T. Rajendar
-
లేడీ డాన్‌గా నమిత
తమిళసినిమా: టీ.రాజేంద్రన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఒరు తాయిన్ శపథం, ఎన్ తంగై కల్యాణి, సంసార సంగీతం, ఇంగవీట్టు వేలన్, మోనీషా ఎన్మోనాలిసా, సొన్నాల్దాన్ కాదలా, తన కొడుకు శింబును హీరోగా పరిచయం చేస్తూ కాదల్ అళివదిల్లై వీరాస్వామి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శింబు సినీ ఆర్ట్స్ సంస్థ ద్వారా టీ.రాజేందర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రానికి ఇన్రైయ కాదల్ డా అనే పేరును నిర్ణయించారు. దీనికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టీఆర్‌నే నిర్వహించనున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇందులో నటి నమిత లేడీడాన్‌గా నటించడానికి సమ్మతించారని చెప్పారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారన్నారు. పలువురు కొత్తవారిని పరిచయం చేయనున్నట్లు చెప్పారు. వారితో పాటు రాధారవి, ఇళవరసన్, వీటీవీ గణేశ్, వెన్నిరాడై మూర్తి, పాండు, రోబో శంకర్, మదన్‌బాబు, కవన్ జగన్ నటించనున్నారని తెలిపారు. ఇది పూర్తిగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఉంటుందని, నేటి తరానికి తగ్గట్టుగా ప్రేమ,ప్రేమ,ప్రేమ మినిహా వేరేమీ ఉండదని టీఆర్.పేర్కొన్నారు. మరి ఇలాంటి లవబుల్ కథలో లేడీ డాన్‌గా నమిత పాత్ర ఏమిటో అన్న ఆసక్తి కలుగుతోందా? ఆ వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టారు
‘ప్రేమ సాగరం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ దర్శకుడు, నటుడు టి. రాజేందర్. కేవలం యాక్టర్, డైరెక్టర్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా ఇలా ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారాయన. డైరెక్టర్‌గా సూపర్ హిట్స్‌ను అందించారు రాజేందర్. ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ సినిమా ‘వీరసామీ’ 2007లో రిలీజ్ అయింది. పదకొండేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న రాజేందర్ మరోసారి మెగాఫోన్ పట్టనున్నారు. తమిళంలో ఓ పొలిటికల్ సెటైర్‌గా మూవీని తెరకెక్కించనున్నారు. ఇంత గ్యాప్ తర్వాత తిరిగొస్తున్న ఆయన హిట్ సాధిస్తారో? లేదో? వేచి చూద్దాం. -
శింబు పాటలో మంచి పదాలూ ఉన్నాయి
శింబు పాటలో మంచి పదాలు ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి మాటలు లేని బీప్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తండ్రి టీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాట్స్‌యాప్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ శింబుపై కావాలనే కొందరు కుట్ర పన్ని దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మహిళలను ఉన్నతంగా చూపిస్తూ పలు చిత్రాలు రూపొందించాననీ, తనకు మహిళలపై చాలా గౌరవం ఉందని, అదే మర్యాద శింబుకు ఉందని అన్నారు. తను స్త్రీలను ఏనాడు అగౌరవ పరచలేదని అన్నారు. మహిళా సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే తాను వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. చట్ట నిబంధనలు తెలియవు నటుడు శింబు ఒక టీవీ ఛానల్‌కు బేటీ ఇస్తూ తాను 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. సినిమా మినహా తనకేమీ తెలియదనీ అదేవిధంగా చట్ట నిబంధనలు తనకు తె లియవని అ న్నారు. ఆ కష్ట కాలంలో తన కు అండగా నిలబడిన తన తల్లిదండ్రుల కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను పాటను కావాలని వాట్స్‌యాప్‌లో పోస్ట్ చేయలేదని అందువల్ల తనను విమర్శించడం సబబు కాదని అన్నారు. తప్పుగా భావిస్తే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శింబు సోమవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటీషన్‌పై ఈ నెల 23న విచారణ జగపనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. శింబుపై ఫిర్యాదులను, ఆర దోళనలను భరించలేక ఆయన ఇంటి ముందు సోమవారం నలుగురు ఆయన అభిమానులు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నడిగర్‌సంఘం ఖండన శింబు చర్యల్ని నడిగర్ సంఘం ఖండించింది. దీని గురించి ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా అన్నది కళకు, కోట్లాది రూపాయల వ్యాపారానికి చిరునామా అన్నారు. అలాంటి సినీ రంగంలో తప్పు చేస్తే చింతించడం, క్షమాపణ కోరడం చేయాలని పేర్కొన్నారు. శింబుపై సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడం విశేషం. -
విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్
గోలీసాడా,10 ఎండ్రత్తుకుళ్ చిత్రాల దర్శకుడు విజయ్‌మిల్టన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటుడు టీ.రాజేందర్ కథానాయకుడిగా విజయ్‌మిల్టన్ చిత్రం చేయనున్నారు. నిజానికి ఈ చిత్రం గోలీసోడా తరువాత ప్రారంభం కావలసింది. గోలీసోడా చిత్రం అనూహ్య విజయంతో విజయ్మిల్టన్కు ఒక సారిగా పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో నటుడు విక్రమ్ హీరోగా చిత్రం చేసే అవకాశం వచ్చింది. దీంతో టీఆర్‌తో చిత్రాన్ని పక్కన పెట్టి విక్రమ్ హీరోగా 10 ఎంత్రత్తుకుళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించలేక పోయింది.దీంతో విజయ్‌మిల్టన్ తదుపరి గోలీసోడా వంటి చిన్న చిత్రాన్ని రూపొందిస్తారని సినీ వర్గాలు భావించారు. అయితే ఆయన ఇంతకు ముందు పక్కన పెట్టిన టీ.రాజేంద్రర్ చిత్రాన్ని చేయ సంకల్పించి ఆ స్క్రిప్ట్ బూజు దులపనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీఆర్‌తో విజ య్మిల్టన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.దీన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.మరో విషయం ఏమిటంటే టీఆర్ చిత్రానికి జరిగినట్లే ఆయన కొడుకు శింబు చిత్రం విషయంలోనూ జరిగింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమయడా చిత్రాన్ని ప్రారంభించారు.ఆ సమయంలో ఆయనకు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో శింబు చిత్రాన్ని పక్కన పెట్టి ఎన్నై అరిందాళ్ చిత్రం చేశారు.ఆ చిత్రం తరువాత ఇప్పుడు మళ్లీ శింబు చిత్రాన్ని రూపొందిస్తున్నార న్నది గమనార్హం. -
నష్టపరిహారం కోటి చెల్లించండి
నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని నటుడు, దర్శకుడు టి.రాజేందర్ రోమియో జూలియట్ చిత్ర నిర్మాతకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. వివరాల్లో కెళితే..డండన్నక పాట వ్యవహారం ముదురుతోంది. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం యువగీత రచయిత లోకేష్ డండన్నక అనే పాటను రాశారు. మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. ఈ పాటలోని పదాలు దర్శక నటుడు టి.రాజేందర్‌కు సంబంధించి ఉండటంతో ఆయన తన అనుమతి లేకుండా తనకు సంబంధించి పాట రాయడం ఏమిటంటూ చిత్ర నిర్మాత, దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకులకు నోటీసులు పంపారు. అందులో టి ఆర్న్యాయవాది పేర్కొంటూ డండన్నక పాటలో తన క్లయింట్ టి.రాజేందర్ మాట్లాడే భాషను అనుకరిస్తూ ఆయన పేరును వాడుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు టి.రాజేందర్‌కు దుష్ర్పచారాన్ని ఆపాదించడమే అవుతుందన్నారు. అదే విధంగా ఆయన ఇమేజ్‌కు భంగం వాటిల్లుతోందన్నారు. అందువలన నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోమియో జూలియట్ చిత్ర నిర్మాత నందగోపాల్‌కు, దర్శకుడు లక్ష్మణన్, సంగీత దర్శకుడు డి.ఇమాన్, గీత రచయిత లోకేష్ పాడిన అనిరుధ్‌లకు నోటీసులు పంపారు.