మంచి నటి అన్న పేరు చాలు! | 2015 Very special year | Sakshi
Sakshi News home page

మంచి నటి అన్న పేరు చాలు!

Published Mon, Jan 4 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

మంచి నటి అన్న పేరు చాలు!

మంచి నటి అన్న పేరు చాలు!

మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను ఈ ఏడాది కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది.
 
  తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.
 
 ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్‌గా నంబర్‌ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్‌ఒన్ స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement