నేను అలాంటి అమ్మాయిని కాను | Hansika Motwani full busy in Kollywood | Sakshi
Sakshi News home page

నేను అలాంటి అమ్మాయిని కాను

Published Sun, Apr 12 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

నేను అలాంటి అమ్మాయిని కాను

నేను అలాంటి అమ్మాయిని కాను

 సంతోషం సగం బలం అంటారు. మనిషి ఏమి చేసినా ఆనందమైన జీవితం కోసమే. అలాంటిది కొందరు ఎంత కూడబెట్టినా ఇంకా డబ్బు డబ్బు అంటూ పరుగులు పెడుతుంటారు. తనలా డబ్బు కోసం వెంపర్లాడే అమ్మాయిని కాదంటున్నారు నటి హన్సిక. కోలీవుడ్‌లో అత్యధిక అవకాశాలు చేతిలో ఉన్న నటీమణుల్లో నయనతార తరువాత హన్సికనేనని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అరణ్మణై, ఆంబళ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మాజీ ప్రియుడు శింబుతో నటించిన వాలు చిత్రం మేలో తెరపైకి రానుంది.
 
  శింబుతో జత కట్టిన వేట్టైమన్నన్‌తో పాటు జయంరవితో నటిస్తున్న రోమియో జూలియట్, ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటిస్తున్న పులి, నటి జయప్రద కొడుకు సిద్ధార్థ్ సరసన నటిస్తున్న ఉయిరే ఉయిరే, ఉదయనిధి స్టాలిన్‌తో కలసి నటిస్తున్న ఇదయం మురళి అంటూ అరడజను చిత్రాలకుపైగా నటిస్తున్న హన్సిక డైరీ ఈ ఏడాది అంతా ఫుల్ అయిపోయింది. చక్కని అభినయంతోపాటు అందాలు ఆరబోయడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో హన్సికకు అవకాశాలు వద్దన్నా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 
  మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ డబ్బు సంపాదన గురించి కూడా పెద్దగా పట్టించుకోదట. ఒక ఇంటర్వ్యూలో హన్సిక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అందరూ డబ్బు సంపాదన కోసమే కఠినంగా శ్రమిస్తున్నారన్నారు. అయితే తాను మట్టుకు సంపాదనే ధ్యేయంగా భావించడం లేదన్నారు. తనకు అవసరం అయిన విషయాలను అమ్మ గమనించుకుంటుందని అందుకే పరిధులు దాటి తానామెను ఏమి అడగనని అన్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ పెట్టుకోలేదు. అందుకే సంతోషంగా ఉన్నాను అని హన్సిక అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement