నిలిచిపోతుందిఅని జయంరవి అన్నారు. త్రిశంకు స్వర్గంలో ఉన్నా దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేను త్రిశంకు స్వర్గంలో ఉన్నాను. ఏ చిత్రం చేసినా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. సొంతంగా తయారు చేసుకున్న కథల్లో నటించడానికి హీరో లెవరూ అంగీకరించని పరిస్థితి. ఎలాంటి చిత్రం చెయ్యాలో అర్థం గాక రీమేక్ చిత్రాలు చేసుకుంటూ వచ్చాను. ఫలితం రీమేక్ చిత్రాల దర్శకుడుగా ముద్ర వేశారు. ఇలా పుష్కర కాలం గడిసిపోయింది. అలాంటిది ఏజీఎస్ సంస్థ అధినేత 2009లో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే సొంత కథతో చిత్రం చేయాలని ప్రోత్సహించారు. తనీఒరువన్ చిత్రం ద్వారా ఒక వ్యక్తిపై ప్రతీకారం అనే ఫార్ములాను బ్రేక్ చేసి విజయం సాధించాను అని అన్నారు. -
నేను అలాంటి అమ్మాయిని కాను
సంతోషం సగం బలం అంటారు. మనిషి ఏమి చేసినా ఆనందమైన జీవితం కోసమే. అలాంటిది కొందరు ఎంత కూడబెట్టినా ఇంకా డబ్బు డబ్బు అంటూ పరుగులు పెడుతుంటారు. తనలా డబ్బు కోసం వెంపర్లాడే అమ్మాయిని కాదంటున్నారు నటి హన్సిక. కోలీవుడ్‌లో అత్యధిక అవకాశాలు చేతిలో ఉన్న నటీమణుల్లో నయనతార తరువాత హన్సికనేనని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అరణ్మణై, ఆంబళ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మాజీ ప్రియుడు శింబుతో నటించిన వాలు చిత్రం మేలో తెరపైకి రానుంది. శింబుతో జత కట్టిన వేట్టైమన్నన్తో పాటు జయంరవితో నటిస్తున్న రోమియో జూలియట్, ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటిస్తున్న పులి, నటి జయప్రద కొడుకు సిద్ధార్థ్ సరసన నటిస్తున్న ఉయిరే ఉయిరే, ఉదయనిధి స్టాలిన్‌తో కలసి నటిస్తున్న ఇదయం మురళి అంటూ అరడజను చిత్రాలకుపైగా నటిస్తున్న హన్సిక డైరీ ఈ ఏడాది అంతా ఫుల్ అయిపోయింది. చక్కని అభినయంతోపాటు అందాలు ఆరబోయడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో హన్సికకు అవకాశాలు వద్దన్నా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ డబ్బు సంపాదన గురించి కూడా పెద్దగా పట్టించుకోదట. ఒక ఇంటర్వ్యూలో హన్సిక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అందరూ డబ్బు సంపాదన కోసమే కఠినంగా శ్రమిస్తున్నారన్నారు. అయితే తాను మట్టుకు సంపాదనే ధ్యేయంగా భావించడం లేదన్నారు. తనకు అవసరం అయిన విషయాలను అమ్మ గమనించుకుంటుందని అందుకే పరిధులు దాటి తానామెను ఏమి అడగనని అన్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ పెట్టుకోలేదు. అందుకే సంతోషంగా ఉన్నాను అని హన్సిక అన్నారు.