హాయ్ జూలియట్ | Ravi on the romance track | Sakshi
Sakshi News home page

హాయ్ జూలియట్

Published Fri, Jun 12 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

హాయ్ జూలియట్

హాయ్ జూలియట్

నటి హన్సిక మంచి జోష్ మీద ఉన్నారు. కారణమేమిటంటారా? ఈ అమ్మడు నటించిన రోమియో జూలియట్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటారీ హన్సిక. అరణ్మైణ  చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, ఆ తరువాత దెయ్యంగా రెండు డైమన్షన్ గల పాత్రలో నటించి మెప్పించిన ఈ ఉత్తరాది బ్యూటీ తాజాగా రోమియో జూలియట్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జయంరవి హీరోగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర గురించి హన్సిక తెలుపుతూ ఈ చిత్రంలో తాను ఎయిర్‌హోస్టెస్‌గా నటించానని తెలిపారు.
 
  రొమాంటిక్ ప్రేమ కథాంశంతో కూడిన ఈ చిత్రం తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని అలా ఎంచుకున్న చిత్రాల్లో రోమియో జూలియట్ ఒకటని అన్నారు. అప్పుడే ప్రేక్షకులు ఎక్కడ కనిపించినా హాయ్ జూలియట్ అని పిలుస్తున్నారని అలా చిత్రంలోని పేరుతో పిలించేంతగా గుర్తింపు రావ డం ఏ నటికైనా ఆనందంగా ఉంటుం దని హన్సిక అన్నారు. ఈ ఏడాది రెండవ భాగంలో రోమియో జూలియట్‌తో పాటు విజయ్‌తో నటిస్తున్న పులి చిత్రం కూడా విడుదల కానుండడం సంతోషకరమైన విషయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement