మీడియాను పిలవొద్దు | 'Romeo And Juliet' Press Conference media no entry | Sakshi
Sakshi News home page

మీడియాను పిలవొద్దు

Published Mon, Jun 22 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

మీడియాను పిలవొద్దు

మీడియాను పిలవొద్దు

 ప్రసార మాధ్యమాలు పెరుగుతున్నాయి. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ నెట్‌వర్క్స్ అంటూ వాటి ప్రభావం అధికం అవుతుండడంతో ఎప్పుడు? ఎక్కడ? ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇక హీరో, హీరోయిన్ల విషయాలైతే వారికి సంబంధించిన చిత్రాల వివరాల కంటే వ్యక్తిగత విషయాలే ప్రచారంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. దీంతో ముఖ్యంగా హీరోయిన్లు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఈ మధ్య నటి హన్సిక, జయంరవితో నటించిన రోమియో జూలియట్ చిత్ర విలేకరుల సమావేశానికి ఆమెను ఆహ్వానిస్తే రానని చెప్పారట.
 
  కారణం శింబుతో లవ్ ఫెయిల్యూర్, ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేసిన నగ్న దృశ్యాలు ఆల్బమ్‌ల గురించి ప్రశ్నలు సంధిస్తారని వివరించారట. అలాంటి ప్రశ్నలు తలెత్తకుండా చూసుకుంటామని దర్శక నిర్మాతలు హామీ ఇవ్వడంతో హన్సిక ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నట్లుగానే ఆ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని విలేకరిని రిక్వెస్ట్ చేశారు. కాగా నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు మీడియాను పిలవొద్దు అంటూ నిర్మాతలకు ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ అమ్మడి వ్యవహారం చూస్తే జీవాతో నటిస్తున్న తాజా చిత్రం తిరునాళ్.
 
  ఈ చిత్ర షూటింగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్ర కవరేజ్ కోసం చెన్నై నుంచి విలేకరులను తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతల వర్గం భావించింది. అందుకు జీవా, నయనతార కూడా ఓకే చెప్పారు. అయితే ఆ తరువాత నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివతో ప్రేమాయణం అంటూ ప్రచారం జోరందుకోవడం, వారిద్దరు దిగిన సెల్ఫీ ఫొటో సోషల్ నెట్‌వర్క్సులో హల్‌చల్ చేయడంతో షాక్ అయిన నయనతార ఇప్పుడు మీడియా వస్తే ఆ విషయాలు గురించే గుచ్చి గుచ్చి అడుగుతారు. చిత్ర వివరాలు గురించి పట్టించుకోరంటూ నిర్మాతలకు నచ్చచెప్పి తాను సెట్‌లో ఉండగా విలేకరులను తీసుకురావద్దు అంటూ అడ్డుకట్ట వేశార ట. ముందు జాగ్రత్త అంటే ఇదేనేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement