హన్సిక నాకంటే బాగా నటించారు | Hansika good acting in Romeo Juliet movie | Sakshi
Sakshi News home page

హన్సిక నాకంటే బాగా నటించారు

Published Tue, Jun 16 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

హన్సిక నాకంటే బాగా నటించారు

హన్సిక నాకంటే బాగా నటించారు

 నటి హన్సిక తనకంటే అద్భుతంగా నటించారని నటుడు జయంరవి కితాబిచ్చారు. వీరిద్దరూ కలిసి నటించన చిత్రం రోమియోజూలియట్. ఎస్ నందగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. దీన్ని కాస్మో విలేజ్ పతాకం ద్వారా శివకుమార్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడడంతో సోమవారం తన ఆనందాన్ని చిత్ర హీరో జయంరవి,దర్శకుడు లక్ష్మణన్, నిర్మాత ఎస్ నందగోపాల్‌తో కలసి విలేకరులతో పంచుకున్నారు.
 
 ఆయన మాట్లాడుతూ తాను విడుదల చేసిన తొలి చిత్రం నాయ్‌గల్ జాగ్రత్తైమంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా జయంరవి, హన్సిక జంటగా నటించిన రోమియోజూలియట్ చిత్రాన్ని విడుదలకు మూడు నెలల ముందే కొనుగోలు చెయ్యాలనిపించిందన్నారు. అదే విధంగా నిర్మాతను సంప్రదించి విడుదల హక్కుల్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్టవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జయంరవి కాల్‌షీట్స్ ఇస్తే చిత్రం చేస్తానని కాస్మో విలేజ్ శివకుమార్ అన్నారు.
 
 హన్సిక అద్భుతంగా చేశారు
 నటుడు జయంరవి మాట్లాడుతూ సక్సెస్‌పుల్ చిత్రం చెయ్యాలన్న భావనతో చేసిన చిత్రం రోమియోజూలియట్ తన ఆకాంక్షను నెరవేర్చిందని అన్నా రు. నటి హన్సిక తన కంటే అద్భుతంగా నటించారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement