Romeo Juliet
-
అదే నిజమైన ప్రేమరుచి
ఆలోచనం విధేయంగా ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమయిన ప్రేమరుచి. రోమియో అండ్ జూలి యట్లో షేక్సి్పయర్ వాడిన భాష, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నా కూతురు ఈ దసరా సెలవులలో ప్రఖ్యాతి గాంచిన ఈ విషాదాంత ప్రేమ నాటకాన్ని చదువుతూ చీటికీమాటికీ అమ్మా అలా అంటే ఏమిటీ, ఇలా అంటే ఏమిటీ అని అడగటం మొదలు పెట్టింది. అడుగుతూ, జూలియట్ తండ్రి క్యాపులెట్, కూతురి గురించి ‘భూమి నా ఆశలన్నింటిని కబళించినది కానీ ఆమె.. ఆమె నా ధరణికే ఆశాజనకమైన దొరసాని’ అన్న డైలాగ్ చదివి, ప్రేమికుడి కోసం పొడుచుకు చనిపోయిన జూలియట్‌ని తలచుకుని ఆ తండ్రిపై చాలా జాలిపడింది. ఆ డైలాగ్ విన్న తర్వాత నాకు హఠాత్తుగా ఈ మధ్య ప్రేమికుడి చేతిలో హత్యకు గురయిన చాందిని జైన్ జ్ఞాపకం వచ్చింది. ఆ సంఘటనతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థి జంట కూడా జ్ఞాపకం వచ్చారు. పిల్లల ఫీజులకోసమని చిన్న చిన్న ఆనందాలను కూడా మూలనపడేసి తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌కి పంపిస్తే వీళ్ళ ప్రాణాలు కేవలం వీళ్ళవే అయినట్లు ఎంత సులభంగా ప్రాణాలను తృణప్రాయం అనుకున్నారు కదా అని పించి చాలా బాధ కలిగింది. అసలు రోమియో జూలియట్‌ని మొదటిసారి చది వినపుడు నేనెలా ఫీలయ్యానో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. నేనూ నా కూతురిలానే ఏ పది హేనేళ్ల వయసులోనో ఆ నాటకాన్ని చదివాను. ఇప్పుడు నా బిడ్డలాగే అప్పుడు నేను జూలియట్ తండ్రి గురించి ఆలోచించానా? లేదా.. ‘‘గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్’’ అనుకున్నానా.. జ్ఞాపకం రావటం లేదు. ఇప్పుడైతే నాకది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించడం లేదు. నా కూతురుతో చాలా కచ్చగా ‘‘రోమియోకి తెలివి చాలా తక్కువ, చంచలుడు! మొదట రోసాలిన్ను ఇష్టపడ్డాడు, తర్వాత చాలా సులభంగా ఆ ప్రేమను వదిలి జూలియట్ వెంట పడ్డాడు. జూలియట్ నటిస్తుందా, లేక నిజమా అని ఓపికగా తెలుసుకోకుండా చచ్చిపోయాడు’’, అని ‘‘వెరీ స్టుపిడ్ హీరో ఐ హావ్ ఎవర్ రీడ్’’ అని చిరచిరా చిరాకు పడ్డాను. తల్లిదండ్రులపట్ల కొంచెమన్నా బాధ్యత, వారేమవుతారోనన్న అక్కర లేకుండా ప్రాణాలు తీసుకున్న, తీస్తున్న ప్రేమికులను గొప్పవారనడం బాగుంటుందా? లేదా స్వార్థపరులనడం బాగుంటుందా? ప్రేమించే హృదయమున్న వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఉదారంగా ప్రేమిస్తారు. స్నేహితులను, తల్లిదండ్రులను, బాధ్యతలను, ముఖ్యంగా పరుల దుఃఖాలను, అందుకే ‘మీ సంతోషం కంటే అవతలి వ్యక్తి సంతోషమే ముఖ్యంగా భావించడమే ప్రేమ’ అంటాడు హెచ్ జాక్సన్ బ్రౌన్. ప్రేమ ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. మాటలకు మృదుత్వాన్ని ఇస్తుంది. చేతలకు సరళతను నేర్పుతుంది. అన్నిటికన్నా హృదయంలో ప్రేమవున్న మనుషులు దయార్ద్రంగా ఉంటారు. తీసుకోవడంకన్నా ఇవ్వడాన్ని ఇష్టపడతారు. దానినే ఖలీల్ జిబ్రాన్ ‘ప్రేమ వశము చేసుకొనదు వశము కాదు తానెప్పుడు’ అంటాడు. మొన్న ఒక పెళ్ళికి వెళ్లాను. వధూవరులు నునులేత యౌవనస్తులు. జీవితాంతపు ప్రేమబంధంలోకి అడుగుపెడుతున్న ఆ చిన్న పిల్లల ఎదుట పెళ్లి పురోహితుడు పదే పదే అంటున్నాడు ‘భార్య భర్తకి లోబడి ఉండాలి’ అని. ఎవరైనా ఎవరికైనా లోబడి వున్నపుడు ఆ బంధంలో ప్రేమ పుడుతుందా. లోబడి భయంతో బ్రతుకుతున్న చోట తిరుగుబాటు, చిరాకు కదా ఉంటాయి. సమానమైన మెదడు ఆలోచనా శక్తి వున్న ఆడపిల్ల జీవితపర్యంతం ప్రేమించాల్సిన భర్తకి లోబడి ఉండాలనే బోధన కాకుండా ఖలీల్ జిబ్రాన్ చెప్పాడు కదా ‘ఒకరినొకరు ప్రేమింపుడు.. కానీ ఈషణ్మాత్రము ఆ ప్రేమ మీకు బంధనమ్ము కాగూడదు ఏ క్షణమున,/అంతకన్నను మీరు మీమీ యెడదలను తీరాలు జేయుడు/ప్రేమ కడలిని వాని మధ్యనజేరి అల్లల్లాడనీయుడు/ఒకరిపాత్రను ఒకరు నింపుడు/కాని యెప్పుడు ఏక చషకమునుండి పానము చేయబోకుడు/ఒకరి కబళము ఒకరికీయుడు/ కాని యెప్పుడు ఒకే కబళము పంచుకొని సేవింపబోకుడు./సంతసంబుగ ఎల్లవేళల కలిసియాడుడు కలిసిపాడుడు/కాని యెప్పుడు వేరువేరుగ నిలిచి ఉండుడు/ ఎవరి వ్యక్తిత్వంబు వారు నిలుపుకొనుడు/వీణ తీగలు రాగమందున ఏకమయ్యును/దేనికయ్యది వేరువేరుగ నిలిచి వుండును./స్వీయకంపనము తోడ పలుకును’. ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన బెంగాలీ సినిమా పాట–అమాకే అమార్ మతో తాక్తే దావ్–ఈ పాట పల్లవి–నన్ను నా లాగే ఉండనివ్వు, నాకు నచ్చిన విధంగా నన్ను నేను మలుచుకొన్నాను, నాకు ఏది దొరకలేదో అది దొరకకుండానే ఉండనీ, కోరుకొన్నవన్నీ దొరికిన జీవితం వృథా... ఎంత గొప్ప వాక్యాలు కదా. మనుషులం ఎవరికి వారమే ప్రత్యేకం. ప్రేమించుకుం టున్నపుడు కూడా మనం విడివిడి మనుషులం. విడివిడి అభిప్రాయాలు ఉండే మనుషులం. చెప్పినట్లు ఉండటం లేదనీ, చెప్పిన మాట వినడం లేదనీ ఆడబిడ్డల్ని క్రూర జంతువులు కూడా చంపవు. పురుషుడికి లోబడి ఉండే ఆడపిల్లల్ని కాదు, తలలో మెదడు ఉన్న ఆడపిల్లల్ని, మీరు అవునంటే కాదని ఖండించి తల ఎగరేసే అమ్మాయిల్ని ప్రేమించేలా చేసుకోండి. స్వయంగా వారిచేతనే దాసోహమనిపించుకోండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమరుచి. అదే నిజమైన ప్రేమను గెలుచుకున్న రుచి. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ఫోన్: 91635 69966 -
జయం రవి హీరోనా.. విలనా?
యువ నటుడు జయంరవి హీరోనా? విలనా? అదేమిటీ హీరోని పట్టుకుని అలా అంటున్నారు అని అనుకుంటున్నారా? జయం రవి స్టార్ హీరోనే. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రంలో అలాంటి సందేహానికి దోహదమయ్యే కథా పాత్రలో నటిస్తున్నారట. విజయాలకు నమ్మకమైన హీరోలలో జయం రవి ఒకరు. రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుదన్ వంటి చిత్రాల వరుస విజయాలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతోపాటు నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటుడు జయం రవి. కాగా ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ వైవిధ్య భరిత చిత్రాలను నిర్మిస్తోంది. వాటిలో ఒకటి రోమియో జూలియట్ చిత్ర యూనిట్ జయం రవి, హన్సిక, దర్శకుడు లక్ష్మణ్, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, నటుడు వీటీవీ.గణేశ్లతో నిర్మిస్తున్న చిత్రం బోగన్. ఈ చిత్ర యూనిట్లో అదనంగా ప్రముఖ నటుడు అరవిందస్వామి వచ్చి చేరారు. విశేషం ఏమిటంటే ఇందులో జయం రవి పాత్ర హీరోగానూ, విలన్‌గానూ రెండు డైమన్షన్లలో సాగుతుందట. అంతే కాదు అరవిందస్వామి పాత్ర అలానే రెండు కోణాల్లో సాగుతుందట. అందుకే బోగన్ చిత్రంలో జయం రవి హీరోనా?విలనా? అన్న సందేహం కలగక మానదు. దీని గురించి దర్శకుడు లక్ష్మణ్ ఏమంటున్నారో చూద్దాం. ‘నా గత చిత్రం రోమియో జూలియట్ పూర్తిగా వినోదభరితంగా సాగే ప్రేమ కథా చిత్రం. అయితే దానికి పూర్తి భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా బోగన్ ఉంటుందని తెలిపారు. ఇందులో కథతోపాటు మంచి కామెడీ ట్రావెల్ అవుతుందని తెలిపారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే బోగన్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోందని చెప్పారు. -
మంచి నటి అన్న పేరు చాలు!
మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను ఈ ఏడాది కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది. తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్గా నంబర్‌ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్‌ఒన్ స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం. -
ఆ ఘనత నాదే
ఒకే ఏడాది మూడు సంచలన విజయాలను సాధించిన ఘనత నాదేనని సగౌరవంగా చేప్పుకోగలను అంటున్నారు జయంను తన పేరులోనే ఇముడ్చుకున్న నటుడు జయంరవి. ఆయన ఈ ఏడాది నటించిన రోమియో జూలియట్, తనీఒరువన్, తాజాగా విడుదలైన భూలోకం చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ చిత్రాల దర్శకులు,తన కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో తన సంతోషాన్ని పంచుకున్నారు. జయంరవి మాట్లాడుతూ 2015లో తను నటించిన నాలుగు చిత్రాలు విడుదలవ్వగా అందులో మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన రోమియో జూలియట్ తొలి విజయానికి నాంది పలికిందన్నారు.ఈ తరువాత వచ్చిన సకలకళావల్లవన్(అప్పాటక్కర్)ఆశించిన విజయాన్ని సాధించక పోయినా అదీ తన కేరీర్లో మంచి చిత్రమేనన్నారు.ఆ చిత్రానికి తన శ్రమ,కృషి పూర్తిగా ఉన్నాయని చెప్పారు. ఇక తన అన్నయ్య మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన తనీఒరువన్ చిత్రం విజయం గురించి మీకే తెలుసు. తను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. తాజాగా విడుదలైన భూలోకం పలు అవరోదాలను ఎదుర్కొని ఇటీవల తెరపైకి విశేష ప్రజాభిమానాన్ని చూరగొనడం సంతోషంగా ఉందన్నారు. 2016 లోనూ ఇలాంటి విజయాల పరంపరనే కొనసాగుతుందనే నమ్మకం ఉందన్నారు. 12 రకాల జీవితాల్ని చవి చూశాం దర్శకుడు, జయంరవి సోదరుడు మోహన్‌రాజా మాట్లాడుతూ తమ్ముడు రవి, తానూ చిత్ర రంగప్రవేశం చేసి పుష్కరకాలం అయ్యిందన్నారు. ఈ 12 ఏళ్లలో 12 రకాల జీవితాలను అనుభవించామని అన్నారు. తమ్ముడు విజయాలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.రవికి తాను ఇచ్చే సలహా ఒక్కటే నీ వెనుక తామంతా ఉన్నామని ఈ విజయపరంపరను కొనసాగించు. అహాన్ని మాత్రం పెంచుకోవద్దు అని అన్నారు. తన తండ్రి 60 ఏళ్ల అనుభవం తమ వెనుక ఉందని అన్నారు. సింహాసనం వేసి కిరీటం తొడిగారు కొడుకుల విజయాలకు ఉప్పొంగుతున్న ఆనందం మధ్య సీనియర్ ఎడిటర్, నిర్మాత ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ తన బిడ్డలకు తానెప్పుడూ ఒకటే చెబుతుండేవాడినన్నారు. ఏ పని చేసినా దాన్ని పరిపూర్ణంగా చేయమని అనే వాడినన్నారు. తన సలహాను పాటించి ఇవాళ ఇంతవాళ్లయిన వారిని చూసి గర్వపడుతున్నానన్నారు. తనకు పెద్ద కొడుకు మోహన్‌రాజా సింహాసనం ఏర్పాటు చేస్తే చిన్న కొడుకు జయంరవి కిరీటాన్ని తొడిగాడని ఆనంద బాష్పాలతో అన్నారు. జయంరవి కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు లక్ష్మణ్,కల్యాణ్క్రిష్ణన్ పాల్గొన్నారు. -
జయంరవి, లక్ష్మీమీనన్‌ల మిరుదన్
నటుడు జయంరవి, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న చిత్రానికి మిరుదన్ అనే పేరును ఖరారు చేశారు.రోమియోజూలియట్, తనీఒరువన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత జయంరవి తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. తాజాగా నిర్మాత మైఖెల్ రాయప్పన్ తన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు నాడోడిగళ్, గోరియపాలైయం, పట్టత్తు యానై హిట్ చిత్రాలను నిర్మించిన మైఖెల్ రాయప్పన్ నటుడు అధర్వ హీరోగా ఈటీ చిత్రాన్ని రూపొందించారు. ఇది త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం ఈయన నాణయం, నాయ్‌గళ్ జాగ్రత్తైవంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో జయంరవి కథానాయకుడుగా మిరుదన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి లక్ష్మీమీనన్ తొలిసారిగా జయంరవితో జతకడుతున్నారు. చిత్ర వివరాలను నిర్మాత వెల్లడిస్తూ చిత్ర షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 18 నుంచి మొదలెట్టనున్నట్లు తెలిపారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో ఎన్నై అరిందాల్ చిత్రం ఫేమ్ బేబీ అనీగ, శీమాన్, కాళీ వెంకట్, ఆర్ఎన్ఆర్.మనోహర్ సాటై రవి,క్రేన్‌మనోహర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని నిర్మాత చెప్పారు. -
మీడియాను పిలవొద్దు
ప్రసార మాధ్యమాలు పెరుగుతున్నాయి. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ నెట్వర్క్స్ అంటూ వాటి ప్రభావం అధికం అవుతుండడంతో ఎప్పుడు? ఎక్కడ? ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇక హీరో, హీరోయిన్ల విషయాలైతే వారికి సంబంధించిన చిత్రాల వివరాల కంటే వ్యక్తిగత విషయాలే ప్రచారంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. దీంతో ముఖ్యంగా హీరోయిన్లు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఈ మధ్య నటి హన్సిక, జయంరవితో నటించిన రోమియో జూలియట్ చిత్ర విలేకరుల సమావేశానికి ఆమెను ఆహ్వానిస్తే రానని చెప్పారట. కారణం శింబుతో లవ్ ఫెయిల్యూర్, ఇంటర్నెట్లో హల్చల్ చేసిన నగ్న దృశ్యాలు ఆల్బమ్‌ల గురించి ప్రశ్నలు సంధిస్తారని వివరించారట. అలాంటి ప్రశ్నలు తలెత్తకుండా చూసుకుంటామని దర్శక నిర్మాతలు హామీ ఇవ్వడంతో హన్సిక ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నట్లుగానే ఆ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని విలేకరిని రిక్వెస్ట్ చేశారు. కాగా నేను షూటింగ్లో ఉన్నప్పుడు మీడియాను పిలవొద్దు అంటూ నిర్మాతలకు ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ అమ్మడి వ్యవహారం చూస్తే జీవాతో నటిస్తున్న తాజా చిత్రం తిరునాళ్. ఈ చిత్ర షూటింగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్ర కవరేజ్ కోసం చెన్నై నుంచి విలేకరులను తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతల వర్గం భావించింది. అందుకు జీవా, నయనతార కూడా ఓకే చెప్పారు. అయితే ఆ తరువాత నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివతో ప్రేమాయణం అంటూ ప్రచారం జోరందుకోవడం, వారిద్దరు దిగిన సెల్ఫీ ఫొటో సోషల్ నెట్‌వర్క్సులో హల్చల్ చేయడంతో షాక్ అయిన నయనతార ఇప్పుడు మీడియా వస్తే ఆ విషయాలు గురించే గుచ్చి గుచ్చి అడుగుతారు. చిత్ర వివరాలు గురించి పట్టించుకోరంటూ నిర్మాతలకు నచ్చచెప్పి తాను సెట్లో ఉండగా విలేకరులను తీసుకురావద్దు అంటూ అడ్డుకట్ట వేశార ట. ముందు జాగ్రత్త అంటే ఇదేనేమో. -
హన్సిక నాకంటే బాగా నటించారు
నటి హన్సిక తనకంటే అద్భుతంగా నటించారని నటుడు జయంరవి కితాబిచ్చారు. వీరిద్దరూ కలిసి నటించన చిత్రం రోమియోజూలియట్. ఎస్ నందగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. దీన్ని కాస్మో విలేజ్ పతాకం ద్వారా శివకుమార్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడడంతో సోమవారం తన ఆనందాన్ని చిత్ర హీరో జయంరవి,దర్శకుడు లక్ష్మణన్, నిర్మాత ఎస్ నందగోపాల్‌తో కలసి విలేకరులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ తాను విడుదల చేసిన తొలి చిత్రం నాయ్గల్ జాగ్రత్తైమంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా జయంరవి, హన్సిక జంటగా నటించిన రోమియోజూలియట్ చిత్రాన్ని విడుదలకు మూడు నెలల ముందే కొనుగోలు చెయ్యాలనిపించిందన్నారు. అదే విధంగా నిర్మాతను సంప్రదించి విడుదల హక్కుల్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్టవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జయంరవి కాల్షీట్స్ ఇస్తే చిత్రం చేస్తానని కాస్మో విలేజ్ శివకుమార్ అన్నారు. హన్సిక అద్భుతంగా చేశారు నటుడు జయంరవి మాట్లాడుతూ సక్సెస్‌పుల్ చిత్రం చెయ్యాలన్న భావనతో చేసిన చిత్రం రోమియోజూలియట్ తన ఆకాంక్షను నెరవేర్చిందని అన్నా రు. నటి హన్సిక తన కంటే అద్భుతంగా నటించారని తెలిపారు. -
రజనీతో రొమాన్స్‌కు ఎదురుచూస్తున్నా!
కోలీవుడ్ ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ అంటే రజనీకాంత్‌నే జయాపజయాలకు అతీతమైన స్థానం ఆయనది. ఆరు పదులు దాటిన ఈ స్టైల్కింగ్తో నటించడానికి కుర్ర హీరోయిన్లు ఎగబడతారు. అలా మిల్కీ బ్యూటీ హన్సిక కూడా ఆయనతో నటించడానికి ఎదురు చూస్తున్నారట. కోలీవుడ్‌లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా విరాజిల్లుతున్న హన్సిక నటించిన రోమియో జూలియట్‌కు శుక్రవారం తెరపైకి వచ్చింది. విజయ్‌తో నటిస్తున్న పులి చిత్రం త్వరలో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ ఉత్తరాది బ్యూటీతో చిన్న భేటీ.... ప్రశ్న: పులి చిత్రం ఎలా ఉంటుంది? జవాబు: చిత్రం చాలా బాగా వస్తోంది. ఇందులో నేను రాణిగా నటించాను. ఆ గెటప్‌లో తయారవ్వడానికే సుమారు మూడున్నర గంటలు పట్టేది. ఈ కష్టం అంతా పులి చిత్ర విజయంతో మరచిపోతాననే నమ్మకం ఉంది. ప్రశ్న: విజయ్‌తో రెండవసారి నటించిన అనుభవం గురించి? జవాబు: నేను విజయ్ను చూసినప్పుడల్లా రోజురోజుకు వయసు తగ్గినట్టు కుర్రాడైపోతున్నారు. ఏమి తింటున్నారు? ఆ రహస్యం ఏమిటనే అడుగుతుంటాను. వేలాయుధం తరువాత విజయ్‌తో నటిస్తున్న రెండవ చిత్రం పులి. ఈ చిత్ర షూటింగ్లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రశ్న : అందాల బొమ్మ, హార్రర్ చిత్రాల్లో దెయ్యాం, పట్టపురాణి ఇలా వరుసగా వైవిధ్యబరిత పాత్రల్లో నటిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు? జవాబు: నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు సుందర్ సి తన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించే అవకాశాలను కల్పిస్తున్నారు. అందుకే ఆయన చిత్రాలంటే కథ కూడా అడగకుండా ఒప్పేసుకుంటాను. ప్రశ్న: హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించడం లేదనే కామెంట్‌పై మీ స్పందన? జవాబు: అందులో వాస్తవం లేదు. అలాగైతే అరణ్మణై చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కాదా? ఆ చిత్రంలో మహిళల పాత్రలే బలమైనవి. నా పాత్ర 20 నిమిషాలు ఉన్నా దాని ప్రభావం చిత్రం అంతా ఉంటుంది. అదే విధంగా నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రశ్న: చిత్ర పరిశ్రమలో మీకు సన్నిహిత మిత్రులెవరు? జవాబు: సుందర్ సి, కుష్భులు నాకు చాలా సన్నిహిత మిత్రులు. అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రశ్న: మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోనున్నారట? జవాబు: ముగ్గురిని కాదు. ఐదుగురిని ఇప్పటికే దత్తత తీసుకున్నాను. ఇలాంటి విషయాలు బయటకు రాకూడదన్నది నా భావన. కారణం నటీమణులు ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తున్నారని అనుకుంటారనే భయమే. అయినా ఈ విషయాలు ఎలాగోలా బయటకొచ్చేస్తున్నాయి. నేను మాత్రం నా ఆత్మ సంతృప్తి, సంతోషం కోసమే చేస్తున్నాను. ఇంకా ఈ అంశం గురించి మాట్లాడదలచుకోలేదు. ప్రశ్న: రజనీకాంత్‌తో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తారా? జవాబు: అలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఒదులుకుంటారా? నేను అంతే. రజనీకాంత్ సరసన నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. -
దేవుడిచ్చిన గిఫ్ట్ హన్సిక
ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సంస్కృతికి చిల్లులు పడుతున్నాయని నటుడు జయం రవి పేర్కొన్నారు. మడ్రాస్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎస్ నందగోపాల్ నిర్మించిన చిత్రం రోమియో జూలియట్. జయం రవి, హన్సిక జంటగా నటించిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో నటి పూనం బాజ్వా నటించారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విలేకరుల సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జయంరవి వల్లే రోమియో జూలియట్ చిత్రం రూపొందిందన్నారు. ఆయన తనకు దేవుడితో సమానంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటించడానికి అంగీకరించడం దేవుడిచ్చిన గిఫ్ట్ భావిస్తున్నానన్నారు. చిత్ర కథ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు జయం రవి బదులిస్తూ రోమియో జూలియట్ అనగానే చాలామంది ఇంకేదో ఊహించుకుంటారన్నారు. ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే సంస్కృతి మారుతోందన్నారు. ఒకవేళ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్నా ఆమెతో చివరి వరకు జీవించడమనే వారి సంఖ్య తగ్గుతోందని అన్నారు. అలాంటి సంస్కృతి తప్పు అని చెప్పే చిత్రం రోమియో జూలియట్. ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఒకరికి ఒకరుగా జీవించాలని చెప్పే చిత్రం ఇది అని తెలిపారు. ఇందులో తన పాత్ర ఇంచుమించు రాముడిలా ఉంటుందన్నారు. హన్సికది సీత లాంటి పాత్ర! అన్న ప్రశ్నకు అంతేకదా! అన్నారు. రోమియో జూలియట్ అభిమానుల అంచనాలను పూర్తి చేసే చిత్రంగా ఉంటుందని హన్సిక అన్నారు. -
హాయ్ జూలియట్
నటి హన్సిక మంచి జోష్ మీద ఉన్నారు. కారణమేమిటంటారా? ఈ అమ్మడు నటించిన రోమియో జూలియట్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటారీ హన్సిక. అరణ్మైణ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, ఆ తరువాత దెయ్యంగా రెండు డైమన్షన్ గల పాత్రలో నటించి మెప్పించిన ఈ ఉత్తరాది బ్యూటీ తాజాగా రోమియో జూలియట్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జయంరవి హీరోగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర గురించి హన్సిక తెలుపుతూ ఈ చిత్రంలో తాను ఎయిర్‌హోస్టెస్‌గా నటించానని తెలిపారు. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో కూడిన ఈ చిత్రం తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానని అలా ఎంచుకున్న చిత్రాల్లో రోమియో జూలియట్ ఒకటని అన్నారు. అప్పుడే ప్రేక్షకులు ఎక్కడ కనిపించినా హాయ్ జూలియట్ అని పిలుస్తున్నారని అలా చిత్రంలోని పేరుతో పిలించేంతగా గుర్తింపు రావ డం ఏ నటికైనా ఆనందంగా ఉంటుం దని హన్సిక అన్నారు. ఈ ఏడాది రెండవ భాగంలో రోమియో జూలియట్తో పాటు విజయ్‌తో నటిస్తున్న పులి చిత్రం కూడా విడుదల కానుండడం సంతోషకరమైన విషయమన్నారు. -
మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా
టీనగర్: నటి హన్సిక మరో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. హన్సిక మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న వాలు త్వరలో విడుదల కానుందన్నారు. జయం రవితో నటించిన రోమియో జూలియట్, విజయ్‌తో నటించిన పులి విడుదల కానున్నాయన్నారు. తనను వెదుక్కుంటూ ఏడు కథలు వచ్చాయని, వీటిలో రెండింటిని సెలక్ట్ చేశానన్నారు. పెద్ద హీరో, పేరున్న దర్శకుని చిత్రాలని, ఆయా సంస్థలు వీటి గురించి ప్రకటన విడుదల చేస్తాయన్నారు. ఈ క్రమంలో హిందీ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నందున ప్రస్తుతం నిరాకరించినట్లు తెలిపారు. చక్కని కథాంశంలో పెద్ద చిత్రాలు కుదిరితే నటిస్తానన్నారు. నిరాదరణకు గురైన చిన్నారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని, ఇంతవరకు 25 మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు పిల్లలను ఆగస్టులో దత్తత తీసుకోనున్నానని, వీరి కోసం ముంబై శివారు ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశానన్నారు. అందులో వారికి అనాథశ్రమం నిర్మిస్తానని తెలిపారు. -
నష్టపరిహారం కోటి చెల్లించండి
నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని నటుడు, దర్శకుడు టి.రాజేందర్ రోమియో జూలియట్ చిత్ర నిర్మాతకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. వివరాల్లో కెళితే..డండన్నక పాట వ్యవహారం ముదురుతోంది. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం యువగీత రచయిత లోకేష్ డండన్నక అనే పాటను రాశారు. మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. ఈ పాటలోని పదాలు దర్శక నటుడు టి.రాజేందర్‌కు సంబంధించి ఉండటంతో ఆయన తన అనుమతి లేకుండా తనకు సంబంధించి పాట రాయడం ఏమిటంటూ చిత్ర నిర్మాత, దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకులకు నోటీసులు పంపారు. అందులో టి ఆర్న్యాయవాది పేర్కొంటూ డండన్నక పాటలో తన క్లయింట్ టి.రాజేందర్ మాట్లాడే భాషను అనుకరిస్తూ ఆయన పేరును వాడుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు టి.రాజేందర్‌కు దుష్ర్పచారాన్ని ఆపాదించడమే అవుతుందన్నారు. అదే విధంగా ఆయన ఇమేజ్‌కు భంగం వాటిల్లుతోందన్నారు. అందువలన నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోమియో జూలియట్ చిత్ర నిర్మాత నందగోపాల్‌కు, దర్శకుడు లక్ష్మణన్, సంగీత దర్శకుడు డి.ఇమాన్, గీత రచయిత లోకేష్ పాడిన అనిరుధ్‌లకు నోటీసులు పంపారు. -
నేను అలాంటి అమ్మాయిని కాను
సంతోషం సగం బలం అంటారు. మనిషి ఏమి చేసినా ఆనందమైన జీవితం కోసమే. అలాంటిది కొందరు ఎంత కూడబెట్టినా ఇంకా డబ్బు డబ్బు అంటూ పరుగులు పెడుతుంటారు. తనలా డబ్బు కోసం వెంపర్లాడే అమ్మాయిని కాదంటున్నారు నటి హన్సిక. కోలీవుడ్‌లో అత్యధిక అవకాశాలు చేతిలో ఉన్న నటీమణుల్లో నయనతార తరువాత హన్సికనేనని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అరణ్మణై, ఆంబళ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మాజీ ప్రియుడు శింబుతో నటించిన వాలు చిత్రం మేలో తెరపైకి రానుంది. శింబుతో జత కట్టిన వేట్టైమన్నన్తో పాటు జయంరవితో నటిస్తున్న రోమియో జూలియట్, ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటిస్తున్న పులి, నటి జయప్రద కొడుకు సిద్ధార్థ్ సరసన నటిస్తున్న ఉయిరే ఉయిరే, ఉదయనిధి స్టాలిన్‌తో కలసి నటిస్తున్న ఇదయం మురళి అంటూ అరడజను చిత్రాలకుపైగా నటిస్తున్న హన్సిక డైరీ ఈ ఏడాది అంతా ఫుల్ అయిపోయింది. చక్కని అభినయంతోపాటు అందాలు ఆరబోయడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో హన్సికకు అవకాశాలు వద్దన్నా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ డబ్బు సంపాదన గురించి కూడా పెద్దగా పట్టించుకోదట. ఒక ఇంటర్వ్యూలో హన్సిక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అందరూ డబ్బు సంపాదన కోసమే కఠినంగా శ్రమిస్తున్నారన్నారు. అయితే తాను మట్టుకు సంపాదనే ధ్యేయంగా భావించడం లేదన్నారు. తనకు అవసరం అయిన విషయాలను అమ్మ గమనించుకుంటుందని అందుకే పరిధులు దాటి తానామెను ఏమి అడగనని అన్నారు. నిజం చెప్పాలంటే జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ పెట్టుకోలేదు. అందుకే సంతోషంగా ఉన్నాను అని హన్సిక అన్నారు. -
చాలా మంది రోమియోలను చూశాను
ఇప్పటి వరకు చాలా మంది రోమియోలను చూశానని నటి హన్సిక పేర్కొంది. నటుడు శింబుతో డీప్ లవ్‌లో పడ్డ హన్సిక పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమై, చివరి క్షణాల్లో పటాపంచలు కావడంతో అప్సెట్ అయింది ఈ ఉత్తరాది భామ. దీంతో ఇక ప్రేమ లేదు. దోమా లేదు అంటూ నటన మీద దృష్టి పెట్టింది. అలాంటిది తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. అదేమిటంటే.... చాలా మంది మగవాళ్లు, మేడి పండులాంటి వారు. పైకి అందంగా కనిపించే మేడి పండ్లు, విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. చాలా మంది మగవాళ్లు కూడా అంతే. అందుకే మగ వారిని చూడగానే, ఒక నిర్ణయానికి రాకూడదంటారు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసి, మగ వాళ్లు ఎలాంటి వారో చెప్పడం సాధ్యం కాదు. ప్రస్తుతం తాను రోమియో జూలియట్ చిత్రంలో ప్రేయసి పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. నా వయసుకు తగ్గ పాత్రలు తమిళంలో లభించడం ఆనందంగా ఉందన్నారు. నేను ఇప్పటి వరకు చాలామంది రోమియోలను చూశాను. అయితే, వారిలో నిజమైన హీరోలు ఎవరు అన్నది కని పెట్టలేకపోయాను అని వెల్లడించింది. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం హన్సిక లాంటి అందాల భామలకు పరిపాటిగా మారిందని కోలీవుడ్‌లో ప్రచారం. -
హిట్ జోష్‌తో ఉన్న గౌతమ్
-
నా కుటుంబ చిత్రం
రోమియో జూలియట్ నా కుటుంబ చిత్రం అన్నారు ఆ చిత్ర కథా నాయకుడు జయం రవి. చాలాకాలం తరువాత ఈయన నగర నేపథ్యంలో సాగే స్టైలిష్ పాత్రలో నటించిన చిత్రం ఇది. మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై నిర్మాత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న భారీ చిత్రం రోమియో జూలియట్. జయం రవి సరసన హన్సిక, పూనం బాజ్వాలు నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను లక్ష్మణన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో జయం రవి, హన్సిక, పూనం బాజ్వా, ప్రభుదేవా, ధనుష్, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను మొదలగు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తన జీవితం, తన స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనలను కథగా తయారు చేసి రూపొందించిన చిత్రం ఈ రోమియో జూలియట్ అని వివరించారు. నిర్మాతగా తనకిది ఐదో చిత్రం అని అయితే ఇంత స్ట్రాంగ్ యూనిట్‌ను ఇంతకుముందు ఎప్పడూ చూడలేదని చిత్ర నిర్మాత ఎస్.నందగోపాల్ అన్నారు. చిత్ర యూనిట్ చాలా సపోర్టుగా ఉన్నారని తనకు ఈ చిత్రం చాలా సంతృప్తి నిచ్చిందని ఇదే యూనిట్‌తో మరో చిత్రం ఖచ్చితంగా నిర్మిస్తానని ఆయన అన్నారు. చిత్ర నాయకుడు జయం రవి మాట్లాడుతూ రోమియో జూలియట్ తన సొంత ఫ్యామిలీ చిత్రంగా పేర్కొన్నారు. దర్శకుడు కథ చెప్పిన విధానం, నిర్మాత అప్రోచ్, చాలా నచ్చాయని అన్నారు. చిత్రాన్ని చాలా క్వాలిటీగా తీశారని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన నటి హన్సిక నేచర్ గురించి, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఈ చిత్రంలో ఆమె నటనా ప్రతిభను చూస్తారని పేర్కొన్నారు. ఇక మరో నాయకిగా పూనం బాజ్వా చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని జయం రవి తెలిపారు. -
రోమియో జూలియట్ కోసం గానాపాట
రోమియో జూలియట్ చిత్రం కోసం ఒక సూపర్ గానా పాటను రికార్డు చేసినట్టు ఆ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు. జయం రవి, హన్సిక, పూనం బాజ్వా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరిన ఈ చిత్రం కోసం ఇటీవల యువ సంగీత దర్శకుడు డీ ఇమాన్ సూపర్ గానా పాటను రూపొందించారని దర్శకులు తెలిపారు. దీని గురించి ఆయన చెబుతూ, అ నేగన్ చిత్రంలో ఢంక మారి... ఊదారి అనే పాట మంచి హిట్ అయ్యిందన్నారు. ఆ పాటను రచించి యువ గీత రచయిత రాజేశ్ తన చిత్రం కోసం ఒక గొప్ప గానా పాటను రాశారన్నారు. ఉండనక...అనే పల్లవితో సాగే ఈ పాట ను యువ సంగీత దర్శకుడు అనిరుద్ గానం చేసినట్టు తెలిపారు. ఈ పాట యువతను ఉర్రూతలుగిస్తుందన్న నమ్మ కం ఉందన్నారు. ఈ చితం కూడా ఊహించిన దాని కంటే బాగా వస్తుందని, చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందని దర్శకుడు తెలిపారు. -
జయంరవి-హన్సిక మధ్యలో ఆర్య
జయం రవి-హన్సిక మధ్యలో ఆర్య. ఈ పేరుతో సినిమా రూపొందితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది కదూ? అలాకాకుండా ఈ ముగ్గురూ కలిసి నటిస్తే ఇంకా క్రేజ్ అంటారా? ఈ క్రేజీ కలయికలో చిత్రం తెరకెక్కుతున్న విషయం నిజమే. అయితే ఇందులో ఆర్య అతిథేనట. ఇంతకీ విషయం ఏమిటంటే ఇంతకు ముందు నయనతార, అనుష్కతో యమా క్లోజ్‌గా మెలిగిన నటుడు ఆర్య ఇప్పుడు హన్సిక సన్నిహితుడయ్యారట. వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు సేట్టై చిత్రంలో జతకట్టారు. తాజాగా మెగామాన్ చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇందులో ఒక పాటకు హన్సిక ఆర్యతో హద్దులు మీరి నటించేసి ఆ తరువాత శృంగారం మితిమీరిందేమో అంటూ చింతించిందట. ఈ కథ అటుంచితే ప్రస్తుతం ఈ బ్యూటీ జయం రవితో రోమియో జూలియట్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ రోమియో జూలియట్ మధ్యకు ఆర్య అతిథిగా వచ్చిపడ్డారట. చిత్రంలో జయం రవి హీరో అయినా హన్సిక ఆర్యతోనే క్లోజ్‌గా ఉండడంతో యూనిట్ చెవులు కొరుక్కుంటోంది. రోమియో జూలియట్ చిత్రంలో ఆర్యకు హన్సికకు రొమాన్స్ సన్నివేశాలున్నాయా అన్న ప్రశ్నకు చిత్ర యూనిట్ ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఏదేమయినా జయం రవి, హన్సికల మధ్యకు ఆర్య రావడం రోమియో జూలియెట్కు బోలెడంత ప్రచారం ఫ్రీగా వచ్చేస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.