మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా | Actress Hansika Motwani Adopting 5 Children | Sakshi
Sakshi News home page

మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా

Published Sun, May 31 2015 3:44 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా - Sakshi

మరో ఐదుగురినిదత్తత తీసుకుంటా

టీనగర్: నటి హన్సిక మరో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. హన్సిక మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న వాలు త్వరలో విడుదల కానుందన్నారు. జయం రవితో నటించిన రోమియో జూలియట్, విజయ్‌తో నటించిన పులి విడుదల కానున్నాయన్నారు. తనను వెదుక్కుంటూ ఏడు కథలు వచ్చాయని, వీటిలో రెండింటిని సెలక్ట్ చేశానన్నారు. పెద్ద హీరో, పేరున్న దర్శకుని చిత్రాలని, ఆయా సంస్థలు వీటి గురించి ప్రకటన విడుదల చేస్తాయన్నారు.
 
 ఈ క్రమంలో హిందీ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నందున ప్రస్తుతం నిరాకరించినట్లు తెలిపారు. చక్కని కథాంశంలో పెద్ద చిత్రాలు కుదిరితే నటిస్తానన్నారు. నిరాదరణకు గురైన చిన్నారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని, ఇంతవరకు 25 మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు పిల్లలను ఆగస్టులో దత్తత తీసుకోనున్నానని, వీరి కోసం ముంబై శివారు ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశానన్నారు. అందులో వారికి అనాథశ్రమం నిర్మిస్తానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement