నష్టపరిహారం కోటి చెల్లించండి
నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని నటుడు, దర్శకుడు టి.రాజేందర్ రోమియో జూలియట్ చిత్ర నిర్మాతకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. వివరాల్లో కెళితే..డండన్నక పాట వ్యవహారం ముదురుతోంది. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం యువగీత రచయిత లోకేష్ డండన్నక అనే పాటను రాశారు.
మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. ఈ పాటలోని పదాలు దర్శక నటుడు టి.రాజేందర్‌కు సంబంధించి ఉండటంతో ఆయన తన అనుమతి లేకుండా తనకు సంబంధించి పాట రాయడం ఏమిటంటూ చిత్ర నిర్మాత, దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకులకు నోటీసులు పంపారు. అందులో టి ఆర్‌న్యాయవాది పేర్కొంటూ డండన్నక పాటలో తన క్లయింట్ టి.రాజేందర్ మాట్లాడే భాషను అనుకరిస్తూ ఆయన పేరును వాడుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు టి.రాజేందర్‌కు దుష్ర్పచారాన్ని ఆపాదించడమే అవుతుందన్నారు.
అదే విధంగా ఆయన ఇమేజ్‌కు భంగం వాటిల్లుతోందన్నారు. అందువలన నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోమియో జూలియట్ చిత్ర నిర్మాత నందగోపాల్‌కు, దర్శకుడు లక్ష్మణన్, సంగీత దర్శకుడు డి.ఇమాన్, గీత రచయిత లోకేష్ పాడిన అనిరుధ్‌లకు నోటీసులు పంపారు.